పాండురంగాపురం

ఆ గ్రామం ఆదర్శానికే ఆదర్శమని చెప్పడానికి సందేహం అవసరం లేదు. కృషి ,పట్టుదల ,నీతి,నిజాయితీ , నియమాలు కట్టుబాట్లు తదితర అనేక అంశాలను ఆ గ్రామం నేటికీ అమలు చేస్తోంది . నిక్కచ్చిగా నిజాయితీగా గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఆ గ్రామస్తులు ఐక్యత అనిర్వచనీయం.12-8-1957 న ఈ గ్రామానికి శంకుస్థాపనజరిగింది. 19కుటుంబాలతో గ్రామం ఏర్పడింది. నా 53 సంవత్సరాల జీవితంలో 12సంవత్సరాల ఈనాడు రిపోర్టర్ గా 5 సంవత్సరాల ఎమ్మెల్యే పి.ఎ గా జీవితంలో అనేక గ్రామాలు, పట్టణాలు చూశాను. అయితే పాండురంగాపురం లాంటి ఆదర్శ గ్రామం ఎక్కడా చూడలేదు. 2020డిసెంబర్ 26 న మెదటి సారి ఆ గ్రామాన్ని చూడగానే ఆకట్టుకుంది. ప్రతి గ్రామం ఇలాంటి గ్రామంలా మార్చగలిగితే ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా మొదటిస్థానం లో నిలవచ్చు.

పాండురంగాపురం గ్రామం నంద్యాలకు 6 కిలోమీటర్లు దూరంలో ఉంది. కడప నంద్యాల హైవే లో రైతునగరం వద్ద నుంచి వెళ్లవచ్చు. ఆ గ్రామంలో ప్రతి కార్యక్రమం గ్రామస్తుల సమిష్టి నిర్ణయం ప్రకారం జరుగుతుంది. విశాలమైన వీధులు , ప్రతి వీధిలో మరుగు నీరు వెళ్లడానికి కాలువలు , ప్రతి ఇంటి ముందు ,ఆవరణలో మొక్కలు , కుళాయి నీరు ,విశాలమైన ఇళ్లు , ఇళ్లు చుట్టూ ఖాళీ స్థలం చాలా శుభ్రంగా పద్దతిగా నిర్మిచుకొన్నారు.ప్రతి వీధి చాలా విశాలంగా ,శుభ్రంగా పచ్చని మొక్కలతో ఆహ్లాదకరమైన వాతావరణం తో సుందరంగా ఉంది. ఈ గ్రామం గురించి ఎంత రాసినా తక్కువ అనిపిస్తుంది. తప్పనిసరిగా ప్రతి వ్యక్తి ఆ గ్రామం సందర్శించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

పాండురంగాపురం వీధులు

పాండురంగాపురం ఎప్పుడు ఏర్పడింది ? ఆ పేరేలా వచ్చింది తెలుసుకొందాం.

ఏడు దశాబ్దాల క్రితం గుంటూరు ప్రాంతం నుంచి కొందరు ధనియాలు కొనుగోలు కోసం ఈ ప్రాంతానికి వచ్చేవారు. అలా వచ్చేవారిలో 19 కుటుంబాలు ఈ ప్రాంతంలో కుందూ నది దిగువన భూములు కొనుగోలు చేసి స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలను కొన్నారు. చాపిరేవుల అనే గ్రామానికి మొదట వచ్చారు. స్వాతంత్ర్య సమరయోధుడు యరబోలు సుబ్బారెడ్డి అనే వ్యక్తి ని కలసి వారి అభిప్రాయం తెలిపారు. సుబ్బారెడ్డి వారిని అక్కున చేర్చుకొని అన్నిరకాల సహయ ,సహకారాన్ని అందించారు. భూములు కొనుగోలు కు సహకరించారు. వారితోపాటు కలిసి నూతన గ్రామం ఏర్పాటు కు కలిసి వచ్చారు .

