పుష్పగిరి

తాడిపత్రి -కడప రహదారిలో యర్రగుంట్ల, కమలాపురం దాటిన తరువాత వల్లూరు అనే చిన్న పట్టణం వస్తుంది. ఇప్పుడు చిన్న పట్టణం అయినా దాదాపు 250 సంవత్సరాలు ములికినాటి సీమ ప్రధాన పట్టణాలలో ఒకటిగా, నల్గొండ నుండి కోలార్ వరకు ఒంగోలు నుండి గుత్తి వరకు విస్తరించి కొంత కాలం స్వతంత్య్ర రాజ్యంగా ఉన్న కాయస్థ రాజ్యానికి వల్లూరు రాజధాని.


ప్రస్తుత కడపజిల్లా కళ్యాణీ చాళుక్యుల పాలనలో ఉండగా, కళ్యాణి చాళుక్య ప్రభువైన త్రైలోక్యమల్ల మహారాజు / త్రైలోక్య వల్లభరాజు పేరు మీద ములికినాటి సీమలో త్రైలోక్య వల్లభాపురం కట్టించారు.ఆ త్రైలోక్య వల్లభాపురమే నేటి వల్లూరు. ఈ త్రైలోక్యవల్లభాపురం /వల్లూరు పట్టణం నుండే త్రైలోక్యమల్ల మహారాజు కొంత కాలం పరిపాలించాడని, ములికినాటి సీమను త్రైలోక్యమల్లుడి తరుపున పాలించడానికి నియమింపబడ్డ కాకరాజు శాలివాహక శకం 1044 వ సంవత్సరం (క్రీ.శ 1123) గండికోటను కట్టించాడని గండికోట కైఫీయత్తు చెబుతుంది.
భువనేకమల్ల రాజు తరువాత చేసిన త్రైలోక్య మల్లదేవ మహారాజు రాజ్యపాలన చేశాడన, అతనికే త్రైలోక్య వల్లభరాజు అనే పేరు కూడా ఉందని, ఈ త్రైలోక్యవల్లభుడే తనపేరు మీద త్రైలోక్య వల్లభాపురం అనే కోట, పట్టణం కట్టించాడని కమలాపురం కైఫీయత్తు తెల్పుతుంది.


కైఫీయత్తుల్లో పేర్కొన్న కాలము, పుష్పగిరి శాసనాల ప్రకారము చూస్తే కళ్యాణి చాళుక్య రాజులలో అత్యంత ప్రసిద్ధి చెందిన త్రిభువనమల్ల ఆరవ విక్రమాదిత్య మహారాజే ఈ త్రైలోక్య మల్ల / త్రైలోక్య వల్లభ మహారాజు అని రూఢీ అవుతుంది.
వల్లూరుపట్టణం, కోట వల్లూరు, త్రైలోక్య వల్లభాపురం వంటి పేర్లతో పిలవబడిందని తెలుస్తోంది.
కోట అంటే మాటలు కాదు. రాజు, రాజ పరివారం, సైన్యం, అంతఃపుర స్త్రీలు, వారి పరిచారికలు, అంతఃపుర సిబ్బంది, కాపలావారు ఇలా అనేక మంది ఉంటారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల ఆర్థిక వ్యవస్థ ఆ కోట మీద ఆధారపడి ఉంటుంది . కోటలో పనిచేసే అందరూ కోటలో నివాసం ఉండరు. చుట్టుపక్కల పల్లెల్లో నివాసం ఉంటూ పనివేళల్లో కోటలో పనిచేసుకుని వెళుతూ ఉంటారు. అలా ఒక కోటలోని పనిచేసే పనివారి పేరుమీదనే ఆ కోట చుట్టుపక్కల 6 గ్రామాలు ఏర్పడి ఇప్పటికీ అవే పేర్లతో చెలామణి అవుతున్నాయి.

వల్లూరు కోటలోని అంతఃపురస్త్రీలకు సైరంధ్రిత్వం చేసేవారికి, కొప్పులు ముడిచేవారికి జాగీరుగా ఇచ్చిన స్థలంలో వాళ్లు కట్టించిన గ్రామానికి కొప్పోలు అని పేరు ఏర్పడింది.
వల్లూరు కోట రక్షణకు నాలుగు వైపులా నాలుగు పహారా బురుజులు(watchtowers) ఉండేవి. ఉత్తర బురుజుకు ఉత్తరాన మిట్ట ప్రాంతంలో(దిన్నె) ఒక చౌకీ ఉండేది.అక్కడ కొంతమంది కాపలామనుషులు తుడిమెలు(ఒకరకమైన వాద్య పరికరం) , కొమ్ములు వంటి వాయిద్యాలతో నిత్యం పహారా కాసేవారు. వారిపేరున తుడుములదిన్నె గ్రామం ఏర్పడింది.
అలాగే తప్పెట్లు వాయించేవారు ఉండే గ్రామం తప్పెట్ల అవ్వగా కొమ్ములు వాయించేవారు ఉండే గ్రామం కొమ్మలూరు అయ్యింది.
కోటకట్టిన కామాట్లు ఉండే ఊరు కొట్లూరైంది.
కోటలో ఉండే గొటగస్తీ వారు(గోట గస్తీ / కోట గస్తీ / కాపలా?) ఉండేవారు ఇళ్లు కట్టుకుని ఉండే గ్రామం గోటూరు అయ్యింది
వల్లూరు కోట కట్టించి దాదాపు 1000 సంవత్సరాలు అయ్యింది. వివిధ రాజవంశాలకు రాజధానిగా, దాదాపు 250 సంవత్సరాలు ములికినాటిసీమలో ప్రధాన పట్టణంగా ఉన్నది. ఇప్పుడు కోటలేదు, దాని ఆనవాళ్లు లేవు. అయినప్పటికీ వల్లూరు పట్టణం, వల్లూరును అనుకుని తుడుములదిన్నె, గోటూరు, తప్పెట్ల, కొప్పోలు, కొట్లూరు, కొమ్మలూరు గ్రామాలు ఇప్పటికీ ఉన్నాయి, నాటి వల్లూరు వైభవానికి ప్రతీకలుగా.
ఈ కొట్లూరు గ్రామానికి సమీపంలోనే వల్లూరు పట్టణ వైభవానికి, చరిత్రకు సాక్షిగామిగిలిన ప్రఖ్యాత శైవక్షేత్రం పుష్పగిరి ఉంది.

Pushpagiri temple

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s