శూద్ర అనగా సేవకుడు అని అర్థంగా వాడేవారు. ఆడబానిసకు పుట్టిన సంతానాన్నిదాసి కొడుకు(దాసీపుత్రుడు) లేదా శూద్ర కొడుకు(శూద్ర పుత్ర) లేదా అసురిపుత్ర అని పిలిచేవారు.        ఒక వ్యక్తి, సేవకున్ని శూద్రునిగా చెప్పేవారు(అన్యాస ప్రేస్య). మనువుశూద్రులను  సేవకులు గా తీర్మానించాడు. చరిత్ర ప్రకారం బ్రాహ్మణ,క్షత్రియ, వైశ్యులకు శూద్రులు సేవకులుగా ఉండేవారు.వీరిలో ద్రావిడులు, కిరాతులు, నాగులు వంటి తెగలున్నాయి. వైశ్యులు అనే వర్గం ఏర్పడక ముందు వీరు కూడా వ్యవసాయదారులే.         వస్తుమార్పిడి జరిగే క్రమంలోవ్యాపార వర్గం ఏర్పడింది. వీరే వైశ్యులు. వీరికి సాయంచేసే వ్యక్తులు శూద్రులు. సమాజంలోశూద్రులుగా పరిగణిస్తున్న అనేక కులాలు ఉపకులాలు ఉన్నాయి. రెడ్డి, కాపు, తెలగ, బలిజ,నాయీబ్రాహ్మణ, చాకలి, ముదిరాజు,కోయరాజు, బట్రాజు, గాండ్ల మొదలైనవన్నీ శూద్రకులాలు.        మాల, మాదిగలను దళితకులాలుగా వర్గీకరించారు. వీరు కూడా శూద్రుల కిందే వస్తారు.      హిందూమతంలోని అనేక శూద్రకులాల్లో రెడ్డి కులం ఒకటి. రెడ్లు ఆంధ్రప్రదేశ్ జనాభాలో 10% నుండి 17% వరకు వున్నారు. వీరి భాష తెలుగు. కర్నాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర ప్రాంతాలలో చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు. అమెరికాలో కూడా చాలామందిఉన్నారు.మొదట రట్టుల ప్రసక్తి క్రీ.పూ. 3వ శతాబ్ది నాటి అశోకుని శిలాశాసనాల్లో కనిపిస్తున్నది. బహుశా ఈశాసనాల్లో పేర్కొనబడిన రట్టులే కాలక్రమంలో రెడ్లు అయి ఉండొచ్చు.       క్రీ.పూ. 200 సంవత్సరాల నాటి భారవేలుని హాతిగుంఫా శాసనం వీరినే రఠికులని ప్రస్తావిస్తున్నది. ఇదే అభిప్రాయాన్ని ఆచార్య బి.యస్.ఎల్. హనుమంతరావు కూడా తన ‘సోషల్ మొబిలిటీ’ అనే పేరుతో వ్రాసిన వ్యాసాలలో వ్యక్తపరచారు. ‘రెడ్డి’ పదం పుట్టుక గురించి  పండితుల మధ్య చాలా పెద్ద చర్చే జరిగింది.          క్రీ.శ. 6వ శతాబ్దినుండి ఆంధ్రదేశంలో కాపులు లేక వ్యవసాయదారుల పేర్ల చివర ‘రట్టగుడి’ పదం కనిపిస్తున్నది. ఉదాహరణకు – క్రీ.