Jeevitha

ఆశ్లీలతకు చోటు లేకుండా చక్కటి అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అందమైన అలంకరణ తో కన్పిస్తుంది.

ఇది చెరగని ప్రేమకు శ్రీకారం ఇది మమతల మేడకు ప్రాకారం ఈ పాట వినగానే జీవిత రాజశేఖర్ గుర్తుకొస్తారు. అందమైన నా ఊహల మేడకు ఆవిడ మణిదీపం అంటూ రాజశేఖర్ తెగ ముచ్చటగా చెబుతాడు.

ఇలా చిత్రాల్లో ప్రేమ లో పడ్డ ఈ జంటకు నిజ జీవితం లో పెళ్లి చేసుకోవడానికి కొన్ని అడ్డంకులు ఎదుర్కొన్నారు. తర్వాత ఆదర్శ జంటగా మారారు. తెలుగు సినిమాలలో నటించక ముందు అనేక మలయాళం సినిమాలలో జీవిత నటించారు.

జీవిత సినీ రంగ ప్రవేశం తమిళ సినిమాతోనే ప్రారంభమైంది .
జీవిత నటి ,దర్శకురాలు .

జీవిత కర్నూలు జిల్లా, శ్రీశైలం లో జన్మించారు. అసలు పేరు పద్మ. తండ్రి రామనాథం తల్లి శకుంతల. తండ్రి హెల్త్ ఇన్స్‌పెక్టర్,తల్లి నర్స్‌. ఒక అక్క, అన్న, చెల్లెలు.మొత్తం 4గురు సంతానం. తాత ఎన్టీఆర్‌ వద్ద అకౌంటెంట్‌గా మద్రాసులో పనిచేసేవారు.

వారింట్లోనే జీవిత అక్క ఉష ఉండేది. వీరి తాతకు సినిమా వాళ్లతో పరిచయం ఉండటం వల్ల జీవిత అక్కకు సినిమాల్లో నటించాలనే ఆసక్తి ఉండేది. మద్రాసులో సినిమా ఛాన్సు కోసం ప్రయత్నించేది. ‘సీతాకళ్యాణం’, ‘చిల్లరకొట్టు చిట్టెమ్మ వంటి కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించింది. జీవిత చిన్నపాప గా ఉండగానే రాంనాథ్ కుటుంబం మద్రాస్ కు మకాం మార్చారు

మద్రాస్ వెంకటేశ్వర మెట్రిక్ కాన్వెంట్ లో తెలుగు మీడియం లో ప్రాథమిక విద్య చదివింది. దర్శకుడు తేజ, డాన్స్ మాస్టర్లయిన బృంద, సుచిత్రలు క్లాస్ మేట్స్.

ఆంధ్ర మహిళా సభలో మెట్రిక్ చదివారు. మెట్రిక్ లో టాపర్.
ఇంటర్మీడియట్ ఆదర్శ విద్యాలయం లో చదివారు.

జీవిత తండ్రి తన స్నేహితులతో కలిసి ప్రభ, చంద్రమోహన్ కాంబినేషన్లో ‘ధర్మం దారి తప్పితే’ అనే సినిమా తీసి నష్టపోయారు.

స్కూల్లో చిన్న చిన్న నాటికల్లో నటించడం తప్ప నటిగాకాని డాన్సులోగాని ఆమె శిక్షణ తీసుకోలేదు. ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లోనే సినీ రంగ ప్రవేశం చేసింది. చదువు మధ్యలో ఆపేసింది.

తమిళ దర్శకుడు టి.రాజేందర్ ‘ఉరవై కార్తకిలి’ అనే తమిళ చిత్రంలో తొలిసారి హీరోయిన్‌ గా నటించారు. ఈ సినిమా దర్శకులు పద్మ పేరును జీవిత గా మార్చారు.ఇదే మలుపు.

టి.రాజేందర్ పరిచయం చేసే హీరోయిన్లంటే ఇండస్ట్రీలో క్రేజ్ ఉండేది. ఆ విధంగా తొలిచిత్రం విడుదల కాకముందే నాలుగైదు సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి.
ఈమె మూడవ చిత్రం ‘హలో యార్ పేసిరది’లో సురేష్ హీరో.

1986లో ఒక తమిళ మేగజైన్లో జీవిత కవర్ పేజీ ఫోటో వేశారు. అది చూసి నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి ‘తలంబ్రాలు’ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేసుకొన్నారు .ఇదే తొలి తెలుగు సినిమా. ఈ సినిమా తో మరో మలుపు తిరిగింది.
ఈ సినిమాలో హీరో డాక్టర్ రాజశేఖర్.

ఎం.ఎస్. ఆర్ట్ మూవీస్ నిర్మించిన తలంబ్రాలు 1986లో విడుదలైంది.కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు.
డా. రాజశేఖర్ ,జీవిత , నందమూరి కళ్యాణ్ చక్రవర్తి, షరీఫ్, రాధాకృష్ణ, ప్రసాద్, ప్రభాకర్, సుబ్బారావు, ఉమ మంజు, నాగలక్ష్మి, నటించారు

ఇది చెరగని ప్రేమకు శ్రీకారం ఇది మమతల మేడకు ప్రాకారం ,
ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో వీరి కాంబినేషన్ కి క్రేజ్ ఏర్పడింది.

