
దేవనహళ్ళి తొలుత గంగవాడిలో భాగంగా ఉండేది. తరువాత ఇది రాష్ట్రకూటుల పాలనలోకి వచ్చింది. ఈ ప్రాంతాన్ని రాష్ట్రకూటులు, నోలంబులు, పల్లవులు, చోళులు, హొయసలులు, విజయనగర పాలకులు వరుసగా పాలించారు.
అనంతపురం, చిత్తూరు పరిసర ప్రాంతాలలో రాజ్యమేలిన మరో సామంత రాజవంశము వారు నొలంబులు లేక నొలంబ పల్లవులు. ఈ వంశంలో 11 మంది పాలకున్నారు. వీరు నొలంబవాడి 32 వేలు గ్రామాలు పై ఆధిత్యం వహించినారు. వీరు బాణులతో, వైదుంబులతో, చోళులతో, రాష్ట్రకూటులతో పొరు సల్పినారు. వీరికి పశ్చిమగాంగులతో చిరకాల మైత్రి ఉన్నది. వివాహ సంబంధాలు ఉన్నాయి. హేమావతి కంబదూరు, కర్తనాపల్లి, నేలపల్లి, మొరిగిరి మొదలైన చోట్ల వీరి శాసనాలు లభించాయి. వీరు తమను నొలంబ పల్లవులుగా వర్ణించుకున్నారు. పల్లవుల ధరించిన సింహపోత, మహేంద్ర లాంటి పేర్లను నొలంబులు ధరించడం పల్లవులతో వీరికి గల సంబంధానికి సాక్ష్యం దక్షిణ భారతదేశంలో ప్రధాన రాజవంశాల మధ్య జరిగిన సంఘర్షణలో నొలంబులు ఒక్కొక్కసారి ఒక్కోపక్షం వహించి ప్రముఖపాత్ర నిర్వహించారు. బాదామి చాళుక్యుల తోటి నిరంతర ఘర్షణవల్ల పల్లవుల అధికారం ఉత్తర సరిహద్దుల్లో బలహీనమౌతున్నప్పుడు, హేంజేరు (నేటి హేమావతి) ప్రాంతాల్లో ఒక చిన్న రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు
నొలంబుల తొలి నివాస స్థానం నొలంబిళిగె 1000. ఇందులో అనంతపూర్, చిత్రదుర్గ, తుంకూరు జేరు వీరు రాజధాని వీరి భూభాగానికి తూర్పున పెన్నానది, పడమర హగరీ నది సహజ సరిహద్దులు నిరంతర యుద్ధాలవలన, పరిసర రాజ్యాల ఆక్రమణ వలన వీరు తమ రాజ్యాన్ని నొలంబళిగె 1000 నుండి నొళంబళిగె -3200కు విస్తరింపజేశారు. ఈ రాజ్య విస్తరణ నొలంబులతో పాటు కదంబళిగే 1000, కొగలి – 500, బల్లకుండె – 300. కనియకల్లు – 300 కుదిహరవి – 70, కరెవీది – 30, మాశెయవీడి – 140. సింధవాడి 1000 ప్రాంతాలు వీరి ఆధీనం క్రిందికి వచ్చినట్లు పరిస్ర ప్రాంతాలలోని శాసనాల వల్ల గ్రహించవచ్చు
ధర్మపురిలో గల ఒక స్తంభంపై ఉన్న శాసనంలో పల్లవాధిరాజ, నొలంబాధిరాజ, మహేంద్రాది రాజ అను ముగ్గురు నొలంబ రాజుల పేర్లు కనిపిస్తాయి. క్రీ. శ 892 నాటి ఈ శాసనం మహేంద్రాది రాజు కాలం నాటిది. హేమావతి శాసనంలో పై ముగ్గురు రాజులతో పాటు త్రిలోచన పల్లవ మొదలు దిలీప వరకు గల రాజుల పేర్లు ప్రస్తావించబడ్డాయి. క్రీ. శ. 943 నాటి ఈ శాసనంలో దిలీపరస పాలన గురించి