నూతలపాటి గంగాధరం చిత్తూరు జిల్లా నాగలాపురం సమీపంలో గల రామగిరి గ్రామం లో డిసెంబర్ 15 1939 న మధ్య తరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. విద్వాన్ చదివి ఉపాధ్యాయునిగా పనిచేశారు సంప్రదాయ సాహిత్యాన్ని చదువుకొని ఆధునిక రచయిత గా ఎదిగిన నూతలపాటి అభ్యుదయ రచయిత. చీకటి నుండి వెలుగులోకి అన్నవి ఆయన కవిత్వ సంపుటాలు.కాగితం పులి అనే నవల రాశారు.
శివాజీ కల అనే కథలు కూడా నూతలపాటి రచించారు అంతేగాక నూతలపాటి చాలా విమర్శలు రచించారు.
1960-75 మధ్య సూతలపాటి రచించిన విమర్శ
వ్యాసాలు ఆయన విమర్శ రోరణిని ప్రదర్శిస్తాయి. వేమన,
గురజాడ, శ్రీ శ్రీ. త్రిపురనేని కుందుర్తి - వీళ్ళు సూతలపాటికి
వచ్చిన కవులు, వేమన లేకుండా ఉంటే మన జీవితంలోనే
గాక,తెలుగు సాహిత్య ప్రపంచంలోనే ఖాళీ ఏర్పడి ఉండేది"
అంటూ తెలుగు సమాజంతో పెనవేసుకున్న వేమన గురించి
చెప్పారు. కవి వ్రాసిన పద్యం గాని కావ్యం గాని అన్ని
కాలాలోను అన్ని రకాల మానవాళిని తట్టిలేపి కర్తవ్యబోధ చేసి
అభ్యుదయ వరంలోకి నడిపించాలి" అనే అవగాహనతో వ్యవస్థ
నూతలపాటి విమర్శ సాగింది.
సాహిత్య వస్తువును పారాణికం, కల్పితం. మిశ్రమం.
చారిత్రకం, అనుభవం అని అయిదు రకాలుగా పేర్కొన్నారు.
నేటికి కూడా చాలా తక్కువ మంది. సాహితీపరులు చెప్పు
తున్నట్లు నూతలపాటి కూడా రచయితలు సమస్యా పరిష్కారా
నికి మార్గం చూపాలని అభిప్రాయపడ్డారు. "జాతిని ముందుకు
నడిపించడమే సాహిత్యం యొక్క ప్రయోజనం అనే
అభ్యుదయ అవగాహనగల సూతలపాటికి గురజాడ సాహిత్యం మహోన్నతమైన సామాజిక బాధ్యత నిర్వహించేదిగా కనబడటంలో ఆశ్చర్యం లేదు. సాహిత్యాన్ని ఒక సామాజిక శక్తిగా భావించే సంప్రదాయం వేమనతోనే ప్రారంభమైందని నూతలపాటి వాదం. 1934లో శ్రీశ్రీ 14 ప్రధాన కవితలు రాశారని అందువల్ల 1934 శ్రీశ్రీ మరో చూపమని సూతలపాటి చేసిన పరిశీలన అతని సూక్ష్మ పరిశీలనకు తార్కాణం.
ప్రజాసాహిత్యం ప్రజలకోసం రాసింది. ప్రజల గురించి
రాసింది అని రెండు రకాలన్నారు. నూతలపాటి ప్రజలకు
అర్థమయ్యేట్టుగా రాసింది. ప్రజల కోసం రాసిందని, ప్రజలకు
అర్ధం అయినా కాకపోయినా, ప్రజల గురించి రాసింది మరొక
రకమని ఆయన వివరించారు.
కవిత్వాన్ని నిన్నటి కవిత్వం, నేటి కవిత్వం. రేపటి కవిత్వం అని నూతలపాటి విశ్లేషించి చేసిన చర్చ ఆసక్తికరంగా ఉంది. కవిత్వం రాసిన కాలాన్ని బట్టికాక, దాని నైసర్గిక స్వలానాన్ని బట్టి ఈ విభజన చేశారాయన. ఈ అవగాహనతో అంధ విశ్వాసాలను పోగొట్టడానికి వేమన, వితంతు వివాహాన్ని
వ్యాప్తిలోకి తేవడానికి కందుకూరి, కులతత్వాన్ని రూపుమాపు
డానికి త్రిపురనేని, కన్యాశుల్కం తీవ్రతను అరికట్టడానికి
గురజాడ, శ్రామిక లోక సౌభాగ్యానికి తమ సాహిత్యం
ద్వారా చేసిన కృషి వల్ల వాళ్ళు ఎప్పటికైనా రేపటి రచయితలని
నూతలపాటి నిర్ణయించారు.
భావకవిత్వాన్ని, సంఘ సంస్కరణ జాతీయోద్యము
సాహిత్యాన్ని, అభ్యుదయ సాహిత్యోద్యమాన్ని ఆయన
ఆమోదించారు. దిగంబర విప్లవోద్యమాలను తిరస్కరించారు.
దిగంబర కవిత్వం మీద నిప్పులు కురిపించారు. సూతలపాటి.
అది సాహిత్య చరిత్రకారులకు ప్రయోజనం కావచ్చేమో గాని
సామాజిక స్వస్థతకు పనికారాదన్నారు. అంతకుముందు వచ్చిన సాహిత్యోద్యమాలన్నీ ప్రవాహ శీలం గలవైతే, దిగంబరకవిత్వం నిలవనీటి మడుగు లాంటిదన్నారు. సాహిత్యం నిలవ నీటి మడుగులాంటి సమాజాన్ని కదిలించే ప్రయత్నం చేయాలని భావించారు. దిగంబర కవిత్వంలో మానవుడి మీద ప్రేమకన్నా వ్యవస్థ మీద విద్వేషమే ఎక్కువగా ఉందన్నారు. అయితే నూతలపాటికి దిగంబర కవుల వస్తువు మీద అసంతృప్తి లేదు. వాళ్ళ కవితా వస్తువు మంచిదేనంటారు. ఆయన అభ్యంతరం వాళ్ళ కవిత్వ శిల్పం మీదనే. చెడిన శిల్పం వల్ల మంచి భావం కూడా చెడిపోతుందనే అవగాహనతో నూతలపాటి దిగంబర కవుల శిల్పంలోని సంయమన రాహిత్యాన్ని నిరసించారు. ఆరుగురు వ్యక్తులు కలిసి ఒకే వ్యక్తిత్వాన్ని ప్రదర్శించడానికి చేసిన ప్రయత్నమే వాళ్ళ శైలి శిల్పాలను ధ్వంసం చేసినట్లు ఆయన భావించారు. దిగంబర కవులు కాక, వాళ్ళు విడివిడిగా రాసిన కవితల్లో మంచి శైలి భావుకతలుండడాన్ని ఇందుకు నిదర్శనంగా పేర్కొన్నారు. దిగంబర కవిత్వం మీద వ్యతిరేకతను చాటుతూ తనకన్నా ముందున్న వాళ్ళ అభిప్రాయాలనుసమన్వయించుకున్నారు.
విప్లవ కవిత్వం మీద కూడా నూతలపాటికి విశ్వాసం లేదు. విప్లవ కవిత్వం మొదలైన తొలి రోజుల్లోనే దానిని తీవ్ర స్వరంలో వ్యతిరేకించారు నూతలపాటి. భారతదేశంలో సాయుధ పోరాటం నేల విడిచిన సాము అన్న అవగాహనతో "నక్సలైట్ ఉద్యమం ప్రజోద్యమం కాద"నే నిర్ణయానికి వచ్చి, ఆ
ఉద్యమాన్ని సమర్ధించే విప్లవ కవిత్వాన్ని తిరస్కరించారాయన.
మార్క్స్ సిద్ధాంతాలను భారతదేశ నైసర్గిక స్వరూప స్వభావాల కనుగుణంగా మలచుకోకుండా యాంత్రికంగా అన్వయించి ప్రయోజనం లేదని అభిప్రాయపడ్డారు. అయితే అభ్యుదయ సాహిత్యోద్యమం ఈ పని చేసిందా అన్నదానిని ఆయన చర్చించలేదు.
సాయుధ పోరాటం అనే మాట దిగంబర కవుల
ద్వారా తెలుగు కవిత్వంలోకి ప్రవేశించిందని. శ్రీశ్రీ వాళ్ళ
అదిరింపులకు లోబడి వాళ్ళను సమర్థించారని అనడానికి
కూడా నూతలపాటి వెనుకాడలేదు. విప్లవ కవులు ప్రజల్ని
గాలికి వదిలి ఎదుటి వాళ్ళని వెక్కిరించి తమను తాము ఎక్కువ చేసుకునే ప్రచారకులనే దాకా వెళ్లారు అంతేగాక వాళ్ల వల్ల కారుకూతలు కవిత్వమనే పరిస్థితి ఏర్పడిందని కవిత్వంలో ఈ వాతావరణం ఏర్పడడానికి శ్రీశ్రీ కారణమని ఆయన తీర్మానించారు. ఈ దృష్ట్యా శ్రీశ్రీ తన బాధ్యతలు విస్మరించారని, ఆయన ప్రారంభంలో తెలుగు సాహిత్యానికి ఎంతో మేలు చేశాడు ఆ తర్వాత అంత కన్నా ప్రమాదకరమైన పని చేశాడని కూడా నిర్ణయం చేశారు. ఆధునిక సాహిత్యాన్ని అభ్యుదయ దృక్పథంతో వ్యాఖ్యానించిన వ్యక్తి నూతలపాటి గంగాధరం
_రాచపాళెం చంద్రశేఖరరెడ్డి
(సేకరణ: పిళ్లా కుమారస్వామి)