శ. 6-7 శతాబ్దాల నాటి శాసనాల్లో ‘అరవళమహేంద్రరట్టగుడి’, ‘పల్లవ రట్టగుడి’, ‘చల్కిరట్టగుడి’ మొదలైన ప్రయోగాలు కనిపిస్తున్నాయి. ఒక కన్నడ శాసనంలో ‘కొమ్మయరట్టగుడి’ అనే పదం ఉంది. ‘కుడియన్’ అనే మాటకు కాపు అనే అర్థం ఉంది. ‘కుడి’ నుంచే ‘కుడియన్ ఉద్భవించింది. నేటికీ ఆంధ్రదేశంలో రెడ్లను ‘కాపోళ్ళు’ అని పిలవడం విదితమే. రెడ్లు అందరూ కాపులే. కాని కాపులందరూ రెడ్డి కాదు. ‘రట్టగుడి’ పదమే క్రమేణ ‘రటోడి’గా మారిందనడానికి తగిన శాసనాధారాలున్నాయి. క్రీ.శ. 10వ శతాబ్ది నాటి కందుకూర శాసనంలో ‘రటోడి కాపులు’ అనీ, అదే కాలానికి చెందిన గురిందగుంట శాసనంలో ‘భీమరట్టోడి’, ‘రటోడికి ఏను రూకలు’  ప్రయోగాలు కనిపిస్తాయి. తూర్పు చాళుక్యుల నాటి కొన్ని శాసనాల్లో ‘రట్టోడి చేను’, ‘రట్టోడి తోట’ మొదలైన శబ్దాలు కనిపిస్తున్నాయి.రట్టోడి పదమే ‘రట్టడి’, ‘రడ్డి’ అనే రూపాంత  రాలు చెంది చివరికి ‘రెడ్డి’గాస్థిరపడిందనడంలో ఏమాత్రం సందేహం లేదు.        క్రీ.శ. 10వ శతాబ్ది నాటి గొంకరాజు శాసనంలో ‘రట్టడి’ అనే పదం ఎలా ప్రయోగించబడిందో చూడండి – శ్రీ భీమేశ్వర మహాదేవరయాన దీని సాక్షి కరెప్పన విట్టపరట్టడి యుంబోని రట్టడియుం నడుకుదిరి సురపరట్టడియుం ఆన్దపురి అయితమ రట్టడియుం….” క్రీ.శ.12వ శతాబ్ది నాటి శాసనంలో ‘యంగిరట్టడి’, ‘ఏరుయమ రట్టడి’ అనే పేర్లు ఉన్నాయి (నెం. 114 శిలాశాసనాలు 1917). ఈ శతాబ్దానికి చెందిన మరికొన్ని శాసనాల్లో పేర్ల చివర ‘రడ్డి’ అనే పదం కనిపిస్తున్నది. ఉదాహరణకు – సూరపరడ్డి, పోతిరడ్డి(ద.భా.శా. IV నెం.762), బొలిరడ్డి కుమారుడు సూరపరడ్డి (నెం.790). 1117 నెంబరు శాసనంలో “కాకతిరాజ్య సమథునంరేచరుద్రిరః” అనే ప్రయోగం కనిపిస్తున్నది. క్రీ.శ. 12వ శతాబ్దినాటి శాసనాల్లోనే రెడ్డి పదం – కేతిరెడ్డి, ముత్తిరెడ్డి మొదలైన పేర్లకనిపిస్తున్నది.పైన పేర్కొన్న ఈ రూపాలన్నీ కేవలం శాసనాల్లోనే కాకుండా కావ్యాల్లో సైతం కనిపిస్తున్నాయి, మల్లికార్జున పండితారాధ్యులురచించిన శివతత్వసారం, కృష్ణదేవరాయలచే విరచితమైన ఆముక్తమాల్యద, తెనాలి రామకృష్ణుని పాండురంగ మహాత్మ్యం, మల్లాది ప్రణీత శివధర్మోత్తరం, తంజావూరు రఘనాథరాయలి రామాయణం మొదలైన కావ్యాల్లో పైన ఉదహరించిన ప్రయోగాలు కనిపిస్తున్నాయి.       ప్రస్తుత ‘రెడ్డి’ అనే శబ్దంతో పాటు ‘రడ్ఢి’ అనే పదం కూడా క్రీ.శ. 17వ శతాబ్ది దాకా వాడుకలో ఉన్నట్లు తెలుస్తోంది.       క్రీ.