Pic source TTD

తులాభారం :-

తిరులారాయ మండపం దగ్గర తులభారం కనిపిస్తుంది. శ్రీకృష్ణదేవరాయలు మండపానికి ఎదురుగా ఉంటుంది. ఇక్కడ భక్తులు తమ పిల్లల బరువుకు సరిసమానంగా ధనం, బెల్లం, కలకండ, కర్పూరం రూపేణ తులాభారంగా శ్రీస్వామివారికి సమర్పిస్తారు.

Ranganayaka Mandapam Inside Srivari Temple
రంగనాయక మండపం :-

కృష్ణరాయమండపానికి దక్షిణం వైపుగా 108 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పు కలిగి ఎతైన రాతి స్తంభాలతో అనల్ప శిల్ప శోభితమై విరాజిల్లుతూ ఉన్నదే ”రంగనాయకమండపం”. శ్రీవారి ఆలయంలో అద్దాల మండపానికి ఎదురుగా శ్రీకృష్ణ రాయ మండపానికి దక్షిణ వైపున ఎత్తైన శిలావేదికపై ఉండే రంగనాయక మండపం.మండపంలో దక్షిణం వైపున 12 అడుగుల చతురస్రాకారంలో మందిరం ఉంది. ఈ చిన్న మందిరంలో రంగనాథుడు కొంతకాలం కొలువై ఉండి పూజలు అందుకున్నారు. క్రీస్తుశకం 1320-1360 మధ్య కాలంలో మహమ్మదీయుల దండయాత్ర వల్ల శ్రీరంగ క్షేత్రంలోని శ్రీరంగనాయకుల ఉత్సవ మూర్తులను తిరుమలకు తీసుకువచ్చి మండపంలో కొలువుతీర్చి నివేదనలు చేశారట. ఆ తర్వాత కొంత కాలానికి ఉత్సవ విగ్రహాలను శ్రీరంగానికి తరలించారట. మండపంలో స్వామి పూజలు అందుకోవడం వల్ల దీనికి రంగనాయకుల మండపం అని పేరొచ్చింది. శ్రీరంగంలోని శ్రీరంగనాథుని ఉత్సవమూర్తులు కొంతకాలం పాటు ఈ మండపంలో భద్రపరిచారు. ఒకప్పుడు నిత్యకల్యాణోత్సవాలు జరిగిన ఈ మండపంలో ప్రస్తుతం ఆర్జితసేవలయిన వసంతోత్సవం, బ్రహ్మోత్సవం, వాహనసేవలు జరుగుతున్నాయి.

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి తదితర ప్రముఖులకు శ్రీవారి దర్శనానంతరం ఈ మండపంలోనే వేదాశీర్వచనంతో పాటు శ్రీవారి ప్రసాదాలను అందజేస్తారు.