పేర్కొనబడింది. ఈ శాసనంలో మహేంద్రుని తర్వాత ఈ వంశంలో పాలించిన నన్నిగ. అయ్యప, అన్నిగ. దిలీపరస పేర్లు ప్రస్తావించబడ్డాయి నొలంబులు మొదట్లో రాష్ట్ర కూటులకు సామంతులుగా ఉన్నారు. ఈ విషయం చెల్లకెర శాసనం ద్వారా గ్రహించవచ్చు ఇందులో చారుపోన్నేర లేక పల్లవాధిరాజు. జగతుంగ ప్రభూత వర్ష ఆకాలవర్తక సామంతుడని పేర్కొనబడింది. ఆకాలవర్షను రెండవ గోవిందునిగా గుర్తించడం జరిగింది. అయితే నొలంబులు ఎంతకాలం రాష్ట్రకూటులకి సామంతులుగా ఉన్నారో సరియైన ఆధారాలు లేవు బహుశ వీరు మొదటి ఆమోఘవర్షుడు అధికారానికి వచ్చేంతవరకు సామంతులుగా ఉండి ఉడవచ్చు, మూడో గోవిందుని తర్వాత దక్షిణ భారత పాలక వంశాల రాజకీయ అధికారంలో మార్పులు చోటు చేసుకున్నాయి
గంగావడిలో అధికారం కొరకు సంఘర్షణ ప్రారంభమైంది. రెండో శివమార తన తర్వాత రాజ్యాన్ని తమ్ముడైన విజయాదిత్యునికి అప్పగించాడు విజయాదిత్యుడు తన తర్వాత కుమారుడైన మొదటి రాచమల్లకు రాజ్యాన్ని స్వాధీనం చేశాడు. రెండో
శివకుమారుని కుమారుడైన మొదటి పృధ్వీపతి తనకు న్యాయబద్ధంగా రావలసిన రాజ్యం కొరకు సరిహద్దు రాజ్యాల సహకారం కోరాడు. ఈ విషయంలో అనేక రాజవంశాలు ముఠాలుగా ఏర్పడినాయి. బాణులు పల్లవులు మొదటి పుథ్వీ పతి పక్షం వహించారు. నొలంబులు మొదటి రాచమల్లుని పక్షం వహించారు. చారుపొన్నేరి కుమారుడైన పోశార్ చోర నాలంబ రాచమల్లుని కుమారై అయిన జాయెబ్బిని వివాహ మాడినాడు నోలంబులు రాచమల్లుకి సామంతులుగా ఉన్నట్లు అల్లూర్ శాసనం ద్వారా తెలుస్తోంది. ఈ శాసనం రాచమల్లుని కాలానికి చెందినది. ఈ శాసనంలో కనిపించే పాళార్ చోర అతనికి సమకాలికుడు. దివబ్బరపి పాశార్ చోరుని అగ్రమహిషిగా కోలార్ జిల్లాలోని ఆవణిలో గల శాసనంలో పేర్కొనబడింది. ఈమె కదంబవంశానికి చెందినది. పాశార్ చోరునికి, జాయెబ్బికి జన్మించినవాడు మహేంద్రుడని ధర్మపురి, హేమావతి శాసనాలలో పేర్కొనబడింది.
కంబదూరులోని మల్లికార్జున దేవాలయంలోని శాసనం 9వ శతాబ్దానికి చెందినది. ఇందులో నొలంబ పల్లవ రాజు వీర- నొంబాధిరాజు, అజపర్వార భాదియే రేయికు బెడ్డుగొండె చెరువు నిర్మాణ సమయంలో ఒక కంకషణం బహుకరించినట్లు తెలుస్తోంది మరొక కంకణాన్ని అతడికి పింగపాత్రప, పొన్నేరరస. మరియు ధర్మమహాదేవి బహుకరించినట్లు ఉంది. ఈ శాసనం క్రీ. శ. 9వ శతాబ్దానికి చెందినది అందువల్ల ఇది మొదటి పొలాల్ చోర నొంబాధిరాజుకు చెందినదై ఉంటుందని భావించవచ్చు.
