జి నాగయ్య 1976 సంవత్సరం జూలై నెల 30వ తేదీన కడప జిల్లా పులివెందుల తాలూకా లోని తాతిరెడ్డిపల్లె లో నారమ్మ,నాగప్ప దంపతులకు జన్మించారు.ఇంటర్మీడియట్ విద్యను అనంతపురం ప్రభుత్వ కళాశాలల్లో పూర్తిచేసి 1959 61 లో తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వరవిశ్వవిద్యాలయంలో తెలుగు పూర్తి చేశారు నాగయ్య 1992 సంవత్సరం మే నెల ఏడో తేదీన తుదిశ్వాస విడిచారు
ఈయన రాసిన ద్విపద వాజ్మయము గ్రంధంలో ఎనిమిది ప్రకరణాలున్నాయి.

1. ఉపక్రమణిక
2. ద్విపద ఛందస్సు, విశేషాలు, ద్విపద గణాలు, దేశీయత,
ప్రాచీనత ఛందస్సు కవిత్వం, ద్విపద తెలుగు విధానాన్ని
ఛందస్సుకు ప్రాతిపదిక ద్విపద గేయ లక్షణాలు, కావ్యోప యోగ్యత
3. ద్విపద వాజ్మయ పరిణామం, ద్విపద కావ్యాల పుట్టుక, అనే
ద్విపద అనాదరణీయమైన సంగతి, నాల్గు ఘట్టాలు (ఎ)
శైవ ద్విపద రచనలు (1160-1500) (బి) వైష్ణవ ద్విపద
రచనలు (1500-1600) (సి) కావ్య ద్విపద రచనలు
(1600-1875) (డి) ఆధునిక ద్విపద రచనలు (1875
తర్వాత)
4 ద్విపద కావ్యాల వర్గీకరణ పౌరాణికాలు, శైవ
పురాణాలు, రామాయణాలు, భాగవతాలు, భారతాలు-
వంశకీర్తనలు - కావ్యప్రబంధాలు - కల్యాణాత్మకాలు, క్షేత్ర
మహాకావ్యాలు - వ్రత మాహాత్మ్యాలు, భక్తి ప్రబోధకాలు -
తాత్త్వికాలు - చారిత్రకాలు - చిత్రాఖ్యానాలు - పరిశిష్టం.
5. ద్విపద కవితారీతులు
6.ద్విపద రచనలు - పరివర్తనాలు
7.ద్విపద రచనలు, సాంఘిక చరిత్ర
8. సింహావలోకం: భాష, వ్యాకరణం, ఇతరాంశాల చర్చ,
అనుబంధం - ద్విపద గ్రంథాల జాబితా
ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారు నిర్వహించిన
పోటీలో పాల్గొని "తెలుగు కావ్యావతారికలు" అనే
పరిశోధనాత్మక వ్యాసానికి బహుమతిని పొందారు. ఆ సిద్ధాంత వ్యాసాన్ని 1968లో ప్రచురించారు. నాటకాల్లో నాందీ ప్రస్తావనల్లా కావ్యాల్లో అవతారికలు కావ్యస్వరూప స్వభావ వివేచనానికి ముంజేతి కంకణాల్లా ఉపకరిస్తాయి. నాగయ్య రాసిన ఈ గ్రంథం ఆ మర్యాదలోని మర్మాలనూ, వికాస పరిణామాలను విశ్లేషణాత్మకంగా వివరించి చెపుతోంది. ప్రసిద్ధాంధ్ర కావ్యాలలో పాటించిన అవతారికా నిర్మాణాన్ని దాదాపు 15 అంశాల క్రింద వింగడించి వాటి ప్రయోగాల్లో
ఉన్న విశేషాలను రచయిత చారిత్రక దృక్పథంతో చిత్రించి
చూపించారు.
నాగయ్య 1976 దాక్షిణాత్య సాహిత్య సమీక్ష పేరుతో ఒక గ్రంథాన్ని ప్రచురించారు. ఈ గ్రంథంలో మూడు వ్యాసాలు న్నాయి.1.రామకథ-రంగనాథ. కంబరామాయాణాలు 2.దక్షిణాత్య సాహిత్యాలు దేశి 3. యక్షగానాలు ద్రావిడ దృశ్యరీతులు .నాగయ్య 1984లో "ఎర్రన శ్రీనాథుల సూక్తి వైచిత్రి" అనే పేరుతో ఒక పరిశోధన గ్రంధాన్ని
ప్రచురించారు. ఈ గ్రంథంలో ముందుగా ఎర్రన రచనల్ని, ఆ
తర్వాత శ్రీనాథుని కృతుల్ని సంక్షిప్తంగా పరిచయం చేశారు.
ఎర్రన శ్రీనాథుల గ్రంధాల ప్రాశస్త్యాన్ని, స్వభావాల్ని, అనువాదవిధానాన్ని, కవితాతారతమ్యాన్ని వివరించారు.
