అనంతపురం జిల్లాలో వ్యవసాయం విస్తారంగా వేరుశనగ పంట వలననే జరుగుతున్నది.2000-01లో జిల్లాలో వేరుశనగపంట 20, 12,894 ఎకరాలలో పెట్టబడింది. వేరుశనగ ఉత్పత్తిలో 2000-01లో అనంతపురం జిల్లాలో మొత్తం రాష్ట్ర ఉత్పత్తితో 42.41% వుంది. ఈ వేరుశనగ పంట విస్తీర్ణం 17,70,842 ఎకరాలు 2,74,815 టన్నుల పంట సరాసరి ఎకరాకు 0.16టన్నులు పండింది. కాని 2000-01 సంవత్సరంలో ఉత్పత్తి 908795 టన్నులకు తగ్గి సరాసరి ఎకరాకు 0.45 టన్ను లయింది. దీనివలన జిల్లాలో వ్యవసాయంపై నమ్మకంగా రైతులు ఆధారపడలేక పోయారు. 
         దాంతో అనంతపురం జిల్లాలో ఆహారధాన్యాల ఉత్పత్తి తగ్గించి రైతులు   వ్యాపార పంటైన వేరుశనగను 1960-61 నుంచి పండించడం మొదలు పెట్టారు.          జిల్లాలో ఆహార ధాన్యాల పంట విస్తీర్ణం రాష్ట్రంలోని విస్తీర్ణం క్రింద పేర్కొనబడింది.

 సం॥    అనంతపురం జిల్లా           రాష్ట్రం                  లక్షల ఎకరాలు          లక్షల ఎకరాలు

1960-61       18.21                        225.97

1970-71       15.05                       234.28

 1980-81        10.63                      216.36
1990_91         3.98                       191.80

1995-96          3.73                       170.35
2000-01          4.20                       189.60

        మొత్తం రాష్ట్రంతో పోలిస్తే అనంతపురం జిల్లాలో ఆహారధాన్యాల ఉత్పత్తి విస్తీర్ణం విపరీత మైన తగ్గుదల సూచిస్తోంది. పేదప్రజలు ఇతర జిల్లాల నుంచి ఎక్కువ ధరకు ఆహారధాన్యాల కొనడం ద్వారా వారి ఆర్థిక పరిస్థితి పై ఎక్కువ భారం పడుతున్నది.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s