శ్రీ శ. 883-84 కాలంనాటి చొలంబ పల్లవ రాజైన మహేంద్రుని కాలంనాటి స్తంభ శాసనం కంబదూరులోని మల్లిఖార్జుని దేవాలయంలో బయల్పడింది. కురగముండ పెరడైగా ఉన్న సమయంలో ఆదిత్యుని దేవాలయానికి బెల్గొండ గ్రామానికి చెందిన గముండలు మరియు ప్రహ్మణులు కొంత భూమిని దానం చేసినట్లు ఈ శాసనం చెబుతుంది. హేమావతిలోని దొడ్డప్ప (శివుడు) దేవాలయంలోని 9వ శతాబ్దపు శాసనంలో నొలంబ పల్లవ రాజు మొదటి మహేంద్రవర్మన్ మ మయిండమ్మ ఇయంబడిరాజుగా పేర్కొంటూ, అతడు బపది మరియు
తపస్విల భోజనార్థం కొంత భూమిని దానం చేసినట్లు తెలుస్తోంది
పోలాల్ చోరుని తర్వాత అధికారానికి వచ్చిన అతడి కుమారు మహేంద్రుడు నొలంబ వంశంలో బలవంతుడైన పాలకుడు ఇతడిని త్రిభువనాధిరాజ లోకరుద్రో, మహేంద్రవో, ఏట్ భూపాల మోళి, ప్రణత సదయుగమ్, కామధేనూపమానహ మొదలగు పేర్లతో వర్ణించడం జరిగింది. ఇతడు తండ్రి ద్వారా సంక్రమించిన గంగ వాడి ప్రాంతాన్ని పాలించాడు. ఇతడు రాజ్యవిస్తరణ చేపట్టినపుడు బాణులతో సంఘర్షణ ప్రారంభమైంది
బాణ భూభాగం పైకి నొలంబుల దాడి గురించి భూడిదెపల్లి శాసనంలో ఉంది. ఇరువురికి మధ్య మినికి వద్ద యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో మహేంద్రుడు విజయం సాధించాడు.
మొదటి మహేంద్రుడు బాణ వంశాన్ని నాశనం చేసినట్లు క్రీ. శ. 892 నాటి ధర్మపురి శాసనంలో ప్రస్తావించబడింది. అయితే ఇది పూర్తిగా వాస్తవం కాదు ఎందుకంటే నాటి మొదటి విక్రమాదిత్యుడు, రెండో విజయాదిత్యుడు చాలా బలవంతులై బాణ రాజ్యాన్ని పాలిస్తున్నారు. అందువల్ల ఏదో ఒక యుద్ధంలో మొదటి మహేంద్రుడు బాణులపై విజయం సాధించి ఉండవచ్చు అనేక యుద్ధాల తర్వాత బాణులు, మొదటి మహేంద్రుని ఆధ్వర్యంలో నొలంబులు సొరెమతి ముఖాముఖి తలపడ్డారు. బాణులకు యుద్ధంలో వైదుంబులు మద్దతిచ్చారు. ఈ యుద్ధం వల్ల నొలంబులకు ఏవిధమైన ప్రయోజనం చేకూరలేదు. అందువల్ల బహుశ నొలంబ, గంగ శాసనాలలో సోరెమతి యుద్ధ ప్రస్తావన
కనిపించదు. ఈ యుద్ధం క్రీ. శ. 872 తర్వాత జరిగింది మహేంద్రుని తర్వాత అయ్యప (క్రీ. శ. 900) అధికారానికి వచ్చాడు. క్రీ. శ. 942 నాటి హేమావతిలోని ఇరివ నొలంబ దిలీవరస యొక్క శాసనంలో ఇతడు నన్నిగాశ్రయ’ అను బిరుదు ధరించినట్లు పేర్కొన బడింది. ఇతనికి చెందిన శాసనం (క్రీ. శ. 948-49) మడకశిరలోని చోళురాజు దేవాలయంలో లభించింది ఇందులో బల్లహా సేవకుడైన కిరియ పున్నయ్య గజాంకుశ చోళులపై సైన్యంతో దాడి చేసినట్లు తెలిపి ఉంది. ఆ తర్వాత ఇబిలియుద్ధంలో దిలీప నొలంబ కూడా పాల్గొన్నట్లు, ఈ యుద్ధంలో కిరియ పున్నయ్య మరణించినట్లు ఈ శాసనం వివరిస్తుంది. అయ్యప గంగ రాకుమారి పొల్లబ్బరసిని వివాహమాడటంతో గంగ నొలంబ మైత్రి పునరుద్ధరించబడింది