మొదటి భాగంలో సాహిత్య అధ్యయన పద్ధతులు అనే
శీర్షిక ఉన్న అధ్యాయంలో వాజ్మయం, సారస్వతం, సాహిత్యంఅనే శబ్దాల్ని విశ్లేషించారు. ఆ తర్వాత కాలానుసరణ, చారిత్రక,తులనాత్మక పద్ధతుల్ని వివరించారు.
ఈ అధ్యాయంలో సాహిత్య చరిత్రకు ఆధారమైన శాసనాలు, కావ్యావతారికలు, ఆశ్వాసాంతగద్యాలు, లక్షణ గ్రంథాలు, సంకలన గ్రంధాలు, గ్రంథసూచికలు, చరిత్ర, జనశ్రుతి అనే అంశాల్ని వివరించారు.
తెలుగు సాహిత్య యుగ విభజనలో పలువురు
సాహిత్య చరిత్రకారులు, విమర్శకులు వెలువరించిన యుగవిభజనల్ని తెలిపి వాటిలోని గుణదోషాలను వివరించారు.
క్రీ.శ. 1000కి పూర్వమున్న తెలుగు భాషా స్థితిని, సంస్కృత,
ప్రాకృతాలతో తెలుగుకున్న సంబంధాన్ని వివరించారు.
నన్నయకు పూర్వమున్న తెలుగు కవిత్వాన్ని గురించి తెలిపితెలుగులో నన్నయ ఆదికవి కావటానికి గల కారణాల్నివివరించారు నన్నయ భారతాంద్రీకరణ విధానాన్ని,కవితారీతుల్ని వివరించి నన్నయ యుగంలోని చారిత్రకవిశేషాల్ని, నన్నయ సమకాలికుల్ని తెలియజేశారు.
నన్నయ యుగం తర్వాత మార్గదేశి సంప్రదాయాల్ని
వివరించారు. నన్నెచోడుని జాను తెనుగు, వస్తుకవితల్ని గురించి పాల్కురికి సోమనాథుని రచనల్ని గురించి, శివకవుల రచనా వైశిష్ట్యాన్ని గురించి తెలిపి శివకవి యుగంలోని చారిత్రక
విశేషాల్ని, ఇతర కవుల్ని పరిచయం చేశారు. రంగనాథ
రామాయణ కర్తృత్వాన్ని గురించి తెలిపి అవాల్మీకాంశాల్ని
వివరించారు. ద్విపద వాజ్మయ చరిత్రను వివరించారు.
తిక్కన కవితాదర్శాలను. రసాభ్యుచిత బంధాన్ని
చారిత్రకయుగ విశేషాలను, సమకాలికులను వివరించారు.
ఎర్రన రచనల పూర్వపరాలను తెలిపి ఆయన సూక్తి వైచిత్రిని
విపులంగా చెప్పారు. ఎర్రన నాచన సోమనల కవితా
తారతమ్యాన్ని, భాస్కర రామాయణ కర్తృత్వరచనా విశేషాల్ని,ఎర్రన యుగంలోని చారిత్రక విశేషాల్ని వివరించారు.
శ్రీనాథ యుగంలో శ్రీనాథుని కృతుల్ని పరిచయం చేసి,
కావ్యశైలిని, వ్యక్తిత్వాన్ని వివరించారు. ఆ తర్వాత పోతనరచనల్ని పరిచయం చేసి ఆంధ్ర భాగవత విమర్శ గావించారు.
శ్రీనాథుని కాలంనాటి చారిత్రక విశేషాల్ని, సమకాలికుల్ని
తెలియజేశారు. తాళ్ళపాక కవుల్ని కూడా పరిచయం చేశారు. మొదటి భాగం చివరలో పురాణేతిహాస కావ్య ప్రబంధ ప్రక్రియల్ని గురించి వివరించారు.
ద్వితీయ భాగంలో అష్టదిగ్గజ నిర్ణయం మొదలైన తెలుగు
సాహిత్య వ్యాసాలు, విమర్శలు, పరిశోధనలు అనే శీర్షిక వరకు
ఈ భాగం సాగింది. అష్టదిగ్గజ కవులు ఎవరు? అనే
విషయంలో సాహితీ విమర్శకులు వెలువరించిన చిన్నాలి.
ప్రాయాలు వివరించి లోకంలో ప్రచారంలో ఉన్న అష్టదిగ్గజ
కవుల్ని పరిచయం చేశారు. తర్వాత ప్రబంధ యుగం అనే
శీర్షికలో విజయనగర రాజుల కాలం నాటి చారిత్రక, సాంఘిక,
రాజకీయ విశేషాల్ని వివరించి ఆ యుగంలోని ఇతర కవుల్ని
గురించి తెలిపారు. తంజావూరు పాలకుడైన రఘనాథ
నాయకుని రచనల్ని పరిచయం చేసి, రచనారీతుల్ని
వివరించారు. తర్వాత చేమకూర వేంకటకవి రచనా
చమత్కృతిని సోదాహరణంగా తెలిపారు. ఈ కాలంలో
రాజాస్థాన గౌరవం దక్కింది. నాగయ్య తెలుగులో వచ్చిన
యక్షగాన విశేషాల్ని విపులంగా వివరించారు. ఆ తర్వాత
వచన వాజ్మయ వికాసాన్ని పరిచయం చేశారు. తెలుగు
సాహిత్యంలో వెలువడ్డ పలు వచన రచనల విశ్లేషణ 'వచన
వాజ్మయ వికాసము' అనే శీర్షికలో సాగింది.
