జి.వెంకటకృష్ణ కథకులు, కవి, విమర్శకులుగా ప్రసిద్ధులు. ఏది రాసినా మనసు పెట్టి రాస్తారు. నిజాయితీ నిక్కచ్చితనం ఆయన సొంతం. రాయలసీమ రచయితగా బహుజనుడిగా ఆయన రచనకు మాటకు ఎంతో విలువుంది.
అనంతపురం జిల్లాలో బూడిదగడ్డపల్లె (గోరంట్ల మండలం) లో పుట్టారు. హైస్కూల్, (బెస్తరపల్లి కంబదూరు మండలం) ఇంటర్, కళ్యాణదుర్గంలోనూ చదివారు. డిగ్రీ బెంగళూరులో బెంగళూరు యూనివర్సిటీ, ఎం.ఏ. ఎం.ఫిల్ (చరిత్రలో) శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అనంతపురంలో చదివారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకార శాఖలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ గా చేరి యిప్పుడు డిప్యూటీ రిజిస్ట్రార్ హోదాలో వున్నారు. ప్రస్తుతం సమగ్ర సహకార అభివృద్ధి ప్రణాళిక అనే ప్రాజెక్టుకు ఛీప్ ప్రాజెక్టు ఆఫీసర్ గా కర్నూలులో పనిచేస్తున్నారు. 
వుద్యోగ రీత్యా ఫస్ట్ పోస్టింగ్ కర్నూలు లో ఇవ్వడంతో కర్నూలులోనే స్థిరపడ్డారు. వెంకటకృష్ణ సహచరి #కె_సుభాషిణి కూడా కర్నూలులోని పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో మాథమెటిక్స్ అసోసియేట్ ప్రొఫెసర్. కె.సుభాషిణి కథకురాలు. 
1994 లో మొదటి కథ ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో వచ్చినప్పటి నుంచీ యిప్పటికి అరవై కథలు రాశారు వెంకటకృష్ణ. మూడు కథా సంపుటులు అచ్చయ్యాయి. #గరుడస్థంభం – 2005. #చిలుకలు_వాలిన చెట్టు – 2010.#దేవరగట్టు – 2016.
నాలుగు కవితా సంపుటులు, రెండు దీర్ఘకవితలు వెలువరించారు. #లోగొంతుక – 2000 #దున్నేకొద్దీ_దుఖ్ఖం – 2005 #కొన్ని_రంగులు ఒక పద్యం – 2010#చినుకుదీవి – 2017.దీర్ఘకవితలు #నదీవరదామనిషి – 2009#హంద్రీగానం – 2016.సాహిత్య వ్యాసాలు పుస్తకంగా వెలువడవలసి ఉంది.

Shajahana begum

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s