భౌగోళికంగా చూసినట్లయితే రాష్ట్రంలో ఎంతో ప్రాచీనత గల ప్రాంతం రాయలసీమ. ఆర్కెమిక్ స శకానికి చెందిన వివిధ రాతి కుటుంబాలను ఇనుము మాంగనీసు, అభ్రకం, బంగారం , వజ్రములు వంటి ఖనిజ విశేషాలను ఈ జిల్లాల్లో గుర్తించారు. కొంత మంది భూ విజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారం కర్నూలు దాని పరిసర ప్రాంతాలు అతి ప్రాచీనకాలంలో జలమయమైనవిగా భావిస్తారు అప్పటికి మానవజాతి పుట్టలేదు.
నల్లమల, ఎర్రమల, శేషాచలం కొండలు, తూర్పు కనుమలు విశేషంగా ఈ జల్లాల్లో పరివ్యాప్తి చెందాయి దట్టమైన అడవులు చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఉండేవి. ఎక్కువగా తెలిసిన జంతు జాతుల్లో గొర్రె మేక, గేదె, అడవి పంది, ఏనుగు, గుర్రము ముఖ్యమైనవి. ఆవు ఎద్దు వంటివి చాలా తక్కువ. ఇటువంటి భౌతిక భౌగోళిక లక్షణాలు గల ఈ ప్రాంతంలో వివిధ స్థాయిల్లో మానవ నాగరికతాభివృద్ధిని తెలిపే అంశాలు చెక్కుచెదరక ఉన్నాయి
కడప, చిత్తూరు జిల్లాల్లో పాతరాతియుగం నాటి వివిధ వస్తువులు కనిపించగా, అనంతపురం, కర్నూలు దానినానుకొనివున్న బళ్ళారి జిల్లాల్లో కొత్త రాతియుగపు మానవాభివృద్ధిని, తొలి వ్యవసాయ స్థావరాలను గుర్తించడం జరిగింది
అదే విధంగా ఈ జిల్లాల్లో పాండవుల గుళ్ళు, రాక్షసి గుళ్ళు వంటి పేర్లతో పిలువబడుతున్న ఇనుపయుగపు కాలంనాటి సమాధులెన్నో కన్పిస్తాయి. ఈ సమాధులన్నీ మానవుడు భూమిపై తనకు గల హక్కును సూచించడానికి ఏర్పరచుకొన్నాడు అనడానికి సంకేతంగా, ఒకేచోట ఒకే కుటుంబపు లేదా వర్ణపు వ్యక్తుల సమాధులను ఏర్పరచుకోవడం జరిగింది, ఈ కాలం గాటి
మానవుడు ‘చరిత్ర’ అని వ్యవహరించే జీవన శైలికి దగ్గరగా
వస్తాడు
చారిత్రక యుగంలో రాయలసీమ లో జీవనశైలికి ప్రధాన స్థావరాలను పెన్న, చిత్రావతి, కుశావతి, హగరి గాలేరు, కుందేరు,బయ్యేరు వంటి వివిధ నదీ విశేషాలను అనుకున్నట్లు గుర్తించగలము
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, మొట్టమొదటిగా పాలించిన మౌర్యుల ప్రధాన స్థావరాలు కర్నూలు జిల్లాలో వున్నాయి. శ్రీశైలం సమీపంలో గల సంద్రగుప్త పట్టణం పత్తికొండ తాలూకాలో గల ఎర్రగుడి. రాజుల మందగిరి వద్దగల అశోకుని శాసనాలు మౌర్యుల పాలనను వివరి స్తాయి. అమరావతిలోగల అశోకుని శాసనం ద్వారా ముందుగా కృష్ణానది మధ్య లోయకు, రాయలసీమకు చెందిన కర్నూలు జిల్లా కేంద్రంగా మౌర్యులు ప్రాకృతి మంగా విస్తరించినట్లు తెలియగలదు
మౌర్యుల తర్వాత పాలించిన శాతవాహమలు కర్నూలు జిల్లాకు చెందినవారేనని, కర్నూలు జిల్లాలోని శాతునికోట,



అనంతపురం జిల్లా హిందూపురం తాలూకాలోని శాసనకోట వంటివి సాతవాహనుల కాలానికి చెందినవే అనే ప్రథ అబద్ధంకాదని బళ్ళారి జిల్లాలో దొరికిన పులమాని శాసనం తెలుపుతుంది. ఆరీతిగా రాయలసీమతో సంబంధం ఉంది.
శాతవాహనుల తర్వాత పాలించిన వంశాలలో ఒకటైన పిల్లవుల చెందిన 4వస్కరదపర్మకు చెదిన తాప్ర శాసనం ఒకటి. బళ్లారి జిల్లా ‘హిరహాడవాల్లి’ లో లభ్యమైంది. దాని ద్వారా శాతవాహనుల తర్వాత ఏర్పడ్డ రాజకీయ శూన్యతను ఈ ప్రాంతంలో పల్లవులు పూరం చి నట్లు తెలియగలదు.
