హృదయాన్ని హత్తుకొనేలా విమర్శలు చేయడం సులువైనది కాదు. అలాంటిది ఈయన ఒప్పించేలా, మెప్పించే సాహితీ విమర్శకుడిగా పేరు గడించారు. కథకుడి గా రచనా వ్యాసంగాన్ని ప్రారభించి అనువాదకుడుగా పేరుగడించారు. ఎందరో సాహిత్య ప్రియుల గుండెల్లో గూడు కట్టుకొన్నారు. ఉపన్యాసకులు గా ఎంతో మంది విద్యార్థులకు వెలుగు రేఖలు నింపారు. ఇంతకీ ఏవరాయన అనుకొంటున్నారా ? ఆయనే వల్లంపాటి వెంకట సుబ్బయ్య.

వల్లంపాటి 1937, మార్చి 15 న చిత్తూరు జిల్లా రొంపిచర్ల లో జన్మించాడు. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా వృత్తిని ప్రారంభించి, ఇంగ్లీషులో ఎం.ఏ చేసి, తరువాత హైదరాబాదు లోని సెంటర్‌ ఫర్‌ ఇంగ్లీష్‌ అండ్‌ ఫారెన్‌ లాంగ్వేజెస్‌ నుంచి ఎం.లిట్‌ పొందాడు. మదనపల్లె బీసెంట్‌ థియేసాఫికల్‌ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేసి పదవీ విరమణ చేసాడు.

వల్లంపాటి కథకుడిగా తన రచనా వ్యాసంగాన్ని మొదలుపెట్టాడు. పరిష్కారం, మిథ్య మొదలైన కథానికలు 40 దాకా ప్రచురించాడు. ఆయన రాసిన ఇంధ్రధనస్సు, దూర తీరాలు నవలలు ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో బహుమతులు పొందాయి.

వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారి ‘కథా శిల్పం’ ఎందరో రచయితలకి స్ఫూర్తినిచ్చిన రచన.

డా//దార్ల వెంకటేశ్వరరావు
అసిస్టెంట్ ప్రొఫెసర్, తెలుగు శాఖ, హైదరాబాదు విశ్వవిద్యాలయం వల్లంపాటి
గురించి 2008లో ఇలా అన్నారు.మార్క్సిస్టు విమర్శకులలో వల్లంపాటి వెంకట సుబ్బయ్య ఒకరు. వస్తు శిల్పాలను ప్రధానంగా చేసుకొని విమర్శ కొనసాగించిన మార్క్సిస్టు విమర్శకులలో ఒక విశిష్టత కలిగిన వ్యక్తి. విమర్శ రంగానికి రాకముందు కథలు, నవలలు రాసేవారు. మార్క్సిస్టు సాహిత్యాన్ని బాగా అధ్యయనం చేశారు. పుట్టపర్తి నారాయణచార్యులు గారి ప్రోత్సాహంతో విమర్శ రంగంలో దృష్టి కేంద్రీకరించాలని భావించారు. విశ్వనాథ సత్యనారాయణ గారి “శ్రీమద్రామాయణ కల్పవృక్షం” పై రాసిన ఒక చిరు సమీక్ష ఆయన తొలి విమర్శ రచనగా చెప్పుకోవచ్చు

అనువాదంలో వీరి ముద్ర ప్రత్యేకంగా కనిపిస్తుంది. అభ్యుదయ, మార్క్సిస్టు సాహిత్యాలను తెలుగు భాషలోకి అనువదించి అదించిన వల్లంపాటి వారు స్వయంగా కొన్ని విమర్శ గ్రంథాలను కూడా రాశారు.
వల్లంపాటి వెంకట సుబ్బయ్య రాసిన విమర్శ గ్రంథాలలో ముఖ్యమైనవి
1985లో రాసిన సాహిత్య వ్యాసాల సంకలనం ” అనుశీలన ” 1989లో వచ్చిన ” నవలా శిల్పం” 1995లో వచ్చిన ” కథా శిల్పం” 1997 లో వచ్చిన “వల్లంపాటి సాహిత్య వ్యాసాలు” 2002లో వచ్చిన “విమర్శ శిల్పం”
గ్రంథాలను బట్టి వల్లంపాటి విమర్శ దృక్పథాన్ని అర్థం చేసుకోవచ్చు.