తెలుగులో వెలువద్ద చారిత్రక కావ్యాలను ఒక ప్రత్యేక
శీర్షికలో తెలిపారు. తెలుగులో రచనలు గావించిన తాళ్ళపాక
తిమ్మక్క, మొల్ల, మోహనాంగి, తిరుమలాంబ, నాబి, లీలావతి,
శారద, త్రివేణి రామభద్రాంబ, మధురవాణి, రంగాజమ్మ
కృష్ణాజీ, చంద్రలేఖ సౌందరి. ముద్దుపళని మొదలైన వారిని
పరిచయం చేశారు. దక్షిణాంధ్ర యుగ సాహిత్యం అనే శీర్షికలో
17.18 శతాబ్దాల చారిత్రక, సాహిత్య విశేషాల్ని వివరించారు.
తంజావూరు, మహారాష్ట్ర, మధురాపురం, చెంజి, మైసూరు,
పుదుక్కోట, ఇతర సంస్థానాల సాహిత్యాలను గురించి
వివరించారు.
'సంస్థానములు - సాహిత్య పోషణము' అనే శీర్షికలో
ఆత్మకూరు, వనపర్తి, జటప్రోలు, దోమకొండ మొదలైన సంస్థానాలు గావించిన సాహిత్య సేవను, పోషణను
వివరించారు.
శతక వాజ్మయ చరిత్ర' అనే శీర్షికలో ముందుగా తెలుగు
శతక స్వరూప లక్షణాన్ని తెలిపారు. తర్వాత శతక
వాజ్మయాన్ని వర్గీకరించి భక్తి శతకాల్లో శైవ, వైష్ణవ శతకాల్ని
వివిధ భక్తి శతకాల్ని, వ్యాజస్తుతి శతకాల్ని, వేదాంత శతకాల్నినీతి శతకాల్ని, అధిక్షేప శతకాల్ని, శృంగార శతకాల్ని హాస్య శతకాల్ని, ఇతర శతకాల్ని పరిచయం చేశారు.

ఆధునిక యుగాంధ్ర కవిత్వము ప్రాదుర్భావ వికాసములులో చిన్నయసూరి, కొక్కొండ వేంకటరత్నం
పంతులు, వీరేశలింగం పంతులు ముగ్గురినీ నవయుగ
ప్రవర్తక త్రయంగా చెప్పారు. కట్టమంచి రామలింగారెడ్డి భావ
విప్లవాన్ని గురించి తెలిపారు. తిరుపతి వేంకట కవులు, వేంకట పార్వతీశ్వరకవుల్ని పరిచయం చేశారు. ఆధునికాంధ్ర
కవిత్వానికి గురజాడ, రాయప్రోలు ఇద్దరు యుగకర్తలని
సి.నా.రె. తన పరిశోధనా గ్రంథం'ఆధునికాంధ్ర కవిత్వం_సంప్రదాయాలు ప్రయోగాలు'లో చెప్పగా, నాగయ్య గురజాడ,
వైపు మొగ్గు చూపారు. ఆ తర్వాత భావ కవిత్వం, విప్లవ
కవిత్వం, అనే శీర్షికల్లో పలు విశేషాల్ని వివరించారు.
సమస్త సాహిత్యానికి పునాది అయిన జానపద సాహిత్యాన్ని గురించి 21వ శీర్షికలో తెలిపారు. జానపద గేయ వాజ్మయ పరిణామాన్ని వివరించి జానపద గేయాల్లోని వివిధ పద్ధతుల్ని విశ్లేషించారు. ఆంధ్ర నాటక సాహిత్య పరిణామాన్ని ఒక శీర్షికలో వెల్లడించారు. తెలుగు నవలా వికాసాన్ని అయిదు తర్వాత విభాగాలుగా విభజించి వివరించారు. తెలుగు కథ. కథానిక
తెలుగు శీర్షికలో తెలుగులో వెలువడ్డ వివిధ కథల్ని కథారచయితల్ని
వచన పరిచయం చేశారు. చివరిగా తెలుగు సాహిత్య వ్యాస రచనా రీతి, పరిణామం, తెలుగులో విమర్శ పరిణామం పొందిన తీరు, తెలుగులో జరిగిన పరిశోధనల తీరు తెన్నుల్ని వివరించారు.
__గుమ్మా సాంబశివరావు
     (సేకరణ: పిళ్లా కుమారస్వామి)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s