Pic source ttd

పవిత్రమైన తిరుమల క్షేత్రంలో ఏడుకొండల వారిని స్మరిస్తూ వారిసేవలో గడపాలని చాలా మందికి ఆకాంక్ష ఉంటుంది. అయితే ఏలా సేవకు వెళ్లాలో తెలియదు.అలాంటి ఆలోచన ఉంటే సేవకులు గా ఏలావెళ్లాలి అందుకు ఏమిచెయ్యాలి అనేవివరాలు మీకోసమే……

అందరికి షేర్ చేయండి…!!

తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామి వారిని ఎంతోమంది దర్శించుకుని తరిస్తారు. అయితే ఆ స్వామి వారి సన్నిధిలో వారం రోజులపాటు సేవ చేసే భాగ్యాన్ని కూడా కల్పిస్తోంది టీటీడీ. శ్రీవారి సన్నిధిలోని క్యూ లైన్లు, దేవాలయ పరిసరాలు తదితర చోట్ల విధులు నిర్వహించేందుకు వలంటీర్లను ఎంపిక చేస్తుంది. స్వామివారి సన్నిధిలో సేవకు ఎలా వెళ్లాలి?, మార్గదర్శకాలు ఏమిటో?

తెలుసుకోండి మరి…!

నెల రోజుల ముందే సమాచారమివ్వాలి..!

ఆధ్యాత్మిక పరిజ్ఞానం కలిగి ఉండాలి. స్త్రీ, పురుష బేధం లేకుండా పదిమంది భక్తులకు తక్కువగాకుండా బృందంగా వెళ్లాలి. గ్రూపులోని సభ్యులంతా వారి పేరు, చిరునామా, వయస్సు తదితర వివరాలను నెలరోజుల ముందుగానే టీటీడీకి పంపాలి.లేదంటే తిరుమల తిరుపతి దేవస్థానం అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి నమోదు చేసుకోవచ్చు.సేవల కోసం ‌www.tirumala.org వెబ్‌సైట్‌ ‌సైట్‌లోకి వెళ్లి పేరు నమోదు చేసుకోవచ్చు. శ్రీవారి సేవా సర్వీసు లింక్‌ క్లిక్‌ చేస్తే వివిధ సేవలు, ఖాళీగా ఉన్న రోజుల వివరాలు దర్శనమిస్తాయి.

ఏ కులం వారైనా హిందువులందరూ శ్రీవారి సేవకు అర్హులే.

హిందువుగా గుర్తించేందుకు తిరుమల నామం, తిలకం లేదా కుంకుమ లేదా చందనం బొట్టు ధరించాలి.

శ్రీవారి సేవకు వచ్చే గ్రూపు లీడరు లేదా కోఆర్డినేటర్ వలంటీర్ల పూర్తి వివరాలు తిరుమల సేవా సదన్‌లో అందించాలి.

వారి వయసు 18 ఏళ్లు నిండి 60 ఏళ్లలోపు ఉండాలి.

ఆరోగ్య ధ్రువీకరణ పత్రాన్ని (మెడికల్ సర్టిఫికెట్) గుర్తింపు పొందిన వైద్యునిచేత అటెస్ట్ చేయించి సమర్పించాలి.
కేటాయించి తేదీల్లో ఉ. 10 నుంచి సా.5 వరకు సేవాసదన్‌లోని సహాయ ప్రజా సంబంధాల అధికారికి రిపోర్ట్ చేయాలి.

సేవకులకు ఉచిత బస కల్పిస్తారు. పురుషులకు పీఏసీ-3లో, మహిళలకు సేవాసదన్‌లో వసతి కల్పిస్తారు. సేవకులు తమ లాకర్ కోసం తాళం చెవిలు తెచ్చుకోవాలి.సేవకు వచ్చిన వారికి భోజనం, బసతోపాటు చివరి రోజు స్వామి దర్శనభాగ్యం కల్పిస్తోంది. సేవకులు ఆధార్‌కార్డు వెంట తప్పనిసరిగా తెచ్చుకోవాలి.

శ్రీవారి సేవాసదన్‌లో రోజూ సాయంత్రం 4గంటలకు డ్యూటీలు కేటాయిస్తారు. రోజుకు కనీసం ఆరుగంటలు విధులు నిర్వహిం చాల్సి ఉంటుంది.

అన్నప్రసాద వితరణ, ఉద్యోగుల క్యాంటీన్‌, కూరగాయలు తరగడం, ఫుడ్‌ కోర్ట్సు, గోసేవ, పూలంగి సేవ, వైకుంఠం- 2లో అన్నప్రసాదం, క్యూ లైన్లు, ఆరోగ్యం, విజిలెన్స్‌, కల్యాణకట్ట, ఏఎన్‌సీ విచారణ, సప్తగిరి సత్రాలు, కొబ్బరికాయలు, పుస్తకాల విక్రయం, హెల్ప్‌డెస్క్‌, పాల పంపిణీ, ఆలయ శుభ్రత, తిరునామం ఇలా జనరల్‌ విభాగంలో పనిచేయాల్సి ఉంటుంది.

