Pic source BBC. డాక్టర్ పర్వీన్

అసలే కరవు సీమ పేదలకు సరైన వైద్య సలహాలు అందక అనేక అవస్థలు పడుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రి కి చికిత్స కోసం వెళ్లాలంటే సామాన్యులు భయపడుతుంటారు. వందలూ, వేలు చెల్లించే స్తోమతలేక ఎంతో ఇబ్బందిపడుతున్నారు.ఈ పరిస్థితి లో కేవలం రూ.10 ఫీజు తీసుకుంటూ వారికి అండగా నేనున్నానంటోంది ఈ యువ వైద్యురాలు నూరి పర్విన్.

Pic source bbc

విజయవాడకు చెందిన నూరి పర్వీన్ కడపలోని ఓ ప్రైవేటు వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ డిగ్రీ చేసింది. చదువుకునే రోజులనుంచే సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేది. చదువు పూర్తయ్యాక 104 వైద్యసేవల విభాగంలో, ఒక ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేసింది. ఈ సమయంలోనే పేదలకు సాయపడాలని దృడంగా నిర్ణయించుకుని కడపలోని మాసాపేటలో2020లో ఆసుపత్రిని ప్రారంభించింది. మార్చి లో కరోనా వచ్చింది. లాక్‌డౌన్ ప్రకటించారు. పైవేట్ ప్రాక్టీసు ను తాత్కాలికంగా కొద్ది రోజులు ఆపేశారు.ఇలా ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనకాడలేదు. ఆ సమయంలో జ్వరంతో వచ్చే వాళ్లని చూడటానికి కార్పొరేట్‌ ఆసుపత్రులవాళ్లే భయపడినా పర్వీన్ మాత్రం వారికి చికిత్స అందించింది. పర్వీన్ రెండు సేవా సంస్థలను ప్రారంభించింది. వాటిలో ‘ఇన్‌స్పైరింగ్‌ హెల్తీ యంగ్‌ ఇండియా’ ద్వారా విద్య, వైద్య అంశాలపై స్ఫూర్తి కలిగించేందుకు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

Pic sources bbc

తాతయ్య పేరు మీద ఏర్పాటుచేసిన ‘నూర్‌ ఛారిటబుల్‌ ట్రస్టు’ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతోంది. లాక్‌డౌన్‌ సమయంలో రోజూ అనేకమందికి భోజనం అందించి వారి ఆకలి తీర్చింది. ఈమె సేవలకు గుర్తింపుగా ఎన్నో సేవా సంఘాలు, సంస్థల్లో సభ్యత్వం లభించింది. ‘మా తల్లిదండ్రుల నుంచే ఈ సేవాగుణం అబ్బింది. వాళ్లు ఇప్పుడు ముగ్గురు అనాథలను సొంత ఖర్చులతో చదివిస్తున్నారని డాక్టర్ పర్విన్ అన్నారు .

Pic source bbc

కడపలో క్లినిక్‌ ప్రారంభించినప్పుడు అమ్మానాన్నలకూ చెప్పలేదని రెండు నెలల తర్వాత వారు తెలుసుకుని ఎంతో సంతోషించారు. ప్రస్తుతం ఇక్కడికి రోజూ చికిత్స కోసం పేద రోగులు వస్తున్నారు. ఇన్‌పేషెంట్లకు బెడ్‌ ఫీజు కూడా కేవలం రూ.50 మాత్రమే వసూలుచేస్తున్నారు. మానసిక వైద్యశాస్త్రంలో పీజీ చేయాలనుకుంటున్నట్లు చెబుతున్నారు. భవిష్యత్తులో మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేసి అప్పుడు కూడా తక్కువ ఫీజుకే వైద్య సేవల్ని అందించాలనుందని డాక్టర్ పర్వీన్ చెబుతున్నారు. ఆమె ఆశయం నెరవేరాలని ఆశిద్దాం.

సేకరణ:- చందమూరి నరసింహా రెడ్డి. ఖాసా సుబ్బారావు అవార్డు గ్రహీత.

చందమూరి నరసింహా రెడ్డి.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s