
ఘంట మండపం :-
బంగారు వాకిలికి గరుడ సన్నిధికి మధ్యగల ప్రదేశం. బ్రహ్మది సకల దేవతాగణాలు స్వామి వారి సందర్శనకు వేచిఉండే ప్రదేశం. దీనినే మహామణి మండపం అంటారు.శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి.. దానికి ఎదురుగా ఉన్న గరుడ మందిరాన్ని అనుసంధానిస్తూ ఘంటా మండపం నిర్మితమైంది చంద్రగిరి వాస్తవ్యుడు, విజయనగర సామ్రాజ్య మంత్రివర్యుడు అమాత్యమల్లన ఈ మండపం నిర్మాణం మొదలు పెట్టించి క్రీస్తుశకం 1417 ఆగస్టు 25 నాటికి పూర్తి చేయించినట్లు శాసన ఆధారాలు ఉన్నాయి. దీనిని మహామణిమండపం, ముఖమండపం అని కూడా వ్యవహరిస్తారు. నాలుగు వరసలుగా మొత్తం 16 స్తంభాలపై ఘంటామండపం నిర్మితమై ఉంటుంది. ఈ స్తంభాలపై భూ వరాహస్వామి, నృసింహస్వామి, మహావిష్ణువు. వేంకటేశ్వరస్వామి వరదరాజస్వామి ఇత్యాది శిల్పాలు చెక్కి ఉన్నాయి. ఇటీవలికాలంలో ఈ మండపానికి ఇత్తడి కటాంజనంతో వాకిళ్లను ఏర్పాటు చేశారు. ఈ మండపంలో బంగారు వాకిలికి ఎదురుగా గరుడాళ్వార్ మందిరం ఉంది
పూర్వం జయవిజయులకు ఇరువైపులా రెండు పెద్ద గంటలు ఉండేవి. హారతి సమయాలలో వీనిని మ్రోగించేవారు. దీనిని ఘంటపని అనేవారట. ఈ గంటలననుసరించే స్వామి వారి ఆహారసేవనలు పూర్తి అయ్యాయని భావించి తదనంతరం చంద్రగిరి రాజులు ఆహారం సేవించేవారట.
ఇప్పుడు రెండూ ఒకేచోటికి చేర్చారు. దర్శనానంతరం వెలుపలకు వచ్చే ద్వారం ప్రక్కనే ఉంటాయి.
గరుడ సన్నిధి :-
వేంకటేశ్వరస్వామి ఆలయ బంగారు వాకిలికి ఎదురుగా గరుడ మందిరం నిర్మితమై ఉంటుంది. స్వామివారికి అభిముఖంగా నమస్కార భంగిమలో రెక్కలు విప్పుకుని నిలిచి ఉన్న గరుత్మంతుని శిలాప్రతిమ గరుడ మందిరంలో ప్రతిష్టించి ఉంటుంది. క్రీస్తుశకం 1712 నాటి శాసనాల్లో గరుడ మందిరం ప్రస్తావన ఉన్నట్లు చరిత్ర పరిశోధకులు చెబుతున్నారు, గరుడ మందిరంపై మూడు బంగారు కలశాలున్న గోపురం నిర్మించి ఉంది. ఈ మందిరం వెలుపలి వెనుక భాగంలో బంగారుపూత రేకులు తాపడం చేసి ఉంటాయి.మూలవిరాట్ కు ఎదురుగా జయ విజయులకు వెలుపలగా గరుడాళ్వారులు గారు ఉన్న మండపం. బంగారు వాకిలి ఎదురుగా, గరుడాళ్వార్ మందిరం ఉంది. శ్రీస్వామివారికి అభిముఖంగా, నమస్కార భంగిమలో సుమారు 5 అడుగుల ఎత్తు ఉన్న గరుడాళ్వారు శిలాప్రతిమ ప్రతిష్టించబడింది. ఈ మందిరానికి వెలుపల అంతటా బంగారం రేకు తాపబడింది. ఈ శిలామూర్తి గాక శ్రీవారి ఆలయంలో గరుడాళ్వార్ చిన్న పంచలోహ ప్రతిమ, బంగారు గరుడ వాహనం కూడా ఉన్నాయి.
ద్వారపాలకులు :-
బంగారు వాకిలికి వెలుపలగా ఇరువైపులా ఉండే జయ విజయులు.
మహాలఘుదర్శనం ఇక్కడే చేసుకొంటారు.
