Janumaddi Hanumath Sastry

డా॥ జానమద్ది హనుమచ్ఛాస్త్రిగారు 1925 అక్టోబర్ 20న అనంతపురం జిల్లా రాయదుర్గంలో జన్మించారు. శ్రీమతి జానకమ్మ, శ్రీ సుబ్రహ్మణ్యశాస్త్రిగార్లు వీరి తల్లిదండ్రులు. ఎం.ఏ (ఇంగ్లీష్), ఎం.ఏ (తెలుగు), బి.ఇడి, రాష్ట్ర విశారద వంటి కోర్సులు అభ్యసించారు. పాఠశాల ఉపాధ్యాయుడుగా, పాఠశాలల పరిశీలకులుగా, సర్వే అధికారిగా, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆంగ్ల అధ్యాపకులుగా శాస్త్రిగారు పనిచేశారు
చిన్న వయస్సులోనే శాస్త్రిగారు ప్రపంచ ప్రసిద్ధిచెందిన వ్యక్తుల ప్రభావానికి లోనయ్యారు. ఆయన ఆరాధించిన వ్యక్తులతో కలసి పనిచేయడం ఆయన అదృష్టం. డా.బళ్ళారి రాఘవగారి పరిచయం ఆయనకు నటనలో అవకాశం కల్పించింది. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారితో కలసి ఆయన తెలుగు ప్రసంగాలను కన్నడంలోకి అనువదిస్తూ డా.శాస్త్రిగారు జాతీయోద్యమంలో భాగస్వాములయ్యారు. అనేక సాహితీ సమావేశాల నిర్వహణ ద్వారా ఆయన తెలుగు సాహిత్య ప్రేమికుల స్నేహితుడయ్యారు. కరుణశ్రీ, బోయి భీమన్న, దాశరథి, పురిపండ అప్పలస్వామి, పుట్టపర్తి నారాయణాచార్యులు, శ్రీశ్రీ, బంగోరె, డా.బెజవాడ గోపాలరెడ్డి మొదలైన ప్రసిద్ధ సాహితీమూర్తులతో ఆయనకు సాన్నిహిత్యం వుంది. 1973-93 మధ్య జానమద్దివారు ‘కడపజిల్లా రచయితల సంఘం కార్యదర్శిగా, అధ్యక్షుడుగా పనిచేశారు. కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారితో ఆయనకు మంచి స్నేహం వుండేది. సంఘసేవా పరాయణత్వంలో జానమద్దివారికి ఎంతోమంది ఉన్నతాధికారుల సాన్నిహిత్యం వుండేది. కడపజిల్లా రచయితల సంఘం కార్యదర్శిగా డా.మల్లెమాల వేణుగోపాలరెడ్డిగారి అధ్యక్షతలో శాస్త్రి గారు కడప పట్టణంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహించారు
జానమద్దివారు సి.పి.బ్రౌన్ ఆరాధకుడు. ఆయన జీవితాన్ని తెలుగు భాషా సముద్దారకుడైన సి.పి.బ్రౌన్ స్మారక కార్యక్రమ నిర్వహణ కోసం అంకితం చేశారు. అనేక సంవత్సరాలు మథనపడి తన జీవితకాల స్వప్నమైన సి.పి.బ్రౌన్ స్మారక గ్రంథాలయ స్థాపనలో శాస్త్రిగారు విజయం సాధించారు. దీనికి వారు వ్యవస్థాపక కార్యదర్శి. ఇది వారి జీవిత సాఫల్యానికి సంకేతం. ఇందుకు ఆయన చిరస్మరణీయుడు సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం ఇప్పుడు యోగి వేమన విశ్వవిద్యాలయంలో భాగంగా వుంది శాస్త్రిగారి నిర్విరామ తెలుగు భాషా సాహిత్య సేవను గుర్తించి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డా.సి.నారాయణరెడ్డిగారు వారిని ‘బ్రౌన్ శాస్త్రి’ బిరుదుతో సత్కరించారు. తనకెన్ని సత్కారాలు జరిగినా ఈ బిరుదు తనకెంతో సంతోషాన్నిచ్చిందని శాస్త్రిగారు చెప్పుకున్నారు.
హనుమచ్ఛాస్త్రిగారు మాసీమ కవులు, కన్నడ కస్తూరి, భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య, బళ్ళారి రాఘవ మొదలైన 30 కి పైగా పుస్తకాలు, 3000 కు పైగా వ్యాసాలు రచించారు. ఆరోజుల్లో వీరి వ్యాసం లేని పత్రిక లేదనడం అతిశయోక్తి కాదు. వీరి సాహితీ కృషికి చిహ్నంగా ఎన్నో పురస్కారాలు వీరిని వరించాయి. 1999 జనవరి 3న శ్రీ శ్రీ శ్రీ విశ్వేశ్వరతీర్థ శ్రీపాదులవారు ప్రసాదించిన ధార్మిక సేవాధురీణ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేట్, విశాఖపట్నంలోని ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారి లోక్ నాయక్ ఫౌండేషన్ వారి లోక్ నాయక్ 2012 పురస్కారం(దీనికి ఆంధ్రజ్ఞానపీఠ పురస్కారం అని కూడా పేరు) వంటివి వీరికి లభించిన పురస్కారాల్లో కొన్ని. సుదీర్ఘమైన సాహితీ, సాంస్కృతిక జీవితంగల డా.జానమద్ది హనుమచ్ఛాస్త్రిగారు తన 90వ ఏట 2014 ఫిబ్రవరి 28న స్వర్గస్థులయ్యారు
2014 అక్టోబరు 19న జానమద్దివారి కృషికి గుర్తుగా గ్రంథాలయ ప్రాంగణంలో ఆయన కాంస్య విగ్రహాన్ని దాతల సహకారంతో భాషా పరిశోధన కేంద్రం ఏర్పాటుచేసింది. దీనిని యోగి వేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య బేతనభట్ల శ్యామసుందర్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ మొదలైన ప్రముఖులు ఆవిష్కరించారు సి.పి.బ్రౌన్ ఖాషా పరిశోధన కేంద్రం హనుమచ్ఛాస్రిగారి స్మారక చిహ్నంగా ‘బ్రౌన్ శాస్త్రీయం’ పేరుతో స్మారక సంచికను ఫిబ్రవరి, 2015 లో వెలువరించింది.

Pillaa kumaraswaamy

2 comments

  1. Dear sir Namaste. My father Late Dr.Janamaddi Hanumath Sastry garu popularly known as “BROWN Sastry ” was born on 20-10-1925 at Rayadurg in Anantapur Dist. There are about 70,000 Books & 250 Thalapathra Grandhaalu in BROWN LIB.KDP. BROWN Library was getting an Annual Grant of Rs.36 Lakhs from AP Govt.till.2018. From 2018, Now, it is getting only Rs.10 Lakhs. Family Members of Dr.Sastry contributed Rs.1 lakh for BROWN Statue in Lib.& waiting for AP CM for its Unveiling soon.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s