
ఒకప్పుడు చేనేత పరిశ్రమ బాగా అభివృద్ధి చెందిన కాలంలో 1980 ,90 వ దశకంలో రాయదుర్గంలో సిల్క్ ట్విస్టింగ్ మరియు రీలింగ్ ఫ్యాక్టరీలు సుమారు 45 దాకా ఉండేవి. ప్రస్తుతం 5 నుండి 10 ట్విస్ట్టింగ్ ఫ్యాక్టరీలు మాత్రం ఉన్నాయి. అందులో పనిచేసే కార్మికుల సంఖ్య వందకు లోపే. రాయదుర్గం లో 2002-03లో 37 సిల్క్ ఫ్యాక్టరీలు ఉండగా 2003-04 నాటికి అవి 23కు తగ్గిపోయాయి. ఫలితంగా శ్రామికుల సంఖ్య 419 నుండి 322కు తగ్గిపోయింది. ఉపాధి ప్రతిఏడాదికి ఇలా తగ్గిపోతూ వుంటే ప్రజాజీవనం గగనమవుతున్నది. చిన్నతరహా పరిశ్రమలు (10,000 రూ|| ఆపైన యూనిట్లు) 310 వున్నాయి. వీటిల్లో 1684 మందికి ఉపాధి లభిస్తోంది.

10,929 మంది రాయదుర్గంలో ప్రధానంగా జీన్స్ బట్టల కుట్టే యూనిట్లు బాగా అభివృద్ధి చెందుతున్నాయి.జీన్స్ బట్టను కర్నాటక ప్రాంతం(బళ్లారి) ప్రాంతం నుంచి తెచ్చుకొని వాటిని దుస్తులుగా కుట్టిబెంగుళూరు తదితర ప్రాంతాలలో విక్రయి స్తున్నారు. ఇదే ప్రధాన ఆదాయ వనరుగా వుంది. రాయదుర్గం పట్టణంలో” పుర ‘పథకం కింద కామన్ ఫెసిలిటీ సెంటర్ 15 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయబడింది .ఇక్కడ కొంత కాలం రెడీమేడ్ గార్మెంట్ పరిశ్రమలో పనిచేయు కార్మికులకు కుట్టు శిక్షణ ఇవ్వబడింది ..ప్రస్తుతం ఈ కేంద్రం మూతపడింది. రాయదుర్గం మండలం 74 -ఉడేగోళం గ్రామం వద్ద చేనేత మరియు జవుళి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో 15 సంవత్సరాల క్రితం టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయబడింది. 55 పరిశ్రమలకు గాను ప్రస్తుతం ఐదు పరిశ్రమలు ఏర్పాటై ఉత్పత్తి కొనసాగిస్తున్నాయి. 55 సంవత్సరాల క్రితం రాయదుర్గం పట్టణంలో రెడీమేడ్ గార్మెంట్స్ పరిశ్రమకు పునాదులు ఏర్పడగా ప్రస్తుతం రాయదుర్గంలో జీన్స్ కాటన్, మొదలైన మెటీరియల్తో ప్యాంట్లు ఇతర ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. ఈ పరిశ్రమపై ఆధారపడి ప్రత్యక్షంగా 10 వేల మంది పరోక్షంగా 20,000 మంది పనిచేసి జీవిస్తున్నారు 500 కోట్లకు పైగా టర్నోవర్ నడుస్తోంది. ఇక్కడి ఉత్పత్తులు దక్షిణ భారతంలోని ప్రధాన పట్టణాలు, నగరాల తో పాటు ఉత్తరాది రాష్ట్రాలకు కూడా మార్కెట్ అవుతున్నాయి. ఈ పరిశ్రమకు అవసరమైన ముడిసరుకు అహ్మదాబాద్, సూరత్ ,ముంబై బళ్లారి, బెంగళూరు నగరాలనుండి తెప్పించ బడుతోంది. ఒకప్పుడు రాయదుర్గం కాటన్ మరియు పట్టు చేనేత చీరల తయారీకి ప్రసిద్ధిచెందినది . ఇక్కడ కార్మికులకు జీన్స్ దుస్తుల తయారీలో, ఫ్యాషన్ డిజైన్లలో నైపుణ్యం అందించగలిగితే జీన్స్ఎగుమతి ప్రధాన ప్రాంతంగా మారుతుంది. ఇక్కడ ఆపరెల్ పార్కు ఏర్పాటు చేయడం ఉపయోగకరం. ఫ్యాషన్ టెక్నాలజీ టెక్స్ టైల్ టెక్నాలజీ లాంటి ఉపాధి నందించే కోర్సులు ఇక్కడి విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలగా ఏర్పాటు చేయడం ఎంతో ఉపయోగకరం. ఈ మండలంలో గ్రానైట్ నిక్షేపాలున్నాయి. వీటిని వెలికి తీస్తే మంచి ఉపాధి లభిస్తుంది.
ఇక్కడ 5000 చేనేత మగ్గాలు ఉండేవి. అయితే ప్రస్తుతం సుమారు 200 లోపు చేనేత మగ్గాలు ఉన్నాయి. గుమ్మగట్ట మండలం లోని కర్ణాటక రాష్ట్ర సరిహద్దు గ్రామాలలో ఉన్ని కంబళ్ళ తయారీ పరిశ్రమ కేంద్రీకృతమై ఉంది. 1000 కంబళ్ళ మగ్గాలు ఉన్నా యి. చేనేతను నమ్ముకున్న కార్మికులకు తగిన సహాయ సహకారాలందిస్తే ఉపాధి విస్తరిస్తుంది. కంబళ్ళ మగ్గాలను ప్రోత్సహిస్తే వేలాది కుటుంబాలకు ఉపాధి లభిస్తుంది.
Rayadurg is a Town and Mandal in Anantapur district of Andhra Pradesh state in India. Total number of villages in this Mandal is 15. Rayadurg Mandal sex ratio is 952 females per 1000 of males.

