వేమన హేతుబద్ధత
వేమనను కేవలం శతక కర్తగానే చూపించి ఆయన స్థాయిని తగ్గించారు.
ఇదే వేమన వేరే దేశంలో ఉండిఉంటే గొప్ప తత్వవేత్తగా గుర్తింపు పొందేవాడు. లేదా బ్రాహ్మణ కులంలో జన్మించి ఉంటే గొప్ప సంస్కర్తగా కొనియాడబడేవాడు..

 1. మతాలు మంచే చెబుతుండవచ్చు కానీ మతబోధకులు దొంగలంటాడు వేమన. ఆరు మతములందు నధికమైన మతంబు
  లింగమతము కన్న లేదు భువిని
  లింగదార్ల కన్నా దొంగలు లేరయా
  విశ్వదాభిరామ వినుర వేమ.

మతము వేషధార్లు మహిమీద పదివేలు.
మూఢజనుల గలప మూగుచుండ్రు
కొంగలు గుమికూడి కొరకవా బోదెలు
విశ్వదాభిరామ వినుర వేమ.

 1. ఆత్మశుద్ది ముఖ్యం కానీ పూజలు ముఖ్యం కాదంటాడు…

ఆత్మశుద్ది లేని ఆచార మదియేల
భాండ శుద్దిలేని పాకమేల
చిత్తశుద్ధి లేని శివపూజలేరా
విశ్వదాభిరామ వినుర వేమ

 1. పిండములను పెట్టడం గురించి….

పిండములను జేసి పితరుల తలబోసి
కాకులకు పెట్టు గాడ్దెలారా
పియ్యి తినెడు కాకి పితరుడెట్లాయెరా
విశ్వదాభిరామ వినుర వేమ.

 1. జీవులను చంపి మనిషి అనే జీవి తింటే ఒళ్ళు వస్తుంది కానీ మోక్షం ఎలా వస్తుంది అంటాడు మరో పద్యంలో..

జీవి జీవి చంపి జీవికి వేయగా
జీవితాన బలిసి చెలగుచుండు
జీవ హింసలకు చిక్కునా మోక్షంబు
విశ్వదాభిరామ వినుర వేమ.

 1. శకునముల గురించి…

బల్లి పలుకులు విని ప్రజ తమ పనులెల్ల
సఫల మగునని సంతసించి
కాని పనులకు తమ ఖర్మ మటందురు
విశ్వదాభిరామ వినుర వేమ.

పాలపిట్ట శకున ఫలమిచ్చు నందురు
పాలపిట్ట కేమి ఫలము తెలుసు
తనకు కాని మంచి తనలోన యుండంగ
విశ్వదాభిరామ వినుర వేమ.

గూబ గృహమున జేరగు నిసి పాడు బెట్టి
వెళ్ళి పోయెదరెంత వెర్రి వారో
గూబ గృహమున లేమి గూర్చురా ఖర్మంబు
విశ్వదాభిరామ వినుర వేమ.

 1. వేద విద్య గురించి…

వేద విద్యలెల్ల వేశ్యల వంటివి
భ్రమల బెట్టి తేట పడగనీవు
గుప్త విద్య యొకటె కులకాంత వంటిది
విశ్వదాభిరామ వినుర వేమ..

 1. విగ్రహారాధకుల మీద.

శిలను ప్రతిమ జేసి చీకటింటను బెట్టి
మొక్కవలదు వెర్రి మూఢులారా
ఉల్ల మందు బ్రహ్మంముండుట తెలియరు
విశ్వదాభిరామ వినుర వేమ.

నీళ్ళ మునగనేల నిధులు మెట్టగనేల
మొనసి వేల్పునకు మొక్కగనేల
కపటకల్మషములు కడుపులో నుండగా
విశ్వదాభిరామ వినుర వేమ.

ఒక్కపొద్దులుండి యొగినీళ్లలో మునిగి
కూడు వండి వేల్పు గుడువు మనుచు
దాని నోరు గొట్టి తాము తిందురు కదా
విశ్వదాభిరామ వినుర వేమ.

పలుగు రాళ్ళ దెచ్చి పరగగుట్టలుగ గట్టి
చెలగి శిలల సేవ చేయనేల
శిలల సేవ చేయు ఫలమేమి గలుగురా
విశ్వదాభిరామ వినుర వేమ.

సేకరణ :-అనంతయ్య గంపల ఫేస్బుక్ వాల్ నుంచి.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s