కేతు విశ్వ నాథరెడ్డి కడపజిల్లా,కమలాపురం తాలూ కా(యర్రగుంట్లమండలం) రంగశాయిపురంలో 10.7.1939న కేతు వెంకటరెడ్డి, నాగమ్మ దంపతులకు జన్మించారు.
బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఆచార్యులు, శాఖాధ్యక్షులుగా పదవీ విరమణ చేశారు. వీరి రచనలకు తెలుగు విశ్వవిద్యాలయం (1993), కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు(1986) లభించాయి.
సాహిత్య పరిశోధనకు, సాహిత్యవిమర్శకు సామాజిక శాస్త్రాల సహాయం అనివార్యమని మార్క్సిస్టులు భావిస్తారు. కేతు విశ్వనాథరెడ్డి దృష్టి అనే విమర్శ గ్రంథంలో ఈ సిద్ధాంతాన్నే ప్రతిపాదించి ఈ సిద్ధాంతం ప్రకారమే విమర్శ రాశారు. సాహిత్య పరిశోధనలో, సాహిత్య విమర్శలో సామాజిక శాస్త్రాల సహాయం అవసరమని మార్క్సిస్టు సాహిత్య విమర్శకుడుగా విశ్వనాథరెడ్డి ప్రతిపాదించారు. సాహిత్యం ద్వారా సామాజిక సమస్యలూ, భావాలూ ప్రస్ఫుట మవుతాయని మనకు తెలుసు. వాటిని విశ్లేషించడానికి, వాటిపట్ల ఒక దృష్టిని ఏర్పరచుకోవ డానికి అర్థశాస్త్రం,చరిత్ర,తత్వశాస్త్రం, రాజకీయ శాస్త్రం, సామాజిక మానవ శాస్త్రం,మొదలైన సమాజశాస్త్రాల సహాయాన్ని పరిశోధకులు తీసుకోకతప్పదు" అంటారు కేతు.
సాహిత్యాధ్యయనంలో సామాజిక శాస్త్రాల సహాయం తీసుకోవాలని ఆమోదించి నప్పుడు ఏ సామాజిక శాస్త్రాన్ని ఆశ్రయించాలి? అనే ప్రశ్న కలుగుతుంది. దీనికి సాహిత్యరచనలో వ్యక్తమయ్యే సామాజికాంశాలే ఏ సమాజ శాస్త్రసాయం తీసుకోవాలో నిర్ణయిస్తాయి" అని విశ్వనాథరెడ్డిసమాధానం చెప్పారు. "మహాభారతాన్ని పరిశోధక విషయంగాతీసుకొన్న పరిశోధకుడు. మహాభారత రచనాకాలంలోని
ధర్మవేదాంత నీతి శాస్త్రాల వెలుగులో మాత్రమే దాన్ని పరిశీలించాలని చెపుతాడు. అయితే పరిశోధకుడు తప్పనిసరిగా తనను తయారుచేసిన చారిత్రక సామాజిక సన్నివేశంలోని విజ్ఞాన ప్రభావంతో భారతాన్ని పరిశీలిస్తాడు.... గత చరిత్రకు సంబంధించిన సాహిత్య రచనలనైనా, సమాజ పరిణామాలలో భాగంగానే అధ్యయనం చేస్తాడు" అన్నారు.
భారతంలో మానవ సంబంధాలున్నాయి. అందులోపాలనాంశాలు ఉన్నాయి. అందులో రాజనీతి ఉంది. ఆర్థికసూత్రాలు ఉన్నాయి. చరిత్ర ఉంది. యుద్ధనీతి, యుద్ధప్రయోజ నాలున్నాయి. అందువలన వర్ణ వ్యవస్థ, దాని నిర్మాణం ఉన్నాయి. అనేక జాతులు, నాగరికతలు, జీవన విధానాలుచిత్రింపబడ్డాయి. వాటినన్నిటినీ అర్థం చేసుకోకుండా సాహిత్య
ప్రమాణాలనే నెపంతో కథాకథనం, పాత్రపోషణం దగ్గరే ఆగిపోతే సాహిత్యజ్ఞానపరంగా మరుగుజ్జులుగానే మిగిలి
పోతాం. అందుకే జానపద సాహిత్యం నుంచి భారత కాలానికి,భారతకాలం నుంచి ఈనాటి సాహిత్యానికి మధ్య వచ్చినసామాజిక మార్పును అర్ధం చేసుకోవాలంటే "సామాజికశాస్త్రాల వెలుగులో సాహిత్యాన్ని చూడక తప్పదు" అన్నారువిశ్వనాథరెడ్డి. ఈ అవగాహనతోనే విశ్వనాథరెడ్డి మార్క్సిజాన్నిఒక ప్రాపంచిక దృక్పథంగా ఏర్పరచుకుని, దాని ప్రకారమేచారిత్రక దృష్టితో తెలుగు కల్పనా సాహిత్యాన్ని అనేక ముఖాలనుంచి విశ్లేషించారు.
