సంజీవమ్మ,పి. జూన్ 1942న సంజీవరెడ్డి,
వెంకటమ్మ దంపతులకు సంజీవమ్మ జన్మించారు. తన ఉద్యోగ జీవితాన్ని 1965లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకురాలిగ ప్రారంభించి, కడప జిల్లాలో ఎక్కువ కాలం,
అనంతపురం జిల్లాలో కొంతకాలం పనిచేసి 1998లో
ప్రిన్సిపాల్ గా విశ్రాంతి పొందారు. 1995లో రాష్ట్ర ఉత్తమ అధ్యాపకురాలిగా పురస్కారం పొందారు.
ఆమె పిహెచ్.డి. సిద్ధాంత గ్రంథం "తెలుగు నవలలో సామాజిక చైతన్యం'. సంజీవమ్మ తమ పరిశోధన కొనసాగించ డానికి 1977లో FIP ప్రణాళికలో ఎన్నికయ్యారు.
అనంతపురం పి.జి. కేంద్రంలో (తర్వాత అది శ్రీకృష్ణదేవరాయ
విశ్వవిద్యాలయం)లో మూడు సంవత్సరాల పాటు పరిశోధన
కొనసాగించి 1982లో పిహెచ్.డి. అవార్డు పొందారు. కడప జిల్లా అభ్యుదయ రచయితల సంఘం ఆమె సిద్ధాంత గ్రంథాన్ని 1984లో ప్రచురించింది.
నవలలో కాని ఇతర సాహిత్య ప్రక్రియలలో కాని
'సామాజిక చైతన్యం' అనే దృక్కోణంలో పరిశోధన చేయటం అనేది 1974నాటికి కొత్త విషయం. ఆ భావనతో ఆనాటికి తెలుగు సాహిత్యంలో పరిశోధన ప్రారంభం కాలేదు. మార్క్సిస్టు దృక్పథం,అభ్యుదయ భావజాలం కలిగిన ఆమె సోవియట్ సాహిత్యం, ఆ విమర్శ అధ్యయనం చేయటం వల్ల నవలా సాహిత్యంలో సామాజిక చైతన్యం అనే అంశాన్ని పరిశోధనకు ఎంచుకున్నారు. దానికి న్యాయం చేశారు. ఈ గ్రంథంలో ఆమె సామాజిక చైతన్యం అనే భావనను చర్చించారు. సామాజిక చైతన్య స్వరూప విశ్లేషణ దాని వివిధ రూపాలు వివరించారు.
వ్యక్తి చైతన్యం రచయిత చైతన్యం గురించి కూడా చర్చించారు.
విమర్శనా పద్దతులను, నవలా లక్షణాల్ని విశ్లేషించారు. ప్రాచీన,నవీన, ప్రాచ్య, పాశ్చాత్య విమర్శ ధోరణుల్ని సంక్షిప్తంగా ప్రస్తావించారు.
తొలి నవల కందుకూరి వారి రాజశేఖర చరిత్ర'తో ప్రారంభించి 1970 దశకం వరకు వచ్చిన 26 ప్రముఖ నవలల్ని స్వీకరించి సామాజిక చైతన్య దృష్టితో విశ్లేషించి విమర్శించారు. ఆయా నవలల్ని చారిత్రక, సామాజిక
ఉద్యమాల నేపథ్యంలో విశ్లేషిస్తూ, ఆ నవలలు అందులోనిపాత్రలు ఏ విధమైన చైతన్యాన్ని కలిగి, ఎంతవరకు సామాజిక ప్రయోజనాన్ని సాధించాయో ఆమె స్పష్టం చేశారు. నిబద్ధ
దృష్టితో పరిశీలించారు.
సంస్కరణోద్యమ కాలంలో ఆనాటి నవలలు ఆ
ఉద్యమానికి చేసిన దోహదం గురించి చర్చించారు. అలాగే
స్వాతంత్ర్యోద్యమ కాలంలోనూ 'మాలపల్లి' లాంటి నవలలు ఆ
ఉద్యమాన్ని ముందుకు నడిపించడంలో సమాజానికి ఇచ్చిన చైతన్యాన్ని స్పష్టం చేశారు.
