ఈ మధ్య పలు ప్రాజెక్టుల మీద రేగిన వివాదల దృష్ట్యా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు(KRMB) ఆంధ్రా,తెలంగాణా ఇరు రాష్ట్రాలను ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మరియు ప్రతిపాదన దశలో ఉన్న ప్రాజెక్టుల కు సంబంధించి వివరాలు ముఖ్యంగా డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్(డిపిఆర్)లు సబ్మిట్ చెయ్యమని ఆదేశించింది.

KMRB అనేది పవర్ లేని ఒక ధర్మకర్త లాంటిది. నేరుగా వారు ఏ ఆదేశాలు ఇవ్వలేరు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేటాయింపులు ఇంకా అవార్డు కాలేదు కాబట్టి ఇరు రాష్ట్రాలు నీటి కేటాయింపుల కోసం రెగ్యులర్ గా KRMB వద్దకు వెళుతున్నారు. కేంద్ర జల శక్తి (ఇంతకు ముందు కేంద్ర జల సంఘం(CWC) అని పిలిచేవారు ) కలగచేసుకొని గట్టిగా చెప్పటంతో KRMB అడిగిన వివరాల మీద ఉత్తరాలు రాశారు.

ఆంధ్రా తరుపున జలవనరుల శాఖ ఇంజినీర్-ఇన్-ఛీఫ్(ENC) మొన్న KRMB కి ఉత్తరం రాశారు. నాలుగు పేరాలు ఉన్న ఆ లెటర్లో ఒకే అంశం పట్ల విరుద్ధ భావాలతో ప్రత్యుత్తరం ఇచ్చారు.

మొదటి పేరాలో రిఫరెన్స్ అంశాలు మాత్రమే ఉన్నాయి.

రెండవ మొదటి పేరాలో ముచ్చుమర్రి,గురు రాఘవేంద్ర, సిద్దాపురం లిఫ్ట్, శివ భాష్యం స్కీం, మున్నేరు లిఫ్ట్ ఉమ్మడి రాష్ట్రంలోనే పూర్తి చేశామని పేర్కొన్నారు.

మూడవ పేరాలో గతంలో అంటే 12వ KRMB మీటింగులో ఆంధ్రా స్పెషల్ చీఫ్ సెక్రటరీ చెప్పినట్లు ఏ ప్రాజెక్టుల నిర్మాణానికి రాష్ట్ర విభజనకు ముందు జీవో విడుదల అయ్యాయో వాటి డిపిఆర్ లు సమర్పించము అని , ఒక వేళ KRMB ఏదైనా ప్రాజెక్టును కొత్తది అంటే దాని డిపిఆర్ ను సమర్పించే విషయాన్ని పరిశీలిస్తాం అని చెప్పారు.

నాలుగు పేరాలో పైన పేర్కొన్న(రెండవ పేరాలో) ప్రాజెక్టులను కొత్త ప్రాజెక్టుల లిస్టు నుంచి తప్పించమని కోరారు. ఇంత వరకు ఎలాంటి వివాదం లేదు. కానీ నాలుగోవ పేరా రెండవ లైను నుంచి గుండ్రేవుల,వేదవతి,రాజోలి బండ కుడి కాలువ(RDS కుడి కాలువ) ప్రాజెక్టులు రాష్ట్ర విభజన తరువాత మొదలు పెట్టాము ,వాటి డిపిఆర్ లు ఇంకా సిద్ధం కాలేదు,అవి సిద్ధం అయినా తరువాత పంపుతాము అని చెప్పారు. దీనితోనే విబేధం ఉంది.

గుండ్రేవుల ఎప్పుడు మొదలు పెట్టారు?

కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 01-Nov-2013న గుండ్రేవుల సర్వే చేసి డిపిఆర్ తయారీకి ARVEE Associates కు ఇస్తూ 51.95 లక్షలు కేటాయిస్తూ GO Ms No. 100 I&CADను విడుదల చేశారు. సర్వే దాదాపు 95% పూర్తయిన తరువాత సర్వే కోసం తమ ప్రాంతంలో బోర్ గుంతలు వెయ్యటాన్ని తెలంగాణ వైపు కొందరు వ్యతిరేకించడంతో పనులు ఆగిపోయాయి. 15-Nov-2014న వడ్డేపల్లి MRO సర్వే యంత్రాలను సీజ్ చేశారు. అప్పటి నుంచి గుండ్రేవుల సర్వే మరియు డిపిఆర్ పనులు పూర్తిగా ఆగిపోయాయి.

