రాయలసీమ లోని కొంతమంది యోధులు..

అవధానులు

మాడుగుల నాగఫణి శర్మ

మాడుగుల నాగఫణి శర్మ (జననం 1959 తాడిపత్రి, అనంతపురం) భారత మాజీ ప్రధానులు పి.వి. నరసింహా రావు, అటల్‌ బిహారీ వాజ్‌పేయి, మాజీ రాష్ట్రపతి శంకర్‌ దయాళ్‌ శర్మ వంటి వారి సమక్షంలో అవధానాలు నిర్వహించి ‘సెహభాష్‌’ అనిపించుకొన్న మాడుగుల నాగఫణిశర్మ అవధాన సహస్ర ఫణి, బృహత్‌ ద్వి సహస్రా వధాని, శతా వధాని సమ్రాట్‌, శతావధాన చూడామణి, కళా సాహిత్య కల్పద్రుమ, వంటి అనేక బిరుదులు పొందారు..!!

లక్కోజు సంజీవరాయశర్మ (1907-1997 ప్రొద్దుటూరు, కడప) గణిత బ్రహ్మగా పేరొందిన వీరు ప్రపంచంలో ఆరు వేల గణితా వధానాలు చేసిన ఏకైక వ్యక్తి

అన్నమయ్య (1408-1503 రాజంపేట కడప) తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదటి వాగ్గేయ కారుడు..!! (సాధారణ భాషలో గేయాలను కూర్చేవారు) అన్నమయ్యకు పద కవితా పితా మహుడు అని బిరుదు ఉంది..!! దక్షిణా పథంలో భజన సాంప్రదాయానికి, పదకవితా శైలికి ఆద్యుడు. గొప్ప వైష్ణవ భక్తుడు..!! తిరుమల వెంకన్నని కీర్తిస్తూ 32వేలకు పైగా కీర్తనలు రచించాడు. అన్నమయ్య పాటలు, పదాలు, పద్యాలలో భక్తి, సాహిత్యం, సంగీతం, శృంగారం, భావ లాలిత్యం పెనవేసి కొని ఉంటాయి..!!

కుందకుందాచార్యుడు (కొనకొండ్ల – గుంతకల్లు -అనంత పురం (క్రీస్తుపూర్వం 40 ప్రాంతం లో పుట్టి క్రీ.శ. 44 మరణించి నట్టు ఆధారాలు ఉన్నాయి) ఈయన జైనమత సాంప్రదాయం లో కుందకుందా చార్యునిగా సుప్రసిద్ధుడు..!! దేశం నలు మూలలా జైనాన్ని ప్రచారం చేశాడు..!!

తరిగొండ వెంగమాంబ (1730 -1817 తరిగొండలో చిత్తూరు జిల్లా) 19వ శతాబ్దపు తెలుగు కవయిత్రి. వీరు అనేక పాటలు, యక్ష గానాలు రచించారు..!!

తాళ్ళపాక తిమ్మక్క లేదా తాళ్ళపాక తిరుమలమ్మ తొలి తెలుగు కవయిత్రి..!! వీరు తాళ్ళపాక అన్నమాచార్యుల వారి ఇల్లాలు, మొదటి భార్య..!! ఈమె నన్నయ భారతము ఆధారముగా 1163 పాదాలతో సుభద్రా కల్యాణము అనే ద్విపద కావ్యము రాసినారు..!!

పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి, కంది మల్లయ పల్లి, కడప.!! 17వ శతాబ్దములో కాలజ్ఞాన తత్వాలను బోధించిన యోగి, హేతువాది, సంఘ సంస్కర్త

దూదేకుల సిద్దయ్య (మడుమాల గ్రామం కడప) ఈయన పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి శిష్యుడు..!!సిద్ధయ్య దూదేకుల కులానికి చెందిన ముస్లిం అయినప్పటికీ బ్రహ్మంగారి ప్రియ శిష్యుడిగా ప్రఖ్యాతి గాంచారు

సత్య సాయిబాబా (పుట్టపర్తి అనంతపురం) వీరు గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు..!!

వేమన (సుమారు 1652-1730 మధ్యకాలం, కడప జిల్లా) “విశ్వదాభి రామ వినుర వేమ” అనే మాట వినని తెలుగు వాడు ఉండడు..!! వానకు తడవని వారు, ఒక్క వేమన పద్యం కూడా రాని తెలుగు వారు ఉండరని లోకోక్తి. వేమన చరిత్ర చాలా మంది పరిశోధకులు కృషి చేసినా అస్పష్టంగా వుంది..!!

ఆతుకూరి మొల్ల (1440 -1530 –గోపవరం-కడప) 16వ శతాబ్ద పు తెలుగు కవయిత్రి. తెలుగులో మొల్ల రామాయణముగా ప్రసిద్ధి చెందిన ద్విపద రామాయణము ను రాశారు.. ఈమె కుమ్మరి కుటుంబములో జన్మించినది. మొల్ల శ్రీ కృష్ణదేవ రాయలు సమయము (16వ శతాబ్దము) లోనిదని ప్రశస్తి. మొల్ల శైలి చాలా సరళ మైనది మరియు రమణీయ మైనది..!!

గజ్జెల మల్లారెడ్డి (1925 ఆంకా ళమ్మ గూడూరు కడప) ఈయన ఒక అభ్యుదయ, వ్యంగ్య కవి. మల్లారెడ్డి గేయాలు, శంఖారావం అన్నవి ఇతని కవితా సంకలనా లు. సవ్యసాచి పత్రికలో గేయాలు ప్రచురింప బడినాయి 1973 నుండి అరసం ఉద్యమం లో పాల్గొన్నారు. ఈనాడు, ఆంధ్రభూమి, ఉదయం పత్రికల కు సంపాదక వర్గ సభ్యునిగా పనిచేశారు..!!

