
మనుషులు రోజూ పనులు చేసుకోవాలి. పని చేయంది చాలా మందికి జీవితం గడవదు. పొట్ట నిండదు. వారంతా పనిచేస్తూ కష్టాన్ని మరచి పోవాలను కుంటారు, ఏదైనా పాటపాడుకుంటుంటే మనసు తేలికగా వుంటుంది. హాయి గొలుపుతుంది. ఇలా జానపదుల పాటలొచ్చాయి.”
వారు కష్టపడే టప్పుడు శరీరం కదులుతుంది. ఆ కదిలిక ఒకే తీరుగా ఉంటుంది. పోట్లు వేస్తారు. కోతకోస్తారు. కుప్పలు వేస్తారు. నూరుస్తారు. దంచుతారు. విసురుతారు. ఒక పనికి శరీరంలో ఒకే విధంగా కదిలించాలి. ఒక పనికి సంబంధించిన కదలికలు ఒకే తీరులో వుంటాయి. ఈ తీరునే తాళం అంటారు. కదలికలలోని శబ్దాలను తాళంగా వాడుకుంటారు. ఆ వరుసలో పాటలు కడతారు చక్కగా పాడుకుంటారు. పని చేసేటప్పుడు కలిగే శ్రమను మరచిపోతారు.”
జీవితమంటే తాండవం
అడవుల్లో వుండే వారి ఆటవికులంటారు. వారు చేసే ముఖ్యమైన పనులు అనేకముంటాయి. వర్షపు చినుకులు ముందుగా పడేటప్పుడు ఆడతారు. పాటలు పాడతారు. వ్యవసాయం ప్రారంభిస్తే యిలాగే చేస్తారు. వేటకు వెళ్లే ముందూ యింతే. యుద్ధానికి వెళ్లే ముందూ యిలాగే చేస్తారు. చివరకు పిల్లలు పుట్టినా ఆడిపాడతారు. మనిషి చని పోయినా యిలాగే చేస్తారు. ఇందు వలన వారి జీవితమంతా ఆట పాటలతో నిండి ఉంటుంది ఈ విధమైన ఆచారాలు ప్రపంచ మంతటావున్నాయి. అన్ని జాతుల వారి పూర్వీకులు యిలాగే చేశారు.
ఇలా చేసేటప్పుడు ఏదో ఒక సాధనంతో శబ్దం కలిగించితే బాగుంటుంది ఆధ్వని ప్రకారం అడుగులు వేస్తారు. దీనికోసం అనేకపరికరాలు తయారైనాయి. ‘
మొదటి దశలో అందరూ కలిసి ఆడేవారు. పాడే వారు. తరువాత ఆడవారువేరుగా చేసే వారు. మగవారు వేరుగా ఆడేవారు. తరువాత ఒక్కొక్కరు చేయటం వచ్చింది. ఇలా నృత్యం, సంగీతం చక్కగా పెరిగాయి. ఈనాటి సంఘంలో మనం వీటిని ఏదో రూపంలో రోజూ చూస్తూనే వున్నాము ‘నే చెప్పబోయే సప్త తాండవాలు మానవుని జీవితంలో జరిగినవే. మనిషి ప్రారంభంలో గుంపుగా వున్నాడు కదా! ఏపని చేయబోయినా ముందు అంతా కలిసి నృత్యం చేసేవారు. నృత్యాలు వారి జీవించే పద్దతిని తెలియ జేస్తాయి.’ ఈ గుంపుగా వున్న వాళ్లనందరినీ కలిపి ‘గణం’గా వున్నారనే వారు. గణంలో ప్రతిమనిషి ఒక సభ్యుడు. వీరి నృత్యాలు ఇలా ఉండేవి. వీరి నృత్యాలను తాండవాలంటారు.జాగ్రత్తగా అర్థం చేసుకోండి.
ఆనందతాండవం
‘గణంలో అంతా కులాసాగా వున్నారు. తినటానికి దుంపలు దొరుకుతున్నాయి. పళ్లు దొరుకుతున్నాయి. వేటాడటానికి జంతువులు దొరుకుతున్నాయి. ఉండటానికి గుహలున్నాయి. చెట్ల తొర్రలున్నాయి. అంతా సంతోషంగా ఉన్నారు. ఆనందంగా ఉన్నారు. అందరూ కలిసి హాయిగా ఆడుతుండే వారు. పాడుతుండే వారు. వారు ఆనందంగా ఆడిన నృత్యము ‘ఆనందతాండవం.’