రాయదుర్గం మండలం 336 చ.కి.మీ. విస్తీర్ణం కలిగివుంది. 2011 సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం రాయదుర్గం పట్టణ జనాభా 62,017. ప్రస్తుతం రాయదుర్గం పురపాలక సంఘం ద్వితీయశ్రేణి పురపాలక సంఘంగాకొనసాగుతోంది.మురికి వాడల సంఖ్య 22.వీటిల్లో 54.77% మందిప్రజలు ఉన్నారు.ప్రభుత్వ ఆసుపత్రి ఒకటి ఉంది.మున్సిపాలిటీ లో 34 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా అందులో 27 ఉన్నత పాఠశాలలున్నాయి.మండల జనసాంద్రత రాష్ట్ర స్థాయికి సమానంగా 275 వుంది. లింగనిష్పత్తి 976 ఇక్కడ లింగవివక్షతక్కువేనని చెప్పవచ్చు (జిల్లా స్థాయి లింగ నిష్పత్తి 958 వుంది). ఈ మండలంలో 20% మంది దళితులున్నారు. 3% మంది గిరిజనులు వున్నారు. 55% మంది ఏ ఉపాధి లేకుండా వున్నవారు ఉన్న 7,842 కుటుంబాలలో 5417(69%) కుటుంబాలుదారిద్రరేఖ దిగువన జీవిస్తున్నాయి. మొత్తం అక్షరాస్యులు 17,878 మందిలో 10,929 మంది పురుషులు, 6,949 మంది మహిళలు ఉన్నారు. మొత్తం కార్మికులు 23,816 మంది బహుళ నైపుణ్యాలపై ఆధారపడి ఉంటారు. అందులో 12,954 మంది పురుషులు, 10,862 మంది మహిళలు ఉన్నారు. మొత్తం 6,294 మంది సాగుదారులు వ్యవసాయ వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు, 4,149 లో పురుషులు సాగు చేస్తారు మరియు 2,145 మంది మహిళలు ఉన్నారు. రాయదుర్గంలో 10,671 మంది వ్యవసాయ భూమిలో పనిచేస్తున్నారు. వారిలో పురుషులు 5,179, మహిళలు 5,492 మంది ఉన్నారు.మండలంలో సగటు వర్షం 529మి. మీ. జిల్లా స్థాయితో పోటీ పడుతోంది. వర్షం అత్యల్పమనే విషయం చెప్పకనే చెపుతోంది.

