విజయనగర సామ్రాజ్య చరిత్ర గురించి ప్రత్యేకించి శ్రీకృష్ణదేవరాయల గురించి అసంఖ్యాకమైన గ్రంథాలు, కావ్యాలు వెలువడ్డా యి. అయినప్పటికీ ప్రజా బాహుళ్యంలో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత చరిత్ర దీనికి సంతృప్తికర సమాధానమివ్వలేకపోతున్నది. రాయల కులం విషయంలో పెద్ద సందిగ్ధత కొనసాగుతున్న ది.

దేశంలో కులం ఒక చారిత్రక వాస్తవం. ఎంతటి చక్రవర్తులైనా కులం అనే ఈ సామాజిక చట్రంలో ఉండి తీరవలసిందే! రాయల వారసులు గా ఘనమైన వారసత్వము సొంతం చేసుకోవడం ద్వారా వర్తమానం లో ప్రభావశీలంగా ఉండాలని ప్రతి కులం భావించడం తప్పు లేదు. అయితే చారిత్రక వాస్తవాలను సంప్రదించడం ద్వారానే ఇది జరగాలి.

ఈ క్రమంలో పాణి రాసిన ‘కృష్ణరాయలు-అస్తిత్వ ప్రశ్నలు’ యుద్దనపూడి వేంకటరత్నం రాసిన ‘యాయాతి వంశీకుడు రాయలు’ అన్న కథనాలలో చర్చకు పురికొలిపే విషయాల ప్రస్తావన ఉంది. చారిత్రక వాస్తవాలు ఎంత మాత్రము అందులో లేవు. ఆంధ్రదేశ చరిత్రలో రాజవంశాలన్నింటిని, వారు ఏ కులము వారు అయినప్పటికీ చంద్ర వంశాస్యయులుగా, సూర్య వంశాస్యయులుగా కాకుంటే యాదవ వంశాస్వయులుగా ఏదో ఒకదాని పరిధిలోకి తెచ్చి వారి చరిత్ర నిర్మాణం చేశా రు. రాజస్థానాలలో ఉన్న కవులు తమ కావ్యాలను ఈ కోణం నుంచే రాశారు. మనం ఈ కోణం నుంచే వెంకటరత్నం రాసిన వ్యాసాన్ని చూడాలి.

రాయల వంశ వృక్షమును రచయిత యాయాతి-దేవయానిలకు కలిగిన తుర్వుసుడి నుంచే తుళువ వంశం ఏర్పడినదని, తుర్వసుడు యదువు కనుక రాయలను యాదవుడని చెప్పారు. రాయలు ఆయన రాసిన ఆముక్తమాల్యదలో తాను చంద్రవంశ క్షత్రియుడనని చెప్పకోవడాన్ని ప్రస్తావించారు. నంది తిమ్మన తన పారిజాతాపహరణంలో రాయలు యాదవుడని ఎన్నో చోట్ల రాశాడని చెప్పారు. అంటే రాయల వంశ వృక్షం మహాభారత యుద్ధానికి ముందు కాలం నాటిదన్నమాట! రాయల ముత్తాత ‘తిమ్మప్ప’కు చంద్రవంశ క్షత్రియులతో సంబంధమేమిటో, దీనికి రుజువులేమిటో రచయిత మనకు చెప్పాలి. ప్రబంధ సాహిత్యంలోని పురాణ పురుషుల వంశావళితో ఏర్పరచబడిన సంబంధాలను ఊటంకిస్తూ వెంకటరత్నం ఒక పురాణ కాలక్షేపం చేశారు.

ఎంతో ఆచరణాత్మక విధానాలకు పెట్టింది పేరు రాయలు. నాటి సామాజిక శ్రేణులతో మమేకమై, బంధుత్వాలను నెరుపుకుంటూ మరీ ముఖ్యంగా పటిష్టమైన సైనిక నిర్మాణానికి నాడు సమాజంలో ప్రబలంగా ఉన్న బోయలతో వారి వంశీయుడుగా సంబంధ బాంధవ్యాలను ఏర్పరుచుకొని వారితో మమేకమయ్యారు.

తన తాత ముత్తాతలు తమ ప్రస్థానాన్ని బోయలు కేంద్ర బిందువుగా గల అమరనాయంకర వ్యవస్థ నుంచే ప్రారంభించారు. కనుక తన సైన్యంలో పదమూడు విభాగాలుంటే అందులో పది విభాగాలకు వీరినే సైన్యాధ్యక్షులుగా చేశారు. తన తమ్ముడైన అచ్యుత దేవరాయలతో బంధుత్వమున్న నాయక రాజులను తంజావూరు ప్రభువులుగా ప్రకటించారు.