శ. 16వ శతాబ్దికి చెందిన తెలుగుకవి అయిన తెనాలి రామకృష్ణ తన రచనల్లో ‘రడ్డి’ అనే పదం ప్రయోగించాడు. అలాగే ,17వ శతాబ్దికి చెందిన మల్లారెడ్డి కూడా తన రచనల్లో ‘రడ్డి’ గానే పేర్కొన్నాడు.      క్రీ.శ. 7వ శతాబ్ది నుండి కోస్తా ఆంధ్రలో లభ్యమైన కొన్ని తామ్రశాసనాల్లో రాష్ట్రకూట ప్రముఖాన్” అనే ప్రయోగం కనిపిస్తోంది. ఉదాహరణకు- క్రీ.శ. 632 వాటి మొదటి విష్ణువర్ధనుని చీపురుపల్లి శాసనంలో “రాష్ట్రకూట ప్రముఖాన్ కుటుంబంలోఅనీ, మొదటి విజయాదిత్యుని శాసనాల్లో “గొమ్మలూరు నామ గ్రామ మధివాసతో రాష్ట్ర కూట ప్రముఖాన్ కుటుంబాన స్పర్వాన్ దినకాడు నామ గ్రామమధివాసతో రాష్ట్రకూట ప్రముఖాన్ కుటుంబాన స్పర్వాన్” మొదలైన ప్రయోగాలు కనిపిస్తున్నాయి.శాసనాల్లో కనిపించే రాష్ట్ర కూట ప్రముఖాన్ కుటుంబవం” అనే సంస్కృత వాక్య ప్రయోగానికి, శాసన పరిశోధకులు ఆంగ్లంలోసూల్డర్స్ నేవీ ది హెడ్స్ ఆఫ్ ప్రాఫెన్సెస్” అని అనువాదం చేశారు. అంటే గృహస్తులైన రాష్ట్రాల యొక్క పెద్దలు లేకనాయకులు అని వారి సూచన. కాని ఈ అర్ధం సరైనది కాదని కుందూరి ఈశ్వరదత్తు గారు వాదిస్తున్నారు. ఆయన అభిప్రాయంలో దీని భావం “కర్షకులైన రట్టడి శ్రేష్టులు, లేక రెడ్డి ప్రముఖులు” అని. రాష్ట్రకూట అంటే గ్రామాధికారి లేక పన్నులు వసూలు చేసేఉద్యోగి అని, మహారాష్ట్ర దేశంలోని దేశపాండ్య దేశముఖ్ అనే పదవులను పోలిందని పి.వి. వైద్యా పండితుడు చెప్పాడు. వైద్యా అభిప్రాయమే ఆమోదయోగ్యంగా ఉంది.        రాజులు భూదాన శాసనాలు రాయించే టప్పుడు, ఈ రాష్ట్ర కూట ప్రముఖులనుఆహ్వానించి వారి సమక్షంలో దానం చేసేవారు. వీరికి ఒకటి లేదా పెక్కు గ్రామాలపై ఆధిపత్యం ఉండేది. రెడ్డి వచ్చే మొదలాడుఅనే మాట ఆనాడు గ్రామాలలో వారు పొందిన గౌరవాన్ని తెలియజేస్తున్నది.పై అంశాలను బట్టి రాష్ట్రకూట అనేది ఉద్యోగ నామమనీ, దాన్ని వంశనామంగా స్వీకరించారని చెప్పవచ్చు.        క్రీ.శ.8వశతాబ్ది నుండి 10వ శతాబ్ది దాకా అంటే సుమారు రెండు శతాబ్దాలు దక్కన్ లో ప్రముఖ పాత్ర వహించిన వారు రాష్ట్రకూటులు.రాష్ట్ర కూటుల (క్రీ.శ. 696-966)మూల పురుషుడు మొదటి ఇంద్ర రాజు (క్రీ.శ.696-710) మొదట్లో చాళుక్య వంశ సామంతులుగా ఉండేవారు.వీరి జన్మస్టలి కన్నడ దేశం. అయితే రాష్ట్ర కూట పదం కంటే “రట్టకుడి” పదం ప్రాచీనమైనదిగా కనిపిస్తున్నది. కాబట్టి “రట్టకుడికి సంస్కృతీ కరణమే రాష్ట్రకూటు” అని చెప్పవచ్చు.  