అదేకాలంలో విశ్వనాథ 'వేయిపడగలు' చలం నవలలూ
వచ్చాయి. అవి స్వాతంత్ర్యోద్యమానికి ప్రాముఖ్యం ఇవ్వలేదు.
ఇరువురి నవలలూ విరుద్ధ భావజాలంతో సమకాలీన
సమాజంపై ప్రసరించిన ప్రభావాన్ని ఆమె అంచనా వేశారు.
సంప్రదాయవాది విశ్వనాథ 'వేయిపడగలు' నవలలో పున
రుద్ధరణ వాదాన్ని ప్రతిపాదించాడు. వర్ణ వ్యవస్థను, పాతివ్రత్యభావాన్ని సమర్థించాడు. తద్విరుద్ధంగా చలం స్త్రీ స్వేచ్ఛను
ప్రతిపాదిస్తూ నవలలు రచించాడని స్పష్టం చేశారు.
తెలంగాణా ఉద్యమ సాహిత్యంలో ఆళ్వారుస్వామి 'ప్రజల మనిషి', దాశరథి రంగాచార్య 'చిల్లరదేవుళ్ళు' వంటి నవలల్ని పరిశీలనకు గ్రహించారు. ఆయా నవలలు ఆ ఉద్యమాన్ని వాస్తవికతా దృష్టితో చిత్రించిన తీరు వివరించారు.
స్వాతంత్ర్యం తర్వాత సమాజంలో వచ్చిన మార్పులు,
వాటిని వాస్తవికతాదృష్టితో ప్రతిబింబిస్తూ వచ్చిన నవలలు
కొన్నింటిని పరిశోధనకు గ్రహించారు. కొడవటిగంటి కుటుంబరావు 'చదువు' నవల, జి.వి. కృష్ణారావు 'కీలుబొమ్మలు',
రంగనాయకమ్మ 'బలిపీఠం', రావిశాస్త్రి 'రాజు-మహిషి',
వాసిరెడ్డి సీతాదేవి 'సమత' మొదలైన నవలలు పరిశీలించి
ఆయా నవలలు సమకాలీన సామాజిక సమస్యల పట్ల
పాఠకుల్ని ఎంతవరకు చైతన్యవంతం చేయగలిగిందీ అంచనా వేశారు సంజీవమ్మ
ఆమె మనోవైజ్ఞానిక నవలల్ని కూడా పరిశీలనకు స్వీకరించి వాటిని సామాజిక దృష్టితో పరిశీలించారు. మనస్తత్వ శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం వ్యక్తుల మనస్తత్వాలకు
ప్రవర్తనలకూ సామాజిక కారణాలు కూడ ఉన్నాయి. డబ్బుతెలుగు సాహిత్య విమర్శ దర్శనం ప్రాధాన్యం కలిగిన, డబ్బుతో మనుషుల్ని విలువ కట్టే సమాజం రుగ్మతల సమాజం. ఇది మానసికంగా బలహీనులైన వ్యక్తుల అంతరంగ రుగ్మతలకు కారణం అవుతుంది. అలాంటి పాత్ర చిత్రణ ద్వారా రచయిత సమాజ స్వరూపాన్ని పాఠకుల ముందుంచి, దాన్ని అవశ్యం మార్చుకోవలసి వుందన్న చైతన్యాన్ని ఇస్తారు. మనోవైజ్ఞానిక నవలల్లో 'చైతన్య స్రవంతి శిల్పం' ప్రయోగించిన విషయం కూడ చర్చించారు సంజీవమ్మ. గోపీచంద్ 'అసమర్థుని జీవయాత్ర' రావిశాస్త్రి ' అల్పజీవి' బుచ్చిబాబు 'చివరకు మిగిలేది' నవలల్ని ఈమె విశ్లేషించారు.
ఆమె 'సాహిత్య విమర్శ వ్యాసాలు " సంపుటి 2001లో
ప్రచురితం. అందులో 16 వ్యాసాలున్నాయి. ఎక్కువగా నవలల మీద అందులోనూ స్త్రీ పాత్రల ప్రాధాన్యం మీదా వున్నాయి.
