ఆంధ్రా కోఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్లు

మద్రాస్ కో అపరేటివ్ స్పిన్నింగ్ మిల్లుగా 1951 డిసెంబర్ నెలలో నెహ్రు చేతుల మీదుగా ప్రారంభించబడి..
తరువాత ఆంధ్రా కో అపరేటివ్ స్పిన్నింగ్ మిల్లుగా తన ప్రస్థానాన్ని టంగుటూరి ప్రకాశం పంతులు చేతుల మీదుగా
మొదలైన ఈ పరిశ్రమ అంచెలంచెలుగా ఎదిగి..
ఏకంగా ఆసియా లొనే అతిపెద్ద మిల్లుగా రూపాంతరం చెందింది..


64 ఎకరాల సువిశాల ప్రాంగణంలో వేల ముందికి ప్రత్యక్షంగా లక్షల రైతులకు పరోక్షంగా ఉపాధి నిచ్చింది..
ఇంగ్లాండ్ నుంచి మద్రాస్ కు పడవలో అక్కడి నుండి రైల్లో
గుంతకల్ కు కోట్ల విలువైన మిషన్లు తరలించి ఫ్యాక్టరీ మొదలుపెట్టారు..
ఎంతో మంది రైతులు స్వచ్ఛంధంగా మిసీన్లు రైళ్ల నుండి ప్రాంగణానికి తరలించి ఫేక్టరీ మొదలుపెట్టారు..
దాదాపు 40 ఎల్ల పాటు నిరాటంకంగా దిన దిన వృద్ధి తో దూసుకుపోయిన ఫేక్టరీ ఒక్కసారిగా 1991 లో మూత వేశారు..
లోపల కోట్ల విలువైన పరికరాలు తుప్పుపట్టి మట్టికొట్టుకుపోతున్నాయి..
అప్పటినుండి ఈరోజు వరకు ఒక్క నాయకుడు పట్టించుకోలేదు..ఒక్క పార్టీ కన్నెత్తి చూడలేదు గెలిచిన వాళ్ళు మిల్లు స్థలాలు ఎలా కొట్టేయ్యల అని చూస్తారు తప్పితే ఏరోజు నిజాయితీగా పోరాటం చెయ్యలేదు.

మూతపడ స్పిన్నింగ్ మిల్లు


ఉన్నపళంగా వేల మంది కార్మికులు నడి రోడ్డుమీద పడ్డారు..
ఒక్క సంస్థ పట్టించుకోలేదు రాయలసీమ కు కరువు నిత్యకృత్యం కనీసం ఇలా ఉపాధినిచ్చే పరిశ్రమలు పట్టించుకోకుంటే మన వాళ్ళు ఎలా బతుకుతారు..

రచయిత :–రాజ రాయలసీమ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s