( 11-09-1923 – 12-06-2005 )                   కామ్రేడ్ బి.పార్వతమ్మ   ధైర్యం,క్రమశిక్షణతో ఆశయసాధన కోసం మొండి పట్టుదలగల కమ్యూనిస్టు కార్యకర్త.  వీరు  తాడిపత్రి తాలూకా చీమలవాగు పల్లెలో  జన్మించినారు. వీరిది భూస్వామిక కుటుంబం. వీరి పెద్దన్న వి.కె. నారాయణరెడ్డిగారు  ఆఫీసుపెట్టి కాంగ్రెసు ప్రచారం చేసేవారు.వీరి చిన్న న్న వి.కె. ఆదినారాయణరెడ్డి గారు  అనంతపురం జిల్లా  కమ్యూనిస్టుపార్టీ నిర్మాతలలో ఒకరు. కమ్యూనిస్టు నాయకు లు కామ్రేడ్ ఐదుకల్లుసదాశివన్ గారు ‘కేశవవిద్యా నికేతన్’ విద్యార్థుల కోసం గ్రామాలు తిరిగి ధాన్యము వసూలు  చే సే వారు. ఆ పని మీద అయన చీమలవాగు పల్లెకు వచ్చినపుడు పార్వతమ్మ  ఇంట్లోనే దిగేవారు. ఆయన అనేక విష యాలు చెప్పేవారు. దేశపరిస్థితులు, స్వాతంత్ర్యోద్యమ పోరాటం, జైలులో తమపై జరిగిన హింస, దాన్ని ఆపేందుకు తాము చేసే పోరాటం. ఆ సందర్భంలో తగినలిన గాయాలు – ఇలా అనేక విషయాలు చెప్పేవారు. ఆయన తెచ్చిన ‘స్వతంత్ర భారత్’ రహస్య పత్రికను కార్బన్ ప్రతులు తయారుచేసి యిచ్చేది పార్వతమ్మ గారు.             1941లో పార్వతమ్మ గారి జీవితానికి పెద్ద దెబ్బ తగిలింది. వివాహం అయిన 9 నెలలకే అనురాగమూర్తి అయిన ఆమె భర్త శ్రీ బి.ఆదినా రాయణరెడ్డి అనారోగ్యంతో మరణించినారు. పార్వతమ్మ గారు దుఃఖాన్ని భరించలేక నిప్పంటించుకొని ప్రాణాలు  తీసుకోవాలని ప్రయత్నించినారు. అయితే మామగారి,పెద్దన్న గారి  తక్షణ స్పందన వల్ల ఆమె ప్రాణాలతో బయటపడింది. కామ్రేడ్స్ తరిమెల నాగిరెడ్డి, సదాశివన్, రాజశేఖర రెడ్డి ఓదార్చడమే గాక వారు కలిగించిన సామజికచైతన్యంతో  వ్యక్తిగత దుఃఖాన్ని అణచుకొని సామాజిక దుఃఖాన్ని అణగార్చే కొత్తజీవితాన్ని  ప్రారంభించింది.       కమ్యూనిస్టుపార్టీ  నిషేధకాలంలో తరిమెల నాగిరెడ్డి, నీలం రాజశేఖర రెడ్డి, వి.కె. ఆదినారాయణ రెడ్డి చీమలవా గు పల్లెలో సమావేశమయ్యేవారు.దయ్యాల భయమున్నా నాయకులను రక్షించే బాధ్యతను పైన వేసుకొని మేడమీద రాత్రంతా మేలుకొని కాపలా కాసేది. దయ్యాల భయం వట్టిదని తేల్చుకొంది. ఈ  నిషేధకాలంలోనే రాయలసీమ కమ్యునిస్టు పార్టీ బాధ్యులు కామ్రేడ్స్ వై.వి.కృష్ణారావు, తరిమెల నాగిరెడ్డి ఆదోని, బళ్ళారి,బెంగళూరుల్లో రహస్య స్థా వరాలు ఏర్పాటు చేసుకున్నారు.జనాలను నమ్మించడానికి వారి చెల్లెలుగా పార్వతమ్మ గారు ఆ స్థావరాలకు వచ్చిపొ య్యేది. కొరియర్ గాను పనిచేసింది. బెంగళూరు రహస్య స్థావరంలో తృటిలో పోలీసులకు దొరకకుండా ప్రాణాలతో బయట పడినారు.       1949 లో చీమలవాగుపల్లెలో వ్యవసాయకార్మిక సమ్మె నెలరోజులపాటు జరిగింది.కూలి పెంచాలనేది ప్రధాన మైన డిమాండు. ఈ సమ్మెకు సహకారం నాయకత్వం వహిస్తున్నారని పెత్తందార్లు  వీరి తండ్రి రంగప్ప గారిని, పెద్ద న్న నారాయణరెడ్డిగారిని తప్పుడు సమాచారం యిచ్చి పోలీసులతో అరెస్టు చేయించినారు. వీరిని తీసుకొనిపోనీకుండా మహిళలు అడ్డుపడినారు. అయినా తండ్రిగారు, పెద్దన్నగారు నచ్చచెప్పి అరెస్టు అయినారు. పార్టీఆదేశం మేరకు పార్వతమ్మ సమ్మెకు నాయకత్వం వహించింది. చర్చలకు కలెక్టరు వచ్చినాడు.ఆయనకు అనేక వాస్తవాంశాలు వివ రించి రైతులదే అన్యాయ ప్రవర్తన అని నిరూపించింది. సమ్మె విజయవంతమైంది.         తరిమెల ఏరియాలో కూడా పోరాటం మొదలయింది. జిల్లాబోర్డు ఎన్నికలలో తరిమెల సుబ్బారెడ్డికి వ్యతిరేకం గా పేదవాళ్ళు, ‘వెనుకబడిన కులాల’కు చెందిన బోయముత్యాలప్పను పార్టీ నిలబెట్టింది. సాహసమే. పార్టీ ఆదేశం మేరకు రాజమ్మ, ఓబులమ్మ, హైమావతిలతో కలసిపార్వతమ్మ నెలరోజులపాటు గ్రామాలలో ప్రచారం నిర్వహిం చింది. (రాజమ్మగారు  కామ్రేడ్ ఐదుకల్లు సదాశివన్ గారి భార్య;  ఓబులమ్మ గారు పార్వతమ్మ గారి రెండో అక్క, తరిమెల కమ్యూనిస్టుపార్టీ నాయకులు కా. శ్రీరామిరెడ్డి గారి భార్య. హైమవతి గారు  కా. చలిచీమల ముత్యాలప్ప గారి సోదరి.)   బహిరంగ సభలలో రెడ్లు బీదప్రజలకు చేస్తున్న అన్యాయాలను బైట పెట్టింది. రెడ్ల కుటుంబానికి చెందినా  పేదప్రజల పక్షాన మాట్లాడటం జనానికి సంతోషం కలిగించింది. చివరకు వంద ఓట్లతో పార్టీ అభ్యర్థి ఓడినా నైతికంగా  ముత్యాలప్పదే విజయమని జనం అనుకున్నారు.       1969 లో అనంతపురం లో పేదప్రజల ఇండ్ల పట్టాలకోసం ‘ రాణినగర పోరాటం’ జరిగింది.పార్టీ అగ్ర నాయకత్వాన్ని పోలీసులు అరెస్టు చేసినారు. జంకకుండా ఆ తరువాత నాయకత్వ బాధ్యతను రాజమ్మ, పార్వతమ్మ చేపట్టారు.  రాజమ్మ, పార్వతమ్మ పార్టీలో అవిభాజ్య జంట కార్యకర్తలు. మహిళలను సమీకరించి ముందుభాగాన నిలబడినారు. దొంగచాటుగా రౌడీలు వచ్చి పేదల గుడిసెలను కూల్చి, ఇంట్లో వున్న సామాన్లు చిందరవందర చేసి నారు. రాజమ్మ, పార్వతమ్మ మరికొంత మంది మహిళలు పట్టణంలో ఇల్లిల్లు తిరిగి, బట్టలు,డబ్బులు వసూలు చేసి పంచారు.           కరువు పోరాట సమయంలో రాస్తారోకోలకు, బంద్ లకు నాయకత్వం వహించింది. అరెస్టులు అయింది. లాఠీచార్జీలకు గురైనారు.కేసులు మోపబడ్డాయి. 1970 లో జిల్లా మహిళాసమాఖ్య ఏర్పడింది. ప్రథమ కార్యదర్శి పార్వతమ్మ గారు. ప్రథమ అధ్యక్షులు రాజమ్మ గారు. మహిళా సమాఖ్య కార్యకలాపాలు  తాలుకాలకు విస్తరించ డానికి పార్వతమ్మ గారు  చాల కృషి చేసినారు.  సమాఖ్య తరఫున చాలా కార్యక్రమాలు చేపట్టినారు. కె.ఎస్.ఆర్ .మహిళా కళాశాల కోసం, కస్తూరి బాయి పాఠశాల దురాక్రమణ కాకుండా, మహిళా ఐ.టి.ఐ.కోసం,పాఠశాలలో సౌకర్యాల కోసం ప్రయత్నాలు చేసి సాధించి నారు. వరకట్న సమస్యలు,అత్యాచార సమస్యలు, అత్తా మామల వేదిం పుల్లో బాధితుల తరఫున నిలబడి న్యాయం కోసం కృషి చేసినారు.స్నేహితురాలి ఇంటికెళ్ళిన అమ్మాయి.రైలు పట్టా లపై శవంగా మారితే, కామాంధులు దారుణంగా అత్యాచారం చేయడమే కాక, పురుగుమందు పోసి ఒక అమ్మా యిని చంపితే; తండ్రిలా కాపాడవలసిన మామ కోడలిని కాటు వేస్తే —- ఇలా అనేక సమస్యలపై బాధితుల పక్షాన  గట్టిగా నిలబడింది.న్యాయం కోసం శతవిధాలా పోరాడింది. కొన్ని విజయాలు వున్నాయి.కొన్ని విజయం పొంద లే నివి వున్నాయి.        పార్వతమ్మ జిల్లా కమ్యూనిస్టుపార్టి కార్యవర్గ సభ్యులు, మహిళాసమాఖ్య జాతీయసమితి సభ్యులుగా అనేక కార్యకలాపాలు నిర్వహించి, పార్టీ నిర్దేశించిన కార్యకలాపాలు నెరవేర్చి పార్టీ, ప్రజల మన్ననలను పొందినది.
      రచన –విద్వాన్ దస్తగిరి

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s