Pic source TTD


తిరుమలరాయమండపం:-

రంగ మండపానికి పశ్చిమాన ధ్వజస్తంభ మండపానికి ముఖం చేసి ఉన్న విశాలమైన కాంప్లెక్సు ను తిరుమల రాయ మండపం లేదా ఉంజాల్ మండపం అంటారు. ఇది రెండు ఎత్తుల్లో ఉంటుంది రంగనాయక మండపాన్ని అనుకుని పడమర వైపునకు ఉన్న ఎత్తయిన స్తంభాలు, తిరుమలేశుడు భక్తులపై చూపుతున్న తరగని ఉదారత్వానికి మచ్చుతునక ఈ తిరుమలరాయ మండపం.
ఈ మండపంలోని వేదిక భాగాన్ని తొలుత సాళువ నరసింహరాయలు నిర్మించాడు (సాళ్వ నరసింహ మండపం). శ్రీస్వామి వారికి “అన్నా ఊయల తిరునాళ్ళ” అనే ఉత్సవాన్ని నిర్వహించే నిమిత్తం క్రీ.శ. 1473 లో ఈ మండపం నిర్మించాడు. ఆ తర్వాతి కాలంలో క్రీ.శ.16వ శ‌తాబ్ధంలో సభాప్రాంగణ మండపాన్ని ఆర‌వీటి తిరుమలరాయలు నిర్మించాడు. ఇందులోని స్థంభాల‌పై శ్రీ వైష్ణ‌వ, ప‌శు-ప‌క్ష‌దుల‌ శిల్పాలు ఉన్నాయి. తిరుమల రాయ మండపం కట్టడపు స్తంభాలు విజయనగర వాస్తు శైలికి నిదర్శనంగా ఉన్నాయి. కేంద్రంలో ఉన్న స్తంభం చుట్టూ చిన్న స్తంభాలు ఉంటాయి. ఇవి సంగీతం పొదిగి ఉన్న మహాద్భుత స్తంభాలు. ఒక రాతితో వీటిపై రుద్దితే సంగీతం ధ్వనిస్తుంది. ఈ మండపంలో రాజా తోడ‌ర‌మ‌ల్‌, అత‌ని త‌ల్లి మాతా మోహ‌నా దేవి, భార్య పిటా బీబీ లోహ విగ్ర‌హ‌లు ఉన్నాయి. అణ్ణై అనగా తమిళంలో హంస.బ్రహ్మోత్సవ సమయంలో ధ్వజారోహణం నాడు శ్రీస్వామివారు ఈ మండపంలోనికి వేంచేసి పూజలందుకుంటారు.తిరుమల రాయ మండపంలో ఉత్సవ మూర్తి శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి కొలువై ఉంటాడు. మలయప్ప స్వామిని ఉత్సవబేరం అంటారు. బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఆస్థానం లేదా వార్షిక దర్బార్ ఇక్కడే నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో పంచిపెట్టే ప్రసాదాన్ని ఇప్పటికీ తిరుమల రాయని పొంగల్ అంటారు.

రాజ తోడరమల్లు:-

ధ్వజస్తంభం మండపానికి 10 అడుగుల దూరంలో స్వామి వారికి నమస్కరిస్తున్నట్లు 3 విగ్రహాలు ఉంటాయి. సహజంగా కళ్యాణం ముగించుకున్న భక్తులు సాధారణ భక్తులతో కలిసే మార్గంలో ఉంటాయి.
అవి రాజా తోడరమల్లు
అతని తల్లి మోహనాదేవి
అతని భార్య పితాబీబీ విగ్రహాలు.
ఈయన అనేక సంవత్సరాలు తిరుమలను దుండగుల బారినుండి రక్షించారు.

ధ్వజస్తంభ మండపం :-

ధ్వజస్తంభ మండపంలో ధ్వజస్తంభం, బలిపీఠం ఉంటాయి.రెండ‌వ గోపుర‌మైన వెండి వాకిలిని తాకుతూ ధ్వజస్తంభ మండపాన్ని క్రీ.శ 1470లో విజ‌య‌న‌గ‌ర చ‌క్ర‌వ‌ర్తి సాళ్వ న‌ర‌సింహ‌రాయులు నిర్మించారు. 10 రాతి స్థంభాల‌తో నిర్మిచిన మండ‌పంలో బంగారు ధ్వజస్తంభం, బలిపీఠం ఉంటాయి. ఈ స్థంభాల‌పై వివిద దేవ‌తామూర్తుల శిల్పాలు, ఇంకా సృష్ఠికి సంబంధించిన స్త్రీ, పురుషుల సంబంధాల‌ను తెలిపే అనేక శిల్పాలు పొందుప‌ర్చారు. ధ్వజస్తంభానికి తూర్పు దిక్కున అనుకొని ఉన్న ఎతైన పీఠమే బలిపీఠం. శ్రీవారి ఆలయంలో నివేదన అనంతరం అర్చకులు బలిని ఆయా దిక్కుల్లో ఉన్న దేవతలకు మంత్రపూర్వకంగా సమర్పిస్తారు. వెండివాకిలికి ఎదురుగా బంగారు ధ్వజస్తంభం ఉంది. ప్రతి ఏటా బ్రహ్మోత్సవంలో తొలిరోజు ఈ ధ్వజస్తంభంపై గరుడకేతనం ఎగురవేస్తారు. దీన్నే ధ్వజారోహణం అంటారు.

