గడియారం వెంకటశేష శాస్త్రి
ఎస్. సంధ్యారాణి
(సేకరణ: పిళ్లా విజయ్)
9490122229

గడియారం వెంకటశేష శాస్త్రి బహుముఖ ప్రజ్ఞాశాలి. వీరు కడప జిల్లా నేటి పెద్దముడియం మండలం నెమల్లదిన్నె గ్రామంలో 1901 ఫిబ్రవరి 16న రామయ్య నరసమ్మ దంపతులకు జన్మించారు.
ప్రొద్దుటూరులో విద్యా
భ్యాసం. విద్వాన్ పరీక్షలో ఉత్తీర్ణులు, ప్రొద్దుటూరు కన్యకా
వరమేశ్వరీ సంస్కృత పాఠశాలలోఉపాధ్యాయులుగా, మున్సిపల్ హైస్కూల్ ప్రధాన ఆంధ్ర పండితులు గాను పనిచేశారు. "బ్రహ్మనందినీ " పత్రికకు కొంతకాలం సహాయ సంపాదకులు.

రూపావతారం శేషశాస్త్రి వద్ద కావ్య నాటకాలంకారా లను జ్యోతిష్య వాస్తు శాస్త్రాలను అభ్యసించారు. రాజశేఖర శతావధానితో కలిసి అవధానాలు చేసి 'అవధానపంచాననుడు' గా సన్మానాలు పొందారు. తాను ముందు సభ్యుడుగా, తరువాత సాహిత్య అకాడమీ అధ్యక్షుడుగా బాధ్యతలు నిర్వహించారు.

వీరు అనేక పద్య కావ్యాలు, గద్య గ్రంథాలు, విమర్శలు అనువాదాలు చేశారు. కిరాతార్జునీయం, మల్లికా మారుతం, పంచబాణ విజయం- అనువాద కావ్య నాటకాలు. దుర్గా స్తోత్రం (దండకం), శరన్నవ
రాత్రి, పద్యావళి. దుర్గామాత - సందేశం, భారతభూమి నాతల్లి,
నా భారతభూమి కావ్యాలు రాశారు. వాల్మీకి చరిత్ర, శ్రీనాథ కవితా సామ్రాజ్యం, ఏదికవితా వస్తువు మున్నగు వ్యాసాలు వ్రాశారు. ఉత్తర రామాయణ కావ్యశిల్పం , తిక్కన కళావైదగ్ద్యం, శ్రీనాధ కవితా సామ్రాజ్యం, వీరి విమర్శనా గ్రంథాలు.
ఉత్తర రామాయణము కావ్య శిల్పం లో గడియారం
తిక్కన రాసిన నిర్వచనోత్తర రామాయణము కంకంటి పాపరాజు రాసిన ఉత్తర రామాయణమును గురించి కావ్య పరిశీలనం చేశారు. ఈ రెండు రామాయణములకు తోడు రామాయణోత్తర కాండను కూడా తీసుకున్నారు. అలాగే రామాయణ కథా రచయితలైన కాళిదాసు, భవభూతిని అవలోకించి, రామాయణ కథాశ్రితాలైన తెలుగు కవులను కూడా పరిశీలించారు. ఈ కావ్యంలో గడియారం ఉభయుల రచనలను తులనాత్మకంగా పరిశీలన చేశారని చెప్పవచ్చు.
తిక్కన తన పీఠికలో తన కవితా విన్యాసమంతా చెప్పారని, పాపరాజు ఆ పని చేయలేదంటారు. తిక్కన కృతి నామక వంశ వర్ణన చేస్తే, పాపరాజు కృతి భర్త శ్రీకృష్ణుడు కాబట్టి అతని పేర ఒక గ్రంధమే రాశాడని చెప్పారు.
అయోధ్య వర్ణన విషయంలో తిక్కన "అఖిల భోగంబుల కాస్పదంబగుట..... అంటూ ప్రజాజీవితాన్ని వర్ణించాడని పాపరాజు ప్రభుత్వోన్నతిని ఎక్కువ చేసి చెప్పాడన్నారు.
రాముని దర్శించడానికి మునులు సభాద్వారము
నిల్చి తమ రాక చెపి, రాముడు వారిని పిలుక రమ్మన్నాడని
తిక్కన అంటే పాపరాశజేమో స్వయంగా రాముడే అగస్త్యాదుల
కడకు వచ్చాడని చెప్పారు. తిక్కనమో రాముడు
ప్రజాపరిపాలకుడైన రాజు అని పాపరాజులేమో రాముడు
దేవుడని అంటాడు.
రావణాదుల జన్మవృత్తాంతం చెపుతూ వారు
పుట్టి పెరిగి పెద్దవారైనారంటూ తిక్కన నామకరణం వరకు
వివరిస్తే, పాపరాజు విద్యాభ్యాసం వరకు వివరించారు. అయితే
రావణ స్వభావసిద్ధమైన క్రౌర్యాన్ని ఇరువురు స్వభావసిద్ధంగా
చెప్పారని గడియారం అన్నారు.
సీత భూగర్భ ప్రవేశానంతరం రాముడేమి చేశాడని కుశలవులేమైనారనే ప్రశ్నలకు రాముడే స్వయంగా వాల్మీకితో చెప్పించాడని పాపరాజు చెప్తే, తిక్కనేమో సర్వజనులను సన్మానించి పంపినారని చెప్పాడు.
తిక్కన కళావైదగ్ద్యంలో తిక్కన కవితాతత్త్వాన్ని విశ్లేషించారు.
ప్రపంచ తెలుగు మహాసభల (1974) సందర్భంగా శ్రీనాథుడిపై ఆయన కవితాతత్త్వంపై విశ్లేషణాత్మక రచన చేశారు.
1981లో ఈ లోకాన్ని విడిచారు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s