Vallampati venkata subbaiah

1937వ సంవత్సరంలో వల్లంపాటి వెంకట సుబ్బయ్య చిత్తూరు జిల్లారొంపిచర్లలో పుట్టారు. ఆంగ్ల సాహిత్యంలో ఎం.ఎ చేశారు.

బోధనా రంగానికి అవసరమైన బి.ఇడ్, ని, ఇంగ్లీషు టీచింగ్ డిప్లమా (పిజిడిటిఇ)ని అందుకున్నారు. “The Role of Indian Sensibility in the Teaching of English

 Literature” అనే అంశంపై సీఫెల్ లో పరిశోధన చేసి M.Litt. పట్టా పొందారు. బెసెంట్ థియోసాఫికల్ కళాశాల,మదనపల్లిలో

 చాలాకాలం పాటు ఆంగ్లోపన్యాసకుడిగా

పనిచేశారు. పుట్టింది రాయలసీమలోనే అయినా, వేంకటేశ్వర విశ్వవిద్యాలయం (తిరుపతి); ఆంధ్ర విశ్వవిద్యాలయం

(వాల్తేరు); సీఫెల్ (హైదరాబాదు) లలో విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. విమర్శ రంగంలో విశేషంగా కృషి చేసిన వల్లంపాటి అనారోగ్యంతో జనవరి 2007లో మరణించారు.

      1985 లో అనుశీలన (సాహిత్య వ్యాసాలు) పేరుతో ఒక వ్యాస సంపుటిని ప్రచురించారు. అంతకు ముందే 1963 లో

ప్రాచీన తెలుగు కవుల జీవిత చరిత్రల్ని “రచనల్లో నాటికవులు” అనే పేరుతో ఒక చిన్న పుస్తకాన్ని వ్రాశారు. ఆ తరువాత వల్లంపాటి సాహిత్య వ్యాసాలు, నవలా శిల్పం, కథాశిల్పం,

విమర్శ శిల్పం  అనే గ్రంథాలను రాశారు. 

తెలుగు విశ్వవిద్యాలయం వారిచ్చే ఉత్తమ సాహిత్య విమర్శ గ్రంథంగా కథాశిల్పం 1996-97లో ఎంపికయ్యింది. అలాగే 

1999లో కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతిని కూడా ఈ రచన పొందింది. వల్లంపాటి వెంకటసుబ్బయ్య స్థానీయ 

చైతన్యంతో రాయలసీమ కవులు, రచయితలూ, విమర్శకులూ చేసిన సాహిత్య కృషిని అధ్యయనం చేస్తూ A Socio- 

economic Analysis of Modern Telugu 

Literature in Raayalaseema పేరుతో తెలుగులో పరిశోధన కొనసాగించి, దాన్ని రాయలసీమలో ఆధునిక సాహిత్యం సామాజిక సాంస్కృతిక విశ్లేషణ’ అనే గ్రంథంగా 2006లో ప్రచురించారు.

       దృక్పథం లేకపోవడమనేది సాహిత్యం పట్లా, జీవితంపట్ల సరైనఅవగాహన లేకపోవ డమే నని వల్లంపాటి అభిప్రాయం. నాలుగు దృక్పథాలతో సాహిత్య ధోరణులను అనువర్తన చేయవచ్చునని తన విమర్శ ద్వారా నిరూ పించారు. అవి: 1. సమాజ కేంద్రిత విమర్శ దృక్పథం 2. రచయిత కేంద్రిత విమర్శ దృక్పథం 3. కృతి కేంద్రిత విమర్శ దృక్పథం 4. పాఠక కేంద్రిత విమర్శ దృక్పథం. పైన పేర్కొన్న మొదటి దానిలో మార్క్సిస్టు, స్త్రీవాద, దళిత

విమర్శ దృక్పథం 4. పాఠక కేంద్రత విమర్శ దృక్పథం పైన పేర్కొన్న మొదటి దానిలో మార్క్సిస్టు, స్త్రీవాద, దళిత సాహిత్యాలు, రెండవ దానిలో జీవిత చరిత్ర, మనో విశ్లేషణ, 

మూడవ దానిలో ప్రక్రియా, ప్రతీక, రూప, శైలీశాస్త్ర విమర్శలు చేరతాయని, నాల్గవ దానిలో పాఠకుడే విమర్శకుడనీ వాటిని 

ఇంచుమించు అదే పద్ధతిలో విశ్లేషించి తన విమర్శ రచనను కొనసాగించారు. వల్లంపాటి విభజనలో సమాజం, రచయిత, కృతి, పాఠకుడు, అనే నాలుగు కోణాలు కనిపిస్తాయి. నవలాను శీలనకు అవసరమైన కథ, కథావస్తువు, కథనం, నేపథ్య చిత్రణ, 

మనస్తత్వ చిత్రణ, దృష్టికోణం, కంఠస్వరం (టోన్), శైలీశాస్త్రం భారతీయ అలంకార సూత్రాలలో లేవు. విమర్శలో కాలాను 

గుణ్యత, తద్వారా వచ్చే ప్రమాణాలను సహృదయతతో స్వీకరించడం చాలా అవసరం. అందుకనే భారతీయ ఆలంకారిక, 

పాశ్చాత్య విమర్శ సూత్రాలను సమన్వయించు కోవలసి ఉందనేది వీరి విమర్శలో కనిపించే దృక్పథం.

       సాహిత్య సిద్ధాంతం సాహిత్య విమర్శ: భారతీయ అలంకార శాస్త్రాన్ని భారతీయ సాహిత్య మీమాంస గా పిలిచి, దీన్ని ఒక సాహిత్య సిద్ధాంతంగానే గుర్తించాలనీ, పూర్తిగా 

సాహిత్య విమర్శగా భావించే వీలులేదని వల్లంపాటి అభిప్రాయం. సాహిత్యం ఎలా ఉండాలో చెప్పేది సాహిత్య సిద్ధాంతం Literary Theory ఎలా ఉందో చెప్పే సాహిత్య విమర్శLiterary Criticism లకు మధ్య

సరిహద్దులున్నా అని స్పష్టంగా లేవు. దీన్ని ఒక సాహిత్య శాస్త్రంగానే గుర్తించాలి. రాజరికం వల్ల, ప్రజాస్వామ్యంలోఉండే స్వేచ్చాపూరిత వాతావరణం లేకపోవడం అనే సామాజిక

చరిత్ర ప్రభావం భారతీయ సాహిత్య శాస్త్రంపై ప్రధానంగా కన్పిస్తుందన్నారు. రసం, అలం

కారం, ధ్వని, ఔచిత్యం, వక్రోక్తి, రీతి వంటి సిద్ధాంతాలను పరిశీలిస్తే, ఇవి రచనా నిర్మాణానికిచ్చినంత ప్రాధాన్యత, రచనా

వస్తువు కివ్వలేదు. పైగా వస్తువును అన్ని సామాజిక వర్గాల నుండి తీసుకోవాలనే సామాజిక దృక్పథం కూడా కనిపించదు.

ఆలంకారిక సిద్ధాంతాలన్నీ ‘సాహిత్య సిద్ధాంతాలు’గానే మిగిలిపోయాయి తప్ప, సాహిత్య విమర్శ సిద్ధాంతాలుగా రూపొంద

లేకపోయాయనేది వీరి విశ్లేషణ.

      వస్తు శిల్ప వివేచన: వస్తు, శిల్పాల విషయ చర్చల్లో Aesthetic values, Aesthetic Distanceల గురించి వల్లంపాటి చాలా చోట్ల ప్రస్తావించారు. మంచి రచనలో వస్తువు, శిల్పం విడదీయలేనంతగా కలిసిపోవాలి. రచనను

అర్థం చేసుకోవడానికి, అనుభూతి కలగడానికి, పాఠకుని సామర్థ్యాన్ని క్రియాత్మకం చేసేందుకు Aesthetic Distance ఉపకరిస్తుంది.