ధ్వజస్తంభం:-

వెండివాకిలి ఎదురుగా సుమారు15 అడుగుల దూరంలో చెక్కడపు రాతి పీఠంపై ధ్వజదండంవలెనున్న ఎతైన దారుస్తంభం నాటబడింది. అదే ధ్వజస్తంభం.

శ్రీ‌వారి గ‌ర్భాల‌యానికి దక్షిణంవైపు క్రీ.శ‌.1586లో శ్రీ అవ‌స‌రం చెన్న‌ప్ప అనే నాయ‌కుడు క‌ల్యాణ మండ‌పాన్ని నిర్మించారు. 80 అడుగుల పొడుగు, 30 అడుగుల వెడ‌ల్పుతో 27 స్థంబాల‌తో నిర్మించారు. ఇందులో మ‌ధ్య‌ భాగంలో నాలుగు చిన్న స్తంభాలు ఉన్న గ్రానైట్ వేదిక ఉన్నాది. పూర్వ‌కాలంలో ఈ కల్యాణ వేదికపై శ్రీమలయప్పస్వామివారికి, శ్రీదేవి భూదేవిలకు కల్యాణోత్సవం నిర్వ‌హించేవార‌ని అర్చ‌కులు తెలిపారు.
బలిపీఠము :-

ధ్వజస్తంభానికి తూర్పు దిక్కున అనుకొని ఉన్న ఎతైన పీఠమే బలిపీఠం. దీనికి కూడా బంగారు రేకు తాపబడింది. శ్రీవారి ఆలయంలో నివేదన అనంతరం అర్చకులు బలిని (అన్నాన్ని ) ఆయా దిక్కుల్లో ఉన్న దేవతలకు మంత్రపూర్వకంగా సమర్పిస్తారు.

క్షేత్రపాలక శిల (గుండు) :-

ధ్వజస్తంభం కు ఈశాన్య (north – east) మూలలో అడుగున్నర ఎత్తుగల చిన్న శిలాపీఠం ఉంది. దీనినే క్షేత్రపాలక శిల అంటారు.
ఇది రాత్రిపూట ఆలయానికి రక్ష. అర్చకులు ఇంటికి వెళ్ళేటప్పుడు గుడికితాళం వేసి తర్వాత ఈ శిలపై ఉంచి నమస్కరించి మరలా ఉదయం ఇక్కడి నుండే శిలకు నమస్కరించి తాళం చెవులను తీసుకువెళతారు.

Pic source TTD

సంపంగి ప్రాకారం :-

మహాద్వార గోపుర ప్రాకారానికి, నడిమి పడికావలి (వెండివాకిలి) ప్రాకారానికి మధ్యలో ఉన్న ప్రదక్షిణ మార్గమే సంపంగి ప్రాకారం. ప్రతి ఆలయానికి స్థల వృక్షాలనేవి ఉండడం పరిపాటి. తిరుమల ఆలయం స్థలవృక్షం సంపంగి. ఒకప్పుడు ఈ ప్రాంతం అంతటా సంపంగి చెట్లు ఉన్నందువల్ల ఇలా పిలవబడుతోంది.ఈ ప్రాకారంలో అద్దాలమండపం, రంగనాయక మండపం, తిరుమలరాయ మండపం, ధ్వజస్తంభమండపం, శ్రీవేంకటరమణస్వామి కల్యాణమండపం, ఉగ్రాణం, విరజానది, పడిపోటు, వగపడి అర తదితర మండపాలున్నాయి. (మిగతా భాగం రేపు….)

మొదటి భాగం పై క్లిక్ చేసి చూడవచ్చు

4 comments

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s