తెలంగాణా రైతులను ఒప్పించటానికి రిటైర్డ్ ఇంజినీర్ సుబ్బారాయుడు సార్ సొంతంగా కరపత్రాలు ముద్రించి వడ్డేపల్లి మండలంలోని అనేక గ్రామాలు తిరిగి గుండ్రేవుల ప్రాజెక్ట్ ఇరు రాష్టాలకు ఏ విధముగా ఉపయోగమో వివరించారు. మరో వైపు నాటి కెసి కెనాల్ DE జవహర్ రెడ్డి వడ్డేపల్లి రెవిన్యూ అధికారులతో సంప్రదించి సర్వే పనులు కొనసాగటానికి ప్రయత్నం చేశారు. చివరికి దాదాపు ఎనిమిది నెలల తరువాత సర్వే పనులు పునఃప్రారంభమయ్యి 13-Oct-2015న 2400 కోట్ల అంచనాతో ARVEE Associates రిపోర్ట్ ఇచ్చింది.

డిపిఆర్ సిద్ధం అయిన తరువాత చంద్రబాబు ఏమి చేశారు?

ప్రాజెక్టుల విషయంలో చంద్ర బాబు గారిని ఎందుకు విమర్శిస్తారు?ప్రత్యేకంగా చెప్పకపోయినా పైన రాసిన విషయాలు సమాధానం చెబుతాయి.. 2015లో డిపిఆర్ సిద్దమైన 2400 కోట్ల గుండ్రేవుల ఎన్ని రోజుల్లో పూర్తి కావాలి?100 రోజుల్లో పట్టిసీమకట్టి రాయలసీమకు నీళ్లు ఇస్తామని అదే 2015 మార్చ్ 1న చెప్పిన బాబుగారు.కర్నూల్ జిల్లాలో తుంగభద్రా నది మీద కట్టవలసిన గుండ్రేవులను ఎందుకు కట్టలేదు అని ఎవరైనా ఎందుకు విమర్శించరు ?.ఖర్చు చూసినా పట్టిసీమ తొలి అంచనా దాదాపు 1600 కోట్లు.. అది పూర్తి అయినా తరువాత ఎస్కేలేషన్ తో సుమారు 2000 కోట్లు కాంట్రక్టర్ కు చెల్లించారు..

2019 మార్చ్ 2 న అంటే ఎన్నికలకు రెండు నెలల ముందు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీలో చేరిన సందర్భంలో గుండ్రేవుల, వేదవతి, RDS కుడి కాలువ, LLC పైప్ లైన్ ఈ నాలుగు పథకాలకు 8100 కోట్లతో పూర్తిచేస్తామని ప్రకటించారు. మీకు ఇప్పుడు సంతృప్తిగా ఉందా?, టీడీపీ అభ్యర్ధికి ఓట్లు వేస్తారా అని కూడా ఆయన శైలిలో అడిగారు.. కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి గారు కూడా ప్రాజెక్టుల సాధనకు, అభివృద్ధికోసమే టీడీపీలో చేరుతున్నానని చెప్పారు.

పుణ్యకాలం ముగిసిన తరువాత ఎన్ని హామీలు ఇస్తే ఏమి లాభం?. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని ప్రాజెక్టులు కడితే రాష్ట్రానికి ఇన్ని సమస్యలు ఉండేవి కావు.. బాబుగారికి పేరొచ్చేది…

ఇప్పుడేమి చేయాలి ?

మొన్న రాసిన లెటర్ కేవలం సమాచారం కోసం రాసిందే. తదుపరి KRMB సమావేశానికి పాత జీవో లు ,డిపిఆర్ లు , ఇప్పటికి పెట్టిన ఖర్చు వివరాలు సిద్ధం చేసుకొని అధికారులు వెళ్ళాలి.

జూన్ మూడో వారంలో KRMB చెప్పినట్లు 02-Jun-2014 తరువాత మొదలైన ప్రాజెక్టులే కొత్తవి. మిగిలిన ప్రాజెక్టులు అన్ని ఉమ్మడి రాష్ట్రంలోనే మొదలుపెట్టిన పాత ప్రాజెక్టులు..లెటర్లో రాసినట్లు రాష్ట్ర విభజనకు ముందే గుండ్రేవుల ప్రాజెక్ట్ నిర్మాణం కోసం జీవో విడుదలైంది కాబట్టి గుండ్రేవుల పాతప్రాజెక్టు అన్న విషయాన్నీ వివరించాలి.