3 వ మూడవ ప్రాకారం :-

బంగారువాకిలి :-
శ్రీ వేంకటేశ్వరస్వామి వారి సన్నిధికి వెళ్లడానికి అత్యంత ప్రధానమైన ఏకైకద్వారం బంగారువాకిలి. వాకిలికి, గడపకు అంతటా బంగారు రేకు తాపబడినందువల్ల ఈ ప్రవేశద్వారానికి బంగారు వాకిలి అనే ప్రసిద్ధి ఏర్పడింది. ప్రతిరోజూ ఈ బంగారువాకిలి ముందు తెల్లవారుజామున సుప్రభాతం పఠనం జరుగుతుంది. ప్రతి బుధవారం భోగ శ్రీనివాసమూర్తికి, శ్రీ మలయప్పస్వామి వారికి ఇక్కడే సహస్ర కలశాభిషేకం జరుగుతుంది.
స్నపన మండపం :-
బంగారువాకిలి దాటి లోపలికి వెళ్లిన వెంటనే ఉండేదే ‘స్నపనమంపం’. క్రీ.శ. 614 లో పల్లవరాణి రామవై ఈ మండపాన్ని నిర్మించి, భోగ శ్రీనివాసమూర్తి వెండి విగ్రహాన్ని సమర్పించిందట. ఈ స్నపనమండపాన్నే తిరువిలాన్కోయిల్ అంటారు. ఆనందనిలయం జీర్ణోర్ధరణ సమయంలో ఈ మండపం నిర్మించబడిందని చెబుతారు.
ప్రతిరోజూ తోమాలసేవ అనంతరం కొలువు శ్రీనివాసునకు ఆరోజు పంచాంగం, చేయవలసిన పూజాదికాలు, క్రితంరోజు హుండీ ఆదాయాది జమ ఖర్చులు వివరిస్తారు.
దీనిలో కుడివైపున అనగా దక్షిణ దిక్కున హుండీ మరియు ఎడమవైపున అనగా ఉత్తర దిక్కున శ్రీవారి ఆభరణాలు భద్రపరిచే గది ఉంటాయి.
రాములవారి మేడ :-
స్నపనమండపం దాటగానే ఇరుకైన దారికి ఇరువైపుల ఎత్తుగా కనిపించే గద్దెలు. ”రాములవారిమేడ”. తమిళంలో మేడు అంటే ఎత్తయిన ప్రదేశం అని అర్థం.
ఇక్కడ రాములవారి పరివారమైన అంగద, హనుమంత, సుగ్రీవుల విగ్రహాలున్నాయి. ప్రస్తుతం ఆనందనిలయంలో ఉన్న శ్రీ సీతారామలక్ష్మణుల విగ్రహాలు ఇక్కడ ఉండేవని, అందువల్లే ఇది రాములవారి మేడ అని పిలువబడుతోంది.
శయనమండపం :-
రాములవారి మేడ దాటి లోపల ప్రవేశించిన వెంటనే ఉన్న గదే శయనమండపం. శ్రీవేంకటేశ్వరస్వామివారు వెలసిన గర్భాలయానికి ముందున్న అంతరాళమే శయనమండపం. ప్రతిరోజూ ఏకాంత సేవ ఈ మండపంలో వెండి గొలుసులతో వేలాడదీసిన బంగారు పట్టె మంచంమీద శ్రీ భోగ శ్రీనివాసమూర్తి శయనిస్తారు.నిత్య ఆర్జిత సేవలైన తోమాల సేవ, సుప్రభాత సేవ, అన్నమాచార్య సంకీర్తనం నిర్వహిస్తారు. రాత్రి పూట దివ్య ప్రబంధం, సహస్రనామ పఠనం, వేద పఠనం చేస్తారు.
కులశేఖరపడి :-
శయనమండపానికి, శ్రీవారి గర్భాలయానికి మధ్యన రాతితో నిర్మించిన ద్వారబంధం ఉంది. అదే కులశేఖరప్పడి.
పడి అనగా మెట్టు, గడప అని అర్థం.

ఆనందనిలయం :-
కులశేఖరపడి అనే బంగారు గడపను దాటితే ఉన్నదే శ్రీవారి గర్భాలయం. శ్రీవేంకటేశ్వర స్వామివారు స్వయంభువుగా సాలగ్రామ శిలామూర్తిగా ఆవిర్భవించి ఉన్నచోటే గర్భాలయం. దీనినే ” గర్భాలయం ” అనికూడా అంటారు. ఈ ఆనంద నిలయంపై ఒక బంగారు గోపురం నిర్మించబడింది. దీనినే ఆనందనిలయ విమానం అంటారు.