యాత్రికుల సంక్షేమ సేవ
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలను కల్పించేందుకు టీటీడీ గత నెలలోనే యాత్రికుల సంక్షేమ, సౌకర్యాల సేవను ప్రవేశపెట్టింది. దీనికి కూడా నెల రోజుల ముందే కోటాను విడుదల చేస్తారు. మే 3న కోటా విడుదల చేయగా, మే 12 నుంచి సేవల్లో పాల్గొంటున్నారు. భక్తులకు టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలు సక్రమంగా అందుతున్నదీ, లేనిది ఈ సేవకులు పర్యవేక్షిస్తారు. ఈ సేవకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ విభాగాల్లో గెజిటెడ్‌ హోదా కలిగిన 35 నుంచి 65 ఏళ్లలోపు మహిళలు, పురుషులు అర్హులు. ప్రైవేటు ఉద్యోగులైతే.. పర్యవేక్షణస్థాయి అధికారి అయి ఉండాలి.

హుండీ కానుకల లెక్కింపు (పరకామణి సేవ)

పరకామణి సేవకు వచ్చే భక్తులు స్వామివారికి హుండీలో వచ్చిన కానుకలను లెక్కించాల్సి ఉంటుంది. ఈ సేవకు ప్రయివేటు, పబ్లిక్‌ సెక్టార్ బ్యాంకు సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారిని అనుమతిస్తారు. వయసు 35 నుంచి 65 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ సేవలో ఎనిమిది రోజుల పాటు ఉండేలా చూసుకోవాలి. వస్త్రధారణ విషయానికి వస్తే కచ్చితంగా నిక్కరు, బనియను మాత్రమే ధరించి పరకామణిలోకి వెళ్లాలి. ఈ సేవకు రెండు నెలల ముందు ఏ తేదీల్లో వీలుందో కోటాను విడుదల చేస్తారు.

సేవా సమయంలోనే శ్రీవారి స్కార్ఫ్‌లు ధరించాలి.

గోవిందుడిని స్మరిస్తూ, భక్తులను గోవిందా గోవిందా అని సంభోదించాలి.

శ్రీవారి సేవ పూర్తిగా యాత్రికుల సహా యం చేసేందుకు ఉద్దేశించిన స్వచ్ఛంద సేవ మాత్రమే. సేవ కోసం గ్రూపు కోఆర్డినేటర్‌కు కానీ సిబ్బందికి కానీ ధన, వస్తురూపంలో ఎలాంటి చెల్లింపులు ఉండవు.

కేటాయించిన ప్రదేశంలోనే సేవ చేయాలి. గర్భాలయ సేవ నిర్బంధ సేవ కాదు. గర్భాలయం సేవ కోసం ఒత్తిడి చేయకూడదు.

” సేవా సదన్‌లో ఉండే మహిళా సేవకులు రాత్రి వేళల్లో నైటీలు ధరించరాదు.”

నియమ, నిబంధనలు అతిక్రమిస్తే రెండేళ్ల వరకు సేవకు అనుమతించరు.

తిరుమల ఆస్థాన మండపంలో ప్రతి శుక్రవారం ఉదయం 9నుంచి ప్రారంభమయ్యే శిక్షణ తరగతులకు శ్రీవారి సేవకులు హాజరుకావాల్సి ఉంటుంది.

సేవకులు తమ చిన్నారులు, వృద్ధులను వెంట తీసుకు రాకూడదు.

డ్రెస్ కోడ్ :
సేవకు వచ్చే మహిళలు మెరూన్ బార్డర్ కలర్‌తో కూడిన ఆరెంజ్ కలర్ చీర, రవిక ధరించాలి. పురుషులు తెలుపు రంగు వస్త్రాలు ధరించాలి.

వెబ్సైట్లో నమోదు చేసుకోలేనివారు నేరుగా వివరాలు పంపితే పరిశీలించి మీరు అర్హులైన మీకు సమాచారం అందజేస్తారు. వివరాలు పంపాల్సిన చిరునామా..!

పౌరసంబంధాల అధికారి,
తిరుమల తిరుపతి దేవస్థానము,
కపిలతీర్థం రోడ్డు, తిరుపతి, పిన్ కోడ్ 517501.

మరిన్ని వివరాలకు 0877-2263544, 0877-2264392 నంబర్లలో సంప్రదించవచ్చు.

ఓం నమో వేంకటేశాయ..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s