
ఒకప్పుడు బండకొండగా పేరుగాంచిన ప్రాంతమే నేడు గుడిబండగా పిలువబడుతోంది.క్రీ.పూ. 17వ శతాబ్దం క్రితం గుడిబండ కోటలో

రాహుత్త మహారయ అనే రాజు పరిపాలిస్తుండే వాడు.ఆయన 90ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కొండపై కొండ మల్లేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాడు.

కొండపై సుందరమైన కొలనులు, కోటగోడలు, బందిఖానా, నంది విగ్రహం, ఫిరంగులు, సొరంగాలుఇక్కడ దర్శనమిస్తాయి. పూర్వీకులు చెక్కిన శిలలు, రాతలు నేటికీ దర్శనమిస్తున్నాయి. ఇదేగాకగుడిబండ కొండపై ఉన్న కొలనులో

నిమ్మకాయవేస్తే కొండకు 8కిలోమీటర్ల దూరంలో ఉన్నమోరుబాగల్ చెరువులో నిమ్మకాయ తేలుతుందని పూర్వీకులు నమ్మేవారు. ఇలాంటి కొండపైఅప్పట్లో కోటను నిర్మించడానికి రాజులు నానా తంటాలు పడ్డారని, ఆ కోట ఒక ప్రక్క నిర్మిస్తేమరోపక్క కూలిపోయేదని చివరకు మల్లేశ్వరుడి గుడి కట్టిన తర్వాతనే కోట నిర్మాణం జరిగిందనిపూర్వీకులు చెపుతున్నారు. మూఢ విశ్వాసంతో ఒక నిండు గర్భిణిని అప్పట్లో బలిచ్చారట. ఇప్పటికీ ఆ మరణించిన మహిళ ఆనవాళ్ళు నేటికీ ఆ కొండపై చూడవచ్చు. ఈ కొండ పై నిర్మించినమల్లేశ్వరస్వామి ఆలయాన్ని బలైన మహిళ ఆనవాళ్ళను చూసి తెలుసుకోవడానికి ఎంతో మంది సందర్శకులు వచ్చి వెళుతుంటారు. ఈ కొండపైకి వెళ్లడానికి సరైన మెట్ల సౌకర్యం లేక మహిళలు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

కొండపై నిర్మించిన మల్లేశ్వరస్వామి ఆలయం కూడా కాలక్రమేనా శిథిలావస్థకు చేరుకుంది. మైరాడా స్వచ్చంద సంస్థ ముందుకు వచ్చి ఆలయానికి మరమ్మతు చేయించింది. దానితో ఆలయానికి పూర్వవైభవం వచ్చింది. గుప్త నిధుల కోసం నంది విగ్రహాన్ని సైతం గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతో నూతనంగా నంది విగ్రహాన్ని ప్రతిష్టించారు. కొండ పైకి వెళ్లే మెట్లదారిలో

విద్యుత్ స్థంభాలను అమర్చి మల్లేశ్వర దేవాలయానికి కొండ పైకి విద్యుత్ సౌకర్యాన్ని కల్పించారు.

జనాభా
2011లెక్కల ప్రకారం మొత్తం 52,610 మంది. పురుషులు 26,964 – స్త్రీలు 25,646.
2001 – 2011 మధ్య కాలంలో మండల జనాభా 47,838 నుండి 52,610 కి పెరిగి, 9.98% దశాబ్ద కాలపు పెరుగుదలను నమోదు చేసింది. ఇదే కాలంలో జిల్లా పెరుగుదల రేటు 12.1% గా ఉంది
మండలంలోని గ్రామాలు
- కరికెర,రాళ్లహళ్లి,పిల్లెనహళ్లి,కేకతి,గుడిబండ,సిగతుర్పి,మొరుబగళ్, గునిమొరుబగల్, ముత్తుకూరు,మండలహళ్లి,కొంకల్లు, ఎస్.రాయపురం,జమ్మలబండ