Pic source google

గాంధీ నాయకత్వంలో అహింసాయుత మార్గాల్లో , పురుషులతో సమానంగా మహిళలు కూడా స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్నారు.

తమ కుటుంబానికి దూరమై, ఖద్దరు ధరించి, స్వాతంత్య్ర సమర గీతాలు పాడుతూ, త్యాగాలు చేసి.. పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు తింటూ చిత్రహింసలకు గురై, స్వాతంత్య్ర సమరధీరలుగా చరిత్రలో నిలిచారు.

స్వాతంత్ర్య సమర యోధురాలు,సంఘసేవకురాలు. ఆదర్శ కాంగ్రెసువాదిగా సంఘంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకొన్న తెలుగు మహిళలలో వేదాంతం కమలాదేవి ఒకరు.

1897 మే 5 వ తేదీన కడప జిల్లా రాజంపేట తాలూకా నందలూరు గ్రామంలో వేదాంతం కమలాదేవి జన్మించారు. తల్లి భ్రమరాంబ, తండ్రి ప్రతాపగిరి గోపాలకృష్ణయ్య .

ఈమెకు12 వయస్సు లో వేదాంతం వెంకటకృష్ణయ్య తో వివాహం జరిగింది. వీరి పెళ్లి నాటికి భర్త కలకత్తాలో వైద్య విద్య చదువుతున్నాడు. ఆయనకు తోడుగా కలకత్తా లో ఉంటున్నప్పుడు అక్కడి సంఘ సేవికురాలు శ్రీమతి సుప్రభాదేవి తో ఏర్పడిన పరిచయ సాన్నిహిత్యం వలన విశేషంగా ప్రభావితమైంది. కలకత్తా లో ఇంగ్లీష్, బెంగాలీ నేర్చుకొన్నారు. సంఘ సేవకురాలుగా , ధీశాలి గా పేరు గడిచింది.

దేశస్వతంత్ర్య ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఈమె ప్రభావంతో ఈమె సోదరుడు ప్రతాపగిరి రామమూర్తి స్వాతంత్ర్యోద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు.

1920 లో కలకత్తా నుంచి కాకినాడ వచ్చి స్థిరపడారు. జాతీయోద్యమపోరాటంలో పాల్గొనడం ప్రారంభించారు.
విదేశీ వస్త్ర బహిష్కరణ, నూలు వడకడం, ఖద్దరు ప్రచారం చేసారు.

దేశ బాందవి దువ్వూరి సుబ్బమ్మ గారిని ఆదర్శంగా తీసుకొని 1921 లో సహాయనిరాకరణోద్యమం లో పాల్గొన్నారు. 1923 లో కాకినాడలో అఖిల భారత కాంగ్రేస్ సభలు జరిగినప్పుడు బులుసు సాంబమూర్తి ప్రోత్సాహంతో మహిళా కార్యకర్తల దళ నాయకురాలి గా విశేషసేవలు అందించారు.

ఆంధ్రదేశం అంతటా విస్తృతంగా పర్యటించి ఖాదీ ప్రచారం చేసారు. తిలక్ స్వరాజ్య నిధికి అనేకమంది దాతల నుండి భారీ విరాళాలు స్వీకరించి గాంధీజి ప్రశంసల ను పొందారు.

పక్షవాతంతో బాధపడుతూ విశాఖ జిల్లా అంతటా పర్యటించి స్త్రీలను ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనమని ప్రబోధించారు. ఉప్పు సత్యాగ్రహంలో భాగంగా నౌపడ లోని ఉప్పు క్షేత్రాల దగ్గర సత్యాగ్రహం చేసి అక్కడే 1930 మే 20 న అరెస్ట్ అయ్యారు. 6 నెలలు వెల్లూరు జైలులో శిక్ష అనుభవించారు.

1931లో ఇచ్ఛాపురంలో జరిగిన మహిళా మహాసభకి అధ్యక్షత వహించారు.

1932 లో ఉప్పు సత్యాగ్రహం తీవ్రదశలో ప్రభుత్వం
కాంగ్రెసు సమావేశాలకు అడ్డుపడుతున్నప్పుడు వేదాంతం కమలాదేవి గుంటూరులో ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ మహా సభను నిర్విఘ్నంగా జరిపి తన అద్యక్షతన తీర్మానాలు అమోదించారు. ఫలితంగా 6నెలలు జైలు శిక్ష విధించారు.వెల్లూరు జైల్లో శిక్షను అనుభవించారు.