శ్రీ వేంకటేశ్వరస్వామి (మూలవిరాట్టు) :-
గర్భాలయంలో స్వయంవ్యక్తమూర్తిగా నిలిచివున్న పవిత్ర శిలా దివ్యమూర్తి శ్రీ వేంకటేశ్వరస్వామి. నిలబబడివున్నందున ఈ ఆర్చామూర్తిని ”స్థానకమూర్తి” అంటారు.
అంతేగాక స్థిరంగా ఉన్నందువల్ల ”…. ధ్రువమూర్తి ….” అని, ”ధ్రువబేరం” అని కూడా అంటారు.
శ్రీ స్వామివారి మూర్తి అత్యంత విలక్షణమైన పద్ధతిలో దర్శనమిస్తూ భక్తులను ఆనందింపజేస్తున్నది. సుమారు 8 అడుగుల ఎత్తుగల స్వయంభూమూర్తి.
ఈ మూలమూర్తికి ప్రతినిధులు గా
కొలువు శ్రీనివాస మూర్తి
భోగ శ్రీనివాస మూర్తి
ఉగ్ర శ్రీనివాస మూర్తి
మలయప్ప స్వామి
అను ఉత్సవ విగ్రహాలు కూడా ఉన్నాయి.
ఇంకా
సీతారామలక్ష్మణులు
శ్రీకృష్ణ రుక్మిణి లు
చక్రతాళ్వారులు
శాలిగ్రామ శిలలు ఉన్నాయి.
(స్వామికి ప్రతిరుపాలుగా వీనికి నిత్య అభిషేకాలు జరుగుతాయి.)
ముక్కోటి ప్రదక్షిణం :-
రాములవారి మేడ చుట్టూ చేసే ప్రదక్షిణం.
వైకుంఠ ఏకాదశి మరియు ద్వాదశినాడు ఈ ద్వారం గుండా దర్శనం ఉంటుంది.
అలంకరణ :-
శిఖామణి: కిరీటం మీది నుంచి రెండు భుజాల మీదివరకు అలంకరించే ఒకే దండను ‘శిఖామణి’ అంటారు. ఇది 8 మూరల దండ. సాలిగ్రామ మాల: శ్రీవారి భుజాల నుంచి ఇరువైపులా పాదాల వరకు వేలాడుతున్న సాలిగ్రామ మాలలకు ఆనుకొని వేలాడదీస్తూ అలంకరించే పొడవైన పూలమాలలు. ఇవి రెండు మాలలు. ఒక్కొక్కటి సుమారు 4 మూరలు ఉంటాయి. కంఠసిరి: మెడలో రెండు పోర్వలుగా రెండు భుజాలమీదికి అలంకరించి ఉండే దండ ఒకటి. 3 1/2 మూరలు. వక్షస్థల లక్ష్మి శ్రీస్వామివారి వక్ష స్థలంలో ఉన్న శ్రీదేవి భూదేవులకు రెండు దండలు ఒక్కొక్కటి 11/2 మూర. శంఖుచక్రం : శంఖు చక్రాలకు రెండు దండలు. ఒక్కొక్కటి ఒక్కో మూర. కంఠారిసరం: స్వామి వారి బొడ్డునున్న నందక ఖడ్గానికి అలంకరించే దండ. ఒకటి 2 మూరలు. తావళములు: రెండు మోచేతుల కింద, నడుము నుంచి మోకాళ్లపై హారాలుగా, మోకాళ్ల నుంచి పాదాలవరకు జీరాడుతూ వేలాడదీసే మూడు దండలు. 1 మూడు మూరలు, 2.3 1/2 మూరలు. 3.4 మూరలు
తిరువడి దండలు: శ్రీస్వామివారి పాదాలపై చుట్టూ అలంకరించే రెండు దండలు ఒక్కొక్కటి ఒక్కో మూర. ప్రతి గురువారం సాయంత్రం జరిగే పూలంగి సేవ’లో మాత్రమే శ్రీస్వామివారి మూల మూర్తికి ఆభరణాలన్నీ తీసివేసి, పైన పేర్కొన్న మాలలతోపాటు నిలువెల్ల స్వామివారిని విశేషంగా పూలమాలలతో అలంకరిస్తారు.
మూలాలు:-ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శ్రీవారి బ్రహ్మోత్సవాల ప్రత్యేక వ్యాసం.
ఈనాడు పత్రిక లో వ్యాసాలు. THE DIVINE STRUCTURE OF THE TIRUMALA MAIN TEMPLE
సరిగా ఉన్నాయి
LikeLike