గువ్వల చెన్నడు (17-18 శతా బ్దాల శతక కవి) కడప జిల్లా రాయచోటి ప్రాంతానికి చెందిన గువ్వల చెన్నడు ” గువ్వల చెన్నా” అనే మకుటంతో శతకాన్ని రచించాడు..!! వేమన, బద్దెన వంటి శతక కవుల వలె లోక నీతిని, రీతిని పరిశీలించి సామాజిక శ్రేయస్సును కాంక్షిస్తూ శతకాన్ని రచించినాడు..!!

పుట్టపర్తి నారాయణాచార్యులు (1914-1990 చియ్యేడు-అనంత పురం) తెలుగు పదాల తో ‘‘శివ తాండవం’’ ఆడించిన కవి. ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులు అభి వర్ణించే శివ తాండవ కావ్యం యొక్క సృష్టికర్త, తెలుగు సాహితీ కారులలో అగ్ర గణ్యు డు, బహు బాషా కోవిదుడు..!!

చండ్ర పుల్లారెడ్డి (కర్నూలు జిల్లా వెలుగోడు గ్రామం) భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు – లెనినిస్టు) ప్రధాన కార్యదర్శిగా ఖ్యాతిగాంచారు..!!రచయిత, సిద్ధాంత కర్త, వక్త. విద్యార్థి దశలోనే దేశభక్తి ప్రేరణతో బ్రిటిష్ సామ్రాజ్య వాదులకు వ్యతిరేకంగా జరుగు తున్న పోరాటంలో పాల్గొన్నారు..!!

తరిమెల నాగిరెడ్డి(1917-1976 తరిమెల గ్రామం-అనంతపురం) ఈయన ఒక రైతు కుటుంబము లో జన్మించారు..!! నాగిరెడ్డి తన ప్రభుత్వ వ్యతిరేక రాజకీయ కలాపల వల్ల అనేక మార్లు జైలుకు వెళ్లారు..!! 1940లో రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో యుద్ధం మరియు ఆర్ధిక వ్యవస్థపై దాని ప్రభావం అన్న పుస్తకం వ్రాసి ప్రభుత్వము యొక్క ఆగ్రహానికి గురై జైలుకు వెళ్ళాడు. 1952లో నాగిరెడ్డి మద్రాసు శాసనసభకు సి.పి.ఐ అభ్యర్థిగా అనంత పురం నియోజక వర్గం నుండి ఎన్నిక య్యాడు. జైలులో ఉండి కూడా ప్రముఖ కాంగ్రేసు నాయకుడు, తన బావ అయిన నీలం సంజీవ రెడ్డిపై విజయం సాధించి సంచలనం సృష్టించాడు.

విజయవాహిని సంస్థ ఆద్యులు కడప వారే

B.N రెడ్డి (బొమ్మిరెడ్డి నరసింహా రెడ్డి 1908-1977) జన్మస్థలం కొత్తపల్లి, పులి వెందుల, కడప జిల్లా..!! బి.ఎన్.రెడ్డి తెలుగు సినిమా దర్శకుడు మరియు నిర్మాత. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన తొలి దక్షిణ భారతీయుడు, పద్మ భూషణ్ పురస్కార గ్రహీత.

ఆయన సృష్టించిన అజరామర మైన చలనచిత్ర కళాఖండాలలో మచ్చుకు కొన్ని ” స్వర్గసీమ..భక్త పోతన, యోగి వేమన, మల్లీశ్వరి, బంగారు పాప”లాంటి చిత్రాలు మనకళ్ళ ముందు కదలాడతాయి..!!
.
బి.నాగిరెడ్డి (బొమ్మిరెడ్డి నాగిరెడ్డి 1912-2004 విజయ ప్రొడక్షన్స్ ) దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన వ్యక్తి..!! తెలుగు సినీ నిర్మాత, దర్శకుడు, ఎడిటర్ వ్యాపార వేత్త, పరోపకారి..!! కడప జిల్లా ‌పొట్టింపాడు గ్రామం లోని ఒక రైతు కుటుంబం లో జన్మించాడు..!!

వారి సంస్థనుండి వచ్చిన కొన్ని సినిమాలు, షావుకారు, పాతాళ భైరవి, పెళ్ళి చేసి చూడు
.
కె.వి.రెడ్డి (జూలై 1, 1912 – 1972 అనంతపురం జిల్లా తాడిపత్రి) కదిరి వెంకటరెడ్డి తెలుగు సినిమాలకు స్వర్ణ యుగమైన, 1940-1970 మధ్య కాలంలో ఎన్నో ఉత్తమ చిత్రాల ను తెలుగు తెరకు అందించిన ప్రతిభా వంతుడైన దర్శకుడు, నిర్మాత మరియు రచయిత..!! నిర్మాణ శాఖనీ, దర్శకత్వ శాఖ నీ రెంటినీ ఆకళింపు చేసుకున్న వ్యక్తి కె.వి.రెడ్డి. అయన దర్శకత్వం వహించినవి కొన్ని ఆణి ముత్యాలు..!! భక్త పోతన (1942) యోగి వేమన (1947) గుణసుందరి కథ (1949), పాతాళభైరవి (1951), దొంగ రాముడు (1955), మాయా బజార్ (1957), జగదేక వీరుని కథ (1961), శ్రీకృష్ణార్జున యుద్ధం (1963)

పి.ఎస్. రామకృష్ణారావు (918-1986 వీరు కర్నూలు జిల్లా) తెలుగు సినిమా నిర్మాత, రచయిత మరియు దర్శకులు. వీరు భరణి పిక్చర్స్ అధిపతి..!! అయన దర్శకుడిగా నిర్మాతగా రచయతగా పనిచేసిన సినిమాలు, గృహలక్ష్మి (1967) వివాహ బంధం (1964) బాటసారి (1961), వరుడు కావాలి (1957) చింతామణి (1956), విప్ర నారాయణ (1954), చక్రపాణి (1954) ప్రేమ (1952) లైలా మజ్ఞు (1949) రత్నమాల (1947)