రెండవ తెలుగు సినిమా ఆహుతి.1987 లో విడుదలయింది. యం.యస్.ఆర్ట్ మూవీస్ నిర్మించిన ఈ చిత్రాని కి
కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు.రాజశేఖర్,జీవిత,
బాబూ మోహన్,శంభుప్రసాద్
గోపి నటించారు.

ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం పాడిన అందమైన నా ఊహల మేడకు ఆవిడ మణిదీపం …
రామకృష్ణ పాడిన
బుద్ధుడు పుట్టిన పుణ్య భూమిలో గాంధి మహాత్ముని జన్మభూమిలో …పాటలు మరపురాని పాటలు.

ఎమ్.ఎస్.ఆర్ట్ మూవీస్ నిర్మించిన అంకుశం మూడో సినిమా. సెప్టెంబరు 28, 1990 లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో విడుదలై సంచలన విజయం సాధించిన తెలుగు సినిమా. రాజశేఖర్, జీవిత ఇందులో ప్రధాన పాత్రధారులు.

ఈ చిత్రం ద్వారా ప్రతినాయకుడు రామిరెడ్డి సినీ రంగ ప్రవేశం చేశాడు. రామిరెడ్డి జీవితానికి ఇదే పెద్ద మలుపు. ఒక నిజాయితీ పరుడైన పోలీస్ ఆఫీసరు అవినీతి పరులైన గూండాల నుంచి రాష్ట్రాన్ని రక్షించడం ప్రధాన కథ. ఈసినిమా సూపర్ బంపర్ హిట్ అయ్యింది.

దీంతో వరుసగా ‘స్టేషన్ మాస్టర్’, ‘ప్రజాస్వామ్యం’, ‘నవభారతం’ వంటి సుమారు పది హిట్ సినిమాల్లో కలిసి నటించారు.

ఈ మధ్యలో స్నేహం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలనుకున్నా రాజశేఖర్ ఇంట్లో పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదు.దీంతో జీవిత కొంత కుంగిపోయింది.
సినిమాల్లో నటించడం క్రమక్రమంగా తగ్గించుకొంది.

‘మగాడు’ సినిమా షూటింగ్ లో రాజశేఖర్ యాక్సిడెంట్ అయ్యింది. నెలరోజుల పాటు అపోలో హాస్పిటల్ లో పక్కనే ఉండి ఆమె సపర్యలు చేసింది. అప్పుడే రాజశేఖర్ ఇంట్లో వాళ్లకు దగ్గరయింది.

ఇరువైపులా అంగీకారంతో 1991జలై 10 న జీవిత, రాజశేఖర్ ల వివాహం జరిగింది.

రాజశేఖర్ 1962, ఫిబ్రవరి 4 న తమిళనాడు రాష్ట్రంలోని థేని జిల్లా లక్ష్మీపురంలో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు శేఖర్, ఆండాళ్ పిళ్ళై.తండ్రి శేఖర్ ఒక పోలీసు అధికారి. రాజశేఖర్ చిన్నతనంలో ఎన్. సి. సి విద్యార్థి. మొదట్లో తండ్రిలాగే పోలీసు అధికారి కావాలనుకున్నా తండ్రి కోరిక మేరకు వైద్యవిద్య అభ్యసించాడు. చెన్నైలో కొంతకాలం ప్రాక్టీసు చేశాడు. తర్వాత సినిమాల్లోకి వచ్చారు.

Pic source google

1996 లో మొదటి కూతురు శివానీ, 2000 లో రెండో పాప శివాత్మిక పుట్టారు.
శివాని ఎం. బి. బి. ఎస్ . శివాత్మిక సినిమా రంగంలో అడుగు పెట్టింది. 2019లో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ, శివాత్మిక ముఖ్య పాత్రల్లో కలిసి నటించిన దొరసాని అనే చిత్రం విడుదలైంది. శివాని భరతనాట్యం కూచిపూడి నేర్చుకొంది. సంగీతం లో అభినివేశం ఉంది. కీ బోర్డు, గిటార్, వీణ వాయిస్తుంది.

27 తమిళ సినిమాల్లో , 13 తెలుగు సినిమాల్లో ఒక కన్నడ సినిమాలో నటించింది. మగాడు ఈమె ఆఖరి సినిమా. తర్వాత నటించడం లేదు.

శేషు ,మహంకాళి,ఆప్తుడు ,
ఎవడైతేనాకేంటి ,
సత్యమేవ జయతే తెలుగు చిత్రాలకుదర్శకత్వం వహించారు.

రాజశేఖర్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఏర్పాటు చేసి సేవలందిస్తున్నారు.
కరోనా వైరస్‌ ప్రభావంతో సినిమా షూటింగ్‌లు ఆపివేశారు ఏరోజుకు ఆ రోజు పని చేస్తే తప్ప ఇల్లు గడవని నిరుపేద కళాకారులు ‘మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌’లో (మా) కొందరు ఉన్నారు.

అలాంటి కళాకారులకు పది రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులను రాజశేఖర్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా అందించారు. మా అసోసియేషన్ ప్రదాన కార్యదర్శిగా పనిచేశారు.

మా లో కొంత వివాదాలు, విభేదాలు చవిచూశారు. తెలుగు దేశం పార్టీ లో కొంత కాలం పనిచేశారు. తర్వాత
వైయస్సార్ కాంగ్రెస్ లో చేరారు.ప్రస్తుతం హైదరాబాద్ లో నివాసమున్నారు.

రచన:–చందమూరి నరసింహా రెడ్డి 9440683219

చందమూరి నరసింహా రెడ్డి

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s