ఆంధ్రదేశంలో రెడ్డి వంశీయులు మొదట్లో రాష్ట్రకూటులే నని చరిత్ర కారులు భావిస్తున్నారు. తర్వాత కాలంలో ఇరు వంశీయులూ తమ శక్తి సామర్థ్యాలతో స్వతంత్ర రాజ్యాలను స్థాపించి ప్రభువులయ్యారు.అయితే ఈ రెండు రాజవంశాల మధ్య గల సంబంధమేమిటో ఖచ్చితంగా చెప్పలేము. రాష్ట్రకూటుల (రాజవంశీయుల) బంధువులేరెడ్లు అన్న ఆచార్య బి.యస్.ఎల్. హనుమంతరావు గారి అభిప్రాయానికి సాక్ష్యాలు లేవు. రెడ్లు తాము రాష్ట్రకూటుల బంధువులమని ఎక్కడా చెప్పుకోలేదు.దక్షిణాపథంలో ‘రట్ట’ జాతి వారున్నట్లు అశోకుని శాసనాల నుండి తెలుస్తున్నది. అశోకుని శాసనాల్లో రాష్ట్రక, రాత్రిక, రిష్టిక రూపాలున్నాయి. భారవేలుని హాతిగుంఫా శాసనం రఠికులను పేర్కొంటున్నది. రట్టులనే వారు ఆంధ్రులలో విలీనమైన ఒకప్రాచీనజాతి అని చెప్పవచ్చు. ఈ జాతి పేరు మీదుగానే – అరట్ట, సురట్ట, మరట్టు రట్టపాడి – అనే కొన్ని ప్రాంతీయ విభాగాల పేర్లు శాసనాల్లో కనిపిస్తున్నాయి. శాతవాహన సామ్రాజ్య పతనానంతరం రాజకీయ ఐక్యత పూర్తిగా విచ్ఛిన్నమై దేశం ఆర్ధికసంక్షోభంలో చిక్కుకున్న సమయంలో, అంటే క్రీ.శ. 300-600 సంవత్సరాల మధ్య కాలంలో, ఈ రట్టుల ప్రస్తావన కనిపించదు.బహుశా ఆ కాలంలోనే వీరు ఆంధ్రదేశంలో విభిన్న ప్రాంతాల్లో స్థిరపడి, వ్యవసాయమే ప్రధాన వృత్తిగా జీవనం సాగిస్తూ క్రమంగాఆర్ధికంగా నిలదొక్కుకొని గ్రామ ప్రముఖులై క్రీ.శ.7వ శతాబ్ది నాటికి  రాజకీయాల్లో ప్రవేశించి ఉంటారు.      రెడ్లది కష్టపడి పనిచేసే తత్వం, శారీరక శ్రమ చేయడంలో నేర్పరులు. ముఖ్యంగా వీరు పశ్చిమాంధ్రలోని కొండ ప్రాంతాల్లో తేలికగానే స్థిరపడి, గ్రామాలపై పెత్తనం సంపాదించ గలిగారు. ఆ విధంగా రెడ్డి అంటేనే గ్రామాధి కారికి పర్యాయపదమైంది. కఠినమైన పీఠభూమిని సైతం వారు దున్ని, దోకి సస్య శ్యామలం చేయగలిగారు. పంటలు పండించే వారు కనుకనే వారు పంట రెడ్లు అయ్యారు. వారు స్థిరపడ్డ ప్రాంతాలను బట్టి, పంటరెడ్లు కూడా శాఖోపశాఖలుగా చీలిపోయారు. కనుకనే ఈనాటికీ, తెలంగాణా,రాయలసీమలో రెడ్లు ప్రధానమైన గ్రామీణ కులంగా ఉన్నారు. వ్యవసాయం, రాజకీయాలు వీరికి ఈనాటికీ పక్క పక్కనే నడుస్తున్నాయి.          చాలామంది  రెడ్లు  రాజ్యాల్ని ఏలినారు.  రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలామందిభూస్వాములుగా,రాయలసీమకృష్ణదేవరాయల కాలం నుండి పాలెగాళ్ళుగా ఉన్నారు. ఎక్కువ భాగం వీరిలో గ్రామ పెద్దలుగా ఉండేవారు. ఈ గ్రామ పెద్దలను రెడ్డి అంటుంటారు. వేరే కులస్థులు ఎవరైనా గ్రామ పెద్దగా ఉంటే వారిని కూడా రెడ్డి అని అంటుంటారు. వీరు పన్నులు వసూలు చేస్తుంటారు. గ్రామరక్షణ చూస్తుండేవారు. ప్రభుత్వంతోనూ, బయటవారితోనూ వ్యవహారాలను నడుపుతూ ఉండేవారు.రాజకీయాలలో వీరి పాత్ర అధికం.          చరిత్రకారుల ప్రకారం క్రీ.పూ. 200లో దక్కను పర్వత కనుమలలోని చిన్న చిన్న రాజ్యాలను పరిపాలించారు. రెడ్లు రాష్ట్ర కూటులనుంచి వచ్చారని చరిత్రకారులన్నారు. రాష్ట్రకూటులు రాష్ట్రిక్ వంశం నుంచి వచ్చారని కూడా చెపుతారు. రాష్ట్రకూటులు రాట్టులుగా, రాట్టులు కాలక్రమంలో రెడ్డిగా మారినారని చెపుతారు.కొంత మంది చరిత్రకారుల ప్రకారం రెడ్డి వర్గం వారిని రఠి వర్గం అంటారని, శాతవాహనులు, మౌర్య చక్రవర్తుల కంటే ముందు అనగా క్ర్రీ.పూ.200లో కాపు అనే వర్గం లోని రాయల కాపు, పాకనాటి కాపు, మొరస కాపు, పంట కాపు,మున్నూరు కాపు,దేసురి కాపు, పొంగలనాటి కాపు, ఓరుగంటి కాపు, మొటాటి కాపు, కొన కాపు, వెలనాటి కాపు, నేరేడు కాపు, అయోధ్యా కాపు, భూమంచి కాపు, కుంచేటి కాపు, గోధాటి కాపులుగా వేరు పడి రెడ్డి వర్గంగా మారి దక్కను పర్వత కనుమల లోని చిన్న చిన్న రాజ్యాలను పరిపాలించారని పేర్కొన్నారు. వీరు ఉత్తర ఆంధ్రప్రదేశ్, కర్నూలు, పూనె దగ్గరి ప్రదేశాలలో నివసించారని పురావస్తు పరిశోధనల ద్వారా తెలుస్తోంది.
క్రీస్తుశకం ఏడెనిమిది శతాబ్దాల నుంచి తెలుగు గడ్డ మీద ” రట్టగుడి ” పేరిట చిన్న గ్రామాధికారులు ఉండేవారు. ఈ రట్టగుడి శబ్దం నుండే రట్టోడి, రట్ట, రడ్డి, రెడ్డి అనే రూపాలు పుట్టాయి.చిన్న చిన్న భూభాగాలకు అధికారులై వాటిని గుత్తగా అనుభవిస్తున్న వాళ్లని  రట్టగుట్టలు, రట్టగుడ్లు అని పిలిచేవారు. వీరి ముఖ్య వృత్తి వ్యవసాయం. రట్లడులకు నిధి, నిక్షేపము, జలము, పాషాణములు, అక్షిణి, ఆగామి, సిద్ధమి, సాధ్యము అనే అష్టభోగస్వామ్యాలు తమ భూములపై ఉండేవి. ఆ కాలంలో రట్టడలు ఒకరకంగా ఆర్ధిక వ్యవస్థలు.ఆదిలో వృత్తివాచకమైన ” రడ్డి ” పదం తర్వాత జాతి వాచకమైంది.