రచయిత వేంపల్లి నాగరాజు ఈయన గురించి ఇలా అన్నారు.ఈయన విమర్శలో సాహితీ సిద్ధాంతాన్నికి, సాహిత్య విమర్శకు మధ్య స్పష్టమైన విభజన రేఖ కనిపిస్తుంది.
వల్లంపాటి సాహితీ విమర్శకుడిగా సుప్రసిద్ధుడు. ఆయన రాసిన కథా శిల్పం, నవలాశిల్పం, విమర్శా శిల్పం పుస్తకాలు తెలుగు సాహిత్య విమర్శకు ప్రామాణికాలు.

మార్క్సిస్టు దృక్పథం గల ఈయన సంప్రదాయ సాహితీవేత్తల రచనలలోని విశేష అంశాలను కూడా ప్రశంసించారు. అలాంటి వాటిలో ” విశ్వనాథ సత్యనారాయణ గారి వెయ్యిపడగలు ” మీద చేసిన విమర్శ పేర్కొనదగినది. రావిశాస్త్రి, కాళీపట్నం రామారావు, చాసో, కొడవటిగంటి మదురాత్మకం రాజారావు మొదలగు వారి కథలలో గల వస్తు శిల్పాలను కూలంకషంగా చర్చించారు.

అంగాంగ సమన్వయాన్ని సాధించలేక పోయిన కథలను విశ్లేషించి అవి అలా తయారవ్వడానికి రచయితలలో శిల్పదృష్టి లోపించడమేనని వ్యాఖ్యానించారు.

వల్లంపాటి వెంకటసుబ్బయ్య కథారచయితగా మొదలై నవలాకారుడిగా మారి, విమర్శకుడిగా తెలుగు సాహిత్యంలో స్థిరపడిన పరిణామ క్రమానికి ఆయన కథలూ, నవలలూ అద్దం పడతాయి. సంప్రదాయం నుంచి మార్క్సిస్టు ఆలోచనా ధోరణికి ఆయన మరలిన వైనాన్ని ఇవి వెల్లడిస్తాయి. వల్లంపాటి వెంకటసుబ్బయ్య విమర్శకుడిగానే ఎక్కువ మందికి తెలుసు.

అనువాదకుడిగా కుడా ఆయన ప్రసిద్ధుడే. ఇంగ్లీషు నుంచి, కన్నడం నుంచి తెలుగులోకి ఎన్నో గ్రంధాలు, కథలను అనువదించాడు. తస్లీమా నస్రీన్‌ రచించిన లజ్జ, బ్రిటిష్‌ రచయిత ఇ.హెచ్‌.కార్‌ రచించిన చరిత్ర అంటే ఏమిటి…? ఆయన చేసిన అనువాద రచనలలో కొన్ని.

అనువాదం గురించి ఓ సందర్భంలో వల్లంపాటి ఇలా అన్నారు. మొత్తం మీద అనువాదం రెండు భాషలకూ, రెండు సంస్కృతులకూ మధ్య అక్షరాల వంతెన. ప్రపంచంలోని అన్ని భాషల్నీ, సంస్కృతుల్నీ సర్వ మానవ జీవితానుభవాలనూ, విజ్ఞానాన్నీ ఏకం చేసే విశ్వకుటుంబీకుడు అనువాదకుడు.

అనువాదకుడిగా నేను మరో పాఠం కూడా నేర్చుకొన్నాను.
” Soil and civilization ” అన్న పుస్తకాన్ని పంపుతూ
హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వాళ్ళు దాన్ని అనువదించమని కోరారు. ఆ పుస్తకాన్ని చదివి ఆశ్చర్య పోయాను. జీవావరణానికీ, సంస్కృతికీ ఉన్న సంబంధాన్ని మొత్తం ప్రపంచ చరిత్రను ఆధారంగా చేసుకొని చర్చించిన పుస్తకం అది. ఆ పుస్తకంలోని వస్తువు అర్ధమైందిగానీ ఆ పుస్తకం మొత్తంగా నా నరాలలోకి ఎక్కలేదు. అందుచేత ఆ పుస్తకాన్ని నేను అనువదిస్తే బాగా రాకపోవచ్చు ననిపించింది.

