పల్లవి.
ఎన్నాళ్ళని వేచి ఉందువు ఓరన్న నీవు రాయలసీమ
రైతు సోదరా ఓరన్న నీవు రాయలసీమ రైతు సోదరా
అనుపల్లవి..
చరణం 1…
ఎండిపోయిన పంటభూమి ఇగిరిపోయిన నదులనీళ్ళు
బతుకు నీడ్చ భారమయిన బాధతీర్చు నాథుడెవరు?
మధ్యయుగం దొరలంతా దగా చేసి దండుకున్న –
చేయిచాచి అడగలేదు నిలదీసి అడగలేదు
మోచేతి నీళ్ళు విడిచి మొఖమెత్తి నిలవరించి
నిధులు నీళ్ళు నౌకరికి ఉద్యమాల బాటనడువు. “ఎన్నాళ్ళని”
చరణం 2
తమిళతంబి వేరుపడగ బళ్ళారీ బాటమారె
తెలుగు రాయల సంస్కృతి కన్నడరాయలగ మారె
తుంగభద్ర, బళ్ళారి ఇనపగనులు విడిపోయె
కర్నూలు మనకనగా కపట నైజాముతొ కలసిపుడు
తెలంగాణగ విడిపోవగ కోస్తాంధ్రుల కలియుటేల?. “ఎన్నాళ్ళని”
చరణం3
శ్రీబాగు ఒప్పందం చెరిపేసిన పెద్దమనిషి
అడ్డమైన కట్టలేసి ఆంధ్రవైపు మొగ్గుచూపి
సీమబాగుకోరలేక కోస్తాంధ్ర వైపుతిప్పి,
రత్నాలు పండుసీమను రళ్ళసీమగమార్చివేయ “ఎన్నాళ్ళని”
చరణం 4
తెలంగాణ, జై ఆంధ్ర ఉద్యమాలు లేచినపుడు
రాయలసీమ ఉద్యమాల రాళ్ళలోన తొక్కినారు
రాళ్ళకష్టాలు మీకు రత్నాలుమాకనుచు,
కర్మాగారాలన్ని కోస్తాంధ్ర చేరవేయ
ఖర్మకింద లెక్కేసి కళ్ళనీళ్ళురాల్చుటేల? “ఎన్నాళ్ళని”
చరణం 5
పౌరుషాన నిలిచినట్టి పోతుగడ్డ పైనిలిచి
కలంఖడ్గంగ పూనిన కవుల బాటనెన్నుకొని-
సంఘాన్ని దారికి తెచ్చు వేమన,బ్రంహ్మం తలచి,.
పెనుగొండ,కొండరెడ్డి, గండికోట బురుజులెక్కి. చంద్రగిరి,తిరుమలేశు,భాగ్యాన్ని తలచుకొని,
రాయలసీమ ప్రజలంత ఒకేమాట బాటపట్టి..
జైసీమ మాసీమ, రాయలసీమని కదులు. “ఎన్నాళ్ళని”
(అప్పిరెడ్డి వెంకటరెడ్డి స్మారక రాయలసీమ పాటల పోటీలలో ద్వితీయ బహుమతి పొందిన కవిత.)

ధర్మిశెట్టి రమణ(వెంకట రమణయ్య.) మైదుకూరు. కడప
9704153892.