సంధ్యా తాండవం
సాయంకాలానికి అంతా ఒక చోట కూర్చునే వారు. ఏదో ఎండు కొయ్యకు నిప్పంటించేవారు. వేటాడి మాంసం తెచ్చేవారు. దాన్ని నిప్పులమీద కాల్చేవారు సాయంకాలపు ఎండ చక్కగా వుంది. సంతోషాన్ని కలిగిస్తోంది. అపుడు తినేవారు ఆడేవారు ఇదే సంధ్యాతాండవంగా తయారయింది
కలికి తాండవం
అందరూ కలిసి జీవిస్తున్నారు. వారిలో కొందరు ఎదురు తిరిగారు. ఇందువల్ల ఆహారాన్ని పోగు చేసుకోవడం కష్టమయింది. విరోధులుగా వున్న ఇతర గణాల వాళ్లతో యుద్ధం చేయటం కుదరలేదు. దాంతో ఓడిపోక తప్పటం లేదు. కాబట్టి ఎదురు తిరిగిన వారిని వెళ్ళ గొట్టాలి. లేకపోతే చంపివేయాలి. ఈ భావాలను నృత్యంతో చూపించారు. ఇదే కలికి తాండవం.’
విజయ తాండవం

‘ఇతరులతో యుద్ధాలు తప్పవు. బయట అనేక రకాల వాళ్లున్నారు. లింగాలను పూజించే వారున్నారు. పులి చర్మాలను అందంగా చుట్టుకునేవారున్నారు. మరికొందరు ఏనుగు చర్మాలను వాడుకుంటారు. కొందరు అడవి దున్నపోతు కొమ్ములను తల పైన అలంకరించుకుంటారు. ఒక గణం వారి అలంకారాలకు రెండో వారి అలంకారాలకు సంబంధం లేదు. వేరుగా ఉంటుంది
అనేక రకాల వారు ఆర్యుల చుట్టూ ఉండే వారు వారిలో వారికి యుద్ధాలు తప్పలేదు. ఒక్కో సమయంలో యుద్ధం వద్దనుకునేవారు. ఒకరి కొకరు హెచ్చరించుకునే వారు. మధ్య వర్తుల ద్వారా మాట్లాడుకునే వారు. తగాదాలు రాకుండా సరిచేసుకునే వారు. కాని తప్పని సరి అయినప్పుడు కొట్లాడుకునే వారు. ఒకరి నొకరు చంపుకునే వారు. శత్రువుల మీడ విజయం సాధించిన తరువాత నృత్యం చేసే వారు. ఇడే విజయ తాండవం.”
ఊర్ధ్వ తాండవం
ఆడవారికి, మగవారికి పోటీ వచ్చింది. ఇద్దరూ ఆడుతున్నారు. శరీరాలనుకదిలించడం లో పురుషులకు తేలికగా వుంటుంది. అనువుగా వుంటుంది. వేగంగా
ఆడటానికి వీలుగా వుంటుంది. కాని స్త్రీలు అలా చేయలేరు. నెమ్మదిగా చేస్తారు. అందంగా ఆడతారు. సుకుమారంగా కదులుతారు. భావాలను తేలికగా చూపించ గలరు. సున్నితంగా చూపించగలరు “ ఈ పోటీలలో పురుషులు వోడిపోయేటట్లున్నారు. ఇందువల్ల ఏదో మోసంతో జయించాలనుకున్నారు. కాలు తీసి నెత్తి మీద పెట్టుకున్నారు. ఒంటి కాలు మీద ఆడినారు. కాని, ఆడవారు కాలు లేపి ఆడలేరు. ఆడలేకకాదు. అందరి ముందూ అలా
చేయటం బాగుండదు. అసహ్యంగా ఉంటుంది. సభ్యతగా పుండదు. అలా చేయడం ఇష్టం లేక
ఆగిపోయారు. ఇదే నృత్యం లో చూపించారు. కాలు తలపై వుంచి ఆడేది కాబట్టి
ఊర్ధ్వ తాండవం అన్నారు.
