దక్షిణభారతదేశపు అగ్రశ్రేణి కర్ణాటక సంగీత విద్వాంసుడు సంధ్యావందనం శ్రీనివాసరావు. కర్నాటక సంగీతంలో మహా విద్వాంసుడు. సంగీత కళానిధి సంధ్యావందనం శ్రీనివాసరావు ఆకాశవాణిలో భక్తిరంజని కార్యక్రమం సంధ్యావందనం హయాంలోనే ప్రారంభించబడింది.
అప్పుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఆలిండియా రేడియోలో సంధ్యావందనం వద్ద ప్రమోషన్‌ అసిస్టెంట్‌గా ఉండేవారు. ముత్తుస్వామి దీక్షితార్‌ కీర్తనలు ఆలపించడంలో సంధ్యావందనం శ్రీనివాసరావు ప్రసిద్ధులు. సంగీత కళారత్న సంగీత కళాచార్య ఆయన బిరుదులు.

అనంతపురం జిల్లా పెనుకొండలో 1918, ఆగష్టు 21న సంధ్యావందనం శ్రీనివాసరావు జన్మించారు. తండ్రి నారాయణరావు, తల్లి గంగాబాయి . ఇతని పూర్వీకులు మైసూరు సమీపంలో శ్రీరంగపట్టణంలో నివసించేవారు.

దత్తమండల కళాశాలలో బి.ఎ.చదివాడు. తరువాత బి.ఎల్. కూడా చదివాడు. వకీలుగా కొంతకాలం ప్రాక్టీసు చేశాడు.

సంధ్యావందనం శ్రీనివాసరావు
సంగీతంలో ప్రాథమిక పాఠాలు పల్లవి పక్క హనుమంతాచార్, తిరుపతి రంగాచార్యులు, చిలమత్తూరు రామయ్యల వద్ద నేర్చుకొన్నారు.

తరువాత టైగర్ వరదాచారి, మహారాజపురం విశ్వనాథ అయ్యర్, ద్వారం వేంకటస్వామినాయుడు, మైసూరు వాసుదేవాచార్‌ల వద్ద సంగీతంలో మెళకువలు నేర్చుకున్నారు.

సంధ్యావందనం శ్రీనివాసరావు
తన 12ఏళ్ల ప్రాయం నుండే సంగీత కచేరీలు ప్రారంభించారు. సుమారు 6 దశాబ్దాల కాలం దేశం అంతటా సంగీత ప్రదర్శనలు ఇచ్చారు.

శ్రద్ధతో, ఉత్సాహంతో, పట్టుదలతో అనేక ప్రాచీన సంప్రదాయ కీర్తనలు సేకరించి, స్త్రీలపాటలు, పల్లెపదాలు అనేకం ప్రోదిచేసి వాటి ద్వారా ప్రాచీన రాగాల స్వరూపాలను కల్పన చేశాడు.

ఇతడు తెలుగు, తమిళ, కన్నడ, మరాఠీ, సంస్కృతము, ఆంగ్ల భాషలలో ప్రావీణ్యం సంపాదించాడు. ఇతడు కళ్యాణి, యదుకుల కాంబోడి, భైరవి, కేదారగౌళ, సహన, ద్విజవంతి మొదలైన రాగాలలో విశేషమైన కృషి చేశాడు.

ఇతడు ఆకాశవాణి విజయవాడ,మద్రాసు కేంద్రాలలో శాస్త్రీయ సంగీత కార్యక్రమాల నిర్వాహకుడిగా, వివిధ హోదాలలో పనిచేశాడు.

శ్రీనివాసరావు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో తొలినాళ్ళలో పనిచేశారు. చక్కటి కర్ణాటక బాణీలో గానం చేయగల వీరు అనేక భక్తరంజని కార్యక్రమాలు రూపొందించారు.

మదరాసులో మ్యూజిక్ సూపర్‌వైజర్ గా చేరారు. వాద్యగోస్టులు నిర్వహించేవారు. విజయవాడలో అసిస్టెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేశారు.మద్రాస్ సంగీత కళాశాల ప్రిన్సిపాల్‌గా పని చేశారు.
తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన పండిత పదవి ని అలంకరించారు.
తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రలో వీరు చక్కటి పేరు సంపాదించారు.

మంగళంపల్లి బాల మురళీ కృష్ణ, ఎం.ఎస్.సుబ్బలక్ష్మి, ఎస్.రామనాథన్,
అరయకూడి రామానుజ అయ్యంగార్, సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్, ఎం.ఎల్.వసంతకుమారి, రాధ&జయలక్ష్మి, త్రిచూర్ రామచంద్రన్, ఆర్.వేదవల్లి, సుగంధ కలామేగం, సీతారాం తదితరులకు ప్రత్యేక సంగీత బాణీలను నేర్పించారు.

మధ్వమునిరావు, పూర్ణప్రజ్ఞారావు, అరుంధతీ సర్కార్, శశాంక్ ఈయన శిష్యులు.

ఇతడు కేంద్ర సంగీత అకాడెమీ నిపుణుల కమిటీలో, యూనివర్శిటీ గ్రాంట్స్ కమిటీలో, సంగీత నాటక అకాడెమీలో, ఆకాశవాణి ఆడిషన్స్ కమిటీలో సభ్యులు గా కొనసాగారు.

తిరుపతి తిరుమల దేవస్థానముల వారి అన్నమయ్య ప్రాజెక్టు, దాస సాహిత్య ప్రాజెక్టు లకు ప్రత్యేక అధికారిగా కూడా సేవలను అందించారు.

సంగీత అకాడెమీ పురస్కారం లభించింది. సంగీతకళాచార్య, సంగీత కళారత్న, స్వరవిలాస అనే బిరుదులు సంధ్యావందనం శ్రీనివాసరావు
లభించాయి.

ఇతడి భార్యపేరు సరస్వతి. ఇతనికి ఐదుగురు కుమారులు, ఒక కుమార్తె.

1994, జనవరి 25న సంధ్యావందనం శ్రీనివాసరావు మరణించాడు.💐💐💐

రచన:– చందమూరి నరసింహారెడ్డి
9440683219

చందమూరి నరసింహారెడ్డి .ఖాసాసుబ్బారావు అవార్డు గ్రహీత.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s