వెల్లాల ఉమా మహేశ్వర రావు (జననం 1912 పుంగనూరు గ్రామం చిత్తూరు జిల్లా), తెలుగు సినిమా తొలితరం హీరోల్లో ఒకరు. చిత్తూరు జిల్లాకు చెందిన ఈయన ప్రముఖ న్యాయవాది మరియు రంగస్థల నటుడు. వీరు నటించిన సినిమాలు. ఇల్లాలు (1940) భాగ్యలక్ష్మి (1943) పంతులమ్మ (1943)

బి. పద్మనాభం(పూర్తి పేరు బసవరాజు వెంకట పద్మనాభ రావు, 1931-2010), ప్రముఖ తెలుగు సినిమా హీరో..క్యారెక్టర్ ఆర్టిస్టు..హాస్యనటుడు, దర్శకుడు నిర్మాత మరియు రంగస్థల నటుడు..!! ఈయన కడప జిల్లా పులివెందుల తాలూకా సింహాద్రిపురం గ్రామంలో జన్మించారు..!!
1964 సంవత్సరంలో రేఖా అండ్ మురళి ఆర్ట్స్ పేర చిత్ర నిర్మాణ సంస్థ, ప్రారంభించి దేవత, పొట్టి ప్లీడర్, శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న నిర్మించారు. మర్యాద రామన్నతోనే SP బాలుని గాయకుడిగా తొలిసారి పరిచయం చేశారు. 1968లో శ్రీరామకథ నిర్మించడమే కాకుండా దర్శకత్వం కూడా వహించారు. 1970లో కథానాయిక మొల్ల తీసి బంగారు నంది అవార్డు పొందారు..!!

జయప్రకాశ్ రెడ్డి..ప్రముఖ తెలుగు నటుడు..!! ఈయన కర్నూలు జిల్లా, ఆళ్ళగడ్డ మండలం లోని శిరువెళ్ళ గ్రామం లోని వ్యవసాయ కుటుంబం లో జన్మించాడు..!! రాయలసీమ యాసలో ఆయన చెప్పే సంభాషణలు ప్రసిద్ధి..!! ఈయన ఎక్కువగా ప్రతినాయక మరియు హాస్య పాత్రలను పోషిస్తుం టాడు..!!

మంచు మోహన్ బాబు And His Family..మోహన్ బాబు చిత్తూరు జిల్లా, ఏర్పేడు మండలం మోదుగుల పాళెంలో జన్మించారు. నటుడు, నిర్మాత, రాజకీయ వేత్త. 573 సినిమాల్లో నటించాడు..!! 72 సినిమాలు నిర్మించాడు. రాజ్యసభ సభ్యుడి గా పని చేశాడు. మోహన్ బాబు అసలు పేరు మంచు భక్త వత్సలం నాయుడు.,!!

శివప్రసాద్ తిరుపతి MP సినిమా ల్లో అక్క డక్కడ కామెడి విలన్ వేషాలు వేస్తూ ఉంటాడు. అప్పు డప్పుడు బయట కూడా కొత్త వేషాలు వేస్తూ నవ్విస్తుం టారు

శాంతకుమారి (1920-2006 ప్రొద్దుటూరు కడప) శాంత కుమారి ప్రముఖ తెలుగు సినిమా నటి, ప్రఖ్యాత దర్శకుడు పి.పుల్లయ్య సతీమణి. ఈవిడ 1936లో ‘శశిరేఖా పరిణయం’ సినిమాతో నటజీవితం ప్రారంభించి వందకు పైగా సినిమాల్లో నటించారు..!!

టీ.జి. కమలాదేవి (1930 – 2012 కార్వేటి నగరం చిత్తూరు) ఈమె తెలుగు సినిమా నటి మరియు స్నూకర్ క్రీడాకారిణి. ప్రసిద్ధ నటుడు చిత్తూరు నాగయ్య భార్య జయమ్మకు చెల్లెలు. చిత్తూరు నాగయ్య ప్రోత్సాహంతో సినిమా రంగ ప్రవేశం చేసింది. ఈమె నటించిన మొట్ట మొదటి సినిమా చూడామణి.

లీలా నాయుడు (1940-2009 మదనపల్లె చిత్తూరు) ప్రఖ్యాత నటీమణి మరియు గొప్ప సౌందర్య రాశి. ప్రపంచములో మహా సౌందర్య వతులలో ఒకరిగా ఎన్నుకొనబడింది..!! పలు హిందీ చలన చిత్రములలో నటించి పేరు సంపాదించు కున్నది. “యే రాస్తే హై ప్యార్ కే” చిత్రములో లీల నటన పలువురి మన్ననలు పొందినది..!!

దేవిక (1943-2002 చంద్రగిరి చిత్తూరు జిల్లా) 1960, 70 దశకాలలో అందాల తారగా తెలుగు, తమిళ సినీరంగాలలో వెలుగొందింది. తెలుగు, తమిళ, మలయాళం లలో 150కి పైగా సినిమాలలో నటించింది. ఈమె అసలు పేరు ప్రమీలాదేవి.

రమాప్రభ (1946 వాయల్పాడు చిత్తూరు జిల్లా) ప్రముఖ తెలుగు సినిమా హాస్య నటి. చిర పరిచయం అయిన పేరు. ఈమె దాదాపు 1400కు పైగా దక్షిణ భారత దేశపు సినిమాలలో నటించింది.

జయంతి (నటి) ప్రసిద్ధ దక్షిణ భారత సినిమా నటి జయంతి అసలు పేరు కమల కుమారి (1950). స్వస్థలం శ్రీకాళహస్తి (చిత్తూరు) అయినా పుట్టింది బళ్ళారిలో ఈమె తెలుగు సినిమా ల్లో నటన ప్రారంభించి కన్నడ సినీరంగంలో రాజ్‌ కుమార్‌ కు సమానంగా అభిమాను లను సంపాదించు కున్నారు. ఈమె సుమారు 500 సినిమాలు తెలుగు, కన్నడ, తమిళ, మళయాల, హిందీ భాషలలో నటించారు.