శరత్ నవలా సాహిత్యంలో స్త్రీలు, చలం నవలల్లో స్త్రీ పాత్రలు,అభ్యుదయ నవలా సాహితలలో స్త్రీ జీవిత చిత్రణ, తెలుగు సాహిత్యంలో స్త్రీవాదం, సామాజిక చైతన్య నవల- రచయిత్రుల
కృషి వంటి వ్యాసాలు ఆమె స్త్రీవాద దృక్పథాన్ని
తెలియజేస్తాయి. అంతేకాకుందా "తెలుగు నవలల మీద
మార్క్సిజం ప్రభావం', 'రచయిత చైతన్యం- సామాజిక
చైతన్యం', 'నవల-వాస్తవికత' వంటి వ్యాసాల్లో సాహిత్యకళ
ఒక శక్తిగా సామాజిక చైతన్యాన్ని జాగృతం చేయడానికి
పురోగమింపచేయడానికి దోహదం చేస్తుంది అనే విషయాన్ని స్పష్టం చేశారు. భారతీయ సాహిత్య నిర్మాతల్లో ఆధునిక భావ చైతన్యానికి తోడ్పడిన శరత్, ఉన్నవ, గురజాడ, మహీధర,
కొడవటిగంటి, వట్టికోట ఆళ్వారుస్వామి, చలం. రావిశాస్త్రి, బీనాదేవి వంటి వారి సాహిత్య కృషిలోని ప్రగతిశీల భావాలనుఈ సంపుటిలోని వ్యాసాలలో వెలికితీశారు సంజీవమ్మగారు.
ఆమె సాహిత్యాన్ని ఒక సామాజిక చర్యగా భావిస్తారు.
"సాహిత్య పఠనాసక్తిని పెంచే విమర్శ' అనే వ్యాసంలో రచన
మానవీయ సంస్కృతిని పెంచేదిగా, హృదయసంస్కారాన్ని
యిచ్చేదిగా వుందో లేదో విమర్శకులు తేల్చి చెప్పాలని, ఇది తేల్చడానికి విమర్శకునికి స్పందించే మనసు, పరిశీలించే,
విశ్లేషించే నిశితమైన బుద్దీ రెండూ వుండాలని అభిప్రాయ
పడతారు ఆమె. ఈ దృష్టితో కేతు విశ్వనాథరెడ్డి కథల్ని ఒక
వ్యాసంలో విశ్లేషించారు. కేంద్ర సాహిత్య అకాడమీ వారు ప్రచు
రించిన 'బంగారు కథలు' కథాసంకలనాన్ని కూడ సమీక్ష్మి
చారు మరొక వ్యాసంలో.
డా. మాడభూషి రంగాచార్య స్మారక సంఘం హైదరాబాదు వారు 2009లో ప్రచురించిన "తెలుగు కథానిక
1980" పుస్తకంలో 1950-60 దశాబ్ద కథల్ని విశ్లేషిస్తూ
సంజీవమ్మ చేసిన పెద్ద ప్రసంగ వ్యాసాన్ని చేర్చారు.
సంజీవమ్మ తమ సాహిత్య కృషికి గుర్తింపుగా ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. 1992లో అభ్యుదయ రచయిత స్వాతంత్ర్య సమరయోధుడు అయిన తుమ్మల వెంకటరామయ్య స్మారక సాహితీ పురస్కారం, 2003లో విశాలాంధ్ర ప్రచురణ సంస్థ స్వర్ణోత్సవాల సందర్భంగా సన్మానం, 2004లో అధికార భాషా సంఘం నుంచి భాషా సేవకు గాను పురస్కారం,2007లో గుంటూరు జిల్లా అభ్యుదయ రచయితల సంఘం తరపున డా. రాజారామ్ స్మారక సాహిత్య పురస్కారం
పొందారు. ప్రస్తుతం రాష్ట్ర అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్ష వర్గ సభ్యురాలిగా సాహితీసేవలు అందిస్తున్నారు సంజీవమ్మ.
__తక్కోలు మాచిరెడ్డి
(సేకరణ:పిళ్లా కుమారస్వామి)
Pillaa kumaraswaamy

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s