మానవ ఆకారంలో సిద్ధేశ్వరస్వామి
దక్షిణ భారతదేశంలోని శివాలయాల్లో శివుడు లింగాకృతిలో ఉండగా అమరాపురం మండలం హేమావతి సిద్దేశ్వరాలయంలో మానవాకృతిలో (విగ్రహం రూపంలో) కొలువుదీరడం విశేషం క్రీ. శ. 730లో నోళంబ పల్లవులు హేమావతిని రాజధానిగా చేసుకుని పాలించినట్లు శిలాశాసనాల ద్వారా తెలుస్తోంది. అప్పట్లో హేమావతిని యెంజేరు పట్టణంగా అనంతరం హైమవతిగా కాలక్రమేణ హేమవతిగా పిలుస్తున్నారు. ఇక్కడి ఆలయంలోని శిల్పాలు నల్లని రాతితో చూడచక్కగా మలిచారు. గ్రామంలో ఎక్కడ తవ్వకాలు చేసినా నంది విగ్రహాలు, శివలింగాలు లభ్యమవుతుంటాయి. విలువైన శిల్పాలను 50 ఏళ్ల కిందట మద్రాసు మ్యూజియానికి తరలించారు. ప్రస్తుతం రూ.50 లక్షలతో నిర్మించిన భవనంలో శిల్పాలను భద్రపరిచారు. శివుడు సిద్ధాసనం భంగిమలో కూర్చొని ఉన్నందున సిద్ధేశ్వరస్వామిగా పూజలందుకుంటున్నాడు. ఏటా మహాశి వరాత్రి నుంచి 9 రోజులపాటు శిరాత్రి మహోత్సవాలు ఆల యంలో ఘనంగా జరుగుతాయి. ఉత్సవాలకు జిల్లాలోని నలుమూలలతో పాటు కర్ణాటక, తమిళనాడు నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారు