నాగపూడి కుప్పుస్వామి చిత్తూరు జిల్లా వాస్తవ్యులు. వీరు నాగపూడి అనే గ్రామంలో క్రీ.శ. 1865లో జన్మించారు. వీరితండ్రి యజ్ఞనారాయణ శాస్త్రి. మద్రాసు క్రైస్తవ కళాశాలలో చదివి బి.ఏ., పట్టభద్రులై 1918 వరకు న్యాయవాద వృత్తిలోఉన్నారు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య విద్యా కళాశాలకువిచారణ కార్యకర్తగా పనిచేశారు.
       నాగపూడి న్యాయవాద వృత్తిలో ఉన్నప్పటికీ వారికి
 సాహిత్య వ్యాసంగంపైన ఆసక్తి ఎక్కువ. అందువల్లనే  సంస్కృతాంధ్ర సాహిత్యాన్ని అధ్యయనం చేశారు. 1917-1938 మధ్యకాలంలో వీరు ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక, భారతి, తదితర పత్రికలలో ఎన్నో సాహిత్య వ్యాసాలు రాశారు. పాశ్చాత్య సాహిత్య పద్ధతులననుసరించి తెలుగు గ్రంధాలకు ఉపోద్ఘాతాలు, పీఠికలు వ్రాశారు. 
      మద్రాసులోని ఆనంద , వావిళ్ల ముద్రణాలయాలు   ప్రచురించిన ప్రాచీన ప్రబంధాలకు వీరు పీఠికలు రాశారు. ముఖ్యంగా, భగవద్గీత, నిర్వచనోత్తరరామాయణాలకు వీరు రాసిన పీఠికలు విలువైనవి.
        వీరి రచనలు ప్రధానంగా 1. భారతసారము _
నిర్దిష్టమైన రచనా శైలికిది ఉదాహరణ. 2. శ్రీ శంకరాచార్య 
చరిత్రము --సంస్కృత శ్లోకాలకు అర్థతాత్పర్య 
వివరణలు. 3. శ్రీ కాళహస్తీశ్వర శతకము-- శ్రీ కాళహస్తి క్షేత్రాన్ని వర్ణించిన శతకం. 4. స్తవరత్నావళి 
(సంస్కృతరచన) నాగపూడి సంస్కృత పాండిత్యాన్ని తెలిపే 
రచన.5. శ్రీనాథుని కవిత్వము --శ్రీనాథుని ప్రబంధ కవిత్వ వైశిష్ట్యాన్ని తెలిపే విమర్శగ్రంథం. 6.భోజరాజీయము (వచనము) ప్రబందాన్ని తెలుగు వచనంలో రాసిన రచన 7. పారిజాతాపహరణము - - పరిమళోల్లాసవ్యాఖ్య--31 పుటలపీఠిక,11 అనుబంధాలతో 26 పుటలు,మొత్తం 57 పుటల వ్యాఖ్యాన పీఠిక తరువాతి వ్యాఖ్యాతలకు
దిశానిర్దేశంగా ఉంది. ఇంతవరకు ఇంతనిర్దిష్టమైన నిర్దుష్టమైన వ్యాఖ్య ముక్కుతిక్కన పారిజాతాపహరణంపై వెలువడలేదు. తొలిముద్రణ 1928లో వెలువడగా, ఆం.ప్ర.సా. అకాడెమీ, హైదరాబాదు 1970లలో రెండవ ముద్రణ చేశారు. 2006లో కుప్పం ద్రావిడ విశ్వవిద్యాలయం వారు మూడవ ముద్రణ వెలువరించారు.
       ఆర్యాద్విశతి అనే పేరుతో దూర్వాస మహర్షి వ్రాసిన 200 శ్లోకాలకు నాగపూడి ప్రతిపదార్థ టీకా విశేషాంశ సహితంగా వ్యాఖ్య వ్రాశారు. నాగపూడి సాహిత్య వ్యాసాలు కొన్ని 'సుపథ'లో ప్రకటింపబడ్డాయి. కుప్పుస్వామి 1951లో 
పరమపదించారు.
__ముదివేడు ప్రభాకరరావు
          (సేకరణ: పిళ్లా కుమారస్వామి)
            9490122229

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s