Pic source vunta somu fb.

       

నేటి పుట్టపర్తి నాటి గొల్లపల్లి ఒకనాడు చుట్టూ దట్టమైన అడవులుండేవి. ఇప్పుడున్న రోడ్ మార్గం లేదు. కేవలం బండి బాట ఉండేది. కర్నాటనాగేపల్లి నుంచి గొల్లపల్లి కి ఎద్దుల బండిలో వచ్చేవారు. చిత్రావతి ఏరు వస్తే ఊరుదాటి వెళ్లాలంటే గగనమే. బుక్కపట్టణం చెరువు లో నీళ్లు లేకపోతే బుక్కపట్టణం నుంచి చెరువు లో నుంచి నడిచివెళ్లేవారు. కమ్మవారి పల్లి నుంచి పాలు కొత్తచెరువు ,బుక్కపట్టణం తెచ్చేవారు. సత్యసాయిబాబా వల్ల ఆ గ్రామానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. బాబా భక్తులు పెరగడంతో సౌకర్యాలు పెరిగాయి.

ఒకనాటి పుట్టపర్తి బస్టాండ్.

పుట్టపర్తి కి పెనుకొండ నుండి 1965 లో మొదటి సరిగా బస్ సర్వీస్ ప్రారంభమైంది.
గవర్నర్ గా బూర్గుల రామ కృష్ణారావు కృషి ఫలితంగా పుట్టపర్తి నుండి మామిళ్ల కుంట వరకు నూతన రోడ్డు నిర్మాణం జరిగింది.

ప్రేమ శాంతి ధర్మం సహనం సమత మమత సేవాతత్పరతకు అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న పుట్టపర్తి నాటి గొల్లపల్లే సత్యసాయి జన్మించిన గ్రామం. చిత్రావతి నది ఒడ్డున కొండకోనల్లోని గొల్లపల్లి లోని సామాన్య కుటుంబంలో ఈశ్వరమ్మ, పెద్దవెంకమరాజు దంపతులకు సత్యసాయి 1926 నవంబర్ 23న జన్మించి, ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఆరాధ్యుడిగా పూజలందు కుంటున్నారు. నాడు గొల్లపల్లిలో అధిక శాతం యాదవులు గోవులను పోషించేవారు. ఒక యాదవ యాజమానికి చెందిన ఆవు మేతకు వెళ్లి, ప్రతి రోజూ పుట్టలోని పాముకు పాలు ఇచ్చేది. ఇంటికి వచ్చిన తర్వాత అన్నీ ఆవులు పాలు ఇచ్చేవి. ఈ ఆవు పాలు ఇచ్చేది కాదు. ఆవు మధ్యాహ్న సమయంలో పుట్టవద్దకు వెళ్లి, పాముకు పాలు ఇస్తుండగా యజమాని గమనించి పామును రాయితో చంపాడు. పాము చనిపోతూ గొల్లపల్లి.. పుట్టలమయంగా మారాలని శపించిందట. పుట్టవద్ద ఉన్న రాతికి ప్రజలు ప్రత్యేకంగా పూజలు నిర్వహించి వేణు గోపాలస్వామి ఆలయం నిర్మించారు. అలా పుట్టపర్ధిని కాస్తా పుట్టపర్తిగా ప్రసిద్ధికెక్కింది.

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వల్ల పుట్టపర్తిలో సత్యసాయి యూనివర్సిటీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విమానాశ్రయం, రైలుమార్గం , స్టేడియం ఇలాఅనేక సౌకర్యాలు సమకూరాయి. ప్రశాంతి నిలయం గా ప్రపంచ ప్రసిద్ధి పొందింది. అంతర్జాతీయ ఆద్యాత్మిక పట్టణం గా గుర్తింపు పొందింది.

సేకరణ :–చందమూరి నరసింహా రెడ్డి.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s