చాలా ప్రాంతాలలో గ్రామ పెద్దగా వుండే వారిని “రెడ్డి”గా వ్యవహరిస్తారు. కాలగమనంలో వారి అనుచరులు రెడ్డి గ్రూపులుగా ఏర్పడ్డారు. ఈవిధంగా కూడా రెడ్డి వర్గం ఏర్పడిందని చెప్పవచ్చు. భారత దేశం, తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో రెడ్ల పాత్ర అత్యంత ముఖ్యమయినది . ఒక రెడ్డి వందమందితో సమానం అని నానుడి వుంది.
        కాకతీయుల కాలం (1050-1076)లో గ్రామ పెద్దను గౌరవవాచకంగా ‘రెడ్డి’ అనిసంభోదించేవారు. కాకతీయులు స్వతంత్ర రాజులయ్యాక రెడ్డి హెూదాతో వున్నవారు చాలామంది సామంతరాజులుగా వీరి దగ్గర ఉండేవారు. కాకతీయులు చాలామంది రెడ్డి ప్రముఖులను ప్రధాన హెూదాలలో, సైనికులు గానూ నియమించే వారు. అప్పట్లో ప్రసిద్ధిచెందిన వారు మునగాల రెడ్లు, కాకతీయ ప్రతాపరుద్రుని క్రింద సామంతరాజులుగా మునగాలకు చెందిన అన్నయిరెడ్డి జమీందారుగా ఉన్నట్లు చరిత్ర చెపుతోంది.        కాకతీయుల తరువాత విజయనగర సామ్రాజ్యంతో పాటు రెడ్డి రాజులు వచ్చారు.సామంతులుగా ఉన్న రెడ్డిరాజులు స్వతంత్రుల య్యారు. అయితే వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరాటం‌ ఉండేది. కానీ బహమనీ సుల్తానులు వీరిద్దరికి ఉమ్మడి శత్రువు అయ్యారు. దాంతో వారిద్దరు ఒక్కటైనారు. విజయనగర రాజు 2వ హరిహరుడు తనకుమార్తెను కాటయవేమారెడ్డి కుమారుడు కాటయకిచ్చి వివాహం చేసినాడు. రెడ్డిరాజులు అద్దంకిని రాజధానిగా చేసుకొని పరిపాలించారు.        రెడ్డిరాజులు కళింగ (నేటి ఒరిస్సా)పై దండెత్తి వాటిని వశపరుచుకొన్నారు. కళింగ గజపతి కపిలేంద్ర వీరిపై పోరాడాడు. కానీ విజయనగర రాజులు రెండవ దేవరాయల సాయంతో వీరభద్రారెడ్డి కపిలేంద్రను ఓడించాడు. వీరభద్రారెడ్డి మరణం తరువాత గజపతి కపిలేంద్ర వీరభద్రరెడ్డి ఆధీనంలో వున్న రాజమహేంద్రవరం (నేటి రాజమండ్రి)ను స్వాధీనం చేసుకున్నాడు. గజపతుల పతనం తరువాత గతంలో వున్న రెడ్డిరాజ్యాలన్నీ విజయనగర సామ్రాజ్యం ఏలుబడిలోకి వచ్చాయి.          విజయనగర రాజుల కాలంలో రెడ్లను సైన్యాధి పతులుగా నియమించు కున్నారు. ఈ రెడ్లు తమ స్వంత సైన్యాలనుఏర్పాటుచేసుకొని విజయనగర సామ్రాజ్యానికి పెట్టని కోటలుగా ఉండేవారు.‌వీళ్ళనే పాలెగాళ్ళు అన్నారు. వీరు యుద్ధాలలో పాల్గొనేవారు. శాంతి సమయంలో గ్రామాలలో పన్నులు వసూలు చేసి రాజు ఖజానాకు చెల్లించేవారు.     