చిత్రమేలి

రాయల సీమ రతనాల దట్టి 
పాలూరు భూముల పగడాల పట్టి || పల్ల వి||
కాని… కరవు రక్కసి వచ్చి తలపులు తట్టే
కరువు బండలు మోయ తలవంచి పెట్టె || అనుపల్లవి||

చిరు ధాన్యములకు చీరా మాగాణి
సేరున్న పంటలకు పెన్నామాగాణి
పుడమి పులకింతలకు పొద్దు సింగారం
కోరినా వరములకు కొంగు బంగారం ||పల్లవి||

దానిమ్మ నారంజ చెరకు వరి తోటల్లో
దాసంగములకు దవనంపు ఘుమ ఘుమలు
దాసరయ్యులు వచ్చి గోవిందా యనగా
నేడు- శప్త శపథాలకు కాడు బీడుళ్లు ||పల్లవి||

ముసలమ్మ బందక్క వీరనాగమ్మలు
చెరువులకు బలులైరి తెగకుండ వానలకు
వారి త్యాగాలు అడుగంటె చెరువు నెర్రెల్లో కోరి
కథలెన్నొ కొలువుండె కవుల కలాల్లో. ||పల్లవి||

నాడు – చిత్రమేలి సేద్యం సిరులు పండించే
దశబంధ కృషి తోడ ధరలు నిందించె
నేడు – వలసా పక్షలయ్యి వలవల యేడ్పించె
బ్రదుకు భారామయ్యి గుండెలార్పించె. ||పల్లవి||

(అప్పిరెడ్డి వెంకటరెడ్డి స్మారక రాయలసీమ పాటల పోటీలలో ప్రథమ బహుమతి పొందిన కవిత.)

గురువేపల్లి నరసింహులు

శ్రీ గురువేపల్లి నరసింహులు, అష్టావధాని, కవి, పరిశోధకులు,
కళ్యాణదుర్గం, అనంతపురము జిల్లా.
9441411190

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s