హగరి లేక వేదవతి అనేనది కర్నాటకలో పుట్టి రాయదుర్గం తాలూకాలో ప్రవహిస్తుంది. ఇది తాలూకాలో దక్షిణ దిశ నుండి ప్రవేశిస్తుంది. మధ్యలో చిన్న హగరినది దీనిలో కలుస్తుంది. అక్కడి నుండి నది ఉత్తర దిశగా ప్రవహించి కర్నాటకలోనికి ప్రవహిస్తుంది. ఇదే పెద్దనీటి వనరు. ఈనది ద్వారానే రాయదుర్గం మునిసిపాలిటీకి త్రాగునీరు లభిస్తోంది. 42 చెరువులున్నాయి. 12 కాలువలు న్నాయి. చెరువుల క్రింద 1407 ఎకరాలు, కాలువల క్రింద 188 ఎకరాలు సాగుచేస్తారు. మొత్తం సాగువిస్తీర్ణం 65% వుంది. బీడు భూములు 26% అడవుల విస్తీర్ణం 9.4%గా వుంది. మండల అక్షరాస్యత శాతం 54. పురుషుల్లో 65% ఉండగా మహిళల్లో 43 శాతం మాత్రమేవుంది. 7 గ్రామాలకు 5కి.మీ. పరిధిలోపల ఉన్నత పాఠశాలలు అందుబాటులో లేవు. ఉపాధ్యాయ,విద్యార్థి నిష్పత్తి 1: 62గా ఉంది. ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులను ఎక్కువగా నియమించాలి. కె.టియస్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, అరబిక్ ప్రవేటు డిగ్రీ కాలేజి,రాయల్ పీ.జీ. సెంటర్ వున్నాయి. పట్టణంలో రెండు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు (అందులో ఒకటి బాలికలకు ప్రత్యేకించబడినవి) కలవు. ప్రైవేటు జూనియర్ కళాశాలలో రెండు ఉన్నాయి. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ,ప్రైవేటు ఐ టి ఐ, కళాశాలలు కూడా ఉన్నాయి.

అనంతపురం నుండి 100కిలోమీటర్ల దూరంలో ఉన్న రాయదుర్గంకు వేల సంవత్సరాల చారిత్రక నేపథ్యంఉంది. చరిత్ర పూర్వ యుగం నుంచి జన నివాసం ఇక్కడ ఉండేది. నూతన శిలాయుగం, లోహ యుగం నాటి అవశేషాలు రాయదుర్గం సమీపంలోని అడగుప్ప గొల్లపల్లి,బాదనహాల్ సమీపంలోని కర్నాటక రాష్ట్రం బ్రహ్మగిరి వద్ద పురాతత్వ శాస్త్రవేత్తలు జరిపిన తవ్వకాల్లో బయట పడ్డాయి. వీటి ఆధారంగా ఆదిమానవుల వికాసపరిణామంలో వివిధ దశలను ఈ అవశేషాలుతెలుపుతాయి. చిన్న రాతి సమాధులు, గుంతలమాదిరి సమాధులు గొల్లపల్లి, అడుగుప్ప వద్ద19వ శతాబ్ది చివరిలో కనుగొన్నారు. సుమారు700 వరకు ఇలాంటి సమాధులను కనుగొన్నారువీటిని సిస్టవాన్లు, ఇష్టవానులుగా పిలిచేవారువంద సంవత్సరాల క్రితం ఈ సమాధులకుఉపయోగించిన రాళ్లు, బండలను అప్పటితహసిల్దార్ రాయదుర్గానికి తరలించి ప్రభుత్వభవనాల నిర్మాణాలకు ఉపయోగించినట్లు తెలుస్తోంది మౌర్య వంశ చక్రవర్తి అశోకుని సామ్రాజ్యం రాయదుర్గం వరకు విస్తరించి ఉండేది. తరువాత శాతవాహనాలు రాష్ట్రకూటులు విజయనగర రాజులు రాయదుర్గాన్ని పరిపాలించినట్లు శాసనాలు చెబుతున్నాయి.

