(రాయలసీమ పాట)

పల్లవి

కాలే కడుపుల చిరునామ….కరువు రక్కసికి వీలునామ…
అతుకుల బతుకుల సరంజామ…రాయలేలిన ఈ సీమ….
రాయలేని కన్నీటి సీమ ||కాలే||

చరణం 1

రతనాల రాశులెటు పోయెను…వ్యసనాల బతుకులే మిగిలిను…
కోటి కష్టాల కడలిలో..తలమునకలై ఎదురీదినా…
మెతుకుల కొరకు గతుకుల దెబ్బలు… ఎన్నెన్నొ తగులుతున్నా…
ఆగిపోనీ జీవనపోరాటం …సాగుతున్న తీరని ఆరాటం …||కాలే||

చరణం 2:

పసిడి పంట పండాలని..ఆలి పుస్తెలమ్మి పని చేసినా.
ఎముకల సున్నం కరిగెను…. ఎండమావులే మిగిలెను.
ముప్పై ఎకరాలున్నా గానీ….పూటగడవనీ దీనావస్థతలో…
అలుపే ఎరుగని హలికుని శ్రమ దానం..
అలుసౌతున్నది ఆ శ్రమ సౌందర్యం….||కలే||

చరణం 3

కరువు పోటు కాటేయగా..ఇరవు తనకు ఇక లేదనీ.
ఆలుబిడ్డలను వదిలేసి.. ఆమళ్ళ దూరమే వెళ్ళగా.
డొక్కలు మాడిన మంటతో.. గుక్క పట్టి ఏడుస్తూ ఉంటే
బాధను ఎవరు తీర్చగ వస్తారు…ఆ గాథకు ఎవరు ఖరీదు కడతారు||కాలే ||

(అప్పిరెడ్డి వెంకటరెడ్డి స్మారక రాయలసీమ పాటల పోటీలలో తృతీయ బహుమతి పొందిన కవిత.)

కె.సి.మల్లికార్జున

కె.సి.మల్లికార్జున సంతేకూడ్లూరు గ్రామం, ఆదోని, కర్నూలు

చరవాణి:8008145357

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s