తెలుగు సాహిత్యాన్ని అంతకుముందటి భావజాలాల కన్నా మార్క్సిజమే జీవితానికి దగ్గరగా తీసుకొచ్చిందని, 1921
ప్రాంతాల నుంచి అది ఎలా సాధ్యమైందో “తెలుగు సాహిత్యంలో మార్క్సిజం ప్రభావం" అనే వ్యాసంలో విశ్లేషించారు. తెలుగులో అభ్యుదయ సాహిత్యం పుట్టుకకు నేరుగ సోవియట్ విప్లవాన్నే ఏకైక కారణంగా చెప్పకుండా, దానికన్నా ముందే వేమన కాలం నుంచి మన సమాజ పరివర్తనకు జరుగు తున్న చిత్రించారని ప్రయత్నాలు కూడా పేర్కొనడానికి మార్క్సిజం అందించిన చారిత్రక సంస్కారమే కారణం. ఈ చర్చలో విశ్వనాథరెడ్డి మార్క్సిజం అందించిన ఘర్షణ - సామరస్యం - గతిశీలత అనే సూత్రాన్ని వినియోగించు కున్నారు.
1980లలో మరొకసారి తెలుగు సాహిత్య చరిత్రలో
యుగవిభజన మీద చర్చ జరిగినప్పుడు విశ్వనాథరెడ్డి కూడా తనదైన విశిష్ట ఆలోచనల్ని అందించారు. తెలుగు సాహిత్య
చరిత్రను లిఖిత సాహిత్య చరిత్రగా మాత్రమే భావించడాన్ని వ్యతిరేకించి క్రీ.పూ. 1000వ సంవత్సరం నుంచి క్రీ.పూ.
600వ సంవత్సరం దాకా వ్యవసాయికపూర్వయుగమని,
అప్పటి నుంచి క్రీ.శ. 1800 దాకా వ్యవసాయక యుగమని, ఆ తర్వాతది పారిశ్రామిక యుగమని మూడు యుగాలుగా విభజించారు. వాటిలో ఒక్కొక్కదాన్లో ఉపదశలో ప్రాంతీ భేదాలూ, ధోరణులూ ఉన్నాయని, వీటి అవిచ్చిన్నతా చరిత్రే తెలుగు సాహిత్య చరిత్ర అని నిర్ధారించారు.
తెలుగు కల్పనా సాహిత్యాన్ని విశ్వనాథరెడ్డి తన మార్క్సీయ దృక్పథం నుంచి అనేక వ్యాసాల్లో విశ్లేషించారు. తెలుగులో కథానిక' అనే వ్యాసంలో స్వతంత్రం వచ్చేదాకా తెలుగు కథానిక పూర్వమధ్యాంధ్ర అగ్రవర్ణ విద్యాధికుల చేతుల్లోనే ఉందని, 1960 ప్రాంతాల నుంచి మిగతా ప్రాంతాలకు విస్తరించిందని పేర్కొన్నారు. 1980 తర్వాత తెలుగు కథానిక, కవిత్వ ప్రచారానికి ధీటుగా నిలబడిందన్నారు. 'తెలుగు కథానిక దశాబ్ది ధోరణులు' అనే వ్యాసం తెలుగు కథానికా సాహిత్య చరిత్ర రచన దృష్ట్యా చాలా విలువైనది. గురజాడ నుంచి ఉన్న వందల కొలది. తెలుగు కథా రచయితల్ని విశ్వనాథరెడ్డి ఆరుతరాలుగా పరిశీలించారు. "ఏభై ఏళ్ళ తెలుగు సాహిత్యంలో కథ" అనే వ్యాసంలో విశ్వనాథరెడ్డి ఒక కొత్త ఆలోచనను బయట పెట్టారు. అది స్వాతంత్ర్యానికి పూర్వం కథల్లో తాత్త్వికత మూడు విధాలుగా కనిపిస్తుందని, అవి విశ్వనాధ కర్మవాదం, కుటుంబరావు సమష్టివాదం. మరొక
వ్యక్తివాదమని పేర్కొన్నారు. తెలుగు భాషా ప్రయోగం దృష్టితో రూప పరిమాణం దృష్టితో విశ్వనాథరెడ్డి రాసిన మూడు వ్యాసాలు మంచి పరిశోధన విలువలుగల పత్రాలు.