“ఉద్దేశాన్ని కళగా మార్చే వరుసవేది శిల్పం లేదా రూపం” అని శిల్పానికి రూపానికి మధ్య వల్లంపాటి వారు పెద్ద వ్యత్యాసాన్ని చూపలేదు. వస్తువును కళగా మార్చేది రూపం. వస్తువుకు ఆకారం లేదు. తగిన రూపాన్నిసంతరించుకున్న వస్తువు మాత్రమే కళ.’రూపం అంటే కథ, కథాకథనం, పాత్రలు, వాటి మానసిక

పరిణామం, అల్లిక, శైలి మొదలైన అనేక అంశాలుంటాయి. రూపాన్ని కొంతమంది. విమర్శకులు శిల్పం’ అని కూడా

పిలుస్తుంటారు. ‘నవలలోని కథకు, నవల బయట ఉన్న వాస్తవిక జీవితానికి ఉన్న సంబంధమే ఒక రకంగా కథా వస్తువు  అన్నారు. ‘శిల్పం’ అని తన గ్రంథాలకు

పేరు పెట్టుకున్నంత మాత్రం చేత కళ కళకోసం అనే కళావాదిగా కాకుండా, కళాత్మకమైన సాహిత్యం ప్రజలకు ఉపయోగపడుతూనే, కళా విలువలను కాపాడేదై ఉండాలని వల్లంపాటి భావించారు.

         నవల-కథా విమర్శ: నవల, కథల గురించి వివరిస్తూ రెండు గ్రంథాలు కూడా రాశారు. వల్లంపాటి కంటే ముందు

కొంతమంది నవలా కథా విమర్శ రంగాలలో కొంత కృషి చేశారు. కానీ, పాశ్చాత్య భావాలను తులనాత్మకంగా పరిశీలించి ఆ భావాలను తెలుగు రచనలకు అనువర్తింపు 

జేయడంలో ఈయన విమర్శకు ప్రత్యేకత ఉంది. నవల, కథ అనేవి పాశ్చాత్య భావాల నుంచి రూపుదిద్దుకున్న సాహిత్య ప్రక్రియలు. ప్రతి విషయాన్ని వేదాల్లోనో, పురాణాల్లోని 

ఉన్నాయని చెప్పే నమ్మకాలను సిద్ధాంతాలుగా విశ్వవిద్యాలయం స్థాయిలో కూడా ప్రచారం చేయడాన్ని తీవ్రంగానే వ్యతిరేకించారు. నవలకు, కథకు ఒక ప్రత్యేక చారిత్రక నేపథ్యం ఉందని, దాన్ని విమర్శకుడు గుర్తించవలసి ఉంటుందన్నారు. కల్పనా సాహిత్య విమర్శకుడు సంప్రదాయ పాండిత్యంతో పాటు మరి కొంత ఆధునిక పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలన్నారు. ప్రపంచ కల్పనా సాహిత్యాన్ని గురించిన అవగాహన, ఆధునిక పాండిత్యం, ఆధునిక మనస్తత్వాన్ని కలిగి ఉండటం, ఆధునిక కల్పనా సాహిత్య సిద్ధాంత అవగాహన కలిగి ఉండటం వంటి వన్నీ అవసరమన్నారు. ఉన్నవ, బుచ్చిబాబు, గోపీచంద్,విశ్వనాథ, రావిశాస్త్రి, కొడవటిగంటి, ఆర్.ఎస్. సుదర్శనం మొదలైన వారి నవలలను పరిశీలించారు. వల్లంపాటి 

సాహిత్య వ్యాసాలలో రాసిన “తెలుగులో కల్పనా సాహిత్య విమర్శ” వ్యాసం ప్రామాణికమైంది. నవలా విమర్శ పేరుతో 

వచ్చిన పరిశోధనలను, విమర్శలను, పరిశీలించి, వాటిలో గల అశాస్త్రీయ విషయాలను సోదాహరణంగా వివరించారు.

