
అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలంసిద్దరాంపురం గ్రామానికి చెందిన చందమూరినరసిరెడ్డి, లక్ష్మినారాయణమ్మ దంపతులకు ఐదవ సంతానంగా చందమూరి నరసింహారెడ్డి08-09-1968న జన్మించారు.
హైస్కూలు విద్యవరకు సిద్దారాంపురం లో వున్న జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్తిచేశారు. ఇంటర్ను పెనుగొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలోచదివారు. అనంతపురం లో వున్న యస్.యస్. బి.ఎన్ కాలేజీలో బిఎస్సీ చదివారు.

డిగ్రీ పూర్తయ్యాక ఈనాడు దినపత్రికకు బుక్కపట్నంలో విలేకరిగా పనిచేస్తూ ఆర్టీసి కాంప్లెక్స్ లో ఫ్యాన్సీ స్టోర్ కూడ నడిపేవారు. రెండేళ్ళ తరువాత తన చిన్నాన్న కొడుకుకు అప్పచెప్పి ఎరువుల దుకాణం ప్రారంభించారు. 1996లో ఈనాడు యాజమాన్యం ఆదేశాల మేరకు తన వ్యాపారాన్ని ఎత్తివేసి కదిరి డివిజన్ లో పని చేయడానికి కదిరికి వచ్చారు.
1996 డిసెంబరు 26న కడపకు చెందిన పద్మరాధిక ను తన స్వగ్రామం సిద్దారాంపురం గ్రామంలో వివాహం చేసుకున్నారు.వీరికి ఒక కుమారుడు. కుమారుని పేరు నచికేత రెడ్డి. ప్రస్తుతం విట్ వేలూరు లో బిటెక్ (ఇసిఇ) ఫైనల్ ఇయర్ చదువు తున్నారు.

1997లో సిద్ధరాంపురం గ్రామంలో ప్రబలిన విష జ్వరాలతో మరణాలు సంభవించినపుడు, ఆ విషయాలను సమగ్ర కథనాలుగా ఈనాడులో వార్తలు రాసినారు. ఆ వార్తలను గుర్తించిన ప్రభుత్వం, నరసింహారెడ్డిని రాష్ట్ర స్థాయి ఉత్తమ గ్రామీణ విలేకరిగా గుర్తించి, ఆయనకు ఖాసా సుబ్బారావు అవార్డును ప్రకటించింది. ఆ అవార్డుతో పాటు రూ. 25,000/- నగదు బహుమతి కూడా ఇచ్చారు. ఈనాడు లో పనిచేస్తూనే కదిరి ఆంధ్రప్రభ విలేఖరి బాబు తో కలసి సిటీకేబుల్ లో వార్తావిభాగం ను ప్రారంభించారు. సిటీకేబుల్ లో కొంతకాలం న్యూస్ రీడర్ గా పనిచేసినారు. 1999లో కదిరి యం.ఎల్.ఏ. పార్థసారధి దగ్గర వ్యక్తిగత సహాయకునిగా (పి.ఏ)చేరారు.2004వరకు పనిచేశారు. ఐదేళ్ళ తరువాత జేసిబీ ,మిల్లర్లు, రోలర్ ,టిప్పర్ తదితర మెషనరీలను నిర్వహిస్తూ కాంట్రాక్టు పనులు చేపట్టారు. ఇందులో నిలదొక్కుకొని 2009లో యస్.వి. కన్స్ట్రక్షన్ సంస్థ లో భాగస్వామి గా చేరారు.2013లో ఆర్టీసీకీ అద్దెబస్సు అందించారు.లో యస్.వి. కన్స్ట్రక్షన్ సంస్థనుంచి 2019లో తప్పుకొన్నారు. కదిరి లోస్వంత ఇళ్ళు నిర్మించుకొని స్థిరపడ్డారు.