తన తండ్రి నరసనాయకుడు స్వయాన సాళువ కఠారి వీర నరసింహరాయలకు బావమరిది. తన కూతుళ్లనిద్దరిని ఆరవీటి ఆళియ రామరాజుకు, వారి తమ్మునికిచ్చి పెళ్లి చేశారు. ఈ విధంగా శ్రీకృష్ణ దేవరాయలు వివాహాల ద్వారా బోయలతో బంధుత్వాలు నెరుపుకున్నాడు. కరుడుగట్టిన భూస్వామ్య వ్యవస్థలో తన కూతుళ్లను తమ కులము వారికి కాక వేరే వారికి ఇవ్వగలరా? ఇలా రాయలు వాస్తవ ప్రపంచంతో సంబంధాలను ఏర్పరుచుకున్నారు. కాని మన రచయితలు మాత్రం రాయల వంశ చరిత్ర నిర్ధారణకు ప్రబంధ సాహిత్యం మీద ఆధారపడుతూ నేల విడిచి సాము చేస్తూనే ఉన్నారు.

ఇక కులాల ప్రత్యేకతలు అస్తిత్వాల ప్రతీకల ప్రస్తావన కొస్తే రామాయణ రచనా కాలంలో సమాజంలో క్షీణించిన విలువలను పునరుద్ధరించడానికి నాటి సామాజిక పరిస్థితులు ఒక కరకు బోయడును వాల్మీకి మహర్షిగా మారేలా ప్రేరేపించి రామాయణ రచనకు ఉపక్రమింప చేశాయి. మళ్లీ మధ్య యుగాలలో సామాజిక పరిస్థితులు ఒక బోయ కులజుడైన రాయలను ఒక మహా చక్రవర్తిగా రూపొందించి నాటి సమాజంలో ఆదర్శాల స్థాపన చేయడమే కాక, నేటి సమాజమూ ఆ వెలుగుల ప్రస్థానంలో పయనించమని చరిత్ర నిర్దేశించింది. చరిత్ర మోపిన ఒక పెద్ద బాధ్యతను స్వీకరించి దానిని సమర్థవంతంగా నిర్వహించగల సామర్థ్యాలు ఈ కులానికున్నవి గనుకే చరిత్ర వీరిని ఈ బాధ్యతా నిర్వహణకు సహజంగానే ఎంపిక చేసుకుంది.

ఇక్కడ మరో విషయం ప్రస్తావించాలి. తెలుగు సాహిత్యాభిమాను లు కొందరు కృష్ణా జిల్లా శ్రీకాకుళంలో రాయల మహోత్సవాలు నిర్వహిస్తూ ఆంధ్ర మహా విష్ణు దేవాలయంలో రాయల విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అనెగొంది (హంపి నగరానికి ఉప నగరం) రాజా వారిని ఆహ్వానించి రాయల వారసులుగా వారిని ఘనంగా సత్కరించారు.

కాని తరువాత బండ్లమూడి సుబ్బారావు రాయల వారసులెవరు? అంటూ ఫిబ్రవరి 2006లో ‘ఆంధ్రజ్యోతి’ పత్రిక ద్వారా సన్మాన విషయంలో ఆక్షేపణ తెలియజేశారు. అనెగొంది రాజులు బోయలని, తిరుమల రామచంద్ర రాసిన హంపి నుంచి హరప్పా దాకా అనే ఆత్మకథాత్మక ఉద్గ్రంథములో పేర్కొన్నారని, తిరుమల రామచంద్ర అనెగొంది రాజులు నడిపిన పాఠశాలలో చదువుకున్నారని, సంస్థానాల చరిత్రపై విశేష పరిశోధన చేసిన వారు కనుక అనెగొంది రాజుల విషయంలో ఆయన చెప్పినదే ప్రామాణికమని తెలియజేశారు.

బోయలైన అనెగొంది రాజులకు సన్మానం చేయడం సబబు కాదని అందులో బండ్లమూడి వారు ఉటంకించారు. బోయలు సంస్కృతీకరణ మోజులో పడి శ్రీకృష్ణదేవరాయలంతటి చక్రవర్తులకు వారసులుగా చెప్పుకోవడం తప్పని రాశారు. అయితే విజయనగర ప్రారంభ పాలకులైన సంగమ వంశస్థులు కురుబలు తరువాత పాలించిన సాళువ, తుళువ, ఆరవీడు వంశస్థులు మాత్రం నిస్సందేహంగా బోయలు. తాళికోట యుద్ధంలో ఆరవీటి రామరాయలు వీరమరణం చెందిన తరువాత వారి తమ్ముడు తిరుమల రాయలు చంద్రగిరి కోటవైపు తరలిపోయారు.

ఆరవీటి ఆళియ రామరాయలకు రాయల కూతురైన తిరుమలాంబకు జన్మించిన పుత్ర సంతానం ఒకరు అనెగొంది సంస్థానానికి, మరొకరు రాయచూరు సంస్థానానికి ప్రభువులుగా ప్రకటించుకున్నారు. వీరి వంశం వారే 1949లో సంస్థానాలు భారత యూనియన్‌లో విలీనమయ్యేదాక ఆ సంస్థానాలకు ప్రభువులుగా కొనసాగారు. ఈ విధంగా రాయల వారితో బంధుత్వమున్న విషయం స్పష్టమవుతున్నది. ఇటీవల రాయల పంచశతాబ్ది ఉత్సవాలలో భాగంగా అనెగొంది రాజ దంపతులను సన్మానించారు. ఈ విధంగా బోయలు, అంతటి రాయలకు వారసులుగా ఉన్నారన్న విషయం తేటతెల్లమవుతుంది.