జిక్కి (1938-2004 చిత్తూరు జిల్లాలోని చంద్రగిరిలో జననం) జిక్కి అని ముద్దుగా పిలుచుకునే అసలు పేరు పి.జి.కృష్ణవేణి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, సింహళ మరియు హిందీ భాషలలో ప్రసిద్ధ సినీ గాయకురాలు. మూడు దశాబ్దాల పాటు పదివేలకు పైగా పాటలు పాడారు..!!

స్వర్ణలత (పాత) (1928-1997 చాగలమర్రి, కర్నూలు జిల్లా) పాత కాలపు తెలుగు సినిమా గాయనీమణి. ఈమె 1950-70 ల మధ్య కాలంలో ఎక్కువగా హాస్య భరితమైన గీతాలు పాడారు.

ఏ.యం.రాజా (1929 – 1989 చిత్తూరు జిల్లాలోని రామచంద్ర పురంలో జననం) అయిమల మన్మథరాజు రాజా (AM Raja) 1950వ దశకములో తమిళ, తెలుగు సినిమా రంగాలలో విశిష్టమైన నేపథ్య గాయకులు, సంగీత దర్శకులు, నటుడు. విప్ర నారాయణ, చక్రపాణి, ప్రేమ లేఖలు, మిస్సమ్మ పాటలు రాజా గాత్ర మాధుర్యానికి కొన్ని మచ్చు తునకలు. ఈయన వివిధ భాష లలో 10,000 పాటలు పాడి, వందకు పైగా సినిమా లకు సంగీతం సమకూర్చారు

వి.ఎన్.రెడ్డి (జననం 1907)
20 ఏళ్ల వయసులోనే 1937లో ఛాయ గ్రహణంలో తన ఆసక్తిని అభివృద్ధి చేసుకొని ఆ రంగంలో స్థిర పడటానికి బొంబాయి చేరాడు. కసిరెడ్డి వెంకట నర సింహా రెడ్డి ఎన్నో ప్రముఖ హిందీ చలన చిత్రాలకి ఛాయ గ్రాహకుడు గా ఆపై తెలుగు సినిమాలకి దర్శకుడుగా పనిచేశారు.

నీలం సంజీవరెడ్డి (1913-1996, ఇల్లూరు గ్రామం అనంతపురం) భారత రాష్ట్రపతి గా, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గా, లోక్‌సభ సభాపతిగా, ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, సంయుక్త మద్రాసు రాష్ట్రంలో మంత్రిగా, కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడిగా వివిధ పదవులను అధిరోహించి, ప్రజల మన్ననలను పొందిన రాజకీయవేత్త..!!

దామోదరం సంజీవయ్య

దామోదరం సంజీవయ్య (1921–1972 కల్లూరు కర్నూలు) మొదటి దళిత ముఖ్యమంత్రి మరియు శాస్త్రిగారి మంత్రివర్గంలో కేంద్ర కార్మిక మంత్రిగా కూడా పనిచేశారు..!!

పనప్పాకం ఆనందాచార్యులు (1843 – 1907 కడమంచి గ్రామం చిత్తూరు జిల్లా) అఖిల భారత జాతీయ కాంగ్రెసు అధ్యక్షులు. ఈయన ఆంధ్ర చరిత్రలో విశేష స్థానం కలిగిన వారు.

పెండేకంటి వెంకటసుబ్బయ్య (1921-1993 నంద్యాల కర్నూలు జిల్లా) రాజకీయ నాయకుడు మరియు పార్లమెంటు సభ్యుడు. వీరు నంద్యాల లోక్‌సభ నియోజక వర్గం నియోజకవర్గం నుండి లోక్‌సభకు నాలుగు పర్యాయా లు ఎన్నికయ్యారు. వెంకట సుబ్బయ్య 1980 నుండి 1984 వరకు కేంద్ర ప్రభుత్వములో గృహ మరియు పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రిగా పని చేశారు. కర్ణాటక రాష్ట్రానికి గవర్నరుగా కూడా పనిచేశారు..!!

బొల్లిన మునిస్వామి నాయుడు 1885 లో చిత్తూరులో జన్మించారు వీరి పూర్వీకులు కార్వేటి నగర సంస్థానం లో ఉన్నత పదవులలో ఉన్నారు. మునుస్వామి రైతు కుటుంబం లో జన్మించి న్యాయవాదిగా పని చేయడం ప్రారంభించి అంచెలం చెలుగా ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి. ప్రధానమంత్రి నియమించి న అగ్రికల్చర్ కమిషన్, బ్యాంకింగ్ ఎంక్వయిరీ కమిటీ, బ్యాంకింగ్ ఎకో కొరియర్ కమీషన్ వంటి కమిటీలు, కమిషన్లలో సభ్యునిగా పని చేశారు.

గడిలింగన్న గౌడ్ (1908-1974 కర్నూలు) నియోజకవర్గపు భారతదేశ పార్లమెంటు సభ్యునిగా పనిచేశాడు. ఈయన నాలుగవ లోకసభలో (1967–71) సభ్యుడు. కర్నూలు నియోజక వర్గం నుండి స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా ఎన్నికయ్యారు.
.
ఎద్దుల ఈశ్వర్ రెడ్డి (కడప) నాలుగు సార్లు CPI పార్టీ తరుపు నుండి కడప MP గా గెలిచి చివరివరకు బ్రమ్మచారిగా ఉండి దాదాపు 600 ఎకరాలు పేదలకి దానం చేసి చివరివరకు పార్టీ ఆఫీసులోనే చిన్న గదిలో ఉండి ప్రాణాలు విడిచిన మహోన్నత వ్యక్తిత్వం ఈయన సొంతం..!!