సరైన అనువాదకుడు ఎవరా అని అలోచిస్తే తల్లావఝ్జుల పతంజలి శాస్త్రి గారు జ్ఞాపకం వచ్చారు. వారు చరిత్రను చదువుకొన్న వారు.సాంస్కృతిక అధ్యయనాలలో నుంచి పర్యావరణంలోకి వచ్చినవారు. పర్యావరణ కార్యకర్త. కధా రచయిత. ” మీరు ఆ పుస్తకాన్ని అనువాదం చేస్తారా ?” అని అడిగితే వారు సంతోషంగా అంగీకరించారు.

రచయితకు కధా వస్తువుతో హృదయ సంవాదం కుదిరినట్టుగా అనువాదకునికి కూడా మూల గ్రంధంలోని విషయంతో హృదయ సంవాదం కుదరాలి. అందరు అనువాదకులూ అన్ని విషయాలనూ బాగా అనువదించలేరు. కొందరు కొన్ని విషయాలను ఇతరుల కంటే మెరుగ్గా అనువదించగలరు. ఈ సత్యాన్నిగుర్తిస్తే అనువాదం కొందరు భావిస్తున్నట్టుగా వృత్తిరచన కాదని అర్ధమౌతుంది

అనువాదకునిగా నాకు సంతృప్తి నిచ్చిన గ్రంధం యస్.జి. సర్ దేశాయి గారి
” Progress and Conservation In Ancient India “. ఆ పుస్తకాన్ని ఒంట బట్టించుకోడానికి దాన్ని అనేక సార్లు చదివాను. ఆపుస్తకంలో మొదటినుంచీ చివరిదాకా భగభగలాడే సర్ దేశాయ్ కోపాన్నీ, అసహనాన్నీ అనువాదంలోకి తీసుకురాగలనన్ననమ్మకం కలిగిన తరువాత రచన ప్రారంభించాను.

వైదిక సాహిత్యాన్నీ, సమాజాన్నీ అభివర్ణించటానికి
సర్ దేశాయి ఉపయోగించిన ఇంగ్లీషు మాటలకు అసలు రూపాలైన సంస్కృత పదాలను గాలించి పట్టుకొని ఉపయోగించాను. ” ప్రాచీన భారత దేశంలో ప్రగతి, సాంప్రదాయ వాదం” అనువాదంలాగా కాకుండా మూల గ్రంధంలాగా చదివించిందని పెద్దలు అన్నప్పుడు చాలా సంతృప్తి కలిగింది.

ఈ విషయాలు మార్చి 2000 ఈమాట
EEMAATA: AN ELECTRONIC MAGAZINE IN TELUGU FOR A WORLD WITHOUT BOUNDARIES
లో అనువాద కళ నా అనుభవాలు అని
వల్లంపాటి వెంకట సుబ్బయ్య
మదనపల్లి లో వెలుబుచ్చినట్లు తెలిపారు.

వాదించుకోవటంలోనూ, అనువదించుకోవటంలోనూ తెలుగు వారు నిష్ణాతులు అని ఎవరో అన్నారు. వాదించుకోవటం మన రాజకీయ వ్యసనమైతే, అనువదించుకోవటం మన సాహిత్య వ్యాసంగం కావచ్చు. వాస్తవానికి తెలుగు సాహిత్యం అనువాదాలతోనే ప్రారంభమైంది.

శతాబ్దాలపాటు అనువాదాలతోనే సంతృప్తి పడుతూ వచ్చింది.మన మహా కవుల్లో చాలా మంది కధనూ, కధా నిర్మాణాన్నీ, పాత్రలనూ, వారి మనస్తత్వాలనూ, ప్రాపంచిక దృక్పధాన్నీ, భావాలనూ, ఆలంకారికతనూ, కొంత వరకు శైలినీ మూలగ్రంధకర్తల నుంచి గ్రహించిన గొప్ప అనువాదకులే. అందుకు మనం సిగ్గు పడాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు.

