భాష్యకార్ల సన్నిధి :-

ఇందులో శ్రీమద్ రామానుజాచార్యులు గారి విగ్రహం ఉంటుంది. శ్రీవారికి ఏం ఏం కైంకర్యాలు ఏవిధంగా చేయాలో మానవాళికి అందించిన గొప్ప వ్యక్తి.

తన 120 సం.ల కాలంలో 3 పర్యాయాలు తిరుమలకు మోకాళ్ళ మీద వచ్చాడు. అలా వస్తున్నపుడు ఆయన ఆగిన ప్రదేశమే మోకాళ్ళ పర్వతం.

ఈనాటికి కాలినడకన వచ్చే భక్తులు ఈ పర్వతాన్ని మోకాళ్ళతో ఎక్కడం గమనించవచ్చు.

ప్రధాన వంటశాల (పోటు) :-

విమాన ప్రదక్షిణంలో ఉన్న ప్రధాన వంటశాలను పోటు అంటారు. ఈ వంటశాలలో దద్దోజనం, చక్కెరపొంగలి, పులిహోర, ముళహోర, కదంబం, పొంగలి, సీరా, మాత్రాలతో పాటు కల్యాణోత్సవ దోశ, చిన్నదోశ, తోమాల దోశ, జిలేబి, పోలి, పాల్‌ పాయసం, అప్పం మొదలైనవాటిని తయారు చేస్తారు. ఆయా నియమాలను అనుసరించి వీటిని స్వామివారికి నివేదన చేస్తారు.

పరకామణి :-

స్వామి వారికి భక్తులు సమర్పించిన నగదు లెక్కించే ప్రదేశం.

చందనపు అర :-

స్వామి వారికి సమర్పించే చందనాన్ని భద్రపరిచే ప్రదేశం.

ఆనందనిలయ విమానం :-

ఆనందనిలయం పైన ఉన్న బంగారు గోపురాన్ని ఆనందనిలయ విమానం అంటారు.

గరుత్ముంతులవారే ఈ గోపురాన్ని వైకుంఠం నుండి భూమిమీదకు తీసుకు వచ్చారని చెప్తారు. దీనిమీద దాదాపు 64 మంది దేవతా ప్రతిమలు ఉన్నట్లు చెపుతారు.

విమాన వెంకటేశ్వరస్వామి :-

గోపురంపై వెండిద్వారంతో ప్రత్యేకంగా ఉండే స్వామివారు.

రికార్డు గది :-

స్వామి వారి ఆభరణాలు వివరాలు, జమ ఖర్చులు భద్రపరచు గది.

వేదశాల :-

రికార్డు గది ప్రక్కనే వేద పఠనం చేసే పండితులు ఉండేగది. ఇక్కడే మనం వారి ఆశీర్వచనం తీసుకోవచ్చు.

శ్రీ యోగనరసింహస్వామి సన్నిధి :-

రామానుజాచార్యులుచే ప్రతిష్టితం చేయబడింది.ఈ గుడి ప్రధానాలయానికి ఈశాన్య దిక్కున వుంటుంది. పురాతనమైన ఈ విగ్రహం రామానుజుల కాలంలో దొరికింది. గ్రామంలో సర్వదేవతలూ ప్రధాన దైవానికి అభిముఖంగా వుండాలన్న ఆగమోక్తి ననుసరించి, నరసింహుని ఉగ్రరూపం తగ్గించడానికనీ తిరుమల ఆలయంలో రెండవ ప్రాకారంలో స్వామికి ఈశాన్య దిక్కున పశ్చిమాభిముఖంగా ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు

శ్రీ నరసింహాలయం క్రీ.శ 1330-1360 మధ్య నిర్మించబడిందని పరిశోధకుల అభిప్రాయం. క్రీ.శ 1469లోని కందాడై రామానుజయ్యంగారి శాసనంలో ఈ యోగనరసింహుని ప్రస్తావన ఉంది.
‘అళగియ సింగర్‌’ (అందమైన సింహం) అని, వేంకటాత్తరి (వేంకటశైలంపై ఉన్న సింహం) అని ప్రస్తావన ఉంది.

