Pic source emesco books HRK

          కవి , రచయిత , పాత్రికేయులు . ప్రజా ఉద్యమాలని , సాహిత్యాన్ని జీవితంగా చేసుకున్న తరంలో ఒకరు . స్వస్థలం కర్నూలు జిల్లా , విప్లవోద్యమంలో పన్నెండేళ్లు పని చేసి 

రెండేళ్లు జైలు జీవితం అనుభవించారు . విరసంలో చరుకుగా పని చేశారు . ఆ తర్వాత పాత్రికేయునిగా ప్రస్థానం . ఈనాడు దినపత్రికలో కీలక బాధ్యతలు పోషించి స్వచ్ఛంద విరమణ పొందారు . ఒక్కొక్కరాత్రి , నకులుని ఆత్మకథ …. తదితరం ఈయన కవితా సంపుటాలు . చేతికిరాని కొడుకు , కొండార కోట , అల్ ఫతా హోటల్ తదితర కథలతో ప్రశంసలు పొందారు . కవి , రచయిత్రి జయవీరి సహచరి . కుమార్తె మమత కూడా కవిత్వం రాస్తారు . పూర్తి పేరు కొడిదెల హనుమంతరెడ్డి . వయసు 64 సంవత్సరాలు . నివాసం అమెరికా- ఇండియా . 

( మహమ్మద్ ఖదీర్ బాబు_ ఇలా కూడా కథలు రాస్తారు నుండి)

అసలు పేరు కొడిదెల హనుమంతరెడ్డి. దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. కర్నూలు జిల్లా, గడివేముల మండలం, గని అనే గ్రామంలో 1951, అక్టోబర్ 10న కొడిదెల సుబ్బమ్మ, సంజీవరెడ్డి దంపతులకు జన్మించాడుతలముడిపి గ్రామంలో హైస్కూలు విద్య పూర్తిగావించాడు. విజయవాడలోని ఆంధ్ర లయోలా కళాశాలలో డిగ్రీ, ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్టణంలో ఎం.ఎ. చదివాడు. ఇతడు నక్సలైటు ఉద్యమం వైపు ఆకర్షితుడై పన్నెండేళ్లు ఆ ఉద్యమజీవితం గడిపాడు. రెండు సంవత్సరాలు కారాగారవాసం చేశాడు. విమోచన పత్రికకు సంపాదకత్వం నెరిపాడు. విప్లవ రచయితల సంఘంలో క్రియాశీలక పాత్రను నిర్వహించాడు. తర్వాత పదహారేళ్లపాటు వర్కింగ్ జర్నలిస్టుగా ఉదయం, ఈనాడు తదితర పత్రికలలో పనిచేశాడు.  పత్రికలలో రాజకీయ, ఆర్థిక, సాహిత్య వ్యాసాలను పావని, దినకర్, కె.సంజీవ్ అనే పేర్లతో వ్రాశాడు చాలా పత్రికలలో కథలు కవితలు ప్రకటించాడు. (వికిపీడియా నుండి)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s