జొన్నలగడ్డ గురప్పశెట్టి (జననం 1937 న శ్రీకాళహస్తి, చిత్తూరు జిల్లా) 1976 కలంకారీ కళకు గాను భారత ప్రభుత్వం ఇచ్చే జాతీయ పురస్కారము తోనూ, 2009 లో పద్మశ్రీ పురస్కారము తోనూ సత్కరించబడ్డారు..!!

పన్నూరు శ్రీపతి (మదనపల్లె చిత్తూరు) చిత్రకళారంగంలో ప్రముఖ పేరు, చిత్రకళోపాధ్యా యునిగా చిరపరిచితుడు, ప్రముఖ తంజావూరు శైలి చిత్రకారులు. మదనపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేసి రిటైర్డు అయినాడు. రెండు చేతులతో చిత్రించడం వీరి ప్రత్యేకత, శిల్పకళాకారు నిగా మంచి పేరు గలదు. పలు భాష లలో వ్రాయగల దిట్ట..!!

మునెయ్య (కడప జిల్లా, దొమ్మర నంద్యాల గ్రామం) ఈయన ప్రముఖ జానపద గాయకుడు. వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు ఐననూ ప్రవృత్తి రీత్యా ఈయన జానపద కళా కారుడు. రాయలసీమ నలుమూల లా తిరిగి కనుమరు గౌతున్న జానపద పాటలను సేకరించి భావి తరాలకోసం వాటిని జాగ్రత్తగా భద్రపరిచారు. వీరు పాడిన ఆ గేయాలు కడప ఆకాశవాణి కేంద్రం నుండి ప్రసారంకాబడ్డాయి. అందులో ప్రముఖమైన గీతం “కోడి బాయె లచ్చమ్మది.. కోడి పిల్లబాయె లచ్చమ్మది”

జిడ్డు కృష్ణమూర్తి (1895-1986 మదనపల్లె చిత్తూరు జిల్లా) వీరు మన జాతికి గర్వకారణం అని చెప్పుకోవచ్చు. వీరు తత్వవేత్త, ఆధ్యాత్మిక ప్రాసంగికుడు, రచయిత, వక్త..!! 1929 నుండి 1986 లో తను మరణించే వరకు ప్రపంచం నలుమూలల ప్రయాణిస్తూ తాత్విక, ఆధ్యాత్మిక విషయాలపై అనేక ప్రసంగాలు చేశాడు. ఆయన స్పృశించిన ముఖ్యాంశాలు – మానసిక విప్లవం, మనోభావ విచారణ, ధ్యానం, మానవ సంబంధాలు, సమాజంలో మౌలిక మార్పు..!

ధర్మవరం రామకృష్ణమాచార్యులు (1853 – 1912 ధర్మవరం అనంతపురం) సుప్రసిద్ధ నటుడు, నాటక రచయిత మరియు బహుభాషా పండితుడు. ఈయన “ఆంధ్ర నాటక పితామహుడు”గా ప్రసిద్ధిగాంచాడు. ఈయన సుమారు 30 కి పైగా స్వంత నాటకాలను రచించాడు..!!

బళ్ళారి రాఘవ (1880-1946 తాడిపత్రి అనంతపురం జిల్లా) తెలుగు నాటకరంగం అందించిన అతిగొప్ప నటులలో బళ్ళారి రాఘవ ఒకరు. ప్రముఖ న్యాయవాది అయినా నాటకా లలో ప్రత్యేకాభిమానం, ప్రతిభ తో రాణించారు. తన సమయాన్ని, సంపదను నాటక రంగ పురోగతి కోసం వెచ్చించిన గొప్ప వ్యక్తి..!!

బుడ్డా వెంగళరెడ్డి (1840-1900 ఉయ్యాలవాడ కర్నూలు జిల్లా) 1866 కాలంలో సంభవించిన కరువు కాలంలో తన ఆస్తినంతా ధారపోసి ఎంతోమంది ప్రాణాల్ని కాపాడిన మహా దాత..!!

చల్లా కొండయ్య (1918 చల్లా వారి పల్లె గ్రామం అనంత పురం జిల్లా)
*ప్రముఖ న్యాయవాది మరియు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేశారు, ఆపై భారత ప్రభుత్వ ఆదాయపన్ను శాఖలో స్టాండింగ్ కౌన్సిల్ లో ఎనిమిది సంవత్సరాలు తమ విధి నిర్వహిincharu

కె.బాలగోపాల్ (1952-2009, కంబదూరు రాళ్ల అనంతపురం)
పౌరహక్కుల ఉద్యమానికి అంత ర్జాతీయ ఖ్యాతి తెచ్చిపెట్టిన బాల గోపాల్ జీవితాంతం ఉద్యమంలో కొనసాగారు. గణిత శాస్త్రవేత్తగా ఎదిగిన ఆయన మానవతా విలు వల కోసం పోరాడారు. ఆదివాసీ ఉద్యమం నుంచి విప్లవో ద్యమం వరకు, పౌరహక్కుల ఉద్యమం నుంచి మానవ హక్కులు ఉద్యమం వరకు, కూలీ పోరాటం నుంచి భూ పోరాటం వరకు అన్ని రకాల ఉద్యమా లతో పెనవేసుకు పోయిన నాయకు డాయన. ఎక్కడ అన్యాయం, వివక్ష, అణిచివేత, అసమానత లు కనిపించినా నిష్కర్ష గా, నిక్కచ్చిగా, నిర్భయం గా పోరాడారు. ఈ క్రమంలో వచ్చిన బెదిరింపుల్ని ఏనాడూ లెక్కచేయ లేదు. ఆయనపై ఎన్నోసార్లు భౌతిక దాడులు జరిగినా రెట్టించిన ఉత్సాహంతో పనిచేశారు..!!