ఎర్రబోలు సుబ్బారెడ్డి

యరబోలు సుబ్బారెడ్డి ని గ్రామ పెద్ద గా నిర్ణయం చేసుకొని పెద్దాయన అని భావించి ఆరాదించారు. పెద్దాయన 19 కుటుంబాలను ఓచోట సమావేశ పరచి గ్రామానికి ఏపేరు పెట్టాలను కొన్నారో మీరే నిర్ణయం చేయమన్నారు. అయితే పెద్దాయన ఏపేరు చెబితే అదేఅని వారు చెప్పారు. పెద్దాయన మీకు ఇష్టమైన దేవుళ్ళు పేరు ప్రతి ఒక్కరూ చెప్పండి చీటిలో రాద్దాం అలా రాసిన చీటిలన్ని కలిపిన తర్వాత ఓ చిన్న పిల్లవాన్ని పిలిచి ఓ చీటి తీసి ఆ చీటీలోని దేవుని పేరు పెడదామని నిర్ణయం చేశారు. అలా చీటి తీసినప్పుడు పాండురంగని పేరు వచ్చింది దీంతో పాండురంగాపురం అని గ్రామానికి నామకరణం చేశారు. గ్రామస్తుల సమిష్టి నిర్ణయం తోనే గ్రామనామకరణం జరిగిన విధంగా ప్రతి నిర్ణయం గ్రామస్తుల సమిష్టి నిర్ణయం చేయాలని ఆరోజే ప్రమాణం చేసుకొన్నారు. నేటికీ అదే అమలు చేస్తున్నారు.

పాండురంగని దేవాలయం.

ఆనాడే సుబ్బారెడ్డి ప్రతి ఇంటివద్దకు ఎద్దుల బండి వెళ్లేలా వీధులు ఉండాలని చెప్పారట అందుకే ఆనాడే ప్రతి వీధి కనీసం 25 అడుగులు ఉండేలా నిర్మించారు. ఎక్కడా వీధులు ఆక్రమణలు జరగలేదు.

వీధులన్ని శుభ్రంగా కన్పిస్తాయి. ఏలా సాధ్యమని ఆగ్రామంలో కొంతమంది పెద్దవారితో మాట్లాడినప్పుడు ఇలా వివరించారు. ప్రతి కుటుంబం వారి పశువులను ఇళ్ళ లోపునే ఉంచుకోవాలి . బజారులో కట్టివేయకూడదు. ఇంటినుంచి పొలాలకు పశువులను తోలుకెళ్లే సమయంలో పేడ వేస్తే గంపలో ఎత్తుకెల్లాలి. ప్రతి కుటుంబం ఇంటి ముందు శుభ్రంగా ఊడ్చి కడగాలి. ఫలితంగా వీధులన్నీ శుభ్రంగా కనిపిస్తున్నాయి. సుమారు 550ఇళ్ళు ఉన్నాయి ఈ గ్రామంలో. ఏ ఇళ్ళు చూసినా 20 సెంట్లు,15 సెంట్లు ఇళ్ళు ఎక్కువగా కనిపించాయి. 5సెంట్లకు తక్కువగా ఏ ఇళ్ళుకనిపించలేదు. నేటికీ ఈ గ్రామంలో ప్రతి కార్యక్రమం గ్రామ సమిష్టి నిర్ణయంతోనే కొనసాగడం విశేషం.

గ్రామంలో ఓ వీధి.

రాజకీయాలకు అతీతంగా ప్రతి కార్యక్రమానికి కమిటీలు వేసుకోవడం వాటిద్వార నిర్ణయం జరగడం అమలు చేయడం జరుగుతోంది. గ్రామస్తుల చందాలు , శ్రమదానంతో సుందరమైన పాడు రంగ దేవాలయం , తాగునీరు చెరువు ,ఫిల్టర్ బెడ్ , పశువులకు నీళ్ల చెరువు,మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మించుకొన్నారు. రైతులకు కో ఆపరేటివ్ ఫర్టిలైజర్ దుకాణం ఏర్పాటు చేసుకొన్నారు. లైబ్రరీఉంది. పాండు రంగుని గుడి , నివాసాలు మొదట పూరిగుడిసెలతో ప్రారంభించారు. గుడి అబివృద్ది కి గ్రామస్తులు సమైక్యంగా కృషిచేశారు. ప్రతిఏటా కొంత కొంత అభివృద్ధి చేస్తూ 20సంవత్సరాలకు సంపూర్ణంగా అభివృద్ధి చేసుకొన్నారు.