అత్యంత ప్రాచీనమైన సంస్కృత, గ్రీక్‌ ,లాటిన్‌ సాహిత్యాలవంటివి తప్ప ఇతర సాహిత్యాలలో చాలా భాగం అనువాదాలతోనే ప్రారంభమయ్యాయి.

ఇంద్ర ధనుస్సు, దూర తీరాలు
మమతలు – మంచుతెరలు,
జానకి పెళ్ళి తదితర నవలలు
రాశారు.బండి కదిలింది,
రానున్న శిశిరం,బంధాలు in లాంటి కథలు,

కథా శిల్పం ,నవలా శిల్పం ,
విమర్శా శిల్పం,అనుశీలన,
నాటికవులు,వల్లంపాటి సాహిత్య వ్యాసాలు
రాయలసీమలో ఆధునిక సాహిత్యం వంటి సామాజిక సాంస్కృతిక విశ్లేషణ 2006లోసాహితీ విమర్శ లాంటివి పరిశోధన రచనలు రాశారు.

అనువాదాలు గా
ప్రపంచ చరిత్ర
చరిత్ర అంటే ఏవిటి?
చరిత్రలో ఏమి జరిగింది?
ప్రాచీన భారతదేశం ప్రగతి
సంప్రదాయ వాదం ,
భారతదేశం చరిత్ర ,
బతుకంతా,
లజ్జ, నవల-ప్రజలు తదితర వాటిని రచించారు.

ఎన్నో సంకలనాలు, సంపుటాలకు ముందు మాటలు వ్రాసాడు
తెలుగు, కన్న, ఇంగ్లీషు భాషలలోకి, వాటినుండి అనువాదాలు చేశాడు
ఇండో – ఆంగ్ల సాహిత్యానికి సంబంధించిన షుమారు 15 పరిశోధనా పత్రాలను లిటరరీ క్రిటేరియన్ వంటి పత్రికలలో ప్రచురించాడు.

తన చివరి కాలంలో స్థానీయ చైతన్యంతో రాయలసీమ కవులూ, రచయితలూ, విమర్శకులూ చేసిన సాహిత్య కృషిని విశ్లేషిస్తూ “A Socio Economic Analysis of Modern Telugu Literature in Raayalaseema” పేరుతో పరిశోధన చేశారు. ఆ పరిశోధనను ” రాయలసీమలో ఆధునిక సాహిత్యం సామాజిక సాంస్కృతిక విశ్లేషణ” (2006) పేరుతో ఒక గ్రంథంగా ప్రచురించారు.

ఆయన చివరి రోజుల్లో ప్రచురించిన గ్రంథం కావచ్చు. అంతకుముందు M.Litt పట్టా కోసం సీ.ఫెల్ లో “The Role of Inidian Sensibility in the Teaching of English Literature” అనే అంశంపై లఘు సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. అలాగే 1963 లో ప్రాచీన తెలుగు కవుల జీవిత చరిత్రల్ని “నాటి కవులు” అనే పేరుతో చిన్న పుస్తకంగా ప్రచురించారు.

ఆయన రాసిన కథాశిల్పం రచనకు 2000 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఇదే పుస్తకానికి తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ సాహిత్య విమర్శ గ్రంథంగా ఎంపిక చేసి, సత్కరించింది.
1993లో తాపీ ధర్మారావు అవార్డు లబించింది.
1995 లో కొండేపూడి సాహిత్య సత్కారం,1997లో
తెలుగు యూనివర్శిటీ అవార్డు 2000 లో గజ్జల మల్లారెడ్డి అవార్డు అందుకొన్నారు.

2007, జనవరి 2 న వల్లంపాటి మదనపల్లెలో మరణించాడు.

రచన:– చందమూరి నరసింహారెడ్డి
9440683219

చందమూరి నరసింహారెడ్డి

1 comment

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s