
కసాపురం గ్రామం లోని నెట్టికంటి దేవాలయం రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ది చెందినది. ఇక్కడికి ప్రతి రోజు ఎంతో మంది భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకుంటూ ఉంటారు. ఇక్కడ ప్రధాన ఆలయానికి దగ్గరలోనే గుట్టపైన బాల ఆంజనేయ స్వామి వెలసినాడు.
నెట్టికంటి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న భక్తులు తరువాత బాల ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని తరిస్తూ ఉంటారు. ప్రధాన ఆలయం నుండి కొద్ది దూరంలో చిన్న గుట్ట పైన కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయం ఉంది. ఇక్కడ నుంచి చూస్తే కసాపురం ఆలయం మొత్తము వ్యూ కనిపిస్తుంది. కసాపురం నుండి గుంతకల్లు కు వెళ్ళే దారిలో శనీశ్వరుని ఆలయం తో పాటు అయ్యప్ప స్వామి ఆలయం కూడా ఉన్నది.

క్రీ .శ . 1521 సంవత్సరం లో శ్రీ వ్యాసరయలవారు(తదనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామి ,మంత్రాలయం ) హంపి క్షేత్రం లో తుంగభద్రా నదితీరంలో కర్మనుష్టానం చేస్తూ తను ధరించే గంధం తో తన ఎదురుగా ఉన్న శీలా పైన ఆంజనేయ స్వామి రూపం చిత్రించాడు .
అది నిజ రూపం దరించి వెళ్తూ ఉంది . ఈ విధంగా అయదు సార్లు చిత్రించగా అదే విదంగా జరిగింది . చివరికి శ్రీ వ్యాసరయలవారు అంజనేయ స్వామి వారి ద్వాదశ నామ బీజాక్షరం తో యంత్రం రాసి దానిలో శ్రీ స్వామి వారి నిజరూపం చిత్రించగా స్వామి వారు ఆ యంత్రం లో బందిచబడినారు .
అప్పుడు స్వామి వారు వ్యాస రాయల వారు స్వప్నం లో స్వామి కనిపించి నేను ఈ క్షేత్రం లో ఉన్నాను దాన్ని తీసి ప్రతిస్టించమని చెప్పగా .. వ్యాసరయలవారు ఈ ప్రాంతాన 732 ఆంజనేయ స్వామి విగ్రహాలు ప్రతిస్తించాడట. చిప్పగిరి గ్రామం లోని శ్రీ భోగేశ్వర స్వామి గుడి లో వ్యాసరయలవారు నిద్రిస్తుండగా నేను ఇక్కడ నుండి దక్షిణ దిక్కుగా కొద్దిరుపం లో భూమి లో ఉన్నాను నన్ను తిరిగి ప్రతిస్టించమని పలికారు .
వ్యాసుల వారు దారి చూపించమని అడగగా ఆంజనేయుడు ప్రస్తుతం నా పైన ఎండిన వేప చెట్టు ఉంది అది నువ్వు రాగానే పచ్చగా చిగురిస్తుంది అని మార్గం సూచించారు .
వ్యాసరాయల వారు కసపురానికి విచ్చేసి శ్రీ స్వామి వారి మిద ఉండే వేప వృక్షానికి సమీపించగానే అది పచ్చగా చిగురించింది అప్పుడు వ్యాసుల వారు ఆ ప్రాంతాన్ని తవ్వించి ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని ప్రతిస్టించాడు అని స్థల పురాణం చెబుతుంది .
కసాపురం గ్రామానికి దగ్గరగా ఉండటం వలన కసాపురం ఆంజనేయ స్వామి అని కూడా పిలుస్తారు . నెట్టికల్లు ( మంచి రాయి ) లో అవిర్బవిన్చినందున శ్రీ స్వామి వారికి నెట్టికంటి ఆంజనేయ స్వామి అనే పేరు ప్రసిద్దమైనది.
నెట్టికంటి అనగా ఒక కన్ను కలవాడని అర్థం . విగ్రహం లో స్వామి కుడి కంటి తో భక్తులను చూస్తూ వారి మనోభిస్టాలను నెరవేరుస్తున్నారు . స్వామి వారు కోరిన కోరికలు, వారి భాదలను తీర్చే కొంగు బంగారం.

గుంతకల్లు పట్టణానికి 4.5 కిలోమీటర్ల దూరం లో ఉన్న నెట్టికంటి ఆంజనేయ స్వామి రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి చెందినది. ఇక్కడి స్వామి వారిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల ఊరి వాళ్ళే కాకుండా కర్ణాటక రాష్ట్రము నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. కసాపురం చేరుకోవడానికి గుంతకల్లు రైల్వే స్టేషను నుండే కాకుండా బస్టాండ్ దగ్గరినుంచి ఆటో లు చాల ఉంటాయి. గుంతకల్లు నుండి పత్తికొండ వెళ్ళే రహదారిలో ఉంది కాబట్టి బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి. ఇటీవలే ప్రభుత్వము గుంతకల్లు నుండి కసాపురము కి నాలుగు లైన్ల రహదారి నిర్మాణం చేపట్టింది.
సేకరణ :- వై.రాజశేఖర్ రెడ్డి