అయ్యప తరువాత అతని కుమారుడు అన్నిగ అధికారానికి వచ్చాడు. ఇతడు ‘వీరనొలంబ’ బిరుదు ధరించాడు. ఇతని కాలంలో రెండో ఎరిగంగ కుమారులైన మూడో రాచమల్ల, రెండో బూతుగ మధ్య సింహాసనం కోసం పోరు జరిగింది. అన్నిగ స్వతంత్రుడు కావడానికి ఇది దోహదం చేసింది. రాష్ట్రకూట మూడో కృష్ణుని సహాయంతో రెండో బూతుగ మూడో రాచమల్లని ఓడించి చంపాడు
అన్నిగ తర్వాత అతని సోదరుడు ఇరివనొలంబ దిలీపరస క్రీ. శ. 940 ప్రాంతంలో అధికారానికి వచ్చాడు ఈతని శాసనాల చిత్తూరు జిల్లాలో లభ్యం కాలేదు అనంతపురం జిల్లా మడకశిరలో ఇరివ- నొలంబ రాజు కాలం నాటి శాసనం (క్రీ. శ. 950-51)లో మల్లన్న శివారి, చిరప 12కు అధికారిగా ఉన్నప్పుడు ఒలగెరే చెరువు మరమ్మతులకు గాను గవుండ కడియన్న పల్లకార తువన్నకు చెరొక మూడు కడుంగల మాగాణి భూమిని దానంగా ఇచ్చినట్లు పేర్కొని ఉంది. ఈ దానం చిరుపి చింతకుంటే, చిరియవొలలు మరియు ఉలువగట్టు గ్రామ ప్రజల సమక్షంలో చేసినట్లు శాసనం చెబుతోంది
మడకశిర తాలుకాలోని మధుడి గ్రామంలోనూ, హిందూపురంలోని చెరువుకట్ట మీద లభించిన శాసనంలో నోలంబులను గూర్చిన ఆధారాలు లభిస్తున్నాయి. హోన్నెరలిహళ్లి శాసనం (క్రీ. శ. 963) నొలంబ పల్లవ రాజైన ఇరివ- నొలంబ నొలిపయ్య కాలం నాటిది. ఇందులో రొల్లేయసూరు గ్రామ ప్రజలు కొంతమంది దొంగలతో పోరాడినపుడు, వారిలో ఒకడైన అబ్బాచారి మరణించినట్లు, అతడి పేరున వీరకల్ వేయించినట్లు శాసనం చెబుతోంది
చిత్తూరు జిల్లా కర్తనపల్లెలో రెండో మహేంద్రుని శాసనం ఉంది. ఇందులో ఇరివ నొలబ (దిలీపరస) మొదలు మహేంద్రాని వంశావళి పేర్కొనబడింది. ఈ శాసనం క్రీ. శ. 19వ శతాబ్దం నాటిది. చోళనాడు నుండి కొలంబవాడికి వెళుతూ కోలార్‌లో బస చేసినపుడు రాజు చెళగటూరు అను గ్రామాన్ని నొలంబ గావుండకు దానం చేసినట్లు ఈ శాసనంలో ఉంది. ఈ శాసనంలో చోళనాడుపై వీర మహేంద్రుని సైనికదాడి ప్రస్తావన ఉంది. క్రీ. శ. 967 నాటికి మూడో రంగం నుండి కృష్ణుడు రాజకీయ నిష్క్రమించడంలో, దక్షిణాన రాష్ట్రకూటుల అధికారం క్షీణించింది. మూడో కృష్ణుని తరువాత అధికారానికి వచ్చిన కొట్టిగ సమర్థుడు కాకపోవడంతో, అప్పటి వరకు సామంతులుగా ఉన్నవారు స్వతంత్రించారు. నొలంబులు కూడా రాష్ట్రకూటుల ఆధిక్యాన్ని ధిక్కరించినట్లు నన్నినొలంబ, రెండో పొళాల్ చోర, రెండో వీర మహేంద్రుని శాసనాలను బట్టి తెలుస్తుంది. వీరు క్రీ.శ. 981 వరకు స్వతంత్రంగా ఉన్నారు
క్రీ. శ భారతదేశంలో 10వ శతాబ్దం చివరినాటికి దక్షిణ కల్యాణి చాళుక్యులు, చోళులు బలవంతులైన పాలకులుగా అవతరించారు. రెండో మహేంద్రుని నాయకత్వంలో నొలంబులు స్వతంత్రులు అయితే ఆ స్థానాన్ని వారు నిలుపుకోలేదు. చాళుక్య రెండో తైలరాజు నొలంబులతో పాటు అనేక మంది సామంతులను తన ఆధీనంలోకి తెచ్చుకున్నారు.
Prof.k.krishnanaik, నాల్గవ ప్రపంచ మహా సభలు ప్రత్యేక సంచిక