Pic source ttd official web site

చుట్టూ పచ్చని కొండలు..ఆహ్లాదకరమైన వాతావరణం…జలపాతాలు….గోవింద నామస్మరణ… స్వామి ని కనులారా ఓసారి వీక్షీస్తేచాలు జీవితం ధన్యం….గోవింద నామాలతో భక్తుల హడావుడి…. ఏడుకొండల వెంకటరమణుడు వెలసిన తిరుమల….గోవిందుడు వెలసిన తిరుమల కొండను ‘తిరువేంగడం’ అని కూడా పిలుస్తారు. వేంకటేశ్వరస్వామిని ‘తిరువేంగడ ముడయాన్’ అని పిలిచేవారు. ఈ తిరువేంగడం అనే కొండ తమిళ దేశానికి ఉత్తర సరిహద్దుగా ఉండేది.మొట్ట మొదటగా, వైఖానస అర్చకుడు శ్రీ మాన్ గోపీనాథ దీక్షితుల వారు (శ్రీ వేంకటాచల మహాత్యం అనుసరించి), శ్రీవారి మూర్తిని స్వామి పుష్కరిణి చెంత, చింత చెట్టు క్రింది చీమల పుట్టలో కనుగొని, శ్రీవారి మూర్తిని ప్రస్తుతం వున్న ప్రదేశంలో ప్రతిష్ఠించి, అర్చించినట్లు పురాణాలు వివరిస్తున్నాయి. అప్పటి నుండి శ్రీ గోపీనాథ దీక్షితుల యొక్క వంశీయులే పరంపరగా స్వామి వారి పూజా కైంకర్యాల నిర్వహణ చేస్తున్నారు.

శ్రీవారి ఆలయ నిర్మాణం..
క్రీ.పూ.12వ శతాబ్దంలో 2.2 ఎకరాల విస్తీర్ణంలో 415 అడుగుల పొడవు, 263 అడుగుల వెడల్పుతో శ్రీవారి ఆలయం నిర్మి తమైంది.

శ్రీవారి ఆలయంలో మొత్తం మూడు  ప్రాకారాలున్నాయి. ఆలయం గోడలు వెయ్యేళ్ల క్రితం నాటివిగా తెలుస్తోంది. ఆలయంలో ఆభరణాలు, పవిత్రమైన వస్త్రాలు, తాజా పూలమాలలు, చందనం తదితరాలను భద్రపరుచు కోవడానికి వేర్వేరుగా గదులున్నాయి. వీటితోపాటు లడ్డూ ప్రసాదం తయారీకి పోటు, శ్రీవారి నైవేద్యం తయారీకి ప్రత్యేక వంట గదులున్నాయి.

ఆలయంలోని నిర్మాణాలు ఇలా ఉంటాయి

1 వ ప్రాకారం :-
మహాద్వార గోపురం 

శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించడానికి శ్రీవారి ఆలయంలో ప్రవేశించే ప్రధాన ప్రవేశద్వార గోపురమే ఈ మహాద్వార గోపురం.క్రీ.శ.13 నుండి మహద్వార గోపురం, సంపంగి ప్రదక్షిణం ఆలయ ప్రవేశ ద్వారమైన మహద్వారంపై నిర్మించిన గోపురాన్ని‘ మహద్వార గోపురం’, ‘ సింహద్వార గోపురం’ , ‘పడికావలి గోపురం’ అనే వివిధ పేర్లతో పిలుస్తారు. తమిళంలో ‘పెరియ తిరువాశల్’ అంటే పెద్దవాకిలి అని అర్థం. ఈ గోపురాన్ని క్రీ.శ.13వ శతాబ్దం నుండి అంచెలంచెలుగా నిర్మించారు.క్రీ.శ.13వ శతాబ్దంలో వెలుపల మహా ప్రాకారం నిర్మించారు. తూర్పు, పడమరగా 414 అడుగుల పొడవు, ఉత్తర, దక్షిణాలుగా 263 అడుగుల వెడల్పుతో నాలుగు అడుగుల మందం, 30 అడుగుల ఎత్తులో ఇది కట్టారు.

Pic source ttd

ఈ ప్రధాన ద్వార గోపురంతో అనుసంధింపబడుతూ నిర్మించిన ప్రాకారమే మహాప్రాకారం. వైకుంఠం క్యూకాంప్లెక్సుల ద్వారా వచ్చిన భక్తులు ఈ మహాద్వార మార్గంలో మాత్రమే వెళ్లి స్వామివారిని దర్శించవలసి ఉంటుంది.

ఇక్కడే మనం క్రింద ఉన్న పైపుకు గల రంధ్రాల ద్వారా వచ్చే నీటితో కాళ్ళు  కడుగుకొని లోపలికి ప్రవేశిస్తాం.