రాయదుర్గం పేరు వింటే చాలు రాయల ఏలుబడిలో ఉన్న ప్రాంతం అనే భావనను కలిగి స్తుంది. రాయదుర్గాన్ని మహామంత్రి తిమ్మరుసు తమ్ముడు గోవిందామాత్యుడు పరిపాలించినట్లు తెలుస్తోంది. 15వ శతాబ్దంలో పాలెగాళ్ల ప్రాబల్యం పెరగడంతో వారిని అణచివేసేందుకు విజయనగర రాజు భూపతి రాయలను ఇక్కడి కి పంపినట్లు శాసనాలు ఉన్నాయి. అతను పాలెగాళ్లను అణచివేసి తనే దుర్గానికి రాజుగా ప్రకటించు కున్నాడు. అప్పటి నుండిభూపతి రాయల దుర్గంగా పిలువబడింది.కాలక్రమంలో ఈ ప్రాంతం రాయదుర్గంగా రూపాంతరం చెందింది.

రాయల పాలన అనంతరం దుర్గాన్ని నాయకులు (బోయలు బేడర్లు) పరిపాలించారు. కుందుర్పి పాలకుడు పెద్దకోనేటి నాయకుడు 1652 సంవత్సరంలో రాయదుర్గం పై దాడి చేసి పెద్ది బొమ్మనాయక్ ను జయించి ఆయన దుర్గం రాజుగా ప్రకటించుకున్నారు. బెలుగుప్ప సమీపంలోని హానకహాల్ గ్రామం వద్ద ఇందుకు సంబంధించిన శాసనం ఉంది. ఆయన అనంతరం వారసులు వెంకటపతి నాయకుడు, తిమ్మప్ప నాయకుడు, అతని తల్లి లక్ష్మమ్మ ఆ ప్రాంతాన్ని పాలించారు.

రాయదుర్గం వీర వనిత మహారాణి లక్ష్మమ్మ , చిత్రదుర్గం పాళెగాడు బరమప్ప నాయకున్ని తరిమికొట్టింది. ఈ దుర్గం నాయకులతో వియ్యం అందుకుని తెలుగు కన్నడ భాషలకు చుట్టరికం కలిపింది. అనంతరం ఆంగ్లేయులు, టిప్పు సుల్తాన్ మధ్య జరిగిన యుద్ధానంతరం రాయదుర్గంఆంగ్లేయుల పాలనలోకి వెళ్లింది.

దత్త మండలాల్లో భాగంగా రాయదుర్గం తొలుత బళ్లారి జిల్లాలోనూ, మద్రాసు ప్రెసిడెన్సీలో, రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో అంతర్భాగమయింది.
బలిష్టమైన గిరి దుర్గంగా ఆనాటి రాజులు దీనిని నిర్మించారు. రాయదుర్గాన్ని ఆలయాల దుర్గంగా పిలుస్తారు.కొండపైన, దిగువకు వందకు పైగా పురాతన కట్టడాలు, ఆలయాలు ఉన్నాయి. కోటపై ఉన్న ఆలయాలు, నాలుగు ప్రాకారాల కోట, కోనేరు, బురుజులు, కట్టడాలను పరిశీలిస్తే ఒకప్పుడు అని మహోన్నత దుర్గంగా వెలసినట్లు అర్థం అవుతుంది. తర్వాత కాలంలో వీటికి రక్షణ కరువై శిథాలావస్థకు గురైనాయి. జైనుల ఆనవాళ్లు
సిద్దేశ్వరాలయం ఆనాటి జైన విద్యాలయంగా విలసిల్లినట్లు అక్కడ ఉన్న శాసనం ద్వారా తెలుస్తుంది. కొనకొండ్లలో నివాసం ఉన్న కుందాచార్యులు ఆ విద్యాలయాన్ని స్థాపించినట్లు అందులో పేర్కొన్నారు. జైనతీర్ధంకుల విద్యాభ్యాసం తదితర చిత్రాలన్ని శిలా శాసనాలలో కన్పిస్తాయి.

