
కుసుమకుమారి చిత్తూరు జిల్లా మదనపల్లెలో నరసింహారెడ్డి దంపతులకు 1950వ దశకంలో జన్మించారు. 1972లో వేంకటేశ్వర విశ్వవిద్యా లయంలో ఎం.ఎ. తెలుగు చదివి ఆ తర్వాత కేతు విశ్వనాథరెడ్డి పర్యవేక్షణలో “బ్రిటిష్ కాలం నాటి తెలుగు ముద్రిత పత్రాల్లో హిందూస్థానీ ప్రతిధేయాలు” అనే అంశం మీద పరిశోధన చేశారు. అనంతపురంలోని శ్రీ సత్యసాయి మహిళా కళాశాలలో ఎనిమిదేళ్ళు అధ్యాపకులుగా పనిచేసి, ఆ తర్వాత శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో చేరారు. అక్కడ తెలుగు శాఖలో రీడరుగా, పాఠ్యప్రణాళికా సంఘాధ్యక్షులుగా, శాఖాధ్యక్షులుగా, కళాశాల ప్రిన్సిపాల్ గా,తాత్కాలిక రిజిస్ట్రార్ గా పనిచేశారు. తర్వాత ఆమె శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సర్ అయ్యారు. తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషలు తెలిసిన కుసుమకుమారి మంచి సాహిత్య విమర్శకులు, వక్త. అనేక జాతీయ అంతర్జాతీయ సదస్సులలో సాహిత్య, సామాజి కాంశాల మీద ప్రసంగించారు. స్త్రీవాద దృక్పథంతో కుసుమకుమారి చేసిన సాహిత్య విమర్శలో మూడు భాగాలున్నాయి. | స్త్రీవాదానికి సంబంధించిన సైద్ధాంతిక విజ్ఞాన నేపథ్యం – 2. స్త్రీ వాదానికి ముందటి ప్రాచీన, ఆధునిక సాహిత్యాన్ని స్త్రీవాద దృక్పథంతో పునర్మూ ల్యాంకనం చెయ్యడం, 3.స్త్రీ వాద దృక్పథంతో వాద_సాహి త్యాన్ని విశ్లేషించడం.
స్త్రీ వాదం అంటే ఏమిటి? స్త్రీవాదం పుట్టుక, లక్ష్యాలు ఏవి ?వచ్చిన భారతీయ సమాజంలో స్త్రీవాద ఆవశ్యకత ఎంత? స్త్రీవాద సాహిత్య ప్రయోజనమేమిటి? స్త్రీవాదంలోని వివిధ శాఖలేవి? మొదలైన అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. దాని కోసం అంతర్జాతీయ రాష్ట్రీయ విద్వాంసులు, సిద్ధాంతకర్తలు రాసిన ప్రసిద్ధ గ్రంథాలు చదివారు. అస్మిత, రిసోర్స్ సెంటర్ ఫర్ వుమెన్ రూపొందించిన ఒప్పందాన్ని అధ్యయనం చేశారు.అమర్త్యసేన్, అనూరాధరాయ్, క్రిస్ బోస్లే, కాథరిన్ టెస్లే మొదలైన వాళ్ళ రచనలు చదివారు.1993-2003 సంవత్స రాల మధ్య ఆమె అధ్యయనాన్ని విస్తృత పరచుకున్నారు.
1975-85 మహిళా దశాబ్ది చరిత్ర చదివారు. దానికి తెలుగు సమాజపు చారిత్రక నేపథ్యాన్ని సమన్వయించు కున్నారు. తెలంగాణ, శ్రీకాకుళ నగల్బరీ ఉద్యమాల ద్వారా సంక్రమించిన మహిళా చైతన్యాన్ని గుర్తించారు.
* సెక్స్, జండర్ వేరు వేరు
*సెక్స్ పుట్టుకతో వస్తుంది. జండర్ సాంఘికంగా
సాంస్కృతికంగా ఏర్పడుతుంది.
*జండర్ వివక్ష మీదనే స్త్రీవాదం పోరాడుతుంది.
*స్త్రీవాద వ్యతిరేకత పురుషుల మీద కాదు, పురుషా
ధిపత్యం మీద.
*స్త్రీవాదం లైంగికత్వంలోని రాజకీయ స్వభావాన్ని నొక్కి
చెబుతుంది. రాజకీయ వేత్తలు, తత్త్వవేత్తలు
* విస్మరించిన సంతానోత్పత్తి, లైంగికత్వం విషయాలన స్త్రీవాదం పట్టించుకుంది.
*మన దగ్గర స్త్రీవాదం 1975లో మొదలైనా పాశ్చాత్య దేశాలలో అంతకుముందే ఉంది.
*స్త్రీవాదం కుటుంబాన్ని ప్రైవేట్ యూనిట్ గా కాక,
సాంఘిక యూనిట్ గా గుర్తిస్తుంది.
*కుటుంబంలోనూ, పనిలోనూ స్త్రీలు అణచివేత,
దోపిడికి సంబంధించిన ఉండి ఈ పరిస్థితిని మార్చడానికి స్త్రీలు, పురుషులు చేసే చైతన్య వంతమైనకార్యక్రమమే స్త్రీవాదం.
* స్త్రీవాదం స్త్రీల హక్కులను మానవ హక్కులగా
ప్రతిపాదిస్తుంది.
* స్త్రీపురుష సమానత్వ సాధనే స్త్రీవాద లక్ష్యం, ప్రయోజనం.
ఈ అవగాహన లోంచి,ఈ నేపథ్య విజ్ఞానంతో
కుసుమకుమారి స్త్రీవాదానికి ముందటి సాహిత్యాన్ని, స్త్రీ వాద సాహిత్యాన్ని విశ్లేషించారు. 1993లో “తెలుగులో వాద
సాహిత్యం, 2003లో భాషా సాహిత్య అధ్యయనం – జండర్
స్పృహ ” అనే పెద్ద ప్రసంగ పత్రాలతోపాటు మరో పది దాకా స్త్రీవాద దృక్పథంతో తెలుగు సాహిత్యం మీద విమర్శ రాశారు. కుసుమకుమారి చేసిన ఈపునర్మూల్యాంకనంలో రెండు భాగాలున్నాయి. 1. ప్రాచీన సాహిత్యం- స్త్రీవాద పునర్మూల్యాం కనం 2. స్త్రీవాద పూర్వ ఆధునిక సాహిత్యం – స్త్రీవాద పునర్మూల్యాంకనం.
“స్త్రీ పురుషులందరూ సమాజంలో సమాన హక్కులను అనుభవించగలిగే మానసిక చైతన్యాన్ని, భావ పరిణతిని కలిగించడమే స్త్రీవాద రచనల ప్రయోజనం”
అంటారు పి. కుసుమకుమారి.

_రాచపాళెం చంద్రశేఖరరెడ్డి