
అనంతపురం రూరల్ మండలంలోని కందుకూరు గ్రామానికి చెందిన పోలప్ప నారాయణమ్మల కుమా రుడు. 1999లో భారత జన విజ్ఞాన సమతి ఆధ్వర్యంలో ప్రభుత్వం గతంలో నిర్వహించిన అక్షర దీక్ష కార్యక్రమం ద్వారా పరిచయమైన కంచు కంఠంపాటలద్వారా – చదువు ఆవశ్యకతను చైతన్యాన్ని కలిగించాడు. ఇతని గళం… గర్జించే మేఘం! ఇంటర్మీడియేట్ తో చదువు ఆపేశాక అమ్మకు కిడ్నీ దెబ్బతినడంతో ఇల్లు గడవడం కష్టమైంది. అప్పుడు ప్రజా వైద్యశాలలో దినకూలీగా పనిచేస్తూ ఓ వైపు ఇంటిని పోషించుకుంటూ మరోవైపు నాటకాలు, పాటలలో ఆసక్తి చూపాడు. ఆరవతరగతి నుంచే సామాజిక, సందేశాత్మక నాటకాలలో తన ప్రతిభను నిరూపించుకున్నారు. పాఠశాలలో ఏ కార్యక్రమం జరిగినా లక్ష్మినారాయణ ప్రార్థనాగీతంపాడందే సభ లేదంటే అతిశయోక్తి కాదు.

పాఠశాలలోపద్మనాభం అనే తెలుగు పండితుని ప్రోత్సాహంతో పాటలలో తన ప్రతిభ నిరూపించుకున్నాడు. చదవాలిరా.. ఎన్ని ఆటంకాలు వచ్చినా.. అనే పాటను పాడి అందరిచేత శభాష్ అనిపించుకున్నారు.
సినిమా పాటల కంటే సామాజిక, అభ్యుదయ గీతాలు పాడటానికే ఎక్కువ ఆసక్తి చూపే లక్ష్మీనారాయణ ప్రస్తుతం ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నారు.తాను పాడే పాట లన్నింటిలోనూ ఆ చల్లని సముద్ర గర్భం అనే దాశరథి రాసినపాటంటే ఎంతో ఇష్టమని చెబుతారు. డప్పుపై సుతారంగా దరువేస్తూ ఈ పాటను ఆలపిస్తుంటే ప్రేక్షకులు తలలూపాల్సిందే.