కల్లూరు వేంకట నారాయణరావు అనంతపురం జిల్లా మరూరు బండ మీద పల్లెలో 6-3-1902న జన్మించారు. లక్ష్మమ్మ, సుబ్బారావు వీరి తల్లిదండ్రులు. వీరు సంస్కృత విద్వాన్ పూర్తి చేశారు. మద్రాసు ప్రెసిడెన్సీలో బి.ఏ.లో పతకాన్ని పొందారు.
నారాయణరావు తెలుగు, సంస్కృతం, కన్నడం, ఆంగ్లం
భాషల్లో అద్భుతమైన పాండితాన్ని సంపాదించారు. కన్నడం,
తెలుగులో ఎం.ఏ. చేశారు.1925 నుంచి అధ్యాపకులకు శిక్షణ ఇస్తూ 1932లో పాఠశాలల డిప్యూటీ ఇన్స్పెక్టర్ గా పదోన్నతిని పొందారు. తర్వాత 16 సంవత్సరాలకు జిల్లా విద్యాశాఖా ధికారిగా నియమితులై 1948 నుంచి 1956 వరకు పనిచేశారు.
వీరేశలింగ యుగం, 19వ శతాబ్దపు ఆంధ్ర వాజ్మయ
చరిత్రం, ద్రావిడ భాషా మూలము' అనేవి కల్లూరు వారి
రచనలు.
నారాయణరావురచనల్లో మకుటాయ మానంగా ప్రకాశించే గ్రంథం 'ఆంధ్ర వాజ్మయ చరిత్ర సంగ్రహము'దీన్ని వావిళ్ల వారు “కవిత్వవేది” పేరుతో 1928లో ప్రచురించారు. ఇందులో మొత్తం సాహిత్య చరిత్రను ఐదు ఖండాలు గా విభజించారు. ప్రతి ఖండంలో సాహిత్యంను చాళుక్యు చోళ,కాకతీయ, రెడ్డి నాయక,రాయల యుగం ఇలా అనేక యుగాలుగా విభజించారు.ఆ యుగ లక్షణాన్ని ప్రతిబింబించే సాహిత్యాంశాలను ఇందులో వివరించారు. రచయితల కాలాన్ని బట్టి కూడా కొన్ని యుగాల్ని విభజించారు.ఆ యుగలక్షణాల్ని సమస్యయం చేశారు.
కాకతీయ యుగంలో వివిధ కవితాబీజాలు సంపూర్ణంగా
పరిణతి పొందాయని, అలంకార లక్షణ గ్రంథాలనేకం వచ్చా
యని, ప్రబంధ కావ్యరీతి ప్రబలిందని, స్వప్న వృత్తాంతాలకు
విశేష ప్రచారం లభించిందని చెప్పారు.
కావ్య, ప్రబంధ కవిత్వం అనే శీర్షికలో అంతకుముందు సాహిత్య చరిత్రలో పేర్కొనబడనిచాలామంది కవుల వివరాల్ని కల్లూరు వారు పొందుపరిచారు.
రాయల యుగంలో కవులు పోటీపడి రాశారని తెలిపారు. వసుచరిత్ర గుణదోషాల్ని, సహేతుకంగా విమర్శించారు.
సంధి యుగంలో నిఘంటు వ్యాకరణ, చారిత్రక పరిశోధన సాగిందని, పత్రికలు వచ్చాయని, జమీందారులు సాహిత్యాన్ని పోషించారని తెలిపారు. 'నవయుగము' అనే పేరుతో ఈ గ్రంథంలో ఒక అధ్యాయం ఉంది. అయితే కల్లూరు వారు 'వీరేశలింగయుగము' పేరుతో ఒక ప్రత్యేక గ్రంథాన్ని కూడా రచించారు.
ఆధునిక సాహిత్యంలో పాశ్చాత్య సాహిత్య ప్రభావం
ద్వారా వచ్చిన మార్పుల్ని, సంఘసంస్కరణ, భాషా సంస్కరణ
జరిగిన తీరుల్ని ఇందులో వివరించారు. ఆ కాలం పండితులను
పరిచయం చేశారు. ప్రతియుగం లోను యుగలక్షణ
సమన్వయం చేసిన తీరు మెచ్చదగినది. ఆకారంలో
చిన్న పుస్తకమైనా “ఆంధ్ర వాజ్మయ సంగ్రహము" గుణంలో
గరిష్ట మైంది.
___గుమ్మా సాంబశివరావు
(సేకరణ: పిళ్లా కుమారస్వామి)
9490122229