అల్లెం

అల్లెం అనేది రాయలసీమ ప్రాంతంలో ఒక ఆచారంగా ఉంది. కుమార్తెకు వివాహం చేసిన తరువాత అల్లుణ్ణి ఆరు నెలలు తమ యింటిలో ఉంచుకొని మంచి ఆహారాన్ని వ్వడాన్ని “అల్లెం పెట్టడం” అంటారు. ఆరుమాసాలు బాగా పౌష్టికాహారాన్నిచ్చి బలంగా తయారుచేస్తే కూతురి కడుపున ఆరోగ్యకరమైన పిల్లలు పుడతారని వారి నమ్మకం.

ఆచార విశేషాలు

పాతకాలంలో అన్నిప్రాంతాల్లో చాలా చిన్న వయసులో పెళ్ళి చేసేవారు.కొందరు అమ్మాయి యుక్తవయస్కురాలు కాకముందే చేస్తే కొందరు ఆ తర్వాత 3,4 ఏళ్లకే….. సరే పెళ్లయ్యాక ఎన్నేళ్లకో అమ్మాయిలు కాపురాలకు వచ్చేవారు…ఈలోగా అమ్మాయిని అత్తారింటికి పంపేముందు అల్లుడిని “అల్లెం”కు పిలిచేవారు. ఈ అల్లెం పెట్టడం కొన్ని నెలలపాటు సాగేది.

అల్లెం పెట్టే పద్దతి
ఈ అల్లెం సమయంలో రోజూ అల్లుడు గారికి రకరకాల ఆహారపదార్థాలు (శాకాహార, మాంసాహార పదార్థాలు) చేసి పెడతారు.ఇక పిండివంటలు చెప్పాల్సిన పనేలేదు. నేతి అత్తరాసులు (అరిసెలు, లడ్డు, కజ్జికాయలు..అంతేనా మళ్లీ వీటిని నెయ్యిలో కలుపుకుని తినాలి.
ఇక అల్లుడు గారు నీడపట్టున తింటూ కాలక్షేపం చెయ్యడం, మరీ విసుగనిపిస్తే అలా పొలాలవెంట షికార్లు తిరిగిరావటం…..
ఈ అల్లెం పెళ్ళి కొడుకుల వంటిమీద ఈగ వాలితే ఆ శరీరం నునుపుకు అది జారిపోవాలిట…..
మరీ ఇంతలా తినిపించినప్పుడు స్థూలకాయులు అవుతారనుకోకండి….
గ్రామీణ క్రీడలకు సంబంధించిన రాతిగుండును ఎత్తటం కూడా చెయ్యాలి…
అందుకే ఈ రాతిగుండ్లకు “అల్లెం గుండు” అనే పేరు వచ్చింది….. (ఆ గుండును భుజమ్మీదకు ఎత్తుకుని వీపు మీదుగా కిందకు జారవిడవాలి)
పట్టణీకరణ, పనుల వత్తిడి, యాంత్రికజీవన విధానలు, గ్రామాల సాంస్కృతిక విధ్వంసం…..ఏదైతేనేం ఈ ఆచారం మాయమైనా “అల్లెం పెళ్లికొడుకు” అనే మాట మాత్రం అక్కడక్కడా వినిపిస్తుంది…..

ఎంత సక్కగున్నాదో

ఎంత సక్కగున్నాదో మాయమ్మ రాయలసీమ ఇంత సందడి యాడ దాక్కున్యాదో ఈ నేలపైన

నల్ల రేగడి నేలల్లోనా సజ్జ జొన్న చేలా సవ్వడి వోలె నెర్రెలిగ్గిన బీడు భూమిపై సర్రున జారేటి వానసినికు వోలె పాలీ పండగా పొద్దు కొత్తల్లుడి “అల్లెం” ఇస్తారాకు వోలె రాములోరి పెళ్లి పందిట్లో యేసే చెక్క భజన చిందు వోలె

ఎంత సక్కగున్నాదో మాయమ్మ రాయలసీమ ఇంత సందడి యాడ దాక్కున్యాదో ఈ నేలపైన

ఈ అల్లెం, అల్లెము అన్న పదానికి మూలం “అల్లిరము” అన్న పదం. పెళ్ళి అయిన తోడనే యల్లునిఁ బిలిచి యత్తవారింటఁబెట్టెడు విందు, మనుగుడుపు, అల్లిరము అన్న పదానికి అర్ధం విందు అని.

అల్లెం పద ప్రాచీనత

ఈ పదం కొన్ని వందల ఏళ్లనాటిది…… పదకవితాపితామహుడు అన్నమయ్య ఈ సంకీర్తనలో ఆ దేవదేవుడిని అల్లీరము/అల్లెం తిందువు రమ్మని పిలుస్తున్న గేయాన్ని చూడండి

విచ్చేయవయ్యా వేంకటాచలము పొంత
కచ్చుగా నేమున్నచోటి కచ్యుత నారాయణా॥

అల్లనాడు లంక సాధించందరు మెచ్చగ
మల్లడి నయోధ్యకు మరలినట్లు
యెల్లగా గైలాసయాత్ర కేగి కమ్మరి మరలి
వెల్లివిరి ద్వారకకు విచ్చేసినట్లు॥

యెన్నికెతో గోమంతమెక్కి జయము చేకొని
మన్ననతో మధురకు మరలినట్లు
అన్నిచోట్లానుండి అల్లిరము లారగించ
వెన్నుడవై వేడుకతో విచ్చేసినట్లు॥

వహికెక్క ద్రిపురాలవనితల బోధించి
మహి నిందిరవొద్దికి మరలినట్లు
విహగగమన శ్రీవేంకటేశ మమ్ము గావ
విహితమై నామతిలో విచ్చేసినట్లు॥

(Wikipedia నుండి)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s