     నవలా ప్రాదుర్భావం మొదలుకొని నవలల్లో ఉండే జీవితం,వివిధ ప్రధానాంగాల గురించి నవలా శిల్పంలో విపులంగా చర్చించారు. కథా ప్రణాళికను తయారు చేసుకున్న తరువాత

ఎదురయ్యే సమస్య కథా కథనం. ఇది లేఖ, దినచర్య, చైతన్య స్రవంతి, న్యూస్ రీల్  వంటి కథా కథన పద్ధతులుగా తెలుగునవలల్లో చిత్రితమైన విధానాన్ని వివరించారు. కథా కథనంలో కొన్ని చవక బారు పద్ధతులు కూడా ఉన్నాయన్నారు. శైలిని వివరించేందుకు భాషా శాస్త్రవేత్తల అభిప్రాయాలను ఉపయోగించు కున్నారు. నవలా వర్గీకరణ అనేది సౌలభ్యం కోసం జరుగుతుంది. దాన్ని అనుసరించి సమాజ, వ్యక్తి, తాత్త్విక,రాజకీయ, చారిత్రక నవలలుగా నవలలను విభజించుకోవచ్చు

అన్నారు.

          కథా సాహిత్యానికి ఉపయోగపడే ఆలోచనలుగా -మంచి కథకు క్లుప్తత, అనుభూతి, సంఘర్షణ, నిర్మాణసౌష్టవం అవసరం.

ఆ) కథకు సూచనే ప్రాణం.

ఇ) పరిష్కారం కథలో నుంచే రూపొందాలి.

ఈ)కథలోని అర్థం రచయిత సృష్టించిన “కల్పిత ” ప్రపంచానికి, కథకు బయట ఉన్న “వాస్తవ ” ప్రపంచానికి మధ్య నున్న సంబంధంలో ఉంటుంది. కథ అర్థం కావడ మంటే,ఈ సంబంధం అర్థం కావడమే.

ఉ) పాత్ర మానసిక జీవితానికి, భౌతిక జీవితానికి మధ్య ఉన్నసంబంధాన్ని, లేదా వైరుధ్యాన్ని చిత్రించడమే నిజమైన

వాస్తవికతావాదం. దీని ఆధారంగానే అనేక రకాలైన ఊహాకల్పనలు చేసి వాస్తవికతను స్ఫురింపచేయవచ్చు. కథైవాస్తవిక సరిహద్దులను దాటి వెళ్ళినప్పుడే దాన్ని ఊహా

కల్పన (ఫాంటసీ) అని నాలుగు రకాలుగా దాన్ని చెప్పారు.

1.దేశ కాలాలను మార్పు చేసే కల్పన,

2. పునః సృష్టి చేసిన పురాణగాధలు Myths

3.జంతు గాథలు Animal Fables

4. విజ్ఞాన శాస్త్ర కల్పనలు Scientific Fiction

ఎ) తెలుగులో అంతరార్థ కథనం గల కథలు చాలా తక్కువ.వాటిలో రా.వి.శాస్త్రి ‘పిపీలికం’ అత్యుత్తమ కథ.

ఏ)ఒకే కథలో ఒకే కథన శిల్పం ఉండాలన్న సిద్ధాంతంలేదు. అది కథా స్వభావాన్ని బట్టి రచయిత దృక్పథాన్ని బట్టి మారుతుంది. ఇలా కథకు సంబంధించిన విలువైన సూత్రాలను వల్లంపాటి అందించారు.

     తెలుగు సాహిత్య విమర్శకు పాశ్చాత్య భావనలు, సిద్ధాంతాలను సమన్వయించటం వస్తు శిల్ప స్పృహ సాహిత్యానికిసాహిత్యేతర శాస్త్రాల ఆవశ్యకత గుర్తించిన మార్క్సిస్టువిమర్శకుడు వల్లంపాటి వెంకట సుబ్బయ్య,

    __   దార్ల వెంకటేశ్వరరావు

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s