పులికంటి కృష్ణారెడ్డి (1931- 2007 వెదురుకుప్పం చిత్తూరు జిల్లా)
కథకుడు, కవి, రంగస్థల కళాకారు డు, బుర్రకథ గాయకుడు. 13 సంవత్సరాల పాటు భారతీయ రైల్వేలో ఉద్యోగం చేసిన ఆయన నాటకాల మీద మక్కువతో దాన్ని వదులు కున్నాడు. ఆయన దాదాపు 200 కథలు, 60 వచన కవితలు, 5 దృశ్యనాటికలు, 6 శ్రవ్య నాటికలు, పది బుర్రకథలు, 4 సంగీత రూపకాలు, జానపద శైలిలో, 43 అమ్మిపదాలు, 60 లలిత గేయాలు రాసాడు. రాయల సీమ జీవన వ్యథల్ని దాదాపు 200 కథలుగా వెలువరించారు.

శంకరంబాడి సుందరాచారి (1914-1977 తిరుపతి చిత్తూరు జిల్లా)
తెలుగు రచయిత లలో శంకరం బాడి సుందరాచారి కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. తెలుగు ప్రజలకు, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి మల్లె పూదండ అందించారు..!!

C.R Reddy (1880-1951 కట్టమంచి చిత్తూరు)
కట్టమంచి రామలింగారెడ్డి ప్రతిభా వంతుడైన సాహితీవేత్త, విద్యావేత్త, పండితుడు, వక్త, రచయిత, హేతువాది. ఆదర్శ వాది, రాజ నీతిజ్ఞుడు. ఇంతటి ప్రతిభా పాటవాలు ఒక వ్యక్తిలో కానరావడం అరుదు..!!

కలువకొలను సదానంద (1939 చిత్తూరు జిల్లా పాకాల)
కలువకొలను సదానంద ప్రముఖ బాల సాహిత్య రచయిత. బాల సాహిత్యంలో కేంద్ర సాహిత్య అకాడమీ వారి మొట్టమొదటి బాల సాహిత్య పురస్కార్‌ అవార్డు అందుకున్న వ్యక్తి..!!

కాశీభట్ల వేణుగోపాల్
కాశీభట్ల వేణుగోపాల్ ఒక ప్రముఖ కవి మరియు రచయిత. ఆయనకు సంగీతంతో కూడా పరిచయం ఉంది. ఆయన స్వస్థలం కర్నూలు.

కె.సభా (1923-1980 చిత్తూరు జిల్లా కొట్రకోన)
రాయలసీమలో కథా రచనను తొలినాళ్ళలో ప్రారంభించి ఆ రుచిని తెలుగు పాఠక లోకానికి దశాబ్దాల పాటు పంచిన బహు ముఖ ప్రజ్ఞాశాలి. జాతీయోద్యమ చైతన్యంతో జీవితాను భవాలను, ఆదర్శాల ను తన రచనా మూలాలుగా అందించిన దార్శనికుడు. కథా రచయితగా, నవలాకారుడిగా, కవిగా, గేయ కర్తగా, బాల సాహిత్య నిర్మాత గా, సంపాదకు నిగా, జానపద గేయ సంకలన కర్తగా, ప్రచురణ కర్తగా కె.సభా విస్తార మైన సాహిత్య కృషిని చేశారు..!!

కేతు విశ్వనాథరెడ్డి (1939 కమలాపురం కడప)
ప్రసిద్ధ సాహితీవేత్త మరియు విద్యావేత్త. ఈయన ప్రధానంగా కథారచయితగా ప్రసిద్ధుడు. కేతు విశ్వనాథ రెడ్డి కథలు అనే కథా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందారు..!!

గడియారం వేంకట శేషశాస్త్రి (1894 పెదముడియం కడప)
పరాయిపాలనను నిరసించి స్వాతంత్య్ర కాంక్షను అణువణువు నా రగుల్చుతూ రచించిన మహా కావ్యమే ‘శ్రీశివభారతం’. భరత మాత పరాయి పాలనలో కళావిహీన మైన తరుణంలో అరుణో దయంగా వెల్లివిరిసింది కావ్య మది. మాతృభాష విముక్తికి మార్గదర్శిగా పంచకావ్యాల సరసన 1943లో 8 ఆశ్వాసము ల ప్రబంధంగా శివభారతం వెలు గొందింది. ఈ అద్భుత కావ్య సృష్టికర్త గడియారం వేంకట శేషశాస్త్రి.

జానమద్ది హనుమచ్ఛాస్త్రి (1926-2014 రాయదుర్గం అనంతపురం)
తెలుగులో ఒక విశిష్టమైన బహు గ్రంథ రచయిత..!!! 1946లో బళ్ళారి లోని ప్రభుత్వ పాఠశాలలో సెకండరీ గ్రేడు ఉపాధ్యాయునిగా ఉద్యోగ జీవితం ప్రారంభించాడు. కడప లో సి.పి.బ్రౌన్ స్మారక గ్రంథా లయ ట్రస్టును నెలకొల్పి, దాని కార్యదర్శిగా అహర్నిశలూ పాటు పడి 10 లక్షల రూపాయల విరాళా లు సేకరించాడు. వీరి కృషితో అది వాస్తవ రూపం ధరించింది. ఈ కేంద్రానికి 15 వేల గ్రంథాలను శాస్త్రి సేకరించి, బ్రౌన్ ద్విశతి మహోత్సవాన్ని ఘనం గా నిర్వహించాడు. వీరు ‘బ్రౌన్ శాస్త్రి’గా పేరు గడించాడు. కడపజిల్లా రచయితల సంఘం 1973లో స్థాపించి 20ఏళ్లు కార్య దర్శిగా పనిచేశాడు. రాష్ట్రం లోని సుప్రసిద్ధ రచయిత లను కడపజిల్లాకు పరిచయం చేసిన ఘనత ఈయనదే..!!

తూమాటి దొణప్ప (1926-1996 రాకెట్ల, అనంత పురం జిల్లా)
ఆంధ్ర, నాగార్జున విశ్వవిద్యా లయాలలో తెలుగు ఆచార్యులు మరియు తెలుగు విశ్వవిద్యా లయం మొట్టమొదటి ఉప కులపతి (పూర్వ). కళా సాహిత్య, సంస్కృతీ విద్యా రంగాలలో గొప్ప కృషీ వలుడు..!!

