
ఎన్నో కోట్ల ఖర్చుతో నిర్మించే కట్టడాలు ఐదు పదేళ్లలోనే పగుళ్లుబారతాయి. అలాంటిది సుమారు రెండు వందల ఏళ్ల కిందటి ఆ నిర్మాణం నేటికీ చెక్కుచెదరకుండా చూపరులను ఔరా అనిపిస్తోంది. కదిరి మండలం చెర్లోపల్లి గ్రామంలో 1800 ప్రాంతంలో పూర్తిగా రాళ్లతో సుమారు 60 అడుగుల ఎత్తు బురుజును నిర్మించారు. నాడు ధాన్యం, ఇతర సామగ్రి అపహరించుకెళ్ళేందుకు రాత్రివేళల్లో బందిపోట్లు వచ్చిపడేవారట. అయితే చెర్లో పల్లి పరిసర ప్రాంతాల్లో పెద్ద చెరువు కింద రైతులు పంటలు బాగా పండించేవారు. బందిపోట్ల బారినుంచి కాపాడుకునేందుకు ఇలా బురుజు నిర్మించుకుని అందులో ధాన్యం, ఇతర సామగ్రి దాచేందుకు అరలు ఏర్పాటు చేసుకుని వాటిని గ్రామస్థులే కాపలా కాసేవారట.