చాలాచోట్ల ఈ విగ్రహం ఉగ్రరూపంలో ఉంటుంది. కానీ ఇక్కడ ధ్యాన ముద్రలో ఉండడం ప్రత్యేకం.
ఇక్కడ అన్నమాచార్యులు కొన్ని సంకీర్తనలు చేశారు.

శంకుస్థాపన స్థంభం :-

రాజా తోడరమల్లు ఆనందనిలయం విమాన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రాంతం.

పరిమళ అర :-

యోగ నరసింహ స్వామి గుడికి దక్షిణం వైపు వున్న గోడకు ఆనుకొని వున్న రాతి సాన నే “పరిమళపు అర” అంటారు.ప్రతీ శుక్రవారం వేంకటేశ్వర స్వామికి పేట్టే నామానికి కావలసిన పచ్చకర్పూరాన్ని ఇక్కడే అరగదీస్తారు.శంకుస్థాపన స్థంభంకు వెళ్ళే దారిలో ఉంటుంది. స్వామి వారి సేవకు ఉపయోగించే వివిధ సుగంధ పరిమళాలను భద్రపరిచే అర. ఈ గది గోడపై రాసిన భక్తుల కోరికలను స్వామి తీరుస్తాడని నమ్మకం.

శ్రీవారి హుండి :-

శ్రీవారిని దర్శించుకొని విమాన ప్రదక్షిణం చేసి వచ్చిన భక్తులు తమమొక్కుబళ్లను, కానుకలను, నిలువుదోపిళ్లను హుండీలో సమర్పిస్తారు బంగారు నగలు, వెండి పాత్రలు, ముడుపులు, నాణాలు, నోట్లు, వస్త్రాలు కర్పూరం, బియ్యం, కలకండ… ఇలా ఎన్నో రకాలైన వస్తువులను భక్తులు స్వామి వారికి కానుకలుగా ఈ హుండీ ద్వారా సమర్పిస్తారు పెద్దసంచి ఆకృతిలో నిటారుగా ఏర్పాటుచేసిన తెల్లని కాన్వాసు వస్త్రంలో పెద్ద రాగి గంగాళాన్ని దించి, పై వస్త్రాన్ని రోటివలె తాళ్ళతో కట్టి వేలాడదీస్తారు. ఈ కాన్వాసు వస్త్రంపై శ్రీవారి శంఖుచక్రాలు, తిరునామాలు ఉంటాయి

భక్తులు వేసే కానుకలు గంగాళంలో పడేలా ఏర్పాటుచేసిన ఈ బుర్కా గంగాళాన్ని ‘కొప్పెర అని కూడా అంటారు. హుండీని రోజుకు రెండుసార్లు విప్పదీస్తారు.

భక్తులు కానుకలు వేసే ప్రాంతం.
శ్రీవారి ఆలయ ప్రాంగణంలో చాలా మార్పులు జరిగిననూ మార్పు చెందని ఒకేఒక స్థలం. దీని క్రింద శ్రీచక్రయంత్రం ధనాకర్షణ యంత్రం ఉందని నమ్మకం.

బంగారు వరలక్ష్మి :-

హుండి ఎడమగోడపై బంగారు లక్ష్మీ దేవి విగ్రహం కలదు. ఈవిడ భక్తులకు అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తుందని నమ్మకం.

అన్నమయ్య సంకీర్తన భాండాగారం ఎదురుగా హుండీకి ఎడమవైపు ఉన్న చిన్న తొట్టి లాంటి నిర్మాణం. ఇందులో స్వామి వారి పాదాల అభిషేక జలాలు సంగ్రహిస్తారు.

విష్వక్సేన :-

హుండి ప్రాంగణం నుండి వెలుపలికి వచ్చాక ఎడమవైపు ఉండే చిన్న ఆలయం. ఈయన విష్ణు సేనాధ్యక్షుడు. ప్రస్తుతం ఈ విగ్రహం అంకురార్పణ మండపంలో ఉంది. (5వభాగం రేపు…….)

1వభాగం

2వభాగం

3వభాగం

ఏభాగం చదవాలనుకొంటే ఆ భాగం పై క్లిక్ చేయండి.

1 comment

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s