ఈ వాకిలి దక్షిణవైపున గోడపై అనంతాళ్వారులు ఉపయోగించిన గుణపం  ఉంటుంది.అనంతాళ్వారులు స్వామివారి మీద విసిరిన గునపాన్ని మహద్వారం దాటిన తర్వాత కుడి వైపు గోడకు వెళ్ళడుతూ ఉండటం చూడవచ్చు.శ్రీ అనంతాళ్వార్ బృందావనం శ్రీవారి ఆలయం వెనకవైపు ఉంటుంది. మనం అనంతాళ్వార్ బృందావనం దర్శించవచ్చు. శ్రీవారి ఉత్సవ మూర్తి అయిన మలయప్పస్వామి సంవత్సరానికి ఒకసారి శ్రీ అనంతాళ్వార్ బృందావనం కి వెళ్తారు.

శంఖనిధి – పద్మనిధి
మహాద్వారానికి ఇరుప్రక్కల ద్వారపాలకులవలె సుమారు రెండడుగుల ఎత్తు పంచలోహ విగ్రహాలు ఉంటాయి. వీరే శ్రీవేంకటేశ్వరుని సంపదలకు నవనిధులను రక్షించే దేవతలు.  దక్షిణదిక్కున ఉన్న రక్షక దేవత రెండుచేతుల్లోనూ రెండు శంఖాలు ఉంటాయి ఈయన పేరు శంఖనిధి, కుడివైపున ఉన్న రక్షకదేవత చేతుల్లో రెండు పద్మాలు ఉంటాయి ఈయన పేరు పద్మనిధి.

Pic source ttd

కృష్ణదేవరాయమండపం :-

మహాద్వారానికి ఆనుకొని లోపలి వైపు 16 స్తంభాలతో 27′ ×25′ కొలతలు ఉన్న ఎతైన మండపమే కృష్ణరాయ మండపం. 16 స్థంభాల‌పై ముస‌లిపై ఉన్న సింహం, దానిపై కుర్చుని స్వారి చేస్తున్న వీరుల శిల్పాల‌తో కూడిన ఎతైన మండపం దీనినే *ప్రతిమా మండపం* అని కూడా అంటారు.

ఈ మండపం లోపలికి ప్రవేశిస్తున్నపుడు కుడివైపున రాణులు తిరుమల దేవి, చిన్నాదేవులతో  కూడిన శ్రీకృష్ణదేవరాయల నిలువెత్తు రాగి ప్రతిమలు ఉన్నాయి.

అలాగే ఎడమవైపు చంద్రగిరి రాజైన వెంకటపతిరాయల రాగి ప్రతిమ, ఆ ప్రక్కన విజయనగర ప్రభువైన అచ్యుతరాయలు, ఆయన రాణి వరదాజి అమ్మాణ్ణి వీరి నిలువెత్తు నల్లరాతి ప్రతిమలు నమస్కార భంగిమలో ఉన్నాయి. శ్రీకృష్ణదేవరాయలు ఏడుసార్లు తిరుమల యాత్ర చేసి శ్రీ స్వామికి ఎన్నో కానుకలు సమర్పించాడు. అచ్యుతరాయలు తనపేరిట అచ్యుతరాయ బ్రహ్మోత్సవాన్ని నిర్వహించాడు.

ADDALA MANDAPAM OR AINA MAHAL


అద్దాలమండపం

ప్రతిమా మండపానికి 12 అడుగుల దూరంలో, ఎతైన అధిష్టానంమీద నిర్మింపబడి ఉన్న దీన్నే అద్దాలమండపమని
అయినామహల్ అని అంటారు.

కృష్ణరాయ మండపానికి ఉత్తరం దిక్కున ఉన్నదే అద్దాల మండపం లేదా ఐనా మహల్ దీనిని 36 స్థంభాల‌తో అద్బుతంగా నిర్మిచారు. ఇందులో మందిరం దీనికి అంత‌రాళం గ‌ర్భ‌గృహం ఉన్నాయి. ఇక్క‌డ ప్ర‌తి రోజు స్వామివారికి డోలోత్స‌వం నిర్వ‌హిస్తారు.43’×43′ కొలతలున్న ముఖమండపంలో శ్రీవారి అన్నప్రసాదాలు అమ్మే అరలు ఉండేవి. ఈ అరల్లో అర్చకులు తమవంతుకు వచ్చే శ్రీవారి ప్రసాదాలను భక్తులకు తగిన వెలకు విక్రయించేవారు ఒకప్పుడు. (మిగతా భాగం రేపు…)

మూలాలు:-ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శ్రీవారి బ్ర‌హ్మోత్స‌వాల ప్ర‌త్యేక వ్యాసం.
పత్రిక లో వ్యాసాలు. THE DIVINE STRUCTURE OF THE TIRUMALA MAIN TEMPLE

6 comments

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s