నాగసూరి వేణుగోపాల్ (1961 సోమందేపల్లె అనంతపురం జిల్లా)
సైన్సు రచయిత, ఫ్రీలాన్స్ జర్న లిస్ట్, హేతువాది. జనవిజ్ఞాన వేదిక విశాఖ మాజీ అధ్యక్షుడు. నార్ల మెమోరియల్, పరుచూరి రాజారాం అవార్డుల గ్రహీత.

పి.రాజేశ్వర రావు (చీమవాగుల పల్లి అనంతపురం జిల్లా)
విశాలాంధ్ర విజయవాడ హెడ్ ఆఫీసులో మేనేజరుగా పని చేశారు పుస్తకాలను జన బాహుళ్యం లోనికి తీసుకుని వెళ్ళడంలో విశేషమైన కృషి చేశారు.

మధురాంతకం రాజారాం (1930-1999 మొగరాల గ్రామం చిత్తూరు జిల్లా)
ప్రముఖ కథకులు, ఈయన సుమారు 400కు పైగా కథలు, రెండు నవలలు, నవలికలు, నాటకాలు, గేయాలు, సాహితి వ్యాసాలు రచించారు. పెక్కు తమిళ రచనలను అనువదిం చారు. ఈయన కథలు అనేకం తమళ, కన్నడ, హిందీ, ఆంగ్ల భాష లలోకి అనువదించ బడ్డాయి. చిన్ని ప్రంపచం-సిరి వాడ నవల రష్యన్ భాషలోకి తర్జుమా చేయబడి ప్రచురిత మైంది. 1993 లో మధురాంతకం రాజారాం కథలు పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ పుర స్కారం లభించింది..!!

సీరిపి ఆంజనేయులు (1891-1974 ధర్మవరం అనంతపురం జిల్లా)
కృతికర్తగా, కృతిభర్తగా, పత్రికా సంపాదకుడిగా, ఉత్తమ ఉపా ధ్యాయుడిగా, సంఘ సంస్కర్త గా, పరిశోధకు డిగా అనంత పురం జిల్లాకు ఎంతో పేరు ప్రఖ్యాతులు ఆర్జించిపెట్టాడు.

వేంపల్లి షరీఫ్ (వేంపల్లె, కడప జిల్లా)
వేంపల్లి షరీఫ్ తెలుగు సాహిత్యం లో కొత్త రచయిత..!! ఈయన జుమ్మా కథల సంపుటి కేంద్ర సాహిత్య అకాడెమి యువ పురస్కారం 2012 కు ఎంపికైంది. ఈ పుస్తకంలోని కథలను కడప ఆల్ ఇండియా రేడియో వారు వరుసగా నాలుగు నెలలపాటు ధారావాహికగా ప్రతిశుక్రవారం ప్రసారం చేశారు..!!

వల్లంపాటి వెంకటసుబ్బయ్య (1937-2007 రొంపిచర్ల చిత్తూరు జిల్లా)
ప్రముఖ సాహితీ విమర్శకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత..!!

విద్వాన్ విశ్వం (1915-1987 తరిమెల, అనంతపురం జిల్లా)
చిరపరచితుడైన మీసరగండ విశ్వ రూపాచారి విద్వాంసులకు విద్వాంసుడుగా పలువురి ప్రశంసలు పొందినవాడు. తెలుగు వెలుగులను అందంగా విస్తరిస్తూ అసభ్యత లకు దూరంగా తెలుగు వారపత్రిక “ఆంధ్రప్రభ” నడిపించిన సంపాదకుడు విశ్వం..!!

జి. మునిరత్నం నాయుడు (1936 తిరుత్తణి తమిళనాడు)
చిత్తూరు జిల్లాకు చెందిన సామాజిక కార్యకర్త. పద్మశ్రీ పుర స్కార గ్రహీత. ప్రముఖ కాంగ్రెస్‌ నాయకులు రాజగోపాల్‌ నాయుడు, ప్రముఖ శాస్త్రవేత్త ఎన్‌జి రంగాతో కలిసి ‘రాయల సీమ సేవా సమితి’ సంస్థ ఏర్పాటు చేశారు. క్రమేణా ఆ సంస్థ రాయలసీమకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది. దీంతో ఆ సంస్థ పేరును రాష్ట్రీయ సేవా సమితిగా మార్చారు..!!

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి (జననం 18 శతాబ్దం తొలినాళ్ళ లో-మరణం-1847 జన్మస్థానం రూపనగుడి కర్నూలు జిల్లా)
1857 నాటి మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధానికి పదేళ్ళ ముందే, బ్రిటిషు దుష్టపాలనపై ఎదిరించి తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు. 1846 జూన్ నెలలో మొదలైన నరసింహారెడ్డి తిరుగుబాటు 1847 ఫిబ్రవరి లో ఆయన మరణంతో ముగిసింది. రాయల సీమలో రాయలకాలం నుండి పాళె గాండ్లు ప్రముఖమైన స్థానిక నాయకులుగా ఉండే వారు. అట్లాంటి వారిలో ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి ఒకడు. దొర తనము ఎదిరించి వీర మరణం పొందాడు..!!

కడప కోటిరెడ్డి (1886-1981 మదనపల్లె చిత్తూరు)
కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు, న్యాయవాది. ప్రసిద్ధ స్వాతంత్ర్య సమర యోధుడు, రాజాజీ ప్రభుత్వం లో మంత్రి..!!

కల్లూరు సుబ్బారావు (1897 – 1973 కల్లూరు హిందూపురం అనంతపురం)
అనంతపురం జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమర యోధుడు. తెలుగు, కన్నడ పండితుడు, వక్త మరియు కవి. వృత్తిరీత్యా అధ్యాపకుడైన సుబ్బారావు 1920 లలో స్వాతంత్ర్యోద్యమం లో చేరారు..!!