1932లో సరోజినీ నాయుడు అధ్యక్షతన ఢిల్లీలో బ్రిటిషు వారి అరాచకాలను నిరసిస్తూ జరిగిన సభలో వేదాంతం కమలాదేవి అరెస్టు అయ్యారు.

మహాసభలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే
విధంగా ప్రసంగించినందుకు 6 నెలలు జైలు శిక్ష విదించారు.

జైలు నుండి విడుదలైన తరువాత తన ఆరోగ్యం సహకరించకున్నా రెట్టించిన ఉత్సాహంతో కాంగ్రేసు ప్రచారం చేసారు.

1937 లో జరిగిన ఎన్నికలలో కాంగ్రేసు అభ్యర్థుల విజయానికి ఎంతో కృషి చేసారు.

ఆమె 1929లో, 1930లో,1934లో అఖిల భారత కాంగ్రెస్ స్థాయి సంఘ సభ్యులు గా ఉన్నారు.

స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొంటూనే, మహిళలలో జాగృతికై కృషి చేసారు.స్రీలలో జాతీయభావాలు ప్రేరేపించేవారు.ప్రాథమిక విద్యావ్యాప్తికి తోడ్పడ్డారు.

పక్షవాతంతో సరిగా తిరగలేని స్థితిలో కూడా సేవానిరతిని కోల్పోలేదు. అస్వస్థత కారణంగా తన స్వగృహం ఆనంద నిలయాన్నే అనాథ శరణాలయంగా మార్చి సేవాకార్యక్రమాలు నిర్వహించేవారు.

మూడుసార్లు కాకినాడ మున్సిపల్ కౌన్సిలర్ గా ఉన్నారు. దేశసేవిక’ బిరుదు పొందారు .

స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న తెలుగు మహిళలు
డా. దుర్గాబాయ్ దేశ్‌ముఖ్, ఆరుట్ల కమలాదేవి, ‘ఆంధ్రా అనిబిసెంటు’గా పేరుగాంచిన బత్తుల కామాక్షమ్మ, కనుపర్తి వరలక్ష్మమ్మ, అచ్చంట రుక్మిణి, మాగంటి అన్నపూర్ణమ్మ,

ఉన్నవ లక్ష్మీబాయమ్మ, వేదాంతం కమలాదేవి, ఇలా ఎందరో తమ కుటుంబానికి దూరమై, ఖద్దరు ధరించి, స్వాతంత్య్ర సమర గీతాలు పాడుతూ, త్యాగాలు చేసి.పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు తింటూ చిత్రహింసలకు గురై, స్వాతంత్య్ర సమరధీరలుగా చరిత్రలో నిలిచారు.

ఈమె 1940, జూలై 14 వ తేదీన తన 43 వ ఏట పక్షవాతం కారణంగా మృతిచెందారు.

టంగుటూరి 1972 లో తను రాసిన పుస్తకం నా జీవిత యాత్ర లో
వేదాంతం కమలాదేవి గురించి ఇలా రాశారు.

కాకినాడ కాపురస్థురాలు కీ॥ శే॥ వేదాంతం కమలాదేవి, వందలూ వేలూ జనం గుంపులు గుంపులుగా తనవెంటరాగ, ఉద్యమాన్ని చాకచక్యంగానడిపించింది.

ఆమె చాలా దైర్యసాహసాలు గల ఇల్లాలు. ఆరుగురు బిడ్డల తల్లి. ఆమె ఆంధ్రదేశంలో పలు ప్రాంతాల్లో ఉద్యమాన్ని చాలా చాకచక్యంగా నడపించింది.

పురుషులు జంకి వెనక్కు తగ్గే పరిస్థితులలో కూడా ఆమె మంచి నేర్పుతో వ్యవహరించింది. ఆమె అకాల మరణం దేశానికి తీరని లోటే.ఇలా ఆమె గురించి పేర్కొన్నారు.

స్వాతంత్ర్యపోరాటంలో పాల్గొని జైలు శిక్షలనుభవించి, సేవా నిరతితో సంఘ సేవా కార్యకలాపాలతో పాల్గొన్న శ్రీమతి వేదాంతం కమలాదేవి ఆదర్శప్రాయంగా నిలిచారు.💐💐💐💐

రచన:– చందమూరి నరసింహారెడ్డి

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s