కుటుంబరావు, రావిశాస్త్రి, కారా ల మీద విశ్వనాథరెడ్డి రాసిన వ్యాసాలు రచయితలు విమర్శకులు ఒకే భావజాలం కలిగిన వాళ్ళయినప్పుడు సాహిత్య విమర్శ ఎలా వుంటుందో రుజువు చేస్తున్నాయి. 1964 నాటి కారాకథ 'యజ్ఞం', 1992
"సంకల్పం - కథలకు మూడు దశాబ్దాల కాలదూరం ఉంది.
అయినా రచయిత సమాజంలోని హింసను మరచిపోకుండా
చిత్రించారని గుర్తిస్తూ 'యజ్ఞం' కథలో వర్గహింస, సంకల్పం
కథలో సాంస్కృతిక హింస ఉన్నాయని, ఈ రెండు కంచులువాస్తవాలేనని, సాంస్కృతిక హింసకు ఎక్కువగా గురయ్యేది స్త్రీ లేనన్న వాస్తవాన్ని సంకల్పం కథ ఆవిస్కరించిందని విశ్లేషించారువిశ్వనాథరెడ్డి.
విశ్వనాథరెడ్డి నవల, నవలా పఠనం అనే వ్యాసం రాశారు. విషయ వాస్తవ స్థాయి, వస్తు లక్ష్యస్థాయి, సాహిత్య స్థాయి, తాత్త్వికస్థాయి, ఆ నాలుగంశాలను దృష్టిలో పెట్టుకొని చదివితే నవల శాస్త్రీయంగా అవగాహన కొస్తుందని చెప్పారు.
మార్క్సిస్టు సాహిత్య విమర్శకులు వస్తువును గురించి ఎక్కువ మాట్లాడుతుంటారు. శిల్పాన్ని గురించి పట్టించుకోరనే అపవాదు ఒకటుంది. విశ్వనాథరెడ్డి ఈ విషయాన్ని గురించి ఇలా అన్నారు. "మార్క్సిస్టు విధానంలో కేవలం సామాజికదృక్పథ విశ్లేషణే ఉంటుందనే అపవాదు మన సాహిత్యలోకంలోలేకపోలేదు.... సాహిత్యానుభవ విశ్లేషణ, సాహిత్యరూపం ద్వారా ఎట్లా సాధ్యమవుతుంది అనే దానికి కొలమానాలు మార్క్సిస్టు విధానంలో లేవని కాదు" కథా రచయిత తన జీవితాగా హనను పాఠకుడికి అందించాలంటే శిల్పమనేది తెలియాలనే అంటున్నారు. కేతు. అంతేకాదు 'కథారూపం' అనే వ్యాసంలో తెలుగు కథకుల శిల్ప విన్యాసాల్ని విశ్లేషించారు.
తెలుగు సాహిత్యంలో గతితర్కం, పరాయీకరణ, వద్ద
కలహం అనే మూడు మార్క్సిస్టు భావనలు కనిపిస్తున్నాయన్న
అవగాహన గల విశ్వనాథరెడ్డి కల్పనా సాహిత్య రచయితగా
వాటిని రచనల్లో ప్రతిబింబించడమేగాక, సాహిత్య విమర్శలోనూ వాటిని ఉపయోగించు కున్నారు. ఆయన సాహిత్య విమర్శకు సామాజిక శాస్త్రమూ, సాంఘిక, ఆర్థిక, రాజనీతి మొదలైన శాస్త్రాలను మార్క్సిజం చట్రంలోనే ఉపయోగించుకున్నారు. జి.యన్.రెడ్డి పర్యవేక్షణలో కడప జిల్లా ఊర్ల పేరుపైకేతు పరిశోధన చేశారు.
1976లో ప్రచురితమైన ఈ గ్రంథంలో తొమ్మిది అధ్యాయాలున్నాయి. గ్రామ నామ పరిశీలనలో ప్రారంభమై సంజ్ఞా నామతత్త్వాన్ని, స్థల నామ పరిశోధన ప్రయోజనాన్ని వివరించింది. అందులోని చారిత్రక పరిణామాన్ని వివరించారు.విశాలాంధ్ర ప్రచురణాల యానికి కొ.కు, సాహిత్య సంపుటాల
భావజాలం సిద్ధం చేస్తున్నప్పుడు రాసిన పీఠికలన్నీ కలిపి మన కొడివటిగంటి పేరుతో ముద్రించారు. నవలా కారుడిగా, కథకుడిగా, సాహిత్య విశ్లేషకుడిగా కొ.కు.ను అంచనా వేశారు. దీపధారులు అన్న కథానికా సాహిత్య విమర్శ రచించారు.
__రాచపాళెం చంద్రశేఖరరెడ్డి
( సేకరణ:పిళ్లాకుమారస్వామి)