బౌద్ధ,జైన,శైవ, వైష్ణవ మతాలు ఈ ప్రాంతంలో సామరస్యంతో మసిలాయి. కొండపై పల్నాడు యల్లమ్మ, మాధవరాయస్వామి. పట్టాభి సీతారామ స్వామి, వెంకటరమణ స్వామి,దశభుజ గణపతి,

వేణుగోపాలస్వామి, నరసింహస్వామి, ఆంజనేయ స్వామి తదితర పురాతన ఆలయాలు ఉన్నాయి.మూడు కన్నులతో దశభుజాలతో చేతిలో సుదర్శనాయుధాన్ని పట్టుకొని అనంతపురం జిల్లాలోని రాయదుర్గంలోప్రథమారాధ్యుడు కొలువైనాడు. ఈ స్వామికి పది చేతులుండడంతో దశభుజగణపతిగా ప్రసిద్ధి కెక్కినాడు. ఫాలభాగంలో మూడవ నేత్రంతో అరిష్టాలను తొలగించే వానిగా ఖ్యాతి చెందాడు కనుకనే ఈ గణపతిని ముక్కంటి గణపతిగా కొనియాడబడుతున్నాడు.

ఇక్కడి గజాననుడు పదిచేతులలో – నారికేళం, చక్రం, త్రిశూలం, ధనుస్సు, అంకుశం, శంఖం, పవిత్రం, శరం, ఖడ్గంలాంటి ఆయుధాలను ధరించి తన దేవేరి అయన సిద్ధితో కలసి దర్శనం ఇస్తాడు.ఈ స్వామి ఎడమ అరికాలి కింద అష్టదళ పద్మం వికసించి ఉంటుంది. ఇలాంటి గణపతి స్వరూపాన్ని మహాగణపతిగా ఆరాధిస్తారు. ఈముక్కంటి గణపతి ఆధ్యాత్మిక సాధన చేసేవారి సాధనలు ఫలప్రదం చేయడంలో ముఖ్యడంటారు.ఈ దశభుజగణపతి కోరిన కోరికలు సిద్ధింపచేసే వానిగా ప్రసిద్ధి కెక్కిసిద్ధివినాయకుడన్న ఖ్యాతి గడించాడు. ఈ స్వామికి కుడివైపున సూర్యుడు, ఎడమవైపున చంద్రుడూ ఉంటారు. వీని వల్ల విశ్వగణపతిగా కీర్తిస్తారు. సుఫలాలను ప్రసాదిస్తారనడానికి ప్రతీకగా స్వామి చేతిలో నారికేళం ఉంటుంది. ఈ దశభుజగణపతికి కోరికను చెప్పి ముందు ఒక కొబ్బరికాయను కొట్టి కోరిక తీరిన తర్వాత తిరిగి 107 కొబ్బరికాయలను నివేదించడం ఇక్కడి ఆచారం. ఈదశభుజ గణపతి ఆలయాన్ని పద్నాల్గవ శతాబ్దంలో భూపతిరాయలు నిర్మించారని చారిత్రికాధారాలు చెబుతున్నాయి. మంగళవారాల్లో మహాగణపతికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. ప్రతినెలా సంకటాలు తొలిగించమని కోరుతూ సంకట చతుర్థిని నిర్వహిస్తారు. ఈ దశభుజ గణపతి ఆలయం పక్కనే నరసింహుని ఆలయం కూడా ఉంది. లక్ష్మీదేవి సమేత లక్ష్మీనరసింహస్వామి కొలువైన ఈ నరసింహుని ఆలయం కూడా రాయలనాటి కాలంనాటిదని అంటారు. వీటిని చూడడానికి యాభైకిలోమీటర్ల దూరంలో ఉన్న కర్ణాటక బళ్లారి నుంచి యాత్రీకులు అనేకమంది ప్రతిరోజు వస్తుంటారు.

రాయదుర్గం ప్రాచీన చరిత్ర ఔన్యత్యాన్ని కాపాడడానికి కేంద్ర పురావస్తు శాఖ కేవలం రెండు ఆలయాల వద్ద మాత్రమే ప్రాచీన స్మారక చిహ్నాల నోటీసు బోర్డులను ఏర్పాటు చేసింది.మాధవరాయ స్వామి ఆలయాన్ని పునరుద్ధరణ గావించింది.కొండ పై ప్రజలు వెళ్లి వచ్చేందుకు అనువైన రహదారిని, పర్యాటకులు అక్కడికి వెళ్లి వచ్చేందుకు కనీస అవసరాలు, తాగునీరు, వీధి దీపాలను కల్పించడంచేస్తే పర్యాటకులకు అనుకూలంగా ఉంటుంది.