Munaiah,proddatur

పల్లె లోగిళ్లు.. పచ్చని పైర్లు.. చేలల్లో హృదయ స్వరాల ఆలాపన.. పల్లె పదాలతో ప్రయోగాలు.. ఎక్కడ చూసినా జానపదాల రాగాలు ప్రతిధ్వనించేవి. భారతీయ సంస్కృతి.. సంప్రదాయలను స్మరించుకోవడం.. సజీవమైన ఒక జాతి జీవన విధానాన్ని దర్శించడమే జానపదాల సారాంశం, మధురాతి మధురంగా ఉన్న తల్లిభాషలో స్వరాభిషేకం చేయడంలో ఆయనది విలక్షణమైన శైలి, నూతన ఒరవడి సృష్టించారు. తియ్యనైన… లలితమైన పదబంధాలతో మల్లె పూల గూభాళింపే. శ్రోతల్ని హత్తుకునేలా రాణించి జానపద తపస్విగా కీర్తిని పొందారు కె.మునెయ్య, ఆయన నేడు మన మధ్య లేకపోయినా గానామృతం సోబగులు శాశ్వ తంగా నిలచిపోయాఏయనే చెప్పాలి.
మండలం దొమ్మర నంద్యాల గ్రామంలో 1943లో కలిమిశెట్టి మునయ్య జననం. తల్లిదం డ్రులు మునెమ్మ, రామయ్య. వారి కుటుంబం తర తరాలుగా జానపద రంగంలో నిష్ణాతులు. వారి వారసత్వాన్ని అందుకుని ఆ రంగంలోకి దూకారు. ఆ తర్వాత ప్రొద్దుటూరులో నివాసం. కలిమిశెట్టి చౌడప్ప శిష్యరి కంలో యక్షగానం,కోలాటం, పండరిభజన, చెక్కభజన తదితర కళా రూపాల్లో పదవ ఏటనే సాధన చేశారు. స్వత హాగా చమత్కారి, చిన్నతనం నుంచి జానపద గీతాలను పాడటంలో దిట్ట శ్రావ్యమైన గొంతుతో శ్రోతలను మైమరపించారు
వృత్తి చిత్రలేఖనం:
 వీరపునాయుపల్లిలో ఉన్న సంగ మేశ్వర పాఠశాలలో వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు చిత్రలేఖనంలో అపార అనుభవం ఉంది. ఇక ప్రవృత్తిగా గ్రామీణ ప్రాంతాల్లో తిరిగి పల్లె గేయా లను సేకరించడంతో పాటు వాటిని రసరమ్యంగా పాడటంలో పేరుగాంచారు
సృజన శీలి
తేనె పల్కుల తేట తెలుగును పేర్చి జనుల భాషకు పీటవేసి భావితరాలకు మార్గదర్శకుడుగా నిలిచి సృజనశీలిగా గుర్తింపు పొందారు మునయ్య. సంభాషణ చాతుర్యంలో ఆయనకు ఆయనే సాటి. పల్లె యాసలో వేదికలపై నేర్పుగా పాటకు ప్రాణం పోసి ప్రశంసలు అందుకు న్నారు. ఆయన రాగం పాత, ఆధునిక బాణీల సంగమం. కొత్త ఎత్తుగడలతో ఊపునిచ్చారు. జానపద గేయాలంటే పల్లెజనులు పాడుకునే పాటలు, అంతేకాకుండా ప్రజా జీవితం సుసంపన్నం కావడానికి చక్కటి దివ్యౌష డంగా పనిచేస్తాయని చాటి చెప్పారు
ఉల్లాసం.. ఉత్తేజం
మునయ్య వేదికపై పాటలు పాడుతుంటే ప్రేక్షకులు, శ్రోతల్లో ఉల్లాసం.. ఉత్తేజం హుషారు ప్రవాహం నాట్యం చేసేది, సరసం. . విరసం.. కలబోసిన సంభాషణలు.. సున్నిత మైన, ముదురు పాకాన పడిన హాస్య చలోక్తులు. చమత్కారాలు.. మధుర సుగంధాలు జానపద కవితా కదంబంలో అరవిచ్చిన మొగ్గలు, వ్యవసా యక, పారిశ్రామిక, సామాజిక కోణాలను దర్శిం చారు. గేయాల సేకరణపై నిరంతరం అధ్య యనం సాగించారు. ‘గురిగింజ గుమ్మడి.. కోడి పిల్ల.. కోడిబాయె లచ్చమ్మది.. యాపమానెక్కి నావ్… తేలు కుట్టిందే పిన్ని. నాంచారీ నామాట.. కోల్ కోల్.. చీరేల్.. తుమ్మెదలు. . , హాస్య గీతాలను ఆయన పాడినప్పుడు శ్రోతలు. ప్రేక్షకుల మదిలో గిలిగింతలు కలిగిస్తాయి
దారిద్ర్యం. ఆకలి.. వెట్టిచాకిరి.,. అస్పృశ్యత అణగారిన ప్రజలను మేలుకొలిపే విధంగా.. సమాజంలో జరుగుతున్న సంఘటనలను తన బాణిలో రచించి తన వాణిలో వినిపించి వెలుగులోకి తెచ్చారు
రాయలసీమ ముద్దబిడ్డగా రాగమయిగా ముద్ర వేసుకు న్నారు. ఎన్నో ఆడియో క్యాసెట్ల రూపంలో ఆయన గానం నేటికీ పదిలమే. ఆకాశవాణి, దూరదర్శన్ లో ఆయన స్వరం అమృతగుళికలే. 
నాటి రాష్ట్రపతి ప్రశంసలు
నాటి రాష్ట్రపత్రి నీలం సంజీవరెడ్డి జమ్మల మడుగు ప్రాంతంలో పర్యటించారు. ఆ సమ యంలో మునయ్య జానపద గీతాలను గానం చేశారు. కంచు మోగినట్లు. సుతిమెత్తని గణాన్ని విని అప్పటి రాష్ట్రపత్రి ప్రత్యేకంగా అభి నందించారు. ఇక చిత్ర ప్రముఖులు ఎంఎస్ రెడ్డి, టి. సుబ్బరామి రెడ్డిల నుంచి ప్రశంసలు అందుకు న్నారు. ఎంతో మంది ప్రజాప్రతిని ధులు, అధికారుల నుంచి లెక్కలేనన్ని అభినంద నలు అందుకున్నారు. ఎంతోమందికి పూలబాట చూపారు. ఎన్నో సన్మానాలు, సత్కారాలు , ప్రశంసలు అందుకుని జిల్లాలో విశేష ఆదరణ పొందారు. దురదృష్టవశాత్తు మంత్రాల యంలో ప్రదర్శన చేసేందుకు వెళుతుండగా 1997 మే ఒకటో తేదీన కర్నూలు జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లాడు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s