గుంటూరు,తెనాలి సమీపంలోని మూడు గ్రామాల నుంచి వచ్చిన 19 కుటుంబాలు అంచెలంచెలుగా ఎదిగి నేడు 550పైచిలుకు ఇళ్ళు ఏర్పడ్డాయి. ఒకనాడు బీడు భూములుగా ఉన్న ఈ ప్రాంతంలో కె.సి. కెనాల్ నీరు ,కుందూ నీరు సద్వినియోగం చేసుకొంటూ నేడు బంగారు పంటలు పండిస్తున్నారు . వరి ,మిరప ,మినుములు అధికంగా పండిస్తున్నారు. చాలా కుటుంబాలకు 10 ఎకరాల్లోపు భూములున్నాయి. దాదాపు ప్రతి ఇంటినుంచి కనీసం ఒకరైనా సాఫ్ట్వేర్ ఉద్యోగిగా ఉన్నారు. గ్రామంలో బ్యాంకు , అంగన్వాడీ కేంద్రం ,పాఠశాల,గ్రామ సచివాలయం అన్నీ సమకూర్చుకొన్నారు. పండించిన ధాన్యం కు గ్రామంలో గ్రామస్తులు సమిష్టిగా కనీస మద్దత్తు ధర నిర్ణయిస్తారు. నిర్ణయించిన ధరకు తక్కువగా ఎవరూ అమ్మరు. రైతులందరి ధాన్యం గ్రామస్తులు నిర్ణయం చేసి వ్యక్తి ఆధ్వర్యంలో తూకాలు వేస్తారు. తూకాల్లో ఏలాంటి మోసం జరగకుండా కాటా జరిగేలా పర్యవేక్షణ ఉంటుంది. పాడురంగ స్వామి మొదటి దేవుడైతే యర్రబోలు సుబ్బారెడ్డి రెండో దేవుడని అప్పట్లో పెద్దాయన అందరి బాగోగులు, కష్టసుఖాలను పంచుకొన్నారని, ఎవరికైనా ఇబ్బందులు ఎదురైతే ఆయనే ఆదుకొన్నారని గుంటూరు ప్రాంతం నుంచి వలస వచ్చి స్థిరపడ్డ 70 సంవత్సరాల వృదుడు సుబ్బారెడ్డి తెలిపారు.

యర్రబోలు సుబ్బారెడ్డి విగ్రహం.

యర్రబోలు సుబ్బారెడ్డి 12-8-1916న జన్మించారు. స్వాతంత్ర్య సంగ్రామం లో పాల్గొన్నారు. జైలు జీవితం గడిపారు. స్వాతంత్ర్య సమరయోధుడు.నంద్యాల మండలాధ్యక్షుడుగా పనిచేశారు.8-12-2006 న మరణించారు. వీరికి నలుగురు కొడుకులు నలుగురు కూతుళ్లు.


పాండురంగాపురం గ్రామానికి 2007లో నిర్మల్ గ్రామ్ పురస్కర్ అవార్డ్ అందించారు.2008 లో శుభ్రం అవార్డ్ లభించింది.2009 లో నంది రైతు సమాఖ్య పురస్కారం అందుకొంది.2010 లో గూగుల్ గ్రామ పంచాయత్ పురస్కార్ లభించింది.
పాండురంగని గుడి వద్ద పెద్దాయన యరబోలు సుబ్బారెడ్డి విగ్రహాన్ని ప్రతిష్టించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం కూడ ఏర్పాటు చేశారు. ఈ గ్రామంలో చాలా కాలం ఏపదవికైనా ఏకగ్రీవం తప్ప ఎన్నికల జరగలేదు . ఇటీవల ఏన్నికలు జరిగాయి.అయితే విభేదాలు, వివాదాలకు తావులేకుండా జరిగాయి. నాయకులు లేరు కానీ నాయకత్వం ఉంది. గ్రామ సంక్షేమం,అభివృద్ధి వీరిలక్ష్యం. గ్రామస్థులందరిది ఒకే మాట ఒకేబాట.ప్రజా సామూహిక నిర్ణయం అంతిమం .అసలైన ప్రజాస్వామ్యం ,గ్రామ స్వరాజ్యం కనిపించింది. ప్రతి కార్యక్రమంకు కమిటీ లుంటాయి. ఒక కమిటీ పనిలోకి మరోకమిటీ కలుగజేసుకోదు. లైబ్రరీ కమిటీ, తాగునీటి కమిటీ , దేవాలయ కమిటీ ఇలా సుమారు 20కమిటీలు ఏర్పాటు చేసుకొన్నారు.

తాగునీటి కొసం వాటర్ ట్యాంకు నిర్మించారు. 8.3 ఎకరాల్లో తాగునీటి చెరువు నిర్మించుకొన్నారు. ఆ చెరువు నీటిని ఫిల్టర్ బెడ్స్ ద్వారా శుభ్రం చేసి గ్రామంలోని ట్యాంకు కు పంపు చేసుకొంటారు. ఇది కాకుండా సేఫ్ డ్రింకింగ్ వాటర్ కోసం వాటర్ ప్లాంటు ఏర్పాటు చేసుకొన్నారు. ఇందుకోసం గ్రామస్తులు చందాలు వేసుకొని నిర్మించు కొన్నారు. దీని నిర్వహణకు కమిటీ ఏర్పాటు చేసుకొన్నారు.

గ్రామంలో 30కి పైగా మహిళా సంఘాలున్నాయి. నందిని స్వగృహ ఫుడ్స్ పేరుతో పచ్చళ్లు , స్వీట్లు, మిరపపొడి ,మజ్జిగ మిరపకాయలు, ఇతర ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారు.

పచ్చళ్లు తయారీ పనిలో డ్వాక్రా సభ్యులు.
నందిని స్వగృహ ఫుడ్

1957లో ఈ గ్రామం ఏర్పాటు జరిగినప్పుడు ఎకరం 200,300రుపాయలుతో 19కుటుంబాలవారు కొంత భూమిని కొనుగోలు చేసుకొన్నారు. నేడు ఎకరం కోటిరుపాయలు ధర పలుకుతోంది.ఈ గ్రామంలో నేడు చాలా మందికి 10ఎకరాల్లోపు భూములున్న రైతులే. వారికున్న భూములు తో పాటు కౌలు తీసుకొని పంటలు పండిస్తారు. శ్రమజీవులు . 70ఏళ్ల ముసలి వారు సైతం నిత్యం ఏదోఒకపని చేస్తుంటారు.వీధి కుక్కలు కనిపించలేదు.ఏ ఇంటి ముంగిట కానీ ఆవరణలో కానీ కోళ్లు కనిపించలేదు.మద్యం తాగినవారు ఎదురు కాలేదు.దాదాపుగా ప్రతి ఇంటికి ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. చాలా ఇళ్లు లో కార్లు కనిపించాయి. వ్యవసాయ యంత్రాలు,ట్రాకర్లు ఉన్నాయి.వరికోత మిషన్లు కనిపించాయి. ఎకరాకు 40నుంచి45బస్తాలు వరి పడిస్తున్నట్లు తెలిపారు. కర్నూలు సోనా ,నంద్యాల సోనా ,బిపిటీ రకాల వరి పండిస్తున్నారు. నాలుగు రోజులు ఆ గ్రామంలో ఉండి స్వయంగా పరిస్థితి చూశాను. చాల మంచి గ్రామం. ఆదర్శ గ్రామం.నాయకులు లేరు. ప్రజలందరూ నాయకులే.నాయకత్వం ఉంది. ప్రజా పరిపాలన, గ్రామస్వరాజ్యంకు ప్రత్యక్ష్య సాక్షం ఈ గ్రామమని చెప్ప వచ్చు.

పాండురంగాపురం విశేషాలు పార్ట్ 1
పాండురంగాపురం విశేషాలు పార్ట్2
పాండురంగాపురం విశేషాలు పార్ట్3
పాండురంగాపురం విశేషాలు పార్ట్ 4

సేకరణ:–చందమూరి నరసింహారెడ్డి. ఖాసాసుబ్బారావు అవార్డు గ్రహీత. 9440683219

చందమూరి నరసింహారెడ్డి.

2 comments

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s