విశేషం ఏమనగా అనంతపురం జిల్లాకు చెందిన కురుబలు కొందరు పాలకులుగా పల్లవుల

కాలంలో అవతరించినట్లు కురుబల జాతివారి సాంస్కృతిక కథనాల ద్వారా తెలుస్తోంది. వారు కంచి వరకు పాలించారని చెపుతారు. కానీ కురుబల పాలనా స్వరూపం గాని, దాని కాల నిర్ణయం గాని చారిత్రికాధారాల ద్వారా సుసాధ్యమైనవి
ఈ స్థితిలోనే వనవాసికి చెందిన కదంబులు గంగాకుట (తెలకాదు)కు చెందిన గాంగులు, కువలాల పురం (కోలారుకు చెందిన బాణులు, వైదాంగులు రాయల సీమను 7 వశతాబ్దం వరకు పాలించారు. గాంగులు ఎంతో బలంగా నిలిచారు. ఆంధ్ర దేశ చరిత్ర దృష్ట్యా వాఖ్యానించినట్లయితే శాతవాహనుల పిదప క్రీ.శ. 200 నుండి 617 వరకు చిన్న రాజవంశాలు తీరాంధ్రలో పాలించినట్లే రాయలసీమలో కూడా అదే పరిస్థితి వచ్చింది. కాని ఈ ప్రాంతంలో స్థానికంగా పాలించే 32వేల గ్రామాలకు ఆధిపత్యం వహించిన వారు నోళంబులు, వీరు గాంగులతో వియ్యమొంది బాణులను ఓడించారు. మహేంద్రుడనే నోళంబరాజు ‘మహాబలికుల విధ్వంసక’ అనే బిరుదు ధరించాడు. నోళంబులు అనంతపురం జిల్లా కంబదూరుకు చెందిన కురుబ జాతి వారు అని అనుమానించవచ్చు. ఆ ప్రాంతమంతా తర్వాతి కాలంలో కురుబసివర సీమ అని పిలువబడింది. రాయలసీమలో నోళంబుల పాలన బాదామి చాళుక్యులకు సమకాలీనంగా ఉండడమే కాక తూర్పు నుంచి ఏ పల్లవ రాజు దాడికి వీలు కల్గించలేదు. కాని ఈ నోళంబ ప్రభువులు తూర్పు చాళుక్య ప్రభువైన రెండవ చాళుత్యు భీముని దాడికి బలియై పతనోన్ముఖులైనారు నైదంబులతో జరిగిన యుద్ధాలలో వీరి పతనం ఖరారైంది కళ్యాణి చారుక్య ప్రభువులైన జగదేక మల్లుడు, త్రైలోక మల్లుడు, భువనైక మల్లుడు మొదలైన వారు రాయలసీమ ప్రాంతాన్ని జయించే తీరాంధ్రంలోనూ, తెలంగాణలోను విజయకేతనాలు ఎగురవేశారు. వీరి దాడి నోళంబుల పతనానికి ఆతర్వాత పాలించిన నిడుగల్లు చోళుల నామ సాంస్కృతికంగా వోళంబులు ఎంతో విజయాన్ని సాధించారు. జైన శు పలాతి చిన్న చిన్న మతాలను ప్రోత్సాహిస్తూ పారి రాజధాని హేమవతిలో నోళంటేశ్వర దొద్దేశ సిద్దేశ్వరాలయాలు నిర్మించారు. వీరు విద్యావ్యాప్తికి ఘటికాస్థానాన్ని కూడా ఏర్పరచారు
కళ్యాణి చాళుక్యుల దాడులతో పాటుగా వారి ప్రత్యర్థులైన చోళులు రాయలసీమ తమదిగా చేసుకున్నారు తుంగభద్ర, కావేరి, పెన్న మధ్య గల తిరైమూరునాడు (మూడు నదుల మధ్య ప్రాంతం) పాలించడానికి విక్రమసింహ రాజరాజ చోళీయ వరియం అనే సేనానిని నియమించినట్లు అనంతపురం జిల్లా శాసనాల ద్వారా తెలుస్తుంది
కళ్యాణి చాళుక్యుల పిదప రాయలసీమ ప్రాంతం మీద యాదవుల దాడులు, పోయసలుల ప్రతిస్పందనలు హెచ్చయ్యాయి. హిందూపురంసమీపంలో గల పులమతి బిసల మాదేపల్లి, పెనుకొండ ప్రాంతాల వద్ద యాదవు సంఘణునికి (యాదవ సంఘణుడు చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో దానాలిచ్చారు. ) కాకతీయులతో అనేక యుద్ధాలు జరిగాయి
కాకతీయుల కాలంలో తిరుగుబాటు లేవనెత్తిన కాయస్థజంన్నగ దేవుడు ఆతని కొడుకైన అంబదేవుడు కర్నూలు జిల్లా ప్రాంతాన్ని పాలించారు. కాకతీయుల కాలంలో వారి ప్రభావం కంచి వరకు విస్తరించడం వల్ల రాయలసీమ యాదవ హోయసాలల సంవర్షణ కు నిలయమైనందున ఇక్కడ తగినంత అభివృద్ధి జరుగలేదు. చారిత్రిక పరిణామాలు తీవ్రంగా కనిపించడం లేదు.
చిత్తూరు జిల్లా శ్రీ కాళహస్తీశ్వర పాద పద్మారార కులై గోదావరి సీమకు, వేంగిపురానికి చెందిన వెంకటగిరి పురాధీశులుగా ఎన్నబడి ‘తిరుచాళుక్కఖశత్తి రాయ’ యాదవ నరసింహా ఇత్యాదులుగా పిలువబడిన రాజులు చోళరాజరాజు (1022) కాలం నుండి పాలించడమే కాక కాకతీయుల సామంతుడై మనుమసిద్ధితో వైవాహిక సంబంధాలు ఏర్పరచుకున్నట్లు చిత్తూరు జిల్లా శాసనాల ద్వారా తెలుస్తోంది. వీరు చాళుక్య వంశం వారని గోత్రనామా దికాల ద్వారా తెలియగా, యాదవ నారాయణ వంటి బీరుదులు ప్రత్యక్షంగా యాదవుల (దేవగిరి పాలకుల)తో సంబంధం లేనప్పటికీ ఎందుకు ధరించారన్నది ప్రశ్నార్థకంగానే ఉంది.
Dr.T.Suryaprakash, history dept. SKUniversity, Ananthapuram