బ్రిటీష్ సామ్రాజ్యానికి ఎదురొచ్చిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కూడా ఒక పాలెగాడుగా ఉండేవాడు. రాయలసీమలో రెడ్లు ఆధిపత్యంలో ఉండేవారు.విజయనగర సామ్రాజ్య పతనం తరువాత పాలెగాళ్ళు స్వతంత్రులయ్యారు. ఈ పాలెగాళ్ళ మధ్య ఆధిపత్య పోరాటాలు జరిగేవి. దాన్నే నేడు మనం ఫ్యాక్షన్ అంటున్నాం.          తెలంగాణాలో రెడ్లు వివిధ సంస్థానా ధిపతులుగా ఉండేవారు. గోల్కొండ సుల్తానుల పాలనలో వీరంతా సామంత రాజులుగా వ్యవహరించేవారు. రామకృష్ణారెడ్డి, పెద్ద వెంకటరెడ్డి, ఇమ్మడి వెంకటరెడ్డి మొదలైన వారు ప్రముఖులు. ఇమ్మడి వెంకటరెడ్డి గోల్కొండ సుల్తాను అబ్దుల్లా కుతుబ్ షాకుమద్దతుగా తన సైన్యాన్ని తరచూ పంపించే వాడు. మహాబూబ్ నగర్ జిల్లాలో పంగల్ కోటను వీర కృష్ణారెడ్డి నిర్మించాడు. గద్వాల సంస్థానాన్ని కోటను రాజా సోమతాద్రి నిర్మించాడు. నిజాం పాలనలో రెడ్లు ప్రధానాధి కారులుగా, గ్రామపోలీసులుగా, పన్ను వసూలుదార్లుగా పనిచేసేవారు.నిజాం ఏలుబడిలో రెడ్లు దేశ్ ముఖ్ లుగా ఉండేవారు. వీళ్ళను పటేల్ అని, దొరలని పిలిచేవారు. రాజా బహదూర్ వెంకటరామారెడ్డి నిజాం పాలనలో కొత్వాలుగా పనిచేసినాడు.           నిజాం ఏలుబడిలో ఒక అధికారిగా నియమించబడిన హిందువు ఇతనొక్కడే.అదే సందర్భంలో నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుల్లో రావి నారాయణరెడ్డి,బద్దం ఎల్లారెడ్డి మొదలగువారు కమ్యూనిస్టు నాయకులు ఉన్నారు. ఆంధ్రమహాసభను నిజాంవ్యతిరేక సభగా మార్చి సాయుధ పోరాటం చేసిన యోధులువారు. అయితే చాలామంది తమపేర్ల చివర కుల సంబంధ రెడ్డి పదాన్ని తీసివేసి కులాతీతంగా జీవించిన వారెందరో ఉన్నారు.        వేమారెడ్డి ప్రజాకవి వేమనగా మారినాడు. పుచ్చలపల్లి సుందరామిరెడ్డి కామ్రేడ్ సుంద రయ్యగా మారినాడు.కొండపల్లిసీతారామయ్య కూడా అదేవిధంగా మారినాడు. ఇలా తమ పేర్ల చివర తమకులచిహ్నాన్ని వదులుకోవడం చాలా సాహసోపేతమైనది. కుల సంఘాలు విపరీతంగా పెరిగి కుల వైషమ్యాలు పెరుగుతున్న సందర్భంలో ఇలా కులచిహ్నాలను వదలుకోవటం ఎంతో ఆదర్శమైనది.
                        

Pillaa kumaraswaamy,9490122229

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s