బహుముఖ ప్రజ్ఞాశాలైన గడియారం వేంకట శేషశాస్త్రి కడపజిల్లా జమ్మలమడుగు తాలూకా నెమళ్ళదిన్నె అగ్రహారంలో 1901లో రామయ్య, నరసమ్మ దంపతులకుజన్మించారు. రూపావతారం శేషశాస్త్రి వద్ద కావ్య నాటకా లంకారాదులను, తర్క, జ్యోతిష, వాస్తు శాస్త్రాలను అభ్యసిం చారు.దుర్భాక రాజశేఖర శతావధానితో కలిసి అవధానాలు చేసిఅవధాన పంచాననుడు’గా సన్మానాలు పొందారు. శాసన మండలి సభ్యుడుగా, సాహిత్య అకాడమీ అధ్యక్షుడుగా బాధ్యత లను నిర్వర్తించారు.

         శ్రీనాధ కవితా సామ్రాజ్యము, తిక్కన కళావైదగ్యము, ఉత్తర రామాయణ కావ్యశిల్పము వీరి విమర్శనా గ్రంథాలు,ఉత్తర రామాయణము కావ్య శిల్పము లో గడియారం తిక్కన కృత నిర్వచనోత్తర రామాయణము కంకంటి పాపరాజు  కృత ఉత్తర రామాయణమును గురించిన కావ్య పరిశీలనము చేశారు. ఈ రెండు రామాయణములకు తోడు రామాయణోత్తర కాండను కూడా తీసుకున్నారు. అలాగే రామాయణ కథా రచయితలైన కాళిదాసు, భవభూతిని అవలోకించి, రామాయణ  కథాశ్రితాలైన తెలుగు కవులను కూడా పరిశీలించారు. ఇక కృత్యావతరణము విషయానికి వస్తే ఈ కావ్యశిల్పంలో గడియారం వారు ఉభయుల రచనలను ఒక విధంగా తులనాత్మక పరిశీలన చేశారని చెప్పవచ్చు. పీఠికలో తిక్కన పీఠికాభాగంలో తన కవితా విన్యాసమంతా చెప్పారని, పాపరాజు ఆ పని చేయలేదంటారు. తిక్కన కృతి నామక వంశ వర్ణన చేస్తే, పాపరాజు కృతి భర్త శ్రీకృష్ణుడు కాబట్టి అతని పేర ఒక గ్రంథమే రాశాడని చెపుతూ శ్రీకృష్ణుని వర్ణన ఎంతైనాచెప్పవచ్చునని సమర్థించాడు. అయోధ్య వర్ణన విషయంలో తిక్కన “అఖిల భోగంబుల కాస్పదంబగుట….” అంటూ ప్రజాజీవితమును వర్ణించాడని పాపరాజు ప్రభుత్వోన్నతినిఎక్కువ చేసి చెప్పాడన్నారు. రాముని దర్శించడానికి అగస్త్యాదులు వచ్చిన సందర్భాన్ని వివరిస్తూ గడియారం అనువాదంలో ఇది ప్రథమ ఘట్టం మునులు సభాద్వారము నిల్చి తమ రాక చెప్తే, రాముడు వారిని పిల్చుక రమ్మన్నాడని తిక్కన అంటే పాపరాజేమో స్వయంగా రాముడే అగస్త్యాదుల వేంకట రామస్వామి కడకు వచ్చాడని చెప్పారు. తిక్కనకేమో రాముడు ప్రజాపరి పాలకుడైన రాజు అని పాపరాజుకేమో రాముడు- ఆ పరమేశ్వరుడైన దేవుడని అంటాడు. మాల్యవదాదుల చరిత్ర,దండయాత్రలు, ఇంద్రాదుల శరణాగతి, మాల్యవదాదుల యుద్ధం మొదలైన వర్ణనలు ఇద్దరు పాత్రోచితంగా చేశారన్నారు. రావణాదుల జన్మవృత్తాంతం చెపుతూ వారు పుట్టి పెరిగి పెద్దవారైనారంటూ తిక్కన నామకరణం వరకు వివరిస్తే, పాపరాజు విద్యాభ్యాసం వరకు వివరించారు. అయితే రావణ స్వభావసిద్ధమైన క్రౌర్యాన్ని ఇరువురు స్వభావసిద్ధంగా చెప్పారని గడియారం అన్నారు. ఇక రావణుని వివాహం.రావణుడు, కుబేరుని మీదికి యుద్ధానికి పోవడాన్నికవులిరువురు చెపుతూ రావణుని గెలుపును వివరించారు.అలాగే రావణుడు కైలాసాన్ని ఎత్తడం గురించి ఇరువురి రచనా విన్యాసం ఒక్కోరకంగా వుందంటాడు.

          హనుమజ్జనన వృత్తాంతం, అగస్త్యాదుల వీడ్కోలు, రాముని ఉద్యాన విహారాన్ని వివరిస్తూ గడియారం తిక్కన తన సహజ భావనాబలంతో మెరుగులు దీర్చి శబ్దానికంటే భావానికి ప్రాధాన్యమిచ్చాడు అంటూ పాపరాజు అతిశయోక్తులు, శబ్ద చమత్కారాలతో సాహితీవ్యాయామం చేశారన్నారు. అపవాద పరామర్శములలో కౌతుకోత్సవమున సీత భూగర్భ ప్రవేశానంతరం రాముడేమి చేశాడని కుశలవులేమైనారనే ప్రశ్నలకు రాముడే స్వయంగా వాల్మీకితో చెప్పించాడని పాపరాజు అన్నాడని, తిక్కనేమో సర్వజనులకు యదార్ధముగా సన్మానించి పంపినారని చెప్పాడు. ఇక అపవాది పరామర్శను చెపుతూ అపవాదమంటే దూఱు-నింద పరామర్శమంటే ఆ వచ్చిన నిందను గురించి ఆలోచించుట అంటూ ఉభయులు ఏకాభిప్రాయాన్నే వెల్లడించారు అంటారు గడియారం. 

         ఇక చివరిది ఉపసంహారం. ఉత్తర రామాయణ కావ్యశిల్పాన్ని చెపుతూ వేంకటశేషశాస్త్రి తిక్కన – పాపరాజుల కావ్యనిర్వహణ పరిశీలనకై ఉద్దేశింపబడిన ఈ గ్రంథం ఈ రెండు కావ్యాలను యథాశక్తిపరిశీలించినదంటూ పాపరాజు రచనలోమూలానికనుసరణేగాక, మూలంకంటే భిన్నంగా కూడా కొన్ని మార్పులు, చేర్పులు కలవంటూ సమకాలీన ప్రకృతి వర్ణనల సంకలనం కనిపిస్తుందన్నారు. 

       ప్రపంచ తెలుగు మహాసభల (1974) సందర్భంగా శ్రీనాథుడిపై ఆయన కవితాతత్త్వంపై విశ్లేషణాత్మక రచన చేశారు. తిక్కన కళావైదగ్యంలో తిక్కన కవితాతత్త్వాన్ని విశ్లేషించారు.

  __ఎస్. సంధ్యారాణి

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s