గాడిచర్ల హరిసర్వోత్తమ రావు (1883-1960 కర్నూలు)
స్వాతంత్ర్య సమర యోధుడి గా, పత్రికా రచయిత గా, సాహితీ కారుడిగా, గ్రంథాల యోద్యమ నాయకుడి గా ఆయన తెలుగు జాతికి బహు ముఖ సేవలు అందించాడు. ఆంగ్ల పదం ఎడిటర్ (Editor) కు సంపాదకుడు అనే తెలుగు పదాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి.

తిరుమల రామచంద్ర(1913 ధర్మవరం అనంతపురం జిల్లా )
సంపాదకుడు, రచయిత, స్వాతంత్ర్య సమరయోధుడు, భాషావేత్త. తిరుమల రామచంద్ర మాతృభాష తెలుగుతో పాటు కన్నడ, తమిళ, సంస్కృత, ప్రాకృతాది భాషల్లో ప్రావీణ్యం కలిగిన బహుభాషావేత్త. రక రకాల వృత్తులు చేసి, వివిధ అను భవాలు సంపాదించి విస్తృత లోకానుభవ శాలి ఐన రామచంద్రతనను తాను వినమ్రంగా భాషాసేవకుడు అని అభివర్ణించుకునేవారు..!!

దేశపాండ్య సుబ్బారావు (నంద్యాల కర్నూలు జిల్లా)
ప్రతేకాంధ్ర ఉద్యమ నాయకుడు మరియు ఆంధ్రమహాసభ అధ్యక్షుడు. నంద్యాల ప్రముఖుడు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుపై కోస్తా ఆంధ్ర, రాయలసీమ నాయకు ల మధ్య ఏర్పడిన అపోహల ను, విభేదా లను తొలగించే ఉద్దేశంతో 1937 లో నియ మించిన సంఘంలో ఈయన సభ్యుడు

మాడభూషి అనంతశయనం అయ్యంగారు(1891-1978 తిరుచానూరు చిత్తూరు)
స్వాతంత్ర్య సమర యోధుడు, పార్లమెంటు సభ్యుడు మరియు లోక్‌సభ స్పీకరు.మహాత్మా గాంధీ సందేశం మేరకు స్వాతంత్ర్య సమరంలో (వ్యక్తి సత్యాగ్రహం మరియు క్విట్ ఇండియా) పాల్గొని రెండు సార్లు కఠిన కారాగార శిక్ష అనుభ వించారు..!!

పత్తిపాటి రామయ్య నాయుడు (1904-1991మదనపల్లె చిత్తూరు జిల్లా)
ప్రఖ్యాతిగాంచిన అణుశాస్త్రవేత్త, వైద్య వైజ్ఞానికుడు మరియు రేడియో ధార్మిక శాస్త్రజ్ఞుడు. వైద్య భౌతిక శాస్త్రము ఆవిష్కరించిన వారి లో ఆద్యుడు. పారిస్ లో నోబెల్ బహుమతి గ్రహీత మేడం క్యూరీ వద్ద పరిశోధనలు చేసిన మేధావి 1938లో భారతదేశము లో మొట్ట మొదటి అణుధార్మిక పరిశోధనశాల స్థాపించిన వాడు.

పెరుగు శివారెడ్డి (1920-2005 దిన్నెదేవరపాడు గ్రామం కర్నూలు జిల్లా)
ఒక ప్రఖ్యాత నేత్రవైద్య నిపుణు డు. గౌరవ పదవుల విషయంలో ఆయన అత్యున్నత స్థానాలకు ఎదిగారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ సలహా దారుగా, దేశ ప్రథమ పౌరుడి (రాష్ట్రపతి)కి గౌరవ నేత్ర చికిత్సకులుగా నియమితు లయ్యారు. ఉస్మానియా మెడికల్ కాలేజీ అఫ్తాల్మాలజీ విభాగానికి ఎమెరిటన్ ప్రొఫెసర్ గా, చైనా లోని సన్-యట్ సెన్ యూనివర్శిటీ ఆఫ్ మెడిసన్ సంస్థకు విజిటింగ్ ప్రొఫెసర్ గా రాణించారు. గుండెపోటుతో మరణించే వరకు ఆయన హైదరాబాదులోని సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి డైరెక్టరుగా ఉన్నారు..!!

ప్రతాప్ రెడ్డి (1933 అరగొండ చిత్తూరు జిల్లా)

అపోలో ఆసుపత్రుల అధినేత. దేశంలో మొట్టమొదటి కార్పొరేట్ ఆసుపత్రులకి ఆద్యుడు. కేంద్ర ప్రభుత్వ పద్మభూషణ్ అవార్డు గ్రహీత మరెన్నో అవార్డులు ఖ్యాతి గడించిన వ్యక్తి..!!

ఇలా ఎందరో మహానుభావులు జీవించిన గడ్డ ఇది. కేవలం కొంతమంది ని మాత్రమే ఇక్కడ ప్రస్తావించాం. వీరిని మించిన ఉద్దండులు చాల మంది ఉన్నారు. వారి గురించి ఎంత రాసినా తక్కువే . ఇది సీమ చరిత్ర .

రాయలసీమ అంటే ఇది..!!

ఇలా ఎందఱో మహాను భావులు

మరెందరో చరిత్రలో నిలచిన వారు.

*అందరూ కలగలిపిన నేల ఈ రాయలసీమ అంటే..!!

ఇక్కడ ఆప్యాయతకి అద్భుతమైన ఆతిధ్యానికి మారుపేరు..!!

ఇప్పుడు చెప్పండి రాయలసీమ అంటే ఏంటో..!!

ఇప్పుడు చెప్పండి సీమ వైభోగం ఏంటో ఎలా ఉండేదో..!!

తలెత్తి సగర్వంగా చాటి చెప్పండి ఇది మా గడ్డ..ఇది మన రాయలసీమ అని..!!

రాజ రాయలసీమ ఫేస్బుక్ వాల్ నుంచి .

రాజ రాయలసీమ

1 comment

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s