అబ్బాయిలూ! సమాజంలో ముందు రోజుల్లో నృత్యాలన్నీ తాండవాలుగానే ఉండేవి. అప్పటి మానవులకు ‘లాస్యం తెలియదు. లాస్యమందే ఏమిటో చెప్పివున్నాను. మానవులు బాగా స్థిరపడిన తరువాత లాస్యం వస్తుంది. ఒక చోట ఊరుకట్టుకుని వ్యవసాయం చేస్తూంటారు. పూర్వం మాదిరిగా తిరుగుతూ వుండరు. ఆహారం వెదుక్కోవలసిన పనిలేదు. వ్యవసాయం వలన పంటలు పండుతాయి. ఈ దశలో మానవుని ఆలోచనల్లో మార్పు వస్తుంది.జీవించే పద్ధతుల్లో మార్పు వస్తుంది. ఈ సమయంలో ‘లాస్యం’ పుడుతుంది. బాగా పెరుగుతుంది భావాలను చక్కగా వివరించేందుకు అభినయం వస్తుంది
ఉమ తాండవం
ఉమ అనగాతల్లి. గణంలో ఎవరైనా చనిపోతే అంతా శోకాలు పెట్టే వారు దు:ఖ పడేవారు. ఆ శవాన్ని స్మశానానికి తీసుకెళ్లేవారు. అందరూ అక్కడ గుమికూడే వారు. అక్కడే అన్నం వండి ఏవేవో చేసేవారు. ఆడా మగా అంతా అక్కడే ఉండీ పనులన్నీ చేసే వారు. కాని తల్లికుండే దుఃఖం వేరు. ఆమె చాలా బాధపడుతుంది. వాళ్లందరికీ తల్లి వంటిది తమ ‘గణం’. ఆగణంలో పుట్టి అందులో పెరిగే వారు అందులోనే చనిపోయేవారు. అన్ని పనుల్లో కలసి వుండే వారు. చివరకు చనిపోయినసమయంలోనూ యిలాగే వుండేవారు. తల్లిలా అంతా కన్నీరు పెట్టేవారు.ఆ స్మశానంలో కలిగే భావాలను వివరించే విధంగా ఆడేవారు. నృత్యం చేసేవారు. ఇదే ఉమా తాండవం.
‘ఉమా దేవి అందరికి తల్లి వంటిది. బిడ్డ చనిపోతే తల్లికి కలిగే దుఃఖం చాలా ఎక్కువగా వుంటుంది.”
ఉమాతాండపం తల్లి మనసులోని బాధను తెలియ జేస్తూ ఆడే ఆట. ‘మధ్య ప్రదేశ్ లో దండకారణ్యం వుంది. ఈ అడవిలో అనేక మంది ఆటవికులునివసిస్తున్నారు. వీరిలో కొందరికి వింత ఆచారం వుంది. ఎవరైనా చనిపోతే, అంతా స్మశానానికి వెళ్తారు. అక్కడే మూడురోజులుంటారు. మధ్యలో గూడేనికి తిరిగిరారు. తినటం, త్రాగటం, నిద్రించటం అంతా అక్కడే జరుగుతుంది. విషాదంగా పాటలు
పాడుతారు భోరుభోరున ఏడుస్తారు. కన్నీళ్ళు పెట్టుకుని స్మశాన నృత్యం చేస్తారు.
గణాలు తెగలుగా పెరిగాయి. అవి జాతులుగా అభివృద్ధి చెందాయి. తరువాత మానవులు చాలా వరకు మారిపోయారు. ఐనా పాత అలవాట్లు కొన్ని మిగిలాయి. అవే ఆచారాలుగా అంటివున్నాయి.’
సంహార తాండవం
శత్రువులను వదలి పెట్టగూడదు. ఒకరిని కూడా వదలరాదు. అందరినీ చంపేయాలి. నరికేయాలి బాణాలతో కూల్చేయాలి, ఇదే భావాన్ని అందరూ చేస్తారు. యుద్దానికి వెళ్ల బోయే ముందు ఆడతారు. ఇదే సంహార తాండవం
తాండవంలో అభినయం వుండదు. లాస్యం వుండదు. కాళ్ళూ చేతుల కదలికలుంటాయి. గెంతుతారు. పాదాలు నేలకు తడతారు. శబ్దాలు కలిగిస్తారు. తాండవాలన్నీ యిలాగే చేస్తారు. తాండవాలు శివునకు సంబంధించినవి. ఇవి ఆర్యుల ఆటలు కావు.”
ద్రావిడ జాతుల వారికి తాండవాలంటే బాగా యిష్టం.’
మరో విషయం గుర్తుంచుకోండి. తాండవం పూర్తిగా నృత్తం అని తెలుసుకోండి నృత్తంలో అభినయం వుండదని చెప్పాను. ఒక విధంగా యిది సరైన మాట కాదు. అభినయం లేకుండా ఏ ఆటా ఉండదు. ఎంతో కొంత వుంటుంది. భావాన్ని విడమర్చి చెప్పాలి కదా! అందుకు అభినయం కన్నా శరీరపు కదలికలనే వాడుతారు.