బొమ్మిరెడ్డి నాగిరెడ్డి ప్రఖ్యాత సినిమా నిర్మాత. ఈయనను బి.నాగిరెడ్డి అని పిలుస్తారు. ఉత్తమ కళాత్మక విలువలను వ్యాపారానికి జోడించి మంచి సినిమాలు తీసిన నిర్మాత. బి.యన్.రెడ్డి కడప జిల్లాలోని ప్రొద్దుటూరు వద్ద పొట్టిపాడు గ్రామంలో అమ్మమ్మ వారింట్లో 02-12-1912న జన్మించాడు. ఈయన స్వస్థలం, సింహాద్రిపురం మండలంలోని ఎద్దులయ్యగారి కొత్తపల్లె (వై.కొత్తపల్లె) గ్రామం. బి.నాగిరెడ్డి అన్న బియన్ రెడ్డి. తండ్రి నరసింహారెడ్డి ఎర్రగడ్డలను(ఉల్లిపాయలు) విదేశాలకు ఎగుమతి చేసేవాడు.

బి నాగిరెడ్డి1950లో చలన చిత్ర పరిశ్రమలో ప్రవేశించాడు.షావుకారు చలన చిత్రం నిర్మాత గా మొదటి సినిమా.
1948 లో విజయ వాహిని స్టూడియో నిర్మించారు. అర్జునుడి పతాకంపై పర్వతాన్ని మోసుకొస్తున్న హనుమంతుడి బొమ్మ ఉంటుంది. “జెండాపై కపిరాజు(హనుమంతుడు)” అని అందుకే అంటారు. అర్జునుడి ఆ పతాకమే విజయావారి లోగో లోనూ ఉంటుంది. లోగోలో “క్రియా సిద్ధి స్సత్వే భవతి” అనే ఆర్యోక్తి ఉంటుంది. షావుకారు మొదటిసినిమా తీశారు. ఎన్టీ రామారావు జానకి లను నాయికా నాయకులుగా తీశారు.మాయబజారు ,మిసమ్మ ,సి.ఐ.డి.
జగదేకవీరుని కథ
సత్య హరిశ్చంద్ర
ఉమా చండీ గౌరీ శంకరుల కథ
గంగ-మంగ
శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీక్లబ్ పాతాళభైరవి ,గుడమ్మకథ మొదలైన ఎన్నో చిత్రాలు తీశారు. ఇండియా ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షులు గా1960-61లో మరియు1962- 63సంవత్సరాలలో రెండు సార్లు ఈ పదవి లో కొనసాగారు. 1974లో ఆయన దృష్టి వైద్యరంగం మీదికి మళ్ళింది. మద్రాసులో రెండు ఆసుపత్రులను నెలకొల్పాడు . విజయ చిత్ర సినిమా వారపత్రిక,
వనిత మహిళల మాసపత్రిక
జూనియర్ క్వెస్ట్, పిల్లలకోసం ఇంగ్లీషులో
స్పూత్నిక్, పిల్లలకోసం ఇంగ్లీషులో
ది హెరిటేజ్, మనోజ్ దాస్ సంపాదకత్వంలో భారతీయ సాంస్కృతిక వైభవాన్ని గురించి తెలియజేసే ఆంగ్ల మాసపత్రిక నడిపారు. 1982-83 లో తిరుమల-తిరుపతి దేవస్థానం చైర్మన్ గా పనిచేశారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ఈయన చైర్మన్ గా కొనసాగిన కాలంలో నిర్మించారు. 1986లో దాదాసాహెబ్ పాల్కే అవార్డు,1962లో గుండమ్మకథ సినిమా నిర్మాత నందిఅవార్డు లభించాయి. 1945లో ఆంధ్రజ్యోతి పత్రిక ను 1947లో చందమామ కథల పుస్తకం ప్రారంభించారు. శ్రీవేంకటేశ్వర, శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయాలనుంచి గౌరవడాక్టరేట్లుపొందారు. 2004 ఫిబ్రవరి 25 వతేదీన మరణిచారు.

సేకరణ:- చందమూరి నరసింహా రెడ్డి.ఖాసాసుబ్బారావు అవార్డు గ్రహీత.

చందమూరి నరసింహా రెడ్డి.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s