ఇక బోయల పూర్వ చరిత్రను గమనిస్తే నల్లమల అటవీ ప్రాంతంలో నివసించే బోయలను సైనిక అవసరాల రీత్యా మైదాన ప్రాంతాలకు రప్పించి వారిని పెద్ద దుర్గాలను నిర్మంచుకునేలా చాళుక్యులు ప్రోత్సహించారు. వీటినే బోయ కొట్టాలు అనేవారు. వీరిని గురించి దండి తన దశ కుమార చరిత్రలో ప్రస్తావించా రు.

అయితే అద్దంకి పద్య శాసనం ప్రకా రం, పల్లవ సేనాని పండరంగడు ఈ కొట్టాలను ధ్వంసం చేయడంతో అసంఖ్యాకమైన బోయలు పెద్ద ఎత్తున కృష్ణానది ఎగువకు, దిగువకు తరలి వెళ్లారని, మరికొందరు ఇతర కులాలైన కమ్మ, కాపు, వైశ్యులలో చేరిపోయి సాంఘికోన్నతి సాధించారని బి.ఎస్.ఎన్.ఎల్ హనుమంతరావు తన ఆంద్రుల చరిత్రలో తెలిపారు. ఇలా కృష్ణానది దిగువ ప్రాంతానికి తరలి వచ్చిన బోయలకు అప్పటికే ఘనీభవించిన కుల వ్యవస్థ ఉనికిలో గల గ్రామాలు వృత్తిని కేటాయించలేకపోయాయి.

దీంతో వీరు సైనిక వృత్తిని స్వీకరించి అనేక రాజ వంశాల తరఫున సైనికులుగా, సేనాపతులుగా యుద్ధాలు చేసి యుద్ధ విద్యలలో ఆరితేరారు. కాకతీయులు, హోయసాలుల సైనిక విభాగాలలో కూడా వీరు పని చేశారు. కాకతీయ చక్రవర్తులకు సరిసాటి వారమని వీరు చెప్పుకున్నట్టు బి.ఎస్.ఎన్.ఎల్ రాశారు. ఇలా ఎన్నో యుద్ధాలలో ఆరితేరిన వీరు తమలో తాము బంధుత్వాలు నెరుపుకుంటూ గృహ నామాలు, ప్రాంతీయ నామాలైన సాళువ, ఆరవీడు, తుళువ నామాల ను తమ వంశ నామాలుగా మలుచుకుని జగద్విఖ్యాతి పొందారు.

ఒక మహా సైనిక శక్తిగా రూపొంది కన్నడ, ఆంధ్ర కూడలి అయిన హంపిని కేంద్రంగా చేసుకుని విజయనగర సామ్రాజ్యాన్ని ఆవిష్కరించారు. సమర భూమిలో తమతో పాటు సాహసాలు ప్రదర్శించి సేనాపతులు గా, రాజులుగా ఎదిగిన సాటి బోయలను సంస్కృతీకరణ ముసుగులో ఎగరేసుకుపోయి వారిని చంద్ర వంశ, సూర్య వంశ క్షత్రియ కుదుళ్లతో జత పర్చి బ్రాహ్మణీకరించడం అసంఖ్యాక బోయల చరిత్రకు జరిగిన ఒక చారిత్రక విషాదం. ‘సంపెట’ నరపాల సార్వభౌముడైన శ్రీకృష్ణదేవరాయలను చంద్ర వంశ క్షత్రియుడిగా చరిత్రలో నిలబెట్టడం ఏమిటి?

Source: Andhra jyothi 2009

రచన :- గుంతలగారి శ్రీనివాసులు. Cell no 7780405964

గుంతలగారి శ్రీనివాసులు

2 comments

 1. YES SRI KRISHNADEVARAYALU BOYA VARU ,
  VIJAYANAGARA SAMSTANAM STAPINCHINA VARU , HARI HARA RAYALU , BUKKA RAYALU IDDARU ANNADAMMULU BOYA VARE . MADAKARI NAYAKA BOYA VARE, KRANTH VEERA SANGULLI RAYANNA BOYA VARE , GANDUGALI KUMARARAYA BOYA VARE , VENKATAPPA NAYAKA BOYA VARE , THAMILANADU MUTHURAYAR BOYA VARE .

  KONNI KULAALA VARU ERSHA THO , MANA BOYA JATHI NI ANGA THOKKARU .

  OOOOOOORIIIIII BOOYAAAAA VADA !!!!!!!!
  IKANINA MELUKO , NINNU NI BOYA JATHI (VALMIKI) NI INTHALA THOKKESTUNNA E RAJAKEEYA PARTY LU .

  ANDARAM EKAMAVUTHE OKA MAHA SENA . BOYA (VALMIKI) ANTE OKA MAHA UPPENA .

  ANDARAM OKKATI AYI , MALLI RAYALA RAJYAME MANADHI.

  JAI VALIMIKI MAHARSHI , JAI BOYA,BEDAR,MUTHURAYAR ,

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s