ఈ విషయం మీద బలంగా వివరించాలి. తెలంగాణా అధికారులు పాలమూరు-రంగారెడ్డి మీద ఏ ప్రాతిపదికన వాదనలు చేశారో గమనించాలి. 2013లో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా జూరాల బ్యాక్ వాటర్స్ నుంచి 70 టీఎంసీ లు ఎత్తిపోయటానికి డిపిఆర్ తయారు చేయటానికి సర్వే నిర్వహించాలని ఇచ్చిన జీవో ను చూపించి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పాతదే అని వాదించిన విషయం గుర్తించాలి.

అసలు గుండ్రేవులకు అనుమతులు అవసరమా?

గుండ్రేవుల ప్రాజెక్ట్ కొత్తదా ?పాతదా ? ఈ ప్రశ్నతో సంబంధం లేకుండా గుండ్రేవుల కట్టుకునే హక్కు ఆంధ్రాకు ఉంది. గుండ్రేవుల అనేది కర్నూల్ జిల్లాలో సి.బెళగల్ మండలంలోని రామాపురం అనే గ్రామం వద్ద తుంగభద్ర నది మీద 20 టీఎంసీల నిలువ సామర్ధ్యంతో నిర్మించవలసిన ప్రాజెక్ట్.

తుంగభద్ర మీద హొస్పెట్ వద్ద టీబీ డ్యామ్(తుంగభద్ర డ్యాము) తరువాత కర్నూల్ టౌన్ కు 20 కి.మీ దూరంలో సుంకేశుల డ్యాం మాత్రమే ఉంది. టీబీ డ్యామ్ కెపాసిటీ 101 టీఎంసీ ,సుంకేసుల డ్యామ్ కెపాసిటీ 1.20 టీఎంసీ .

సుంకేసుల డ్యామ్ వద్ద నుంచి కుడిగట్టు మీద కేసీ కెనాల్ మొదలవుతుంది.కేసి కెనాల్ కు బచావత్ ట్రిబ్యునల్ 39.90 టీఎంసీ లు కేటాయించగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 31.90 టీఎంసీలు కేటాయించింది. బ్రిజేష్ ట్రిబ్యునల్ ఇంకా అవార్డు కాలేదు,నీటి పంపిణీ మీద కోర్టులో కేసు నడుస్తుంది.

కేసి కెనాల్ కు కేటాయించిన 39.90 టీఎంసీల నీటిలో హొస్పెట్ వద్ద ఉన్న టీబీ డ్యామ్ నుంచి 10 టీఎంసీలు కేటాయించారు. మిగిలిన 29.90 టీఎంసీల నీరు టీబీ డ్యామ్ -సుంకేసుల మధ్య ఉన్న కాచ్మెంట్ నుంచే రావాలి.అంటే ఆప్రాంతంలో పడే వర్షాలు,తుంగభద్రలో కలిసే వాగులు, వంకల నీటితోనే లభించాలి. తుంగభద్రకు తక్కువ రోజుల్లో ఎక్కువ వరద వస్తుంది. కృష్ణ నది కన్నా ముందే తుంగభద్రలో వరద మొదలవుతుంది. ఈ సంవత్సరం కూడా జూన్ మూడో వారంలోనే సుంకేసుల గేట్లు ఎత్తి నీటిని కిందికి వదిలారు.

పూడిక తరువాత సుంకేసుల కెపాసిటీ ఒక టీఎంసీ మాత్రమే, కేసీ కెనాల్ డిశ్చార్జ్ కెపాసిటీ 3850 క్యూసెక్కులు , అంటే ఒక రోజులో 1/3 టీఎంసీ నీటిని మాత్రమే తీసుకోగలుగుతారు . ఈ కారణాలతో తుంగభద్రలో వరద వచ్చినా కేసి కెనాల్ ఆయుకట్టుకు కేటాయింపు మేర నీరు అందటంలేదు. టీబీ డ్యాము నుంచి కేసీ కెనాల్ కు కేటాయించిన 10 టీఎంసీలలో 5 టీఎంసీలు HLC కి కేటాయించారు.. అంటే కేసీ కెనాల్ కు కేటాయించిన మొత్తం నీరు దాదాపుగా టీబీ డ్యామ్ దిగువ నుంచే రావాలి.అలా వచ్చిన నీటిని ఆపుకోవటానికి సుంకేసుల కెపాసిటీ సరిపోదు… అందుకే గుండ్రేవుల నిర్మాణం చేస్తే 20 టీఎంసీల నీరు నిలువ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది.

గుండ్రేవుల వరద జలాల ఆధారంగా ప్రతిపాదించిన ప్రాజెక్ట్ కాదు.. కేసి కెనాల్ కు టీబీ డ్యామ్ దిగువన రావలసిన నికర జలాలు 34.90 టీఎంసీల ఆధారంగా కట్టవలసిన ప్రాజెక్ట్.. గుండ్రేవుల మీద కర్ణాటకకు అభ్యంతరం ఉండదు. తెలంగాణాకు కూడా కొంత నీరు అందుతుంది.

గుండ్రేవుల మీద ఆంధ్రా అధికారులు మరింత సమాచారాన్ని సేకరించి KRMB ముందు బలమైన వాదనలు వినిపించాలి. గుండ్రేవుల ముమ్మాటికీ పాత ప్రాజెక్ట్…

వేదవతి,RDS కుడి కాలువ పరిస్థితి ఏమిటి?

బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ RDS (రాజోలి బండ) కుడి కాలువకు 4 టీఎంసీల నికర జలాలను కేటాయించారు. బ్రిజేష్ కుమార్ కేటాయింపులు ఇంకా అవార్డు కాకపోయినా ఒక ట్రిబ్యునల్ నికర జలాలను కేటాయించింది అంటే దానికి తగిన ప్రాతిపదిక ఉన్నట్లే. కోర్టు అయినా ఏకపక్షంగా కొట్టేయదు , ఆ ట్రిబ్యునల్ సభ్యుల సలహా అడుగుతుంది.

ఈ విషయాన్ని పక్కన పెడితే చంద్రబాబు హయాంలో RDS కుడి కాలువ పనులు NCC Groupకు ఇచ్చారు. ఏ వర్క్ అయినా సర్వే, డిపిఆర్ అయినా తరువాతనే టెండర్ అవుతుంది. 1542 కోట్ల RDS కుడి కాలువ పనులు 2019 ఫిబ్రవరిలో టెండర్లు పిలవగా NCC Group కాంట్రాక్ట్ దక్కించుకుంది. ఎన్నికలు రెండు నెలలు ఉంటే పనులు ఎలా జరుగుతాయో అందరికి తెలిసిందే. జగన్ ముఖ్యమంత్రి అయినా తరువాత రివర్స్ టెండర్లో రద్దయిన ఈ ప్రాజెక్టును తిరిగి NCC నే దక్కించుకుంది.

వేదవతిది కూడా ఇలాంటి కథే..కేటాయింపులు లేవు,2014 జూన్ కన్నా ముందు జీవో లు విడుదల కాలేదు అని KMRB వాదించినా గుండ్రేవుల,RDS కుడి కాలువ పనులకు KRMB అడ్డుచెప్పకూడదు..

గుండ్రేవుల పూర్తి అయితే కేసీ కెనాల్ కింద ఉన్న 2.66 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు లభిస్తుంది . అవకాశం ఉంటే గుండ్రేవుల ఆధారంగా అటు అనంతపురానికి ఇటు పశ్చిమ కర్నూల్ జిల్లాకు నీళ్లు ఇచ్చే పథకాలు ఆలోచించవచ్చు.

కోట్ల విజయ భాస్కర్ రెడ్డి హయాంలో ఈ ప్రోజెక్టుల గురించి చాలా చర్చ జరిగింది కానీ వీటి మీద జీవో లు విడుదల అయ్యావో సమాచారం లేదు.

ఇంత ముఖ్యమైన ప్రాజెక్ట్ మీద అధికారులు మరింత దృష్టి పెట్టాలి. KMRB లో వాదన గెలవాలి,ప్రాజెక్టుల నిర్మాణానికి అడ్డంకులు తొలగించాలి. ముఖ్యమంత్రి జగన్ కూడా గుండ్రేవుల కడతామని గత సెప్టెంబర్ లో ప్రకటించి ఉన్నారు.ఈ సంవత్సరం చివరి లోపు పనులు మొదలు అయితే 2023 లోపు పూర్తి చేయొచ్చు. ప్రాజెక్టులు పూర్తి అయితేనే ప్రజలకు నమ్మకం కలిగేది.

శివ రాచెర్ల ఫేస